19, మే 2011, గురువారం

చమత్కార పద్యాలు - 57 (దృఢసత్త్వంబునఁ జీమ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 1
సమస్య - "దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా
దిగ్దంతు లల్లాడఁగన్"
మ.
సఢులీశోర్వి చలింప, నిర్జరవరుల్ శంకింప, భేరీనికా
య ఢమత్కారత నిద్రలేచి దశకంఠామర్త్యవిద్వత్పరీ
వృఢసోదర్యుఁడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై
దృఢసత్త్వంబునఁ జీమ; తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

10 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  పాండవులచే అవమానించబడి, వారిని జయించుటకు కఠినమైన
  దీక్ష వహించి ఈశ్వరుని మెప్పించి ఒక్కరోజు క్రీడినితప్ప
  పాండవ సమూహాన్ని నిలువరించ గలిగిన వరము పొంది,
  తదుపరి పద్మవ్యూహ భేదనమునాడు ,దుర్మార్గుడైన
  సైంధవుడు జయింప శక్యము కానివాడైన సందర్భం :

  01)
  ________________________________________

  ద్రఢిమ న్పాండవ సేన ,నొక్క తరి , వై - రారోహ మందాపగా
  ధృఢ దీక్ష న్వహియించి, యా,పశుపతిన్ - దేవేశు, సంకల్పమున్
  ధృఢుడై నిల్చె గదా , యనంతరము,దు- ర్మేధుండు, వ్యూహంబునన్ !
  దృఢ సత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా - దిగ్దంతు లల్లాడఁగన్ !
  ________________________________________
  వైరారోహము = యుద్ధము ;
  దుర్మేధుండు = దుష్టుడు ( సైంధవుడు)
  వ్యూహము = పద్మ వ్యూహము

  రిప్లయితొలగించండి
 2. దిక్కులల్లాడేట్లు తుమ్మాలంటె కుంభకర్ణుడు లాంటివాడే తుమ్మాలి.
  ముక్కులో చీమ చేత కుట్టించి తుమ్మించటం ... అద్భుతమైన ఊహ..మోచర్ల వారూ!నమోవాకాలు!
  మహామహులు పూరించిన ఈ సమస్యను మరల పూరించటం సాహసమే అవుతుంది.అయినా చిన్ని ప్రయత్నం...
  డుఢు-ఢూ అనే రెండు చీమల పెండ్లి గురించి తీసిన కార్టూన్ ఫిల్మ్ లోని ఒక సన్నివేశం ..నా ఊహలో..


  'డుఢు,ఢూ చీమల పెండ్లి 'యంచు యొక కార్టూన్ ఫిల్ము;అందొక్కచో
  డుఢు,ఢూ ప్రక్కన శాస్త్రి గారు వడి పట్టున్ పట్టె నశ్యంబునే
  డుఢు నాసంబుల రేగి దూరి తెగ ఘాటున్ పుట్టి మంటెత్తగా
  దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్!

  రిప్లయితొలగించండి
 3. దృఢ చిత్తంబున జేసినాడ నిదిగో దీటైన వ్యూహమ్ము యే
  దృఢ చిత్తుండరు డెంచు చూతు ననియెన్ ధీశాలి ద్రోణుండు ఆ
  దృఢ చిత్తుం డభిమన్యు "బాలకుడు" చేదించెన్ యొంటిమై వ్యూహమున్
  దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్!

  రిప్లయితొలగించండి
 4. వసంత కిశోర్ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. చీమ లాంటి సైంధవుణ్ణి దృఢసత్వుణ్ణి చేసారు. బాగుంది. అభినందనలు.
  మూడవపాదం "ధృఢమైనట్టి తపం బొనర్చి హరుచే దివ్యేచ్ఛఁ దా నందుటన్" అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీరు "డుఢు" చీమ చేతనే తుమ్మించారు. ఆ చిత్రాన్ని టి.వి.లో చూసాను. మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ,
  "దృఢచిత్తం"తో మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కొప్పరపు సోదర కవుల పూరణ:
  ద్రఢిమన్మీఱిన పాండుపుత్రుల మహాస్త్రప్రౌఢులన్ రాట్పరీ
  వృఢలోకాద్భుత విక్రమక్రములనాఁపై న్సైంధవ భ్రష్టుఁడా
  ది ఢులీంద్రోపములైన, నీశ్వరవరాధిక్యంబునంజేసి హా!
  దృఢసత్వంబునఁ జీమ తుమ్మెఁగదరా? దిగ్దంతులల్లాడఁగన్

  రిప్లయితొలగించండి
 8. శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రుల పూరణలు ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 9. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. దృఢమౌ నాంగ్లురు దేశమేలగను భల్ తీండ్రించి దండించుటన్
  దఢ ధడ్మంచును నుప్పుజేయగను తా దండీకి పర్వెట్టుచున్
  బుఢపమ్మందున గాంధితాత నగుచున్ ముద్దాడి గుద్దాడెనే!
  దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్

  రిప్లయితొలగించండి