కవిమిత్రులకు వందనాలు. అత్యవసరమైన పని మీద ఊరికి వెళ్తున్నాను. అందువల్ల మీమీ పూరణలను విడివిడిగా సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి. పూరణలు పంపిన వసంత కిశోర్, గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, మంద పీతాంబర్, జిగురు సత్యనారాయణ, గన్నవరపు నరసింహమూర్తి గారలకు అభినందనలు, ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
________________________________
పదము పట్టి వేడ - భక్త కోటికి ముందు
కనక దుర్గ యిచ్చు - గష్ట ములను !
కరుణ తోడ పిదప - కామితార్థము దీర్చు
దురితములను బాపు - దొడ్డ తల్లి !
________________________________
గయ్యాళి,కనకదుర్గ - సినిమా నటి సూర్యకాంతం
రిప్లయితొలగించండిమారు పేర్లు గదా ! ఆమె గురించి వేరే చెప్పాలా ?
02)
________________________________
సూర్య కాంత మునకు - చూడ చక్కని పేరు
తెనుగు చిత్ర మందు - కనక దుర్గ !
కలహములను బెట్టి - గయ్యాళి రూపున
కనక దుర్గ యిచ్చు - గష్ట ములను !
________________________________
ఇక సూర్య కాంతం రంగారావుతో జోడీ కడితే
రిప్లయితొలగించండిచెప్పేదేం ఉంది ???
03)
________________________________
కనక దుర్గ యనెడి - గయ్యాళి భార్యతో
భంగ పడును యెస్వి - రంగ రావు !
చెండు యతని నెపుడు - చిత్ర రాజము లందు
కనక దుర్గ యిచ్చు - గష్ట ములను !
________________________________
కఠిన మైన ప్రశ్న కావాలనే యిచ్చు
రిప్లయితొలగించండిగురువు శిష్య వృద్ధి కోరి జగతి!
భక్తి నిగ్రహముల పరికింపగా నెంచి
కనక దుర్గ యిచ్చు గష్టములను!
తల్లి బిడ్డ కిచ్చు దండన యనుకొన
రిప్లయితొలగించండికనక దుర్గ యిచ్చు కష్ట ములను;
పిదప ఒడిని జేర్చి పిల్లవానికి గోరు
ముద్ద లిడిన రీతి ముక్తి నొసగు!
మా వూరి కృష్ణాతీర శ్రీమాత కనకదుర్గ మీద, కంద పద్యంలో సమస్య పాదాన్ని కూర్చి:
రిప్లయితొలగించండిచరణములఁ బట్టిన సిరులు
కరుణఁ కనకదుర్గ యిచ్చుఁ; గష్టములను దీ
ర్చురయమున కలుష హారిణి
వరదాయిని విజయవాడ భవ్య శుభకరీ!
కల్తి సరకులమ్ము కపటవర్తకులకు ,
రిప్లయితొలగించండిదుష్ట వర్తనులకు,ధూర్తు లకును ,
కౄర,చోర, జార కుటిల చిత్తులకెల్ల
కనక దుర్గ యిచ్చు గష్ట ములను!!!
ఇంద్రుడిటుల పల్కె యిమ్ముగ సురలతో
రిప్లయితొలగించండికనక దుర్గ మనలఁ గాచునింక
మదము హెచ్చినట్టి మహిషాసురునకును
కనకదుర్గ యిచ్చుఁ గష్టములను!!
మిత్రు లందఱి పూరణలు బాగున్నాయి. వసంత కిశోర్ గారి మొదటి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిఎవరికీ కష్టాలు వద్దు, అయినా పాప భీతి మంచిదే కదా !
కడఁగి సజ్జనుండు గష్టపెట్టడు వేనిఁ
గుటిలుఁ డైన వాఁడు నటుల గాదు
కఠిన జిత్తు లయ్యి గష్టింప సుజనులఁ
గనకదుర్గ యిచ్చుఁ గష్టములను !
కవిమిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండిఅత్యవసరమైన పని మీద ఊరికి వెళ్తున్నాను. అందువల్ల మీమీ పూరణలను విడివిడిగా సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి.
పూరణలు పంపిన వసంత కిశోర్, గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, మంద పీతాంబర్, జిగురు సత్యనారాయణ, గన్నవరపు నరసింహమూర్తి గారలకు అభినందనలు, ధన్యవాదాలు.