"సిరి" అనే పదాన్ని
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
ముసిరిన దారిద్ర్యంబులు
రిప్లయితొలగించండికసిరిన పోనట్టి నష్ట కష్టము మా,చే
నుసిరిక చందము; జేతుము
మసి,రిత్తగ; నిను భజించి మాతా!లక్ష్మీ!
(చేనుసిరిక=కరతలామలకము)
అనవచ్చా మాస్టరుగారూ!
శంకరార్యా!మా చేనుసిరిక, బదులు...చేతన్నుసిరిక చందము ...ఇలా వ్రాయవచ్చునా సందేహము తీర్చగలరు.
రిప్లయితొలగించండిచూసిరి శ్రీదేవిని, యర
రిప్లయితొలగించండిమూసిరి గన్నులు ,మనములు ముదమున బొంగన్!
పూసిరి పలు గంధమ్ముల
వేసిరి మందార మాల ,వేడిరి భక్తుల్ !
శంకరయ్య గారూ.. మీ సిరి దత్త పది చూసాక నాకో ఆలోచన వచ్చింది.
రిప్లయితొలగించండి"లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్" పదలతో దత్తపది బాగుంటుందా.. ఆలోచించండి.
వ్రాసిరి కవులు కావ్యము ల్వరమడుగను
రిప్లయితొలగించండిచేసిరి భక్తులు పూజలు చేరగ నిను
నేనొక పసిరిక కనుల పాపిని నను
కసిరి గొట్టక కావుము కమల వసిని (కనక లక్ష్మి)!
మనవి: కమల వసిని అనటం విరుద్దమయితే కనక లక్ష్మి అని చదువుకోవచ్చు. పెద్దలు తెలియజేయగలరు.
క్షమించాలి; మూడవ పాదము సవరించిన తరువాత:
రిప్లయితొలగించండివ్రాసిరి కవులు కావ్యము ల్వరమడుగను
చేసిరి భక్తులు పూజలు చేరగ నిను
పసిరిక కనులంగప్పిన పాపి నేను
కసిరి గొట్టక కావుము కమల వసిని (కనక లక్ష్మి)!
కలిసిరి సురలు దైత్యులు కడలి చిలుక
రిప్లయితొలగించండితెలిసిరి నిను శ్రీలక్ష్మిగా తేజమలర
వలపెగసి రివ్వున హరిపై వాలినావు
విసిరి గొట్టక వినుము నా విన్నపమ్ము!!
కవి మిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఇప్పుడే ఊరినుండి తిరిగి వచ్చాను. వచ్చీ రాగానే బ్లాగు తెరిచాను. మా ఆవిడ స్నానం చేసి కూర్చోమంటే "అన్నీ బ్లాగులో క్రొత్త పోస్ట్ పెట్టిన తర్వాతే" అని ముందుగా ఈనాటి సమస్యను ఇచ్చాను. ఇప్పుడు నిన్నటి దత్తపది పూరణలు చూస్తున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
"మా చే నుసిరిక, చేత న్నుసిరిక" రెండూ సరైనవే.
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ సూచన బాగుంది. ధన్యవాదాలు.
రెండు మూడు రోజుల్లో దత్తపది ఇస్తాను.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
"కనకలక్ష్మి" అనడమే సబబు.
జిగురు సత్యనారాయణ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. "వలపెగసి రివ్వున" చాలా బాగుంది. అభినందనలు.
శంకరార్యా! ధన్యవాదములు.సందేహ నివృత్తి అయినది.
రిప్లయితొలగించండిమిస్సన్న గారి పూరణ ....
రిప్లయితొలగించండిమా బండి చాలా లేటు.
చేసిరి దేవ దానవులు క్షీర సముద్రపు మంథనమ్ము మేల్
చేసిరి ధాత్రి కిచ్చి నిను శ్రీ కరమౌ కరుణార్ద్ర దృక్కులన్
చూసిరి శోభనమ్ములను శ్రీలను సేయగ మాకు స్తోత్రముల్
చేసిరి సర్వులున్ జనని శ్రీహరి పట్టపు రాణి శ్రీ సతీ!
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిలేటయినా స్వీటు పద్యం చెప్పారు. అభినందనలు.
"మాకు స్తోత్రముల్చేసిరి సర్వులున్" ?
గురువుగారూ మాకు తర్వాత కామా ఉంటుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు నా పూరణ నచ్చినందుకు.