10, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం - 334 (యతి మోహావేశ మెసఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్.

21 కామెంట్‌లు:

 1. అతి ఘోర తపము జేసియు
  గతిదప్పెను మేనకపుడు కనుపించగనే
  మతిచెడి గాధేయుడు,ఆ
  యతి, మోహావేశ మెసగ నతివను బిలిచెన్!

  రిప్లయితొలగించండి
 2. అతి ఘోర తపము జేసియు
  గతిదప్పెను మేనకపుడు కనుపించగనే
  మతిచెడి గాధేయుండని
  యతి,మోహావేశ మెసగ నతివను బిలిచెన్!

  (గాధేయుండు+అనియతి)

  రిప్లయితొలగించండి
 3. గతిదప్పె సుభద్ర ,కుంతీ
  సుతురూపముజూడగోరి,సుందరి వేడెన్ ,
  నతనికి జతగలిపెదనని
  యతి మోహావేశమెసగ ,నతివను బిలిచెన్!

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  "మేనక + అపుడు" అన్నప్పుడు తప్పక యడాగమం రావాలి. "మేనక తన కనులఁ బడఁగనే" అందాం. "గాధేయుండని యతి" అనేది "గాధేయుం డను యతి" అంటే?

  రిప్లయితొలగించండి
 5. మంద పీతాంబర్ గారూ,
  మనోహరమైన పూరణ మీది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. "గతి చెడె సుభద్ర కుంతీ" అంటే సరి!

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఫోన్ పనిచెయ్యనందున రెండు రోజులనుండి
  మిత్ర దర్శనానికి దూరమయ్యా !

  కపట యతి వేషంలో నున్న అర్జునుడు
  సుభద్రను జూచి :
  01)
  ________________________
  అతి బలవంతుడు పార్థుడు
  యతి వేషము వేసి చేరె - యాదవ నగరిన్ !
  అతివను అతిగా వలచిన
  యతి , మోహావేశ మెసగ - నతివను బిలిచెన్ !
  ________________________

  రిప్లయితొలగించండి
 7. శంకరార్యా!మీ సరణకు ధన్యవాదములు.చిన్న మార్పుతో...
  అతి ఘోర తపము జేసియు
  గతిదప్పెను మేనక మరి కనుగీటగనే
  మతిచెడి,గాధేయండని(ను)
  యతి,మోహావేశ మెసగ నతివను బిలిచెన్!
  (అనియతి..అనవచ్చాండీ)

  రిప్లయితొలగించండి
 8. పతినే దలచెడు రాముని
  సతి గని యల రావణుండు సరసకు బోయెన్ !
  మతిచెడి యాతడు దప్పి ని
  యతి మోహావేశ మెసగ నతివను బిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 9. గత రాత్రి జరిగె కలహము,
  పతి మాటాడక బిగిసెను, వయ్యారముగన్
  మతి చెదర నవ్వగ వెలది
  యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్!!

  వెలది + అతి మోహావేశము = వెలది యతి మోహావేశము (యడాగమ సంధి)

  రిప్లయితొలగించండి
 10. మితిమీరి తపము జేసిన
  మతి దప్పి తిరిగెదరట మునులేరీతిన్ !
  గతితప్పి నతివ గాంచిన
  యతి మోహా వేశమెసఁగ నతివనుఁబిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 11. స్థితి దప్పి రావణు౦డు "భ
  వతి భిక్షాం దేహి" యనుచు పర్ణకుటీ రా
  న్విత సీతఁజేరి వెడ్డరి
  యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్.

  రిప్లయితొలగించండి
 12. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మన్నించాలి. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరే సరిగా చెప్పారు. "అనియతి" మంచి ప్రయోగం.

  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "అతివను అతిగా" విసంధిగా వ్రాసారు. "అతివ నతిగఁ దా వలచిన" అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 13. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  నే నూహించిన పూరణ మీ నుండి వచ్చింది. సంతోషం. చాలా బాగుంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  చంద్ర శేఖర్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. "వెడ్డరి" పదప్రయోగం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
  జీ ఎస్ జీ ! మీ పూరణ నాకేదో అయోమయంగా నున్నది !
  వెలది అతివను పిలవడం ఏమిటో ? వివరిస్తారా !

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  అక్కడ వెలది అతివను పిలవలేదు. వెలది నవ్వితే పతి అతివను పిలిచాడు అని అర్థం చేసికోవాలని జిగురు వారి భావం అయి ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 16. గురువు గారు తెలిపిన భావమే నా భావము.
  అది "యడాగమ సంధి" కొఱకు పడిన పాట్లు. అందుకోసము ఇకారాంతమైన "వెలది"ని మూడవ పాదము చివరకు తెచ్చాను.

  రిప్లయితొలగించండి
 17. శంకరార్యా ! జి ఎస్ జీ ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 18. అతి దౌర్భాగ్యపు దినముల
  గత కాలమ్మున నొకపరి గవరనరకటా
  మతి తప్పిననా ముదుసలి
  యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   గవర్నరు గవరనర్ గా చేశారు.అలాంటి వాడిని అలా ఖండించాల్సిందే. బాగుంది పూరణ. అభినందనలు.

   తొలగించండి
 19. బ్రతుకిక భారమ్మనుచును
  వెతతో మేనకను జూచి వేడుక మీరన్
  మతిబోవగ కుతి మీరగ
  యతి మోహావేశ మెసఁగ నతివనుఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి