19, మే 2011, గురువారం

సమస్యా పూరణం -342 (సంపాదన లేని పతిని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.

26 కామెంట్‌లు:

 1. జుంపాలవాడు ,సరిపడు
  సంపాదన గల్గినట్టి సచ్చీలుండున్,
  కొంపల గూల్చే పాపపు
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు ! పీతాంబరధరా ! పాపపు సంపాదన - బావుంది !

  పోతనగారి భార్య :

  01)
  __________________________________

  ఇంపొదవెడి భాగవతము
  సొంపుగ రచియించినట్టి - సుమధుర హృదయున్
  పెంపొదవెడు ప్రేమ, మిగుల
  సంపాదన లేని పతిని - సతి మెచ్చుకొనెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 3. Rampapu kothalu koyuchu,
  kompalu thaa koolchu potta kootiki jagathin,
  vemparaaladuchu akrama
  sampaadana leni pathini sathi mechukonen.

  రిప్లయితొలగించండి
 4. My first trail. Excuse me if any thing is wrong. Advise me on the improvements. Will be trying now and then.

  I really like this blog which is creating interest in Telugu SAahithyam and being a base to exhibit the same.

  రిప్లయితొలగించండి
 5. అఙ్ఞాతగారూ మొదటి ప్రయత్నమైనా చాలా బావుంది !

  అఙ్ఞాతగారి పద్యానికి తెనుగు సేత !


  రంపపు కోతలు కోయుచు,
  కొంపలు తా కూల్చు, పొట్ట - కూటికి జగతిన్ !
  వెంపర లాడుచు , నక్రమ
  సంపాదన లేని పతిని - సతి మెచ్చు కొనెన్.

  రిప్లయితొలగించండి
 6. రొంపను రోగము రాగా
  కోపము చేతను విసుగున, కొలువును వీడెన్;
  తప్పును జెప్పగ భార్యయు;
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !

  రిప్లయితొలగించండి
 7. మంద పీతాంబర్ గారి భావాన్నే చెప్పారు... అజ్ఞాత గారు.
  అయ్యా.. అజ్ఞాత గారూ..http://lekhini.org
  సైటు కు వెళ్ళి పైన ఆంగ్లము లో టైపు చెయ్యండి. కింద తెలుగు లో వస్తుంది. కాపీ పేస్టు అంతే...సింపుల్.

  రిప్లయితొలగించండి
 8. మంద పీతాంబర్ గారూ,
  'పాపపు సంపాదన లేని మగని' గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'జుంపాలవాఁడు' అంటే జులపాలవాఁడేనా? అలాంటి ప్రయోగం ఎక్కడా వినలేదు. 'ఇంపైనవాఁడు' అంటే ఎలా ఉంటుంది?

  వసంత కిశోర్ గారూ,
  ఇంపైన భాగవతాన్ని మించిన సంపాదన ఏముంటుంది? సుమధురమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అజ్ఞాత గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం!
  ఇది మీ మొదటి ప్రయత్నమంటే నమ్మలేకున్నాను. కందం నడక మీకు అందంగా పట్టుబడింది. పద్యరచనలో కాదు కాని శంకరాభరణంలో సమస్య పూరించడంలో ఇది మీ మొదటి ప్రయత్నం కావచ్చు. నిర్దోషంగా, చక్కని పదప్రయోగంతో చేయి తిరిగిన కవి వ్రాసిన పద్యంలా ఉంది. పూరణకూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు. మీ నుండి ఇక క్రమం తప్పకుండా పూరణలను ఆశిస్తున్నాను.
  తెలుగులో టైపు గురించి టేకుమళ్ళ వారి సలహా పాటించండి.

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.

  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  అజ్ఞాత గారికి సలహా ఇచ్చినందకు ధన్యవాదాలు.
  మీ పూరణలో 2,3 పాదాలలో ప్రాస తప్పింది. సవరించి మళ్ళి పోస్ట్ చేయండి.

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా ! ధన్యవాదములు !


  02)
  __________________________________

  వంపులు తిరిగెడి , పాముల
  నింపుగ మెడ వైచుకొనెడి - ఈశుని సతి, తా
  కంపర మొందక , సుంతయు
  సంపాదన లేని పతిని - సతి మెచ్చుకొనెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 12. సంపద ఆరోగ్యమ్మే!
  సంపద మరి ప్రేమ! మనకు సంతోషమ్మే
  సంపద! వాటిని జెరిపే
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్!

  రిప్లయితొలగించండి
 13. గురువుగారు మొదట "ఇంపైనవాడు" పదాన్నే వ్రాసి పోస్ట్ చేసాను ప్రాస తప్పిందేమో నని సవరించి మళ్లీ పోస్ట్ చేసాను జులపాల వాడనే అర్థంలోనే "జుంపాల" అనే పదాన్ని వాడాను .

  రిప్లయితొలగించండి
 14. సుమతీ కౌశికుల కథ :

  03)
  __________________________________

  సంపద నంతయు , చివరికి
  కొంపను వేశ్యల కిడినను ! - కుష్ఠపు రోగిన్ !
  సంపూర్తిగ ,తన మదిలో
  సంపాదన లేని పతిని - సతి మెచ్చుకొనెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 15. ఇంపుగ విబూది రేఖలు
  సొంపుగ పామును ధరించి శోభిలు చుండే
  కొంపే లేనట్టి హరుని -
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !

  రిప్లయితొలగించండి
 16. క: రంపాలంటి పలుకులను
  జంపాలాటాడని పతి జంటగ నుండన్
  పంపానది తీరములో
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.
  ( జంపాలాట = మధ్యము సేవించుట)
  గురువుగారికి నమస్కారములతో

  రిప్లయితొలగించండి
 17. కం: చెంపకు చెంపయి , చెక్కిలి
  కెంపులు విరబూయ మదన కేళీ విలసత్
  సొంపుల " వేరొక సుదతీ
  సంపాదన " లేని పతిని సతి మెచ్చుకొనెన్

  -----వెంకట రాజారావు . లక్కాకుల

  రిప్లయితొలగించండి
 18. వసంత కిశోర్ గారూ,
  మీ 2వ, 3వ పూరణలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఆరోగ్యాన్నీ, ప్రేమను చెరిపే సంపాదన వద్దన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "శోభిలుచుండే" అనేది "శోభిలువాఁడై" అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 19. వరప్రసాద్ గారూ,
  మంచి ధారతో పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  "రంపాలంటి పలుకులను" అనేది "రంపముల వంటి పలుకుల" అంటే బాగుంటుంది.

  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.
  అన్నట్టు మీ యింటిపేరు నాకెంతో యిష్టం. 'లక్కాకుల నారాయణ' అని మా మామయ్య ఉండేవాడు. ఆయనంటే నాకెంతో యిష్టం.

  రిప్లయితొలగించండి
 20. చంపకముల మాలలు కొని
  సొంపుగ పరమేశు గళము నింపెడు భర్తన్ !
  ఇంపుగ మదిలో పొగడుచు
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !

  రిప్లయితొలగించండి
 21. ఇక్కడ " కొని " = { అనగా ] తెచ్చి , తీసుకొని వచ్చి , చేకొని వచ్చి "

  రిప్లయితొలగించండి
 22. రాజేశ్వరి నేదునూరి గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. రోజులు మారాయ్:

  సంపద లెన్నో యున్నను
  గంపలు గంపలుగ ధనము గలగల రాలన్
  సొంపుగ నలరెడు న్యాయపు
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్

  రిప్లయితొలగించండి
 24. బంపరు లాటరి గెల్వగ
  కొంపలు దండిగ కొనుచును కూరిమి తోడన్
  కంపగు ప్రభుత్వ దాస్యపు
  సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్

  రిప్లయితొలగించండి