21, మే 2011, శనివారం

చమత్కార పద్యాలు - 59 (కన్నులలోఁ జన్ను లమరెఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 3
సమస్య -
"కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్"
కం.
చిన్నవి ఝషకంబులు గొని
చెన్నలరఁగ బెస్తవారి చిన్నది రాఁగాఁ
బన్నుగ ఱొమ్మునఁ గల వల
కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

13 కామెంట్‌లు:

 1. వెంకన్న గారి సమస్యా పూరణ అసాధారణం ,అనితరసాధ్యం .

  రిప్లయితొలగించండి
 2. సన్నగ వరుడటు జూచిన
  కన్నులలో జన్ను లమరె, గాంతామణికిన్
  చెన్నుగ సిగ్గులు మొలిచెను,
  చిన్నా!యిటు జూడ కనుచు చెంగును గప్పెన్!

  రిప్లయితొలగించండి
 3. చిన్నది సింగా రించుక
  కన్నున్ గీటంగ మగడు కౌగిట జేర్చెన్
  అన్నుల మిన్నను, కాంతుని
  కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.

  రిప్లయితొలగించండి
 4. అన్నలుసు బడినదెక్కడ?
  కన్నా!మగమేక గొంతు కచ్చట వేమో?
  చిన్నా!మెట్టెల వెవరికి?
  కన్నులలో, జన్ను లమరె, కాంతా మణికిన్!

  రిప్లయితొలగించండి
 5. సన్నని మీనులు జేరెను
  కన్నులలోఁ, జన్ను లమరెఁ గాంతామణికిన్
  మిన్నగ, మెయి కాంతులొలికె,
  కన్నియ ప్రౌఢతనమొందు కాలమడుగిడన్!!

  రిప్లయితొలగించండి
 6. సత్యనారాయణ గారూ మీ పూరణ సుందరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 7. కన్నియ తోటను ముంజెల
  నెన్నుక తన గుండె కదిమి యేతెంచు తరిన్
  పన్నుగ తాళపు ముంజెల
  "కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్"

  (అద్భుత కవి వెంకన్న గార్కి క్షమాపణలతో, వారి మార్గంలో)

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ!సత్యనారాయణ గారూ! మీ మీ పూరణలు వడ్డాది పాపయ్య, బాపూ చిత్రాలను మనసులో చిత్రించాయి.అబినందనలు.

  రిప్లయితొలగించండి
 9. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
  క్రమం తప్పక పోవడంలో మీకు మీరే సాటి.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణలు సరసంగా ఉన్నాయి. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  నవయౌవనంలోకి అడుగిడిన కన్యను వర్ణించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. కన్నులలో కన్నులనిడి
  పన్నుగ పాలిండ్ల నిచ్చి పరవశ మొందన్
  చిన్నారి బాలకుడివిరు
  కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్

  రిప్లయితొలగించండి