పిలువని పేరటమ్మునకుఁ బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా తలుపగ నేల మానమును? ధైర్యము జేసి భుజించి లేతమోయ్ అలములు ఆకులెందుకిక? హాస్టలు నందున మెస్సువద్దురా సెలవగు రోజు నేడు మరి చీకులు చింతలుఁ మర్చిపోదమోయ్
గోలి వారు: ఇందాకే అనుకున్నాను. ఇంతలో చెప్పారు. కిషోర్ గారు: అలములు - గడ్డి, ఆకులలములు అంటాం కదా అలాగ.
"చెలువుగ దేవళమ్మునట" జిల్ల న పాన కమంత ద్రావఁగన్ "కలువల కళ్ళరాముడట" గమ్మునపెళ్ళి కి నేగుచున్ ననున్ పిలువర దేమి యన్ననిటఁపిల్చిరి;నాకును చెప్పిరే నికన్ పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా
వసంతకిశోర్ గారు, హనుమచ్ఛాస్త్రి గారు మమ్మల్నందరినీ పిలవకుండా పెళ్ళికి బయల్దేరారే అని నేనడిగితే వాళ్ళు - "పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా" అని చెప్పారని నా ఉద్దేశ్యం. మిత్రులను మన్నించమని అడుగుతూ .......:)
మిస్సన్న గారూ! మేమంతా సీతా రామ కల్యాణానికి వెళ్తుంటే మీరు మాత్రం నెచ్చెలితో వనానికి వెళ్ళారు!జీ యస్ యన్ గారేమో షడ్రసోపేత భోజనం పెట్టారు. మీ రూటే సపరేటు! ఉభయులకూ అభినందనలు.
వసంత కిశోర్ గారూ, మీ నాలుగు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు. మొదటి పూరణలో "రాములవారి కళ్యాణానికి ఊళ్ళో ఉందరూ పెళ్ళిపెద్దలే" అన్నారు కదా, ఇక దానికి పిలుపెందుకు అనడం బాగుంది. ఇక రెండవ పూరణలో "శంకరాభరణం" బ్లాగును ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. నిజమే ... ఈ వేదక పైకి ఎవరైన పిలువకుండానే రావచ్చు. మూడవ, నాల్గవ పూరణలలో చూపిన దేశభక్తి ప్రశంసనీయం.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు. "కంజదళాక్షిణి సీత మాతకున్" అనేది "కంజదళాక్షియు తల్లి సీతకున్" అయితే? "పిలువరు + ఎవ్వ రక్కడకు" అన్నప్పుడు యడాగమం రాదు. "పిలువరె" అంటే సరి!
రవి గారూ, అలా మెస్సులలో తినలేక ఫంక్షన్లలో దూరి తినే వాళ్ళు నాకు తెలుసు. త్రీ ఇడియట్స్ లోని ఆ సన్నివేశం కూడా నాకు నచ్చింది. మంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారూ, భేష్! మీరు పూరణలపైనే పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. మీ రెండవ పద్యం బాగుంది. కాని భావమే కాస్త సందిగ్ధంగా ఉంది.
జిగురు సత్యనారాయణ గారూ, షడ్రసోపేతమైన పూరణతో మా కందరికీ విందు చేసారు. అత్యుత్తమం! అభినందనలు.
మిస్సన్న గారూ, వాహ్! ఏమి విరుపండీ?! అద్భుతం. అభినందనలు.
మందాకిని గారూ, మీ వివరణతో రెండవ పూరణలో నా సందిగ్ధత తొలగిపోయింది. సంతోషం. మూడవ పూర్ణ బాగుంది. కాని "దీవళి" ? అన్యదేశ్య పదంగా తీసుకున్నా అది హిందీలో "దివాలీ" కదా! నాల్గవ పూరణ కూడా బాగుంది. మీడియ వాళ్ళను గురించి చక్కగా చెప్పారు. అక్కడ "పెద్దదియు గాదన" అంటే బాగుంటుందేమో? "వలే" _ "వలెన్" అనడం బాగు. మొత్తానికి వృత్త రచనలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. అభినందనలు.
01)
రిప్లయితొలగించండి________________________________________
చెలువుగ దేవళమ్మునను- చిత్ర విచిత్రపు రీతులన్ మహా
వెలుగున జానకీ రమణు - పెండిలి వేడుక జూడగన్ సదా
కలుగును సంతసంబు మది ! - కారణ జన్ముల గాంచగా నిలన్
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
________________________________________
కలువల కళ్ళ రామునకు కంజదళాక్షిణి సీత మాతకున్
రిప్లయితొలగించండిచలువల పందిరేసి యిట చక్కగ పెండ్లిని జేయుచుండె!రా!
పిలువరు యెవ్వ రక్కడకు పేరును బెట్టుచు,రమ్మురమ్మికన్!
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుట మేలు మిత్రమా!
కిశోర మహోదయా! హనుమచ్చాస్త్రి గారూ
రిప్లయితొలగించండిఅద్భుతమైన అంశాన్ని అత్యద్భుతంగా మలచారు.
అభినందనలు.
అనుకోకుండా నేనూ సీతారామ కల్యాణానికే బయల్దేరాను.కాని మీరే నాకంటే నిమిషం ముందు చేరుకున్నారు.అభినందనలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరవి గారూ!హాస్టలరు మానససికి స్థితి చక్కగాచెప్పారు.
రవి గారూ!మూడవ పాదంలో గణము తప్పింది.అలములు ఆకు వంటకము -అంటే సరిపోతుందేమో!
రిప్లయితొలగించండిశాస్త్రిగారూ !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
మిస్సన్న మహాశయా !
ధన్యవాదములు !
ఇందాకే మీరన్నట్టుగా
భావ సారూప్యత అంటే ఇదే గదా !
రవీజీ !
బావుంది !
"అలములు ఆకులున్నవట " అంటే ?
పిలువని పేరటమ్మునకుఁ బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా
రిప్లయితొలగించండితలుపగ నేల మానమును? ధైర్యము జేసి భుజించి లేతమోయ్
అలములు ఆకులెందుకిక? హాస్టలు నందున మెస్సువద్దురా
సెలవగు రోజు నేడు మరి చీకులు చింతలుఁ మర్చిపోదమోయ్
గోలి వారు: ఇందాకే అనుకున్నాను. ఇంతలో చెప్పారు.
కిషోర్ గారు: అలములు - గడ్డి, ఆకులలములు అంటాం కదా అలాగ.
త్రీ ఈడియట్స్ సినిమా చూస్తూంటే ఆలోచన వచ్చింది.
"చెలువుగ దేవళమ్మునట" జిల్ల న పాన కమంత ద్రావఁగన్
రిప్లయితొలగించండి"కలువల కళ్ళరాముడట" గమ్మునపెళ్ళి కి నేగుచున్ ననున్
పిలువర దేమి యన్ననిటఁపిల్చిరి;నాకును చెప్పిరే నికన్
పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా
వసంతకిశోర్ గారు, హనుమచ్ఛాస్త్రి గారు మమ్మల్నందరినీ పిలవకుండా పెళ్ళికి బయల్దేరారే అని నేనడిగితే వాళ్ళు -
"పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా" అని చెప్పారని నా ఉద్దేశ్యం. మిత్రులను మన్నించమని అడుగుతూ .......:)
సీతామాత అనాలేమో!సీతమాత అనకూడదనేమోనని సందేహం.అందుకని చిన్న సవరణ.మాస్టరుగారూ! సందేహం తీరుస్తారా!
రిప్లయితొలగించండికలువల కళ్ళ జానకికి కంజదళాక్షుడు రామచంద్రుకున్
చలువల పందిరేసిరట చక్కగ పెండ్లిని జేయుచుండె!రా!
పిలువరు యెవ్వ రక్కడకు పేరును బెట్టుచు,రమ్మురమ్మికన్!
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా!
కొలువునుదేవతాదులనుఁగూడిసురేంద్రుఁడువచ్చెనందరున్
రిప్లయితొలగించండిగొలువఁగ చేరిరాగిరిజకున్పతిగాఁగలయీశునచ్చటన్
పిలువఁగలేదటంచునటఁబిల్పులకైనెటులాగ మందువో
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా!
పై పద్యంలో రెండు పాదాల తర్వాత సెమికొలన్ పెట్టటం మరిచాను.
రిప్లయితొలగించండివలసిన పాయసాన్నములు పప్పును పూర్ణము లడ్లు పూత రే
రిప్లయితొలగించండికులు పులిహోర యప్పడము కోరిన కూరలు భక్ష్యభోజ్యముల్
ఫలములు చారు క్షీరజము పాను పసందుగ విందులుండినన్
పిలువని పేరటమ్మునకుఁ బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
జి ఎస్ జీ !
రిప్లయితొలగించండిమీరు చెప్పిన పదార్థాలతో
విందు ఇస్తే
మేమంతా పిలువని పేరంటానికి తయార్ !
చాలా బావుంది !
సత్యనారాయణ గారూ నోట్లో రసాలూరిపోతున్నాయి.
రిప్లయితొలగించండివిలువగు పచ్చ పుట్టమును, వెన్నెల నవ్వులు, కొప్పు నిండుగా
రిప్లయితొలగించండిపలు రమణీయ పుష్పములు, పక్షి గణమ్ముల మంగళధ్వనుల్,
సలుప ' వసంత ' వేడుకలు చైత్రమునన్ వనలక్ష్మి కింపు సొం-
పిలు! వని పేరటమ్మునకు బ్రీతిగ నేగుట మేలు నెచ్చెలీ!
జిగురు సత్యనారాయణ గారూ
రిప్లయితొలగించండివలసిన పాయసాన్నములు పప్పును పూర్ణము లడ్లు పూత రే
కులు పులిహోర యప్పడము కోరిన కూరలు భక్ష్యభోజ్యముల్
----------
వావ్. ఎక్కడ పెట్టించినా బాగుంటుంది. పూరణ బాగుంది.
02)
రిప్లయితొలగించండి________________________________________
పలుకుల శంకరార్యు, కృప ! - పద్యము వ్రాయగ నిచ్ఛ గల్గెనా
విలువగు పద్య మాలికల - వెల్గులు చిందెడి బ్లాగు లందునన్
అలరెడి శంకరా భరణ - మందున చిందులు వేయగా నొహో
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
________________________________________
పలుకు = విద్య
03)
రిప్లయితొలగించండి________________________________________
నిలుపగ దేశ గౌరవము - నిర్మల చిత్తము గల్గి యుండినన్
చెలగగ ,లంచ గొండులను - చిత్తము విత్తము గల్గు మంత్రులన్
పిలుపది నీకదేల ? మది - వేదన జెందిన , ముందు దూకుమోయ్
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
________________________________________
హనుమచ్ఛాస్త్రి గారు, సత్యనారాయణగారు, మిస్సన్నగారు, వసంతకిశోర్ గారు
రిప్లయితొలగించండిరవి గారు విభిన్నమైన పూరణలు చక్కగా అందించారు. అందరికీ అభినందనలు.
బుద్ధి, బలము , యిష్టము గల
రిప్లయితొలగించండియువతకు సైన్యములో జేరుటకు
పిలుపెందుకు?
04)
________________________________________
బలమును బుద్ధియున్ గలుగ !- భారత దేశపు రక్ష సేయగన్
పలుమరు దండ యాత్రలకు - వచ్చెడి పాకుల మూకలందరిన్
గెలువగ యుద్ధమందు; మది - కిష్టము, గల్గిన సైన్యమందునన్
పిలువని పేరటమ్మునకు - బ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
________________________________________
పాకు = పాకిస్థాన్
మిస్సన్న గారూ! మేమంతా సీతా రామ కల్యాణానికి వెళ్తుంటే మీరు మాత్రం నెచ్చెలితో వనానికి వెళ్ళారు!జీ యస్ యన్ గారేమో షడ్రసోపేత భోజనం పెట్టారు. మీ రూటే సపరేటు!
రిప్లయితొలగించండిఉభయులకూ అభినందనలు.
అహో !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా !
ఎంత చక్కని విరుపు !
భళారే భళా !
చంద్ర శేఖరా !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయులు
వరూధినిని పేరు మార్చేసారు
" వనలక్ష్మి " యని !
గుర్తించారా !!!
కిశోర మహోదయా మీ రెండవ పూరణ అమోఘం .
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ వసంత మహోదయా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో "రాములవారి కళ్యాణానికి ఊళ్ళో ఉందరూ పెళ్ళిపెద్దలే" అన్నారు కదా, ఇక దానికి పిలుపెందుకు అనడం బాగుంది.
ఇక రెండవ పూరణలో "శంకరాభరణం" బ్లాగును ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. నిజమే ... ఈ వేదక పైకి ఎవరైన పిలువకుండానే రావచ్చు.
మూడవ, నాల్గవ పూరణలలో చూపిన దేశభక్తి ప్రశంసనీయం.
పిలువఁగ రావటయ్య,నినుపేర్మిగచెప్పుచునుందు నాకునె
రిప్లయితొలగించండిచ్చెలుడని; దీపకాంతులిట చీకటిమబ్బులనెట్టి పృధ్వితా
రలవలెపెట్టినారు నెలరాజ,నిదీవళికింక రాగదే,
పిలువని పేరటమ్మునకుబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
"కంజదళాక్షిణి సీత మాతకున్" అనేది "కంజదళాక్షియు తల్లి సీతకున్" అయితే?
"పిలువరు + ఎవ్వ రక్కడకు" అన్నప్పుడు యడాగమం రాదు. "పిలువరె" అంటే సరి!
రవి గారూ,
అలా మెస్సులలో తినలేక ఫంక్షన్లలో దూరి తినే వాళ్ళు నాకు తెలుసు. త్రీ ఇడియట్స్ లోని ఆ సన్నివేశం కూడా నాకు నచ్చింది. మంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
భేష్! మీరు పూరణలపైనే పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
మీ రెండవ పద్యం బాగుంది. కాని భావమే కాస్త సందిగ్ధంగా ఉంది.
జిగురు సత్యనారాయణ గారూ,
షడ్రసోపేతమైన పూరణతో మా కందరికీ విందు చేసారు. అత్యుత్తమం! అభినందనలు.
మిస్సన్న గారూ,
వాహ్! ఏమి విరుపండీ?! అద్భుతం. అభినందనలు.
కొలువునుదేవతాదులనుఁగూడిసురేంద్రుఁడువచ్చెన్, అందరున్ గొలువఁగ ేరిరి+ఆగిరిజకున్పతిగాఁగలయీశునచ్చటన్;
రిప్లయితొలగించండిపిలువఁగలేదటంచునటఁబిల్పులకైనెటులాగ మందువో
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా!
గిరిజాకళ్యాణపువేళ హిమవంతుడు, ఈశ్వరుడు అందరినీ పిలిచేఉంటారు. కానీ పిలుపుఅందని ఒకరిద్దరు ఇలా మాట్లాడుకొన్నట్టు ఊహించాను. ఏదో చిరు ప్రయత్నం.
ఇక చివరి పూరణలో దీవళి పండుగకు చంద్రుడు రాలేదే, పిలువలేదని రాలేదా, తారల్లా దీపాలు భువినంతా నింపాము రావయ్యా అని పిలువటం.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సవరణకు చిన్న మార్పు.
పిలువగ రారు నీ కడకు పేరును బెట్టుచు; రమ్ము రమ్మికన్! ... అంటే..
గురువుగారూ కడుంగడు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికలహమదంత పెద్దదిగ కాదని వీడరు గాక వీడరీ
రిప్లయితొలగించండిగలు , గుడమంత జేరు బలు గాథ వలే వెనువెంట వత్తురే
"పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా,
ఫలితముదక్కుఁ జాలు"ననిబారులుతీరుచుమాధ్యమంబులున్.
మీడియా వారు ప్రతి చిన్న విషయం నుంచి లాభం పొందాలని చూస్తారు గదా!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ వివరణతో రెండవ పూరణలో నా సందిగ్ధత తొలగిపోయింది. సంతోషం.
మూడవ పూర్ణ బాగుంది. కాని "దీవళి" ? అన్యదేశ్య పదంగా తీసుకున్నా అది హిందీలో "దివాలీ" కదా!
నాల్గవ పూరణ కూడా బాగుంది. మీడియ వాళ్ళను గురించి చక్కగా చెప్పారు. అక్కడ "పెద్దదియు గాదన" అంటే బాగుంటుందేమో? "వలే" _ "వలెన్" అనడం బాగు.
మొత్తానికి వృత్త రచనలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. అభినందనలు.
శంకరార్యా !
రిప్లయితొలగించండి" వీడరీ గలు , గుడమంత జేరు "
అంటే అర్థం చెబుతారా ?
గురువు గారు,
రిప్లయితొలగించండిమరీ మరీ ధన్యవాదాలు. మీ సవరణలు శిరోధార్యము. దీవళి అంటే దీపావళి అని అర్థం రాదంటే వేరే పదమేమీ తోచట్లేదే!
వసంత కిశొర్ గారు,
వీడరు, యీగలు గుడమంత ----గుడము = బెల్లము
మందాకినిగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమందాకినిగారూ ! " దీపావళి = దివ్వెల = దీవల " అను అర్థములున్నవి !
రిప్లయితొలగించండికలిగిన రెడ్డిగారికట కన్నడు పుట్టగ లేకలేకయే
రిప్లయితొలగించండివిలువగు చీర నారలను వెర్రిగ పంచగ బోడిముండ్లకున్
తలపులు తీసిపెట్టిరట తన్నుకు చావగ సూర్యకాంతమా!
పిలువని పేరటమ్మునకుఁబ్రీతిగఁ బోవుటె మేలు మిత్రమా!