గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ప్రశ్నోత్తరరూపంలో ఉన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ, మధురమైన పూరణ మీది. అభినందనలు.
మిస్సన్న గారూ, అద్భుతమైన సీసపద్యంతో అలరించారు. ధన్యవాదాలు. "ఆలి కొంగట్టుక" అనే దాన్ని "ఆలి కొంగును పట్టి" అందామా?
జిగురు సత్యనారాయణ గారూ, ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ, మంచి విషయాన్ని ఎత్తుకొని పూరించారు. బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో గణం, రెండవ పాదంలో యతి తప్పాయి. నా సవరణ .. మంత్ర పటిమ వలన తంత్ర(మొల్లని) కుంతి కవచ కుండలములఁ (గనెను సుతుని)
ప్రసవ మైన పిదప పాపనేమందురు?
రిప్లయితొలగించండిప్రసవ మిడిన వనిత పాప కెవరు?
సంతు లేని ఇంతి చక్కటి పేరేమి?
బిడ్డ-కన్న తల్లి-గొడ్డురాలు.
(బిడ్డను అనే అర్థంలో ఉంది గనుక చిన్న మార్పుతో..
పడతి నెలలు నిండ ప్రసవించు నెవ్వరి ?
ప్రసవ మిడిన ముదిత పాప కెవరు?
సంతు లేని ఇంతి చక్కటి పేరేమి?
బిడ్డ,గన్న తల్లి,గొడ్డురాలు.
దేవకీలలామ దేవుని, వరమున
రిప్లయితొలగించండిబిడ్డఁ గన్న తల్లి; గొడ్డురాలు.
యగుట మేలు కాదె యనుచును వగచెను
కంసు కన్నతల్లి కల్ల కాదు
తల్లికి గల యాస్తి తనకు వ్రాయించుక
రిప్లయితొలగించండి......................బైటకు నడుపెడి భ్రష్టుడొకడు!
ఆలి కొంగట్టుక కాల భైరవుడట్లు
......................తల్లిని మఱచిన తనయుడొకడు!
అమ్మను రేపవల్ అరవ చాకిరి చేయు
......................పనిగత్తెగా జూచు పాపి యొకడు!
గోరుముద్దలు వెట్టి గారము జేసిన
......................కన్నకడుపు మాడ్చు కటిక యొకడు!
ఆదరమ్ము లేని అమ్మలు యెందరో
బ్రతుకు భార మయి శవాల వోలె
బ్రతుకు చుండ్రి నేడు! పరమని కృష్టుడౌ
బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు!
అడ్డ పాపగున్న బిడ్డగుదురు కాని
రిప్లయితొలగించండిగడ్డములు మొలిచిన బిడ్డగుదెరె?
ఫుడ్డు పెట్ట కుండ నడ్డి విఱిచినట్టి
బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు
మంత్ర పటిమ వలన తంత్రమెరుగని కుంతి
రిప్లయితొలగించండికవచ కుండలముల కొడుకు కనెను
గంగ పాలు చేసి భంగ పడెను గాన
బిడ్డ గన్న తల్లి గొడ్డు రాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిప్రశ్నోత్తరరూపంలో ఉన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ,
మధురమైన పూరణ మీది. అభినందనలు.
మిస్సన్న గారూ,
అద్భుతమైన సీసపద్యంతో అలరించారు. ధన్యవాదాలు.
"ఆలి కొంగట్టుక" అనే దాన్ని "ఆలి కొంగును పట్టి" అందామా?
జిగురు సత్యనారాయణ గారూ,
ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మంచి విషయాన్ని ఎత్తుకొని పూరించారు. బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణం, రెండవ పాదంలో యతి తప్పాయి. నా సవరణ ..
మంత్ర పటిమ వలన తంత్ర(మొల్లని) కుంతి
కవచ కుండలములఁ (గనెను సుతుని)
గురువుగారూ మీ సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి"నా సుతు"డన, "కాదు - నా సుతుం" డని, ఇరు
రిప్లయితొలగించండిసతులు పోర; రాజు " సమ విభజన
సలుపు" దనగ - తేలె సతుల నెవ్వ రెవరు
’బిడ్డ గన్న తల్లి’; ’గొడ్డురాలు’!
ఆచార్యుల వారి పూరణ అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిడా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిప్రశస్తమైన పూరణతో మనోల్లాసాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆట వెలది లో (గొడ్రాలి) వెలది ఆట కట్టించి 'నాలుగు పాదాల ' ధర్మాన్ని నిలిపిన కథ చెప్పిన ఫణీంద్ర గారికి అభినందనలు.