గురువుగారూ నేనెప్పుడూ అలా అభ్యంతరం చెప్పను. "స్ఫురణ భవత్స్వరూపము" సమస్య సందర్భంలో ఈ విషయంలో నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. బుర్రకు పదును పెట్టే దేదైనా సమస్యే. చంద్రశేఖరుల "ఆవకాయ" సమస్య సందర్భంలో నా వ్యాఖ్యల నేపథ్యంలో మీరిలా భావిస్తే అక్కడ నేను " (నవ్వుతూ) " పెట్టడం మరచిపోయా నంతే.
శంకరార్యా! నమస్కారములు.సిస్టం లోని సాంకేతిక లోపం కారణంగా పూరణమును బ్లాగునందు పెట్టలేక మీకు మైల్ చేశాను. వెంటనే సకాలములో బ్లాగునందుంచినందులకు ధన్యవాదములు. ప్రస్తుతము లోపము బాగైనది.ఇకనుండి యధావిధిగా పంపగలను.కృతజ్ఞతలతో...
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఇందులో "సమస్య" ఏముందని అభ్యంతరం చెప్పకండి ....
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఎన్నికలు, ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు ???
ఎన్నిసార్లురా బాబోయ్ !!!!!!
అంటున్న ఓటరు :
01)
___________________________________
ఎన్ని ఎన్నికలో నేడు - ఎన్నుకొనగ
ఎన్ను కొనినాక యేలిక - లేమి చేయు
ఏడు నెలలైన మరలక - నేగుదెంచు
ఎన్ను కొనుడయ్య మమ్ముల - నెన్ను కొనుడు
ఇంతియే గాద నెన్నిక - లేడ జూడ !
ఎన్నికలనఁగ రోతాయె - నేమి కర్మ!
___________________________________
ఎక్కడుంది ప్రజాస్వామ్య మెక్కడుంది
రిప్లయితొలగించండిస్వపరిపాలన !? నోట్లను జల్లి, మందు
పోసి గెలుచు నాయకులను జూసి నాకు
ఎన్నికలనగ రోతాయె నేమి ఖర్మ !
గురువుగారూ నేనెప్పుడూ అలా అభ్యంతరం చెప్పను.
రిప్లయితొలగించండి"స్ఫురణ భవత్స్వరూపము" సమస్య సందర్భంలో ఈ విషయంలో నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. బుర్రకు పదును పెట్టే దేదైనా సమస్యే. చంద్రశేఖరుల "ఆవకాయ" సమస్య సందర్భంలో నా వ్యాఖ్యల నేపథ్యంలో మీరిలా భావిస్తే అక్కడ నేను " (నవ్వుతూ) " పెట్టడం మరచిపోయా నంతే.
రూకలున్నను రాజ్యము రూఢి వశము
రిప్లయితొలగించండినాకు దక్కుట సహజమనగను, పాడి
గాదు ధర్మము నెచ్చట గనము నిట్టి
ఎన్నికలనగ రోతాయె నేమి ఖర్మ
ఎన్ని కలల ఫలితమన్న నీ స్వతంత్ర
రిప్లయితొలగించండిభారతమ్ము, దాని చెఱచి పట్ట పగలు
నిట్ట నిలువు దోచెడి వారి నెన్ను కొనెడి
ఎన్నికలనఁగ రోతాయె, నేమి కర్మ!
పెద్దలలనాడు నెంచిరి పేర్మి గాను
రిప్లయితొలగించండిఎన్నికలనగ గొప్పగ మేలు చేయు
నంచు; నీయవినీతుల నంత జూడ
నెన్నికలనగ రోతాయె నేమి ఖర్మ
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలు ......
రిప్లయితొలగించండి(1)
ఉప్పుఁ జేయరె దెబ్బల కోర్చి నాడు
ప్రజల రాజ్యముఁ గోరుచు ప్రముఖు లెల్ల
స్వంత రాజ్యము చిక్కగ స్వార్ధపరుల
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ!
(2)
కులము మతములు జూపుచు కుటిలపరులు
ధనము మద్యము పంచుచు కొనగ నోట్లు
పదవు లాయెను వ్యాపర పథము లిపుడు
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ !
(3)
నీతిబాహ్యులు నేతలు జాతి కిపుడు
మంచితనమును వీడిరి మంత్రు లెల్ల
దోచుకొందురె దేశము దాచ నెచటొ
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ!
తడవ తడవకో యెన్నిక దప్ప దాయె!
రిప్లయితొలగించండికడప గడపన సర్కారు గన్నులాయె!
బరిన నిల్చిన వారుసంపన్నులాయె!
ఎన్నికలనఁగ రోతాయె, నేమి కర్మ!
గన్నవరపు నరసింహ మూర్తి గారు చెప్పారు.
రిప్లయితొలగించండిగురువుగారూ, యెన్నికలని అనవసరంగా యడాగమములు పెట్టాను ముందు పురణలలో.
అమెరికా యెన్నికల గురించి యీ పద్యము.
ఓటు కీయరె డాలరు నోటు లచట
వాహనమ్ముల పోయరె పవన మైన
చంద్రభాసుర మొక్కింత చవికి రాదె
ఎన్నిక లనగ రోతాయె నేమి కర్మ !
అక్కడ పెట్రోలియమును గ్యాస్ అంటారు. అందుకు 'పవనము ' అని వాడాను.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఎన్నికలనగానే అంత రోత పుట్టిందా? ఒకేఒక్క పూరణ పంపారు. సమస్యాపూరణం మీద రోత పుట్టలేదు కదా? :-)
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశంసనయంగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ అత్యుత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !నిజంగా ఎన్నికల మీద రోతే !
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
యడాగమం వేయడమే సరైనది.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఅంత్యానుప్రాసతో మీ పూరణ అలరించింది. అత్యుత్తమం. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ....
రిప్లయితొలగించండినాటు, నీటులు ఓటుకు నోటు, వేటు
ఉచిత స్కీములు గుప్పించి ఉచ్చు వేసి!
లాగుచుందురు నాయక రాక్షసు లరె!
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
శంకరార్యా! నమస్కారములు.సిస్టం లోని సాంకేతిక లోపం కారణంగా పూరణమును బ్లాగునందు పెట్టలేక మీకు మైల్ చేశాను. వెంటనే సకాలములో బ్లాగునందుంచినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిప్రస్తుతము లోపము బాగైనది.ఇకనుండి యధావిధిగా పంపగలను.కృతజ్ఞతలతో...
ఇరువురు పెళ్లి కాని యువతుల నడుమ సంభాషణ:-
రిప్లయితొలగించండిసాప్టువేరు వరుడె సరియని తలచిన
.......కొలువెపుడూడునో తెలియ లేము!
బడి పంతులె మనకు బాగని తలచిన
.......బండెడు చాకిరి బ్రతుకులాయె!
డాక్టరె వరుడైన డాబని తలచిన
.......డాక్టరు డాక్టర్ని డాయునెపుడు!
లాయరు వరుడైన లాభమనుకొనిన
.......కేసులు రాకున్న కీడు కలుగు!
పెళ్లి పందిరి వారలు పిలిచి చూప
పెక్కు వరుల వివరములు, లక్కు లేక
పెళ్లి కొడుకుల జాబితా వెతికి, వరుని
యెన్నికలనఁగ రోతాయె నేమి కర్మ!!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన సీసంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.