12, మే 2011, గురువారం

సమస్యా పూరణం - 335 (నాస్తికులకు దేవతలన్న)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నాస్తికులకు దేవతలన్న నయము భయము.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

6 కామెంట్‌లు:

 1. తలుపు మూసిన,వెలుగులు దాటిరావు
  అడుగకున్నను తెరచిన,ఆక్రమించు
  తలపు తెరిచిన,దూరును దైవమనుచు
  నాస్తికులకు,దేవతలన్న నయము భయము!

  రిప్లయితొలగించండి
 2. మిస్సన్న గారి పూరణ ....

  నాస్తికులు జేరి సభ జేయ నగర మందు
  నేత యొకరుడు పలికె " విఘ్నేశ్వరునకు
  తొలుత జేయుడు స్తోత్రము తొలగు నడ్డు "!
  నాస్తికులకు దేవతలన్న నయము భయము.

  రిప్లయితొలగించండి
 3. ఉండె నున్నాడు నుండును నుర్వి యందు
  గుండె గుండెలో నిండుగా గుప్తముగను,
  లేడు లేడులే దేవుండు లేడ టన్న
  నాస్తికులకు దేవతలన్న నయము భయము.

  రిప్లయితొలగించండి
 4. మంద పీతాంబర్ గారి పూరణ ...

  ఉండె నున్నాడు నుండును నుర్వి యందు
  గుండె గుండెలో నిండుగా గుప్తముగను,
  లేడు లేడులే దేవుండు లేడ టన్న
  నాస్తికులకు దేవతలన్న నయము భయము.

  రిప్లయితొలగించండి
 5. మిస్సన్న గారి పూరణ ...

  నాస్తికులు జేరి సభ జేయ నగర మందు
  నేత యొకరుడు పలికె " విఘ్నేశ్వరునకు
  తొలుత జేయుడు స్తోత్రము తొలగు నడ్డు "!
  నాస్తికులకు దేవతలన్న నయము భయము.

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులకు మనవి ...
  నిన్న, మొన్న గూగుల్ వారి సాంకేతిక లోపం వల్ల మీ పూరణలు, వ్యాఖ్యలు కనిపించకుండా పోయాయి. మెయిల్ బాక్స్ లో మంద పీతాంబర్, మిస్సన్న గారల పూరణలు మాత్రం లభించాయి. మీమీ పూరణలను, వ్యాఖ్యలను శ్రమ అనుకోకుండా మరోసారి పోస్ట్ చేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి