23, మే 2011, సోమవారం

సమస్యా పూరణం -347 (బ్రహ్మచారి భార్య)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

  1. పతియు పలుక నదియు హితమవ్వు చెవులకు
    నెదురు నాడ బోదు సుదతి యెపుడు
    నగలు నట్ర నడుగ నాతియు వెనుకాడు
    బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి !

    మరి ఆ భార్యతో ఊహాలోకములో బ్రహ్మచారి విహరిస్తూంటాడు.

    రిప్లయితొలగించండి
  2. బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి
    పెద్ద పులులఁ జూసి బెదరరెవరు.
    వెంగళప్ప చెప్పు వింతపాఠములను
    విన్న వారు నవ్వి వెక్కిరింప.

    రిప్లయితొలగించండి
  3. బ్రహ్మచారి యనెడు కమసాల వానికి
    యూరి లోన మంచి పేరు గలదు
    పరమ సాత్వికుండు బ్రహ్మచారి యనగ
    బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  4. బ్రహ్మ చారి యగును పవవ కుమారుడు
    సతి సువర్చ లండ్రు, స్తుతులఁ గొన్ని!
    అది నిజ మను కొన్న ననవచ్చు నిట్లని;
    బ్రహ్మచారి భార్య పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె: మొగుడు బ్రహ్మచర్య మొనసి చేయుచు నుండె
    దైవ దర్శన ఘన దీక్ష బూని
    భార్య పగలు రాత్రి పరిచర్య చేసెను
    బ్రహ్మ చారి భార్య పరమ సాధ్వి

    -----వెంకట రాజా రావు . లక్కాకుల
    బ్లాగుపేరు : స్రుజన-సృజన

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్చాస్త్రి.

    చారి గొప్ప వాడు,సాధువే,మావూరి
    వారి తలను నాల్క,వైద్యు డతడు;
    అతనికి తగినట్టి అతివయే దొరకె,విను
    బ్రహ్మ! చారి భార్య పరమ సాధ్వి.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్చాస్త్రి.

    చారి గొప్ప వాడు,సాధువే,మావూరి
    వారి తలను నాల్క, వైద్యు డతడు;
    అతనికి తగినట్టి అతివదొరకె,విను
    బ్రహ్మ! చారి భార్య పరమ సాధ్వి.

    రిప్లయితొలగించండి
  8. మాల ధారి యతడు మణికంఠు దర్శింప
    దీక్ష బూని చేయు దైవ పూజ
    సౌఖ్య మెరుగని సతి శోషింఛి సేవించ
    బ్రహ్మ చారి భార్య పరమ సాద్వ్హి !

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్చాస్త్రి.

    చిన్న సవరణతో...

    చారి గొప్ప వాడు,సాధువే,మావూరి
    వారి తలను నాల్క, వైద్యు డతడు;
    అతనికి తగినట్టి ఆలినే యిచ్చెను
    బ్రహ్మ; చారి భార్య పరమ సాధ్వి.

    రిప్లయితొలగించండి
  10. ( తల్లి కొడుకుతో అంటుంది : )

    "అప్పారావా ! చూడర !
    కొప్పులు యెండినవి మావి గూడులు కట్టెన్ !
    ఇప్పుడె తెమ్ముర కొని ! నా
    కప్పకు సంపంగి నూనె కావలె వింటే !"

    నాకు + అప్పకు = నాకప్పకు = నాకు, మీ యక్కకు

    రిప్లయితొలగించండి
  11. క్షమించండి ! పొరపాటున వేరే సమస్యాపూరణం ఇక్కడ పడింది !

    రిప్లయితొలగించండి