4, మార్చి 2016, శుక్రవారం

పద్యరచన - 1183

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. పిండిని జేయగ దిరుగలి
    మెండుగ వాడెదరు తొల్లి మేలగు వంటల్
    పండుగ దినముల యందున
    కండలు కరిగించి విసరు కాలమ టన్నన్

    రిప్లయితొలగించండి
  2. క్షమించాలి
    చివరి పాదంలో " విసరు కాంత లటన్నన్ ! అంటె బాగుండునేమొ అని

    రిప్లయితొలగించండి
  3. జీవన తిరుగలి లో మన
    సే వనమాలిని తలచుచు సేవను జేయన్
    కావడి కుండల బతుకున
    రావము తొలగును జిలేబి రావడి బోవున్

    రిప్లయితొలగించండి
  4. మరలంటు లేని దినమున
    తిరగలియే పిండి విసర దిక్కై మిడికెన్
    తరుణులలనాడు దీనిని
    సిరియని భావించిపూజ సేసిరి కూడన్

    కమ్మనగు వంట సేయగ కొమ్మలకది
    యాయుధమ్ము పూర్వపుకాలమందు నిదియె
    తిరగలియను నామమ్ముతో తిష్ఠ వేసె
    ఇంధనమ్మక్కరయె లేదు ఇంపుయెగద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి.
      ‘తిరుగలి’ సాధురూపం. ‘లేదు+ఇంపు’ అన్నపుడు సంధి నిత్యం. ‘లేక యింపుగూర్చె’ అనండి.

      తొలగించండి


  5. గిరగిరదిరుగుచుదిరుగలి సరసముగాబిండిజేయుచావలిమరియు న్నిరవుగగోధుమలన్మరి
    కరములతోబట్టిత్రిప్పకాంతా!యెరుకే?

    రిప్లయితొలగించండి
  6. మనమున ఘనమ్ముగ మథిం
    చిన బృహదాలోచనలు విశేషముగ ఫలిం
    చుననిన సందేహంబే
    మినుములఁ దిరుగలి నఱుమదె మెత్తని పొడిగన్

    రిప్లయితొలగించండి
  7. . తిరగలి మధ్య ధాన్యమును తీరిక చేతను వేసి-త్రిప్పగా?
    తిరగలి నోటితో నమిలి దీక్షగబంచును|” పిండిరూపమున్
    మరిగెడి నీటితో గలిపి మంటన వండగ గంజి యౌను”|యే
    మరువరు గంజి నోటపరమాన్నమె నౌనట|ఆకలున్నచో|

    రిప్లయితొలగించండి
  8. మీ పద్యం బాగున్నది.
    పరమాన్నమె యౌనట.. అనండి.

    రిప్లయితొలగించండి
  9. చక్తిలములను చేయ చక్కగాబియ్యమున్
    తిరుగలందు వేసి తిప్పు వారు
    మినుమలైనగాని మెంతులె యైనను
    పిండి వలయు నన్న విసురు వారు.
    సున్ని యుండలు చేయ సుందరీ మణులంత
    మినుములెల్ల దెచ్చి ముందుగాను
    వట్టి బాణలందు వేయించి పిదపనే
    విసురు రాయి యందె విసురు వారు.

    రిప్లయితొలగించండి
  10. రోజులు మారె! తిరగలిన్
    బూజు దులిపి యుంచిరిగదె! పూర్వ స్మృతుల బే
    రీజునకుపయుక్తమ్మని
    మ్యూజియమునకుఁ దరలించు పోలికగుపడన్!

    రిప్లయితొలగించండి
  11. తిరుగుచు తిరుగుచు పరిపరి
    తిరగలి తానరిగి పోక త్రిప్పట బెటుచున్
    విరువదె పొడిగను పప్పుల...
    గురువటు శిష్యుని యహమును గుండగ నలుపున్ :)

    రిప్లయితొలగించండి


  12. తిరుగలి వలె తిరుగుచు బతు
    కు రయ్యనుచు పారిపోయె కుణ్ణదలిని తా
    నరయంగచేసిన యతన
    ము రవంతయు ఫలములేక ముడిచెన్ ద్రోవన్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. తిరుగలి తా తిరుగన పిం
    డి రయ్యన డిగనురుకును వడివడిగ నౌరా
    పరుగులన తిరుగు చుందురి
    ట రవంతయును పనిలేక టకటక యనుచున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి