మూల నున్న మూర్తి - ముఖమందు గీసెను ముద్దు గుఱ్ఱ యొకడు - మురిపె మలర ! ముదము గొలుప నుదుట - మూడవ నేత్రము మూడు కనుల వేల్పు - ముర హరుండు ! _____________________________________ మూర్తి = విగ్రహము(విష్ణుమూర్తి)
వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. రెండవ పూరణలో "ముచ్చట పాలించు" అనేదాన్ని "ముచ్చటగా నేలు" అంటే ఎలా ఉంటుంది?
వరప్రసాద్ గారు, ధన్యవాదాలు. మీ పూరణలో మీరు చెప్పదలచుకున్న భావాన్ని అవగాహన చేసికొనలేక పోతున్నాను. కాస్త వివరిస్తారా? మొదటిపాదంలో "కన్నుల" అనేది "కనుల" కావాలి. రెండవ పాదంలో "హరికైన" అన్నచోట "హరికి నైన" అని ఉండాలి.
మంద పీతాంబర్ గారూ, పద్యం చాలా బాగుంది. కాని చివరి రెండు పాదాలకు అన్వయం కుదరడం లేదు. ఒకసారి పరిశీలించండి.
గురువు గారు నమస్కారం .మీరు పూర్తిగా కోలుకున్నందుకు చాలాసంతోషం.
ధర్మాన్ని ఆచరిస్తూ,దానకార్యలను చేస్తూ సత్య పథాన నడుస్తున్న వారి వాక్కుల యందె మేము {మూడు కనుల వేల్పు, మురహరి ) వసిస్తాము అన్న భావన చేసి పురించాను . చిన్న సవరణతో
ధర్మమాచరించి దానంబుజేయుచు సత్య పథమునందు సాగు వారి వాక్కులందునెపుడు వసియింతు మందురు, మూడు కనుల వేల్పు, ముర హరుండు !
అందరికీ వందనములు ! మరియు స్వాగతం !
రిప్లయితొలగించండి01)
_____________________________________
మూల నున్న మూర్తి - ముఖమందు గీసెను
ముద్దు గుఱ్ఱ యొకడు - మురిపె మలర !
ముదము గొలుప నుదుట - మూడవ నేత్రము
మూడు కనుల వేల్పు - ముర హరుండు !
_____________________________________
మూర్తి = విగ్రహము(విష్ణుమూర్తి)
02)
రిప్లయితొలగించండి_____________________________________
మూడు లోకములను - ముచ్చట పాలించు
మూల రూప మొకటె - ముఖ్య మదియె !
ముర హరుండు , బ్రహ్మ - ముక్కంటి యొక్కటే !
మూడు కనుల వేల్పు - ముర హరుండు !
_____________________________________
గురువు గారికి నమస్కారములతో,
రిప్లయితొలగించండిమీరు ఆరోగ్యమును కాపాడుకొనుచూ మాకు
ఆనందమును పంచుపెట్టమని కోరుతూ
ఆ: మూడు కన్నుల వేల్పు మురహరుండు మదిలో
నుండ, హరికైననుండు మురము
రమ్ము, రమ్ముగొట్ట దుమ్ములేపుచునుండు
మురమురమ్ము ముందు మానవులకు.
( మురముర= కోపము)
మీ
వరప్రసాదు
ధర్మమాచరించి దానంబుజేయుచు
రిప్లయితొలగించండిసత్య పథమునందు సాగు హితుల
వాక్కులందునెపుడు వసియింతు మందురు,
మూడు కనుల వేల్పు, ముర హరుండు !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవ పూరణలో "ముచ్చట పాలించు" అనేదాన్ని "ముచ్చటగా నేలు" అంటే ఎలా ఉంటుంది?
వరప్రసాద్ గారు,
ధన్యవాదాలు.
మీ పూరణలో మీరు చెప్పదలచుకున్న భావాన్ని అవగాహన చేసికొనలేక పోతున్నాను. కాస్త వివరిస్తారా?
మొదటిపాదంలో "కన్నుల" అనేది "కనుల" కావాలి. రెండవ పాదంలో "హరికైన" అన్నచోట "హరికి నైన" అని ఉండాలి.
మంద పీతాంబర్ గారూ,
పద్యం చాలా బాగుంది. కాని చివరి రెండు పాదాలకు అన్వయం కుదరడం లేదు. ఒకసారి పరిశీలించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారు నమస్కారం .మీరు పూర్తిగా కోలుకున్నందుకు చాలాసంతోషం.
రిప్లయితొలగించండిధర్మాన్ని ఆచరిస్తూ,దానకార్యలను చేస్తూ సత్య పథాన నడుస్తున్న వారి వాక్కుల యందె మేము {మూడు కనుల వేల్పు, మురహరి ) వసిస్తాము అన్న భావన చేసి పురించాను . చిన్న సవరణతో
ధర్మమాచరించి దానంబుజేయుచు
సత్య పథమునందు సాగు వారి
వాక్కులందునెపుడు వసియింతు మందురు,
మూడు కనుల వేల్పు, ముర హరుండు !
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ భావాన్ని నా "మంద"బుద్ధి అర్థం చేసికొనలేకపోయింది. మన్నించండి.
ఒకరి హృదయమందు ఒకరుందు రెప్పుడు
రిప్లయితొలగించండిఅర్థమొకటె జూడ 'హర 'కు 'హరి ' కి
భేదమేమి లేదు, వాదమేల? యొకరె
మూడు కనుల వేల్పు, మురహరండు.
సురులరిపులనైన సుతులుగాఁనెంచెడి
రిప్లయితొలగించండిమూడు కనుల వేల్పు, మురహరుండు,
నాల్గు ముఖములుండు నా కమలభవుడు
నన్నిరూపులందు నరయఁ దానె.
శ్రీ జగన్నాథుని దర్శనార్థం పూరీ (ఒడిషా) వెళ్ళినందున ఆలస్యంగా పూరించగలుగుతున్నాను. మన్నించి సరిచూడగలరు.
హనుమచ్ఛాస్త్రి గారు,
రిప్లయితొలగించండిఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
మందాకిని గారూ,
"ఏకం సత్" అంటూ పూరిచిన మీ పద్యం బాగుంది. అభినందనలు.