20, మే 2011, శుక్రవారం

సమస్యా పూరణం -343 (గొప్పవారి కుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గొప్పవారి కుండుఁ గొంచె బుద్ధి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. కొంత మంది జూడ వింతగా నుందురు,
    ఒరుల మాట వినరు ఓర్పు తోడ;
    అందు రెపుడు మేము అందరి కన్నను
    గొప్ప! వారి కుండు గొంచె బుద్ధి!

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారి పూరణ గొప్పగా ఉంది .

    (మాజీ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నారాయణ దత్ తివారి ఉదంతము దృష్టిలో బెట్టికొని)

    రాజ్య పాల కుండు రాసలీలల దేలి
    రాజ భవను విడిచె రచ్చగాగ
    తప్పు డైన పనులు ముప్పు దెచ్చెను గదా
    గొప్ప వారికుండు గొంచె బుద్ధి

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ!ధన్యవాదములు.
    పీతాంబర్ గారూ! ధన్యవాదములు.గొప్ప అనుకునేటి(తి)వారిని గుర్తు జేశారు.

    రిప్లయితొలగించండి
  4. ధర్మసూను డతను ధర్మమ్మునేవీడి
    ద్రోణుని హత మార్చ దోషియయ్యె
    నంత రాత్మ జంపి వింతగా మాట్లాడె
    గొప్ప వారికుండు గొంచె బుద్ధి.

    రిప్లయితొలగించండి
  5. శంతన మహారాజు యోజనగంధిని చూచిన సందర్భము


    పుడమినేలెడు రేడు పడతి చూపుకు లొంగి,
    శంతనుండునేగె కాంతకడకు,
    విధి విచిత్రము చూడ వేర్వేరు విధములు
    గొప్ప వారికుండు కొంచె బుద్ధి.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________________

    రామ సతిని దెచ్చె - రావణాసురువంటి
    రాజ కోవి దుండు - రాక్షసముగ !
    రాణ జూపు సుంద - రాంగు లెందరొ యున్న !
    గొప్పవారి కుండు - గొంచె బుద్ధి !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  7. ఆ: ధనము వలన గలుగు ఘనులకైన మధము
    చిన్నవారి జెలిమి చెఱపి వారు
    ముందు వెనుక మరచి మసలుతూ పోయెడి
    గొప్ప వారి, కుండు గోచె బుద్ధి|
    గురువు గారి సవరణకు ధన్యవాదములు తెలుపుతూ

    రిప్లయితొలగించండి
  8. స్వంత జాతి యందు స్పర్థలెపుడులేక
    కలిసి యుండు జంతు గణము; నరుల
    కెపుడు నరుల చింత గిట్టదు. వింతగ
    గొప్ప వారికుండు కొంచె బుద్ధి.


    ఆడపడుచు భర్తృవియోగం పొందినందువల్ల కొన్ని రొజులు ప్రయాణం హడావిడి....

    సమస్యపూరణాన్ని ఎంతో మిస్ అయ్యాను.

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:సత్య భాషణాది సకల శుభ గుణాలు
    గొప్ప వారి కుండు - కొంచ బుధ్ధి
    యుండు నధమ జనుల కుర్వి లో శంకరా !
    "శంకరాభరణ"శశాంక వినుత !

    ---వె6కట రాజారావు .లక్కాకుల
    బ్లాగు :సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  10. 02)
    ____________________________________

    మాన్య వరులు గల స - మావేశ మందున
    మాయ జేత గెలిచి - మాన ధనుడు
    మాన హరణ జేసె - మానిని ద్రౌపదిన్ !
    గొప్పవారి కుండు - గొంచె బుద్ధి !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    అజ్ఞాత గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే 1వ, 3వ పాదాల్లో గణదోషం ఉంది. బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం ...
    పుడమినే(లు ఱేఁడు) పడతి చూపుకు లొంగి,
    శంతనుండునేగె కాంతకడకు,
    విధి విచిత్ర (మరయ) వేర్వేరు విధములు
    గొప్ప వారికుండు కొంచె బుద్ధి.

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    చక్కని భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదంలో "మధము" ? ... "మదము"నకు టైపాటు.
    మూడవ పాదంలో యతి తప్పింది. "మరచి ముందు వెనుక మసలుచు పోయెడి" అంటే సరి.

    మందాకిని గారూ,
    మంచి పూరణతో "రీ ఎంట్రీ" ఇచ్చారు. స్వాగతం.
    మీ ఆడపడుచుకు నా సానుభూతి.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మనోహరమైన పూరణ మీది. అభినందనలు. పూరణలో నా పేరును, బ్లాగును ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి