11, మే 2011, బుధవారం

దత్తపది - 13 (లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్)

కవిమిత్రులారా,
"లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"
పై పదాలను ఉపయోగించి
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. వాడెను మోములు ప్రభుతకు
    వీడెను సభ్యులు తమబరి వేరే జతకై
    ఊడెను ప్రాభవమని య
    ల్లాడెను;కాంగ్రెస్సు బండి లాగుట యెటులో!

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇంత స్పీడా? చాలా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    "వీడెను సభ్యులు" క్రియాపదం ఏకవచనం కదా! "వీడెను సభ్యులకూటమి/సంఘము" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  3. మత్తకోకిల:

    వీడె నాజత యన్న ధైర్యము వీడె కాంగ్రెసు పార్టిలో!
    ఊడెనా మరి సీటు రాదని ఊడ బట్టుకు నుండెగా!
    వాడెనా మరి ధైర్యమింకను; వాడ మందులు లేక య
    ల్లాడె;నేటికి గట్టునెక్కెడు లక్ష్యమే కనరాదుగా!

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా! ధన్యవాదములు.చిన్న సవరణ..
    వీడెను పాలన స్థిరముగ వెలుగుట యందున్.. అంటే

    రిప్లయితొలగించండి
  5. చిన్న సవరణ.. వీడెను పాలన స్థిరముగ వెలిగెడు యాశల్..

    రిప్లయితొలగించండి
  6. తోవక వృత్తము :

    కొత్తలు - కోటులు కోశము వీడెన్ !
    పొత్తుల నేతల మోములు వాడెన్ !
    "చిత్తుగ నోటమి" చిత్రము లాడెన్ !
    ఇత్తరి కాంగ్రెసు యింజను లూడెన్ !

    కొత్తలు = డబ్బులు ; కోశము = ఖజానా

    రిప్లయితొలగించండి
  7. ఊడెను కాంగ్రెసు చీలలు
    వాడెను సోనియ మొగములు భళిరా జగనూ!
    వీడెను మత్తు కిరణుడ
    ల్లాడెను, పులివెందుల పులి యరవగ పారెన్ !
    సూచన: మొగములు = many faces of Sonia

    రిప్లయితొలగించండి
  8. శ్రీ చిరంజీవిగారి రాజకీయ ప్రస్థానం.

    పదునైన మాట లాడెన్,
    పదవిని నాశించి నాడు,పరపతి యూడెన్,
    బెదిరెను, విలువలు వీడెన్
    వదనము వాడెన్,చివరకు వార్ధిన గలిసెన్!

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారూ,
    గమ్మత్తైన మత్తకోకిలతో అదరగొట్టేసారు. మన బ్లాగులో ఇది మొదటి మత్తకోకిల. ధన్యవాదాలు.
    మొదటిపూరణలో మీ సవరణ బాగుంది.

    నాగరాజు రవీందర్ గారూ,
    అద్భుతం! మన బ్లాగులో మొదటి తోటక/తోదక/తోవక(?) వృత్తం రాసిన ఘనత మీదే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    చమత్కార పూరితమైన మీ పూరణ నన్ను బాగా నవ్వించింది. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను. ఉత్తమమైన పూరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు ధన్య వాదములు. బాగుంటుందో లేదోనని సందేహిస్తూ పోస్ట్ చేసాను.

    రిప్లయితొలగించండి
  12. వీడెను కొందరు వెంపర
    లాడెను పీఠము కొఱకు దురాశ యెగిసినన్
    వాడెను పార్టీ పరువే
    ఊడెను పంచెలధిపతికి నున్నపలముగన్!!

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదములు మాష్టారు గారూ !
    తోవక వృత్తము "సులక్షణసారము" లో వుంది. దీనికే "పాదప వృత్తము" అను నామాంతరము కలదు. ఐనా మీకు తెలియంది ఏముంది! గురువు గారూ !

    రిప్లయితొలగించండి
  14. లాగులాడెను కిరణుడు బాగు బాగు
    వాడెనే మోము లక్కటా వచ్చె చిరుడు
    ఊడెనా పదవి జరుగు కీడు తనకు
    వీడెనా కాంగిరేసును మూడు నిజము.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !


    ప్రజా పార్టీ ,దాని అధినేత చరిత్ర :

    01)
    _________________________________

    చిందు లాడెను ముందర - చిరము జీవి
    పిదప ఊడెను కోరిక - పెగడ మీద
    తుదకు వీడెను తనదగు - తొట్టి పార్టి
    కడకు వాడెను; సోనియా - కాళ్ళు పట్టి !
    _________________________________
    పెగడ = మంత్రి (ముఖ్యమంత్రి )

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    ప్రజాపార్టీ అధినేత చరిత్ర :

    01)
    ___________________________________

    చిందు లాడెను ముందర - చిరము జీవి !
    పిదప ఊడెను కోరిక - పెగడ మీద !
    తుదకు వీడెను తనదగు -తొట్టి పార్టి
    కడకు వాడెను ! సోనియా - కాళ్ళు పట్టి !
    ___________________________________

    పెగడ = మంత్రి ( ముఖ్య మంత్రి )

    రిప్లయితొలగించండి
  17. ధన్యవాదములు మాష్టారు గారూ ! తోవక వృత్తము "సులక్షణ సారము" లో ఇవ్వబడింది.

    రిప్లయితొలగించండి