7, మే 2011, శనివారం

సమస్యా పూరణం - 331 (ఓటుకు నోట్లిచ్చువారె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    ______________________________

    వాటముగ దేశ సంపద
    పోటీపడి దోచు కొనగ - ముఖ్యులు నేతల్ !
    కోటలు దాటును కోతలు !
    ఓటుకు నోట్లిచ్చు వారె - యుత్తమ నేతల్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    ______________________________

    నోటే ప్రాణా ధారము
    నోటే మనకందరకును - నుక్కట దీర్చున్
    నేటి మన భారతంబున
    ఓటుకు నోట్లిచ్చు వారె - యుత్తమ నేతల్ !
    _______________________________

    నుక్కట = బాధ

    రిప్లయితొలగించండి
  3. 03)
    ______________________________

    సూటిగ యెన్నిక లందున
    పోటీ నీతిగ సలిపిన - బోవును సర్వమ్ !
    ధీటుగ గెలువగ నెన్నిక;
    ఓటుకు నోట్లిచ్చు వారె - యుత్తమ నేతల్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. 04)
    ______________________________

    బాటిలు సారా మరియును
    కూటమిగా జనులకెల్ల - కూడును ,దోడున్
    నీటిని వ్రాతలు వ్రాయుచు !

    ఓటుకు నోట్లిచ్చు వారె - యుత్తమ నేతల్ !
    _______________________________

    కూడు = తిండి = బిర్యానీ
    తోడు = మీకు తోడుగా ఉంటామని
    నీటిని వ్రాతలు = మీ క్కావలసిన వన్నీ చేస్తామనే వృథా హామీలు

    రిప్లయితొలగించండి
  5. అధినేతల పీటలు మోసి, బూట్లు తుడిచి,
    మూట్ల నందించి సీట్లు పొంది
    నోట్లు పంచి ఓట్లు సంపాదించి చివరకు
    ఆ ప్రజల్ని దోచుకొనే నాయకులే గదా అంతా !

    05)
    ______________________________

    పీటలు మోయుచు ,నేతల
    బూటును తుడుచుచు ,బరువగు - మూటల-సీట్లే!
    ఓటరులను దోచు కొనుచు !
    ఓటుకు నోట్లిచ్చు వారె - యుత్తమ నేతల్ !
    _______________________________

    నేత = అధినేత
    ఓటరులు = ప్రజలు

    రిప్లయితొలగించండి
  6. నోటున కున్న ట్టి విలువ
    మాటకు లేకుండబోయె,మన దేశములో
    పోటీలోయెవరున్నను,
    ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ !

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ...

    చేటులు గలుగక పాలన
    పాటవముగ జేతుమన్న పాపము వారిన్
    ఓటరు ఖాతరు జేయడు
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమ నేతల్!

    రిప్లయితొలగించండి
  8. ఓటేయ బధ్ధకించెడు,
    ఓటిడినను బదులడిగెడు ఉత్తమ పౌరుల్
    వాటాకు మీరి యుండగ
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్.

    రిప్లయితొలగించండి
  9. రేటుకు మించిన పైకము
    సీటుకు చెల్లించి యెగ్గు సిగ్గులు లేకన్
    పూటకు సారా పొట్లము,
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్!

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ మీ పూరణ చాలా బాగుంది.
    రేటుకు మించిన పైకము
    సీటుకు చెల్లించి యెగ్గు సిగ్గులు లేకన్
    పూటకు సారా పొట్లము,
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్!"

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా! నమస్కారములు.సిస్టం లోని సాంకేతిక లోపం కారణంగా పూరణమును బ్లాగునందు పెట్టలేక మీకు మైల్ చేశాను. వెంటనే సకాలములో బ్లాగునందుంచినందులకు ధన్యవాదములు.
    ప్రస్తుతము లోపము బాగైనది.ఇకనుండి యధావిధిగా పంపగలను.కృతజ్ఞతలతో...

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ ....

    ధాటిగ దోపిడి చేసెద
    రోటుకు నోట్లిచ్చువారె; యుత్తమనేతల్
    నీటగు వ్యక్తిత్వముతోఁ
    బాటుపడుదు రెల్ల వేళ ప్రజ నాదుకొనన్.

    రిప్లయితొలగించండి
  13. లక్కరాజు వారికి ధన్యవాదాలు. శంకరయ్య మాస్టారూ, చక్కటి విరుపు.

    రిప్లయితొలగించండి
  14. ఓటమి భీతిన హారకు
    డోటుకు నోట్లిచ్చు, వారె యుత్తమనేతల్
    ధాటిగ యిచ్చిన మాటను
    సూటిగ చెల్లించి ఓటు చూరగొనంగన్!

    మనవి: హారకుడు=దోచుకొనేవాడు

    రిప్లయితొలగించండి
  15. కవి మిత్రు లందరికీ వందనాలు.
    పని ఒత్తిడివల్ల అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించాలి.
    ఐదు పూరణలు పంపిన వసంత కిశోర్ గారికి,
    రెండు పూరణలు పంపిన చంద్ర శేఖర్ గారికి,
    ఒక్కొక్క పూరణలు పంపిన మంద పీతాంబర్, హరి, గోలి హనుమచ్ఛాస్త్రి గారలకు అభినందనలు, ధన్యవాదాలు.
    లక్కరాజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ఘాటైన ప్రేమ జూపుచు
    పూటలు గడవని ప్రజలకు పూజల తోడన్
    నోటులు నకిలీ వైనవి
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్

    రిప్లయితొలగించండి
  17. ఏటికి మైకున మాటల్?
    ఏటికి ఘనపత్ర పూజ? ఏటికి మ్రొక్కుల్?
    కూటికి గుడ్డకు సరిపడ
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్

    రిప్లయితొలగించండి