24, మే 2011, మంగళవారం

క్షమించాలి

కవిమిత్రులకు మనవి.
ఈరోజు పోస్టులు పెట్టలేక పోతున్నందుకు మన్నించండి.
నిన్న ప్రయాణంలో ఉండి సరిగా నీళ్ళు త్రాగకపోవడం వల్ల ఉదయంనుండి కిడ్నీలోని రాయివల్ల భరిచరాని నొప్పి వస్తున్నది. మా బంధువు నన్ను డక్టరు గారి దగ్గరకు తీసుకువచ్చాడు. వోవెరాన్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మా బంధువుతో టాయిలెట్‌కని చెప్పి హాస్పిటల్ వెనుక గుమ్మంగుండా బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న నెట్ సెంటర్ నుండి ఈ సందేశాన్ని పోస్ట్ చేస్తున్నాను.
ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడితే అప్పుడే క్రొత్త పోస్ట్ పెడతాను, నిన్నటి పూరణలను చూసి వ్యాఖ్యానిస్తాను.
అప్పటిదాకా నన్ను క్షమించాలి.

25 కామెంట్‌లు:

  1. అయ్యోగురువుగారు, మొదట మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ రిలాంటి రిస్క్ లేమీ తీసుకోకండి. మీ ఆరోగ్యం కుదుటపడేవరకూ విశ్రాంతిగా ఉండండి. భగవంతుడు మీకు సకలాఅయురారోగ్యైశ్వర్యాలనివ్వాలని కోరుకునే -మీ శిష్యబృందం.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమఛ్చాస్త్రి.

    శంకరార్యా! మీకు త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.మాకు సమాచారాన్ని అందించాలని పడే మీ తపనకు జోహార్లు.కాని ఇలాటి సమయంలో అలాటి సాహసాలు చేయకండి.వీలున్న కవిమిత్రులలో ఒకరికి ఫొన్ ద్వారా సమాచారాని ఇస్తే బ్లాగులో వుంచే అవకాశం వుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! మీరు ఇంటర్‌నెట్ కు అంత ప్రాధాన్యతనివ్వకండి. మీ కంప్యూటర్ మిత్రులు కొనిచ్చినదే అని నాకు తెలుసు. అయినా తనకు మాలిన ధర్మం మంచిది కాదు. మీ నిబద్ధతకి జోహార్లు.

    రిప్లయితొలగించండి
  4. guruvugaru tvaragaa kolukovalani aakshistunnamu.

    srinivas hyd.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ ఆరోగ్యం తర్వాతే ఏదైనా. సాహసాలు మీ బోటి వారికి కాదు. మీరు త్వరగా కోలు కొంటారని మా నమ్మకం.

    రిప్లయితొలగించండి
  6. తొక్కలో బ్లాగు. వదిలేసి నీ ఆరోగ్యం చూసుకోండి. గురూజీ

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారూ, నమస్కారం. మీరు చేసింది ఏమీ బాగాలేదు. తప్పుగా అనుకోకండి.
    అలాంటి అనారోగ్య పరిస్థితిలో ఆసుపత్రిలో చేరి, డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్పపుడు వెనక గేటులోంచి వచ్చి మరీ ఇలా బ్లాగ్ లో రాయటం అవసరమా చెప్పండి? దీన్ని తపన అనుకోమంటారా? నిబద్ధత అనుకోమంటారా? మీ మీద అభిమానంతోనే.. మీకిది వ్యసనంలా మారిపోతోందని అనుకోకుండా ఉండలేకపోతున్నా.
    బ్లాగింగ్ మీకెంత ముఖ్యమైనా, అది మీ ఆరోగ్యం కంటే ముఖ్యం కాదు కదా. నెట్ సెంటర్లో మీకేదైనా అయితే ఏమైవుండేది! ఒకరోజో, నాలుగు రోజులో పోస్టులు పెట్టకపోతే కొంపలేం మునిగిపోవు. ఆరోగ్యం కుదుటపడేదాకా దయచేసి కంప్యూటర్ జోలికి వెళ్ళకండి!

    రిప్లయితొలగించండి
  8. "మాయామేయ జగంబె నిత్యమని సంభావించి...మాస్టారూ, మనందరమూ ఇష్టమైన వాటికి లొంగి పోతాము. సహజమే. మీరు మాకంటే పెద్దవారు. నానుడి గా వాడే మాట, "You need to choose between NEED and WISH". ఒక్కొక్కప్పుడు అవసరానికన్నా కోరికకి ప్రాధాన్యం ఇస్తాము. కాని అది ప్రమాదానికి దారి తీయకూడదు కదా!

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారూ, ఏమిటండీ మాష్టారూ, మీ సాహసం? మీరు అలా నొప్పితో బాధపడుతూనే హాస్పటల్ "వెనుక గేటు" నుంచి వెళ్ళి మరీ ఈ మెసేజ్ పెట్టారా? ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆ నెట్ సెంటర్లో ఉన్న క్షణంలో మీకు ఏమైనా విపత్కర పరిస్థితి వచ్చి ఉంటే?

    బ్లాగు ఒక టైమ్ పాసే గానీ, ఇంత అత్యవసర పరిష్తిలో కూడా పోస్టు పెట్టాల్సిన అవసరం లేదు కదండీ! ఒక రోజు పోస్టు పెట్టకపోతే మిత్రులేమనుకుంటారు? మహా అయితే"ఇవాళ శంకరయ్య మాస్టారికేదో పనుండి ఉంటుంది" అనుకుంటారు. అంతేగా!

    మీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. పెద్ద వారు, మీకు చెప్పవలసిన అవసరం లేదనుకోండి! ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డాకే రాయండి!

    రిప్లయితొలగించండి
  10. తమ్ముని ఆశీర్వదించి ! .
    మీ ఆరోగ్యం కన్న ముఖ్యం గాదు కదా ? అటువంటి సాహసం చేయ వద్దు. మీ ఆరోగ్యం కుదుట బడే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు గా మిమ్మల్ని చేతు లెత్తి ప్రార్దిస్తున్నాను. మేమందరం మీరు త్వరగా కోలు కోవాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూనే ఉంటాము . తమ్ముడూ ! ఈ అక్క మాట మన్నించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసు కుంటావు కదూ ? ? ? హృదయ పూర్వక శుభాశీస్సులు. ప్రియమైన అక్క

    రిప్లయితొలగించండి
  11. అయ్యో ! గురువు గారూ ! ఏం ఫరవా లేదు. మీరు మొదట పూర్తిగా విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా !
    ఆరోగ్యమే మహా భాగ్యం గదా !
    దాన్ని అశ్రద్ధ చేస్తే ఎలాగు ?
    మీ ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు !
    దయచేసి విశ్రాంతి తీసుకోండి !
    బ్లాగు సంగతి ఆరోగ్యం కుదుట బడ్డాక చూసు కోవచ్చు !

    నాకూ ఆరోగ్యం సరిలేకే 5 రోజుల నుండి మిత్రులకు దూరమయ్యాను !
    ఈ రోజు తెరచి చూస్తే - మీ అనారోగ్యం !
    మీరు త్వరగా కోలు కోవాలని నా ప్రార్థన !

    రిప్లయితొలగించండి
  13. మూడు దినముల తర్వాత మీ బ్లాగు చూశాను మీ అస్వస్థత విచారాన్ని కలుగ జేసింది ఆస్పత్రిలో మీరు చేసిన సాహసం మరింత విచారాన్ని కలుగ జేసింది పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యం కంటే బ్లాగు వ్రాయడం ముఖ్యమైనది కాదు .మీకు త్వరగా స్వస్థత చేకూరాలని దేవుణ్ణి కోరుకొంటున్నాను .తగిన విశ్రాంతి తర్వాతనే బ్లాగు పనులు చేపట్టండి

    రిప్లయితొలగించండి
  14. శంకరయ్య గారూ. ...ఇది నిజంగా తగని పనండీ ..'నెఫ్రో లిథియాసిస్ ' ( కిడ్నీలో రాళ్లు ) వల్ల వచ్చే నెప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసును . రాయి పరిమాణం ఎంతో మీకు తెలిసే ఉంటుంది గనుక , చిన్నదైతే , సాధ్యమైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోండి . పెద్దదైతే , మీ అనుకూలతని బట్టి ఒక నెఫ్రాలజిస్ట్ / యూరాలజిస్ట్ ని కలవండి .చాల మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి . అంత నెప్పిలోనూ మీరిలాంటి సాహసం ఎలా చేశారో ,దయచేసి ఇంకోసారి ఇలా చేయబోకండి . అందరూ చెప్పిందే నా మాట కూడా ...ఆరోగ్యం తరువాతే మరేదైనా ....మీ సంపూర్ణారోగ్యాన్ని అభిలషిస్తూన్నాను !

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్యగారూ !!

    మీ అబ్బయి వయసువాణ్ణి కనుక చనువుతో ఒక సలహా ఇస్తున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్ధు.

    మీరు సమస్యాపూరణల టపాలు మొదలెట్టినప్పటి నుండీ, ఇప్పటికి చాలామంది పద్యాలతో పరిచయం పెంచుకోగలిగారు. ఔత్సాహికులు ప్రతిరోజూ పూరిస్తున్నా ప్రతీరోజూ ఒక సమస్య అయ్యేసరికి, ఆఫీసు సమస్య లతో మాకేమో సమయం దొరకటం లేదు. మీరేమో ప్రతిరోజూ సమస్యలని ఇవ్వాలి, వ్యాఖ్యానించాలి అనుకుంటూ లేని తాపత్రయాన్ని పెంచుకుంటున్నారు.

    మీకు వీలైనప్పుడు, మనసుకు ఉత్సాహం గా అనిపించినప్పుడు మీరు బ్లాగచ్చు కదా.. వారాంతాల్లో ఇవ్వాలి, ప్రతిరోజూ ఇవ్వాలి, అన్నిటికీ వ్యాఖ్యానించాలి అనుకుంటూ ఇప్పుడు ఎందుకు? అదొక బంధనం గా చేసుకోవటం ఎందుకు? మీరు వ్యాఖ్యానించకపోయినా, టపా పంపకపోయినా నొచ్చుకునే వాళ్ళెవరున్నారు? ఒక వేళ ఉన్న.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా?

    నిజం చెబుతున్నాను. గత 3-4 నెలలుగా పూరణలనిచ్చేవారిలో పెద్దలే ఎక్కువ ఉన్నారు.వారికి వీలుచిక్కుతోంది కనుక మీరిచ్హ్చే సమస్యకై ఎదురుచూస్తూ వెంటనే పూరిస్తున్నారు, కానీ ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, నెట్ సెంటరు ఎంత దూరంలో ఉన్నా దానికోసం మీరు పడే శ్రమ వారికి తెలియకపోవచ్చు. మీతరఫున వారికీ, వారి తరఫున మీకు ఇదే నా విన్నపం.

    (1) మీ ఆరోగ్యం కన్నా మీ బ్లాగ్సేవ ఏమాత్రమూ గొప్పదీ, ముఖ్యమైనదీ కాదు
    (2) మీరు వారానికి ఒకటి/ రెండు సమస్యలనిచ్చినా/ అసలేమీ ఇవ్వకపోయినా మీపై అభిమానం ఎవరికీ ఎప్పటికీ తగ్గబోదు. దానికోసం మీరు అనవసరమైన ప్రయాసలకి పోవలసిన అవసరం లేదు
    (3) ప్రతీ పూరణకీ మీరు వ్యాఖ్యల నివ్వలేదేమిటని ఎవరూకూడా నొచ్చుకోరు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారూ శ్రీపతి గారి సలహా మనసు పెట్టి ఆలోచించ దగ్గది.
    అభిలషనీయం. ఆచరణీయం.

    రిప్లయితొలగించండి
  17. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, మే 28, 2011 8:03:00 AM

    గురువు గారూ,
    పూర్తిగా విశ్రాంతి తీసుకోండి.
    మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా !
    మీకు పూర్తిగా స్వస్థత చేకూరిందని తలుస్తాను !
    అశ్రద్ధ చేయకుండా తగిన మందులు మరియు విశ్రాంతి తీసుకోండి !
    మీరు తొందరగా కోలుకోవాలనేదే మా అందరి ఆకాంక్ష !

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారు,
    మీరు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  20. ఆర్యా! శంకరయ్యగారూ! గ్రామాంతరం వెళ్ళిన నేను ఇప్పుడే వచ్చాను. మీ అనారోగ్యం సంగతి మీ బ్లాగుద్వారా చూచాను. చాలా బాధనిపిస్తోంది.
    శరీరమాద్యంఖలు ధర్మసాధనం.
    అన్న ఆర్యోక్తి నెఱుగనివారు కాదు మీరు.
    మీ విచిత్ర ప్రవర్తన మీ బంధువర్గానికే కాక మిత్రవర్గానికి కూడా బాధాకరమౌతోంది. దయ చేసి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆపరమాత్మను వేగముగా స్వస్తత చేకూర్చమని ప్రార్థించండి. తగ్గిన అనంతరం మళ్ళీ మీ పనులు కొనసాగించండి.
    ఇలా అన్నానని మరోలా అనుకోకండి.
    మీ ఆరోగ్యం అతి త్వరగా నయమవాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను.నమస్తే.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం గురించి ఆందోళన చెంది, బాధపడి సలహాలిచ్చినవారికి, చీవాట్లు పెట్టినవారికి ధన్యవాదాలు. అత్యవసరంగా గ్రామాంతరం వచ్చి ఇక్కడి నెట్‌సెంటర్ నుండి పోస్ట్ పెడుతున్నందున పేరుపేరునా అందరినీ పలుకరించలేక పోతున్నాను. మన్నించండి.
    ప్రస్తుతం నా ఆరోగ్యం అన్ని విధాలా బాగుంది.
    హైదరాబాదు నుండి మళ్ళీ వరంగల్‌కు మకాం మారినందున ఇంట్లో ఇంకా నెట్ కనెక్షన్ రాలేదు. ఈ రోజు రావచ్చు. ఇకనుండి బ్లాగు క్రమం తప్పకుండా నిర్వహిస్తాను.

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! మీకు స్వస్థత చేకూరినందులకు చాలా ఆనందముగా నున్నది !

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ మీ ఆరోగ్యం కుదుట బదినందుకు చాలా సంతోషంగా ఉంది.
    ఏమైనా మీ వయసును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి.
    మీరు వరంగల్ తిరిగి రావడం ఆనందకరమైన విషయం. ఎంతైనా జననీ జన్మభూమీ అన్నారుగదా.
    కుటుంబ విషయమైన సమస్యలు తప్పక పరిష్కారమౌతాయి.
    శ్రీయుతులు చింతా రామ కృష్ణారావు గారు చెప్పినట్లు దైవ ధ్యానం అన్ని సమస్యలనూ
    పరిష్కరిస్తుంది . మీకు చెప్పదగ్గ వారము కాదు .
    భవదీయుడు - మిస్సన్న.

    రిప్లయితొలగించండి