5, మే 2011, గురువారం

సమస్యా పూరణం - 329 (వేప చెట్టున గాసెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వేప చెట్టున గాసెను వెలగ పండ్లు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ________________________________

  గాంధి నెహ్రుల గన్నట్టి - కనక గర్భ !
  నేటి భారతావని జూడ - నిజము గాను
  లంచ గొండులె పాలించు - రాజ్య మయ్యె!
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!
  ________________________________

  రిప్లయితొలగించండి
 2. శంకరార్యా !
  అన్వయము సరిపోయినదా యని అనుమానముగా నున్నది !

  రిప్లయితొలగించండి
 3. వసంత కిశోర్ గారూ,
  "అందరి పూరణలూ
  అలరించు చున్నవి !" ..... ?
  మీ పూరణే మొట్టమొదటిది. ఇంకా ఎవరి పూరణలూ రానిదే?
  పై పూరణలో అన్వయ విషయంలో మీరన్నది నిజమే ... చేదు పండ్ల నిచ్చే చెట్టుకు తినదగిన పండ్లు వచ్చాయి. "వెలగచెట్టుకు గాసెను వేపపండ్లు" అనే సమస్యకు మీ పూరణ సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 4. శంకరార్యా !
  అది cut&paste పొరపాటు !

  పండ్ల విషయానికొస్తే వెలగ పండ్లే తియ్యన వేపకన్న !
  కాని వేపచెట్టే గొప్పది మిగిలిన విషయములలో !
  అందుకని...................!!!???

  రిప్లయితొలగించండి
 5. వసంత కిశోర్ గారూ,
  ఇదేదో సుదీర్ఘమైన చర్చకు అంకురార్పణ జరిగినట్లుంది.

  రిప్లయితొలగించండి
 6. తాగి తందాన యాడేటి తండ్రి యొకడు;
  తగవు లాటల వెలిగేటి తల్లి యొకతె
  పెద్ద చదువులు జదివిరి పిల్ల లంత
  వేప చెట్టున గాసెను వెలగ పండ్లు

  రిప్లయితొలగించండి
 7. వెలగ చెట్టు ప్రక్కన కరి వేప నాట
  యెరువు లేయుచు ప్రతి రోజు నీరు బోయ
  పెరిగి నేడవి, చిగురాకు వేసెను కరి
  వేప, చెట్టున గాసెను వెలగ పండ్లు.

  రిప్లయితొలగించండి
 8. శంకరయ్య గారూ... ఎన్నికలు పోటా పోటీ గా జరుగుతున్నాయి కడపలో. ఎవరు గెలిచేది. దేవుడెరుగు! మధ్యలో ఓటర్లు కంఫ్యూషన్ తో చచ్చి పోతున్నారు. ఈ నేపధ్యం లో ఓ మంచి సమస్య ఇవ్వండి. ఉదా:
  ఎన్నికలలన్న రోతాయె ఏమి కర్మ!

  రిప్లయితొలగించండి
 9. టేకుమళ్ళవారు నా ఐడియా కొట్టేశారు:-)

  రిప్లయితొలగించండి
 10. రెందవ పాదంలో యతి మైత్రి సరి చెస్తూ...

  వెలగ చెట్టు ప్రక్కన కరి వేప నాటి
  నేను బెంచితి పెరడున నీరు బోసి!
  పెరిగి నేడవి, చిగురాకు వేసెను కరి
  వేప, చెట్టున గాసెను వెలగ పండ్లు!

  రిప్లయితొలగించండి
 11. వెంకటప్పయ్య గారూ ! చక్కగానున్నది !
  శాస్త్రీజీ ! వెలగ పండ్ల కన్నా మీ కరివేప చిగుర్లు బాగా పండినవి !

  ఇంతకీ వేప గొప్పదా ? వెలగ గొప్పదా ? సభ్యులు స్పందించాలి !

  రిప్లయితొలగించండి
 12. "ఓటు కన్న మిన్న నోటు పోటు" లేక "నోటు పోటు కన్న ఓటు మిన్న" - మాష్టారు మీరు పరిశీలించి ఇవ్వండి. టేకుమళ్ళ వారి కోరిక తీర్చండి, ఎన్నికల సమయంలో.

  రిప్లయితొలగించండి
 13. వేప, వెలగ రెండూ కూడా ఆయుర్వేద ఔషధులే. వసంత మహోదయా, ఈ కాన్సెప్ట్ మీద ఒక పద్యం అందుకోండి.

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  సరే ! కాసేపు పండ్లు మాత్రమే పోలిస్తే !
  హిరణ్య కశిపుని కడుపున ప్రహ్లాదుడు !

  02)
  ________________________________

  వరములను పొంది పిమ్మట - సురల మీద
  దండ యాత్ర సలిపినట్టి - దనుజునకును
  అంబుజోదరు గీర్తించు - నంగజుండు !
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!
  ________________________________
  అంగజుడు = కొడుకు

  రిప్లయితొలగించండి
 15. కిశోర్ గారూ! ధన్యవాదములు.వేపా,వెలగా గొడవెందుకనే నేను కరివేప పెంచాను.ఐనా ప్రస్తుతానికి పండ్లను పోల్చుతున్నాం కాబట్టి వేపను చేదు భావన లోనే తీసుకోవాలని నా అబిప్రాయం.

  రిప్లయితొలగించండి
 16. శాస్త్రీజీ ! ధన్యవాదములు ! నేనూ అదే అభిప్రాయానికి వచ్చాను !
  పోలిక పండ్ల వరకేనని !

  రిప్లయితొలగించండి
 17. పెండ్లి యింటికి ముందున్న వేప చెట్టు
  పైన గట్టిరి చిరు లైట్లు పండ్లవలెను!
  వేప పండ్లకు ప్రక్కన వెలుగు చుండ
  వేప చెట్టుకు గాసెను వెలగ;పండ్లు!

  రిప్లయితొలగించండి
 18. గురువు గారు,
  325,326,328 లందు నా పూరణలను పరిశీలించవలసినదని ప్రార్థన.

  అందరి పూరణలూ బాగున్నాయి. శాస్త్రి గారు రకరకాలుగా విరిచేసి భలె పూరిస్తున్నారె!

  పెరటి తోటను గలదొక పెద్దచెట్టు
  చెట్టు పెద్దది, వింతగ చిన్న పండ్లు
  వేపచెట్టుకు గాసెను; వెలగపండ్లు
  గాచెడి వెలగవృ క్షమునే గాన మెచట

  రిప్లయితొలగించండి
 19. 03)
  ________________________________

  రాము నెదిరించు రావణ - లంక లోన
  రామ చంద్రుని పూజించు - రాక్ష సుండు !
  విమల చరితుడు , పూజ్య ,వి - భీషణుండు !
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!
  ________________________________

  రిప్లయితొలగించండి
 20. వెలగ పండైన, వేపైన వేస్టు గాదు
  దేని విలువను దానికే దేవు డిచ్చె
  కవులు దయచేసి జగడాలు కట్టి పెట్టి
  పద్య మార్గము బట్టుము హృద్య మంగ!

  రిప్లయితొలగించండి
 21. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  గణన యంత్రము నాంగ్లముఁ గలయఁ జూచి
  వర్ణ మాలను జిలుకగ పదము లూరెఁ
  దెనుగు భాషలోన, సమస్య దీఱె నిపుడు
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు.

  రిప్లయితొలగించండి
 22. వేప చెట్టున గాసెను వెలగ పండ్లు
  యన్న సామెత చందంబు వ్యాస కృపను
  దాసి కడుపున బుట్టెను ధర్మ వేత్త
  విన మహాత్ముల పుటకలు వింత గాదె!

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందరి పూరణలు బాగున్నవి.

  ప్రఖ్యాత ఐంద్ర జాలికుడు తన ప్రదర్శనలో

  చిట్టి తొట్టిలో విత్తును బెట్టినాడు
  ఎరువు వేసెను ,పోసెను యెర్ర నీరు,
  మంత్ర దండమ్ము దిప్పెను మాయ జేసి
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!!

  రిప్లయితొలగించండి
 24. విష్ణు కీర్తిని ,మూర్తిని ,విశ్వ మయుని
  దుష్ట కశిపుండు దిట్టెను దిక్కులదర
  యట్టి వానికి ప్రహ్లాదు బుట్టె గాదె!
  వేప చెట్టున గాసెను వెలగ పండ్లు/పండు!

  రిప్లయితొలగించండి
 25. చిట్టి తొట్టిలో విత్తును బెట్టినాడు
  ఎరువు వేసెను ,పోసెను యెర్ర నీరు,
  మంత్ర దండమ్ము దిప్పెను మాయ జేసి
  వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!!
  -----------------------------

  మంద పీతాంబర్ గారూ మీ పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 26. వసంత కిశోర్ గారూ,
  మీరు ఈ బ్లాగు ప్రారంభకాలంలో ఇచ్చిన సమస్యలకు ఎంతో ఓపికతో , ఆసక్తితో చేస్తున్న పూరణలను చూస్తున్నాను. చాలా బాగుంటున్నాయి. వీలున్నప్పుడల్లా వాటిని విశ్లేషిస్తాను. వాటిపై వ్యాఖ్యలు వెంటనే పెట్టనంత మాత్రాన నేను చూడడం లేదని నిరుత్సాహ పడకండి. మీరు పంపే పూరణలన్నీ నా జి-మెయిల్ ఇన్‌బాక్స్ లోకి కూడా వస్తాయి. నేను ఎప్పటి కప్పుడు నా మెయిల్ చెక్ చేసుకొని అన్నీ చదువుతాను.
  నేను సిద్ధం చేయబోయే ఇ - బుక్కులో ఆ పూరణలు తప్పకుండా ఉంటాయి.
  మీకు నా అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 27. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "ఆడేటి, వెలిగేటి" పదాలను "ఆడెడు, వెలిగెడు" అంటే బాగుంటుంది.
  ఎన్నికల నేపథ్యంలో సమస్య ఇవ్వమన్న మీ సలహా పాటిస్తాను.
  మధ్యేమార్గంగా పద్యమార్గం పట్టమన్న మీ హితబోధ బాగుంది. ధన్యవాదాలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ కరివేప పూరణ, వేపచెట్టుకు లైట్లు కట్టిన పూరణలు అదిరాయి. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  ప్రహ్లాద, విభీషణ ప్రస్తావనలతో మీ 2వ, 3వ పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. మందాకిని గారూ,
  దేని కదే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు
  చివర "గాన మెచట" అనేది "గాంతు మెచట" అనాలనుకుంటా!

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  గణనయంత్ర మనే వేపచెట్టుకు తెలుగు పండ్లు పండించారు. మధురమైన పూరణ. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  "పండ్లు + అన్న" ఇక్కడ యడాగమం రాదు. "పండ్లటన్న" అందాం. అలాగే "పుటకలు" పుట్టుక అంటే సరి.

  మంద పీతాంబర్ గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  "ప్రహ్లాదు బుట్టె ... "డు" ప్రత్యయం? "యట్టి వానికి బుట్టె ప్రహ్లాదు డకట!" అంటే ఎలా ఉంటుంది?

  లక్కరాజు వారూ,
  మీ ఇంద్రజాలికుని పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  "పోసెను + ఎర్ర నీరు" అన్నప్పుడు యడాగమం రాదు. "పోసినా డెఱ్ఱనీరు" అందాం.

  రిప్లయితొలగించండి
 29. తక్రమందు రుచుల తనివితీర్చెడికరి
  వేప,చెట్టున గాసెను; వెలగ పండ్లు,
  ప్రీతినారగిచు పిలిచినయమునను
  బెట్టిచూడుమొక్క పెద్దకరికి

  రిప్లయితొలగించండి
 30. బాబోయ్ నేను వ్రాయలేదు. మాస్టారూ ఆ పద్యం పీతాంబార్ గారి పూరణ. చదవటానికి నాకు చాలా బాగుంది. నాకూ ఎప్పుడో పద్యాలు వ్రాసే రోజులొస్తాయి చూస్తూ ఉండండి.

  రిప్లయితొలగించండి
 31. వేప పైన బదనికగ వెలగ మొలిచె
  వెలగ చెట్టుకు కాసెను వెలగ పండ్లు
  చూచు వారలు పలికిరి తోచినట్లు
  "వేప చెట్టున గాసెను వెలగ పండ్లు"!!

  బదనిక = ఒక చెట్టు పైన మరో చెట్టుగా మొలిచినది

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 33. సవరణకు ధన్యవాదాలు, మాస్టారూ.

  రిప్లయితొలగించండి
 34. లక్కరాజు వారూ,
  నిన్న పీతాంబర్ గారి పూరణను మీ పూరణగా పొరబడ్డాను. ఏమిటో? మతిమరుపు ఎక్కువౌతున్నది. అయినా మీరు మొత్తం పద్యాన్ని కాపీ ,,, పేస్ట్ చేయకుండా ఆ పూరణలో మీకు నచ్చిన భాగాన్ని మాత్రమే చూపండి.
  నా పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 35. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ బదనికా పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. మందాకిని గారూ,
  తక్రానికి రుచిని పెంచే కరివేప పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 37. ఇష్టమైన పద్యాన్ని సగంలో నరకలేక పూర్తి పద్యం పెట్టాను. అన్నట్లు మతిమరుపు మీద ఒక పోస్ట్ వేసాను వీలుంటే చూడండి. మనందరికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
  www.mytelugurachana.blogspot.com.

  రిప్లయితొలగించండి
 38. శ్రీ శివరామ కృష్ణ గారు ధన్యవాదములు .గురువుగారికి ధన్య వాదాలు .

  రిప్లయితొలగించండి