22, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 346 (సన్నుతిచేయు టొప్పగును)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
సన్నుతిచేయు టొప్పగును
సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:

  1. ఎన్నికలప్పుడే ప్రజల కెన్నెని తీయని మాటలిచ్చుచున్
    ఎన్నిక పూర్తిగాగ 'జనమెవ్వరు?ఛీ' యని మాట మార్చి, సం
    పన్నులు గాగ మారుదురు, వారలె గొప్పగు, నేడు జూడగన్
    సన్నుతి జేయుటొప్పగును సత్య విదూరుల నిధ్ధరాస్థలిన్!

    రిప్లయితొలగించండి
  2. మిన్నగు సత్యపాలనను మేలగురీతుల చేయలేరికన్,
    మన్ననసేయరీజనులు,మన్నులనేలెడినేతలెవ్వరున్.
    సన్నుతిచేయు టొప్పగును సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్
    యన్ననెగానిజీవనపుయాత్రనుఁసౌఖ్యముకానరాదిటన్

    సత్యపాలనను మన్నన చేయరని, సమస్యలో ఉండే ఆ మాట ఒప్పుకుంటే గాని జీవనయాత్ర చేయలేమని భావము.

    రిప్లయితొలగించండి
  3. హనుమచ్చాస్త్రి గారూ, మందాకినీ గారూ మీ పూరణలు మిన్నగా ఉన్నాయి.

    ఎన్నికలందు నక్రమపు టెత్తులు వేసెడి వారు, చోరు, లా-
    పన్నుల పట్ల నిర్దయులు, పాపులు, జారులు, ఘాతుకమ్ములన్
    పన్నెడు క్రూరులున్ జగతి ప్రాపు గడింపగ నేది మార్గమౌ?
    సన్నుతిచేయు టొప్పగును సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్.

    రిప్లయితొలగించండి
  4. పన్నిదమయ్యె జూదమున పాండవ రాజ్యము, వారు ధర్మమే
    మిన్నని కానకేగిరి, యమేయ బలాధికులైన వారలన్
    సన్నుతిచేయు టొప్పగును, సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్
    తన్నిన పాపమంటదు, సదా వెలుగొందును సత్యమే ధరన్!!

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మాట తప్పిన నాయకులే సన్నుతులను పొందుతున్న వాస్తవాన్ని చక్కగా వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "మన్నుల నేలెడి నేతలు" .... ?

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    సత్యవిదూరులను తన్నాలని చెప్పిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. సంతోషం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారు, ధన్యవాదాలు.
    జనులూ, భూముల నేలెడి నేతలు మన్ననసేయరు అని నా భావం.

    రిప్లయితొలగించండి
  7. సుమతీ శతకం:

    తిన్నగ కాంచలేము మరి తీరుగ లేవుగ కంటిచూపులే
    మిన్నగ విన్గలేము మరి మిక్కిలి చెమ్డుగ మాకటంచుచున్
    పన్నుగ తప్పుకొంచునిట పండుగ జేసెడి ధన్యజీవులన్
    సన్నుతిచేయు టొప్పగును సత్యవిదూరుల నిద్ధరాస్థలిన్

    రిప్లయితొలగించండి