31, మార్చి 2016, గురువారం

సమస్య – 1989 (దానగుణము మిగుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దానగుణము మిగుల హీనగుణము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

43 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవి మిత్రుల కభి వాదములు

    1.
    సద్గుణముల లోన సాటిలేనిదొకటె
    దానగుణము, మిగుల హీన గుణము
    అడ్డ దారు లందు నర్థసాధన జేసి
    తాను కుడువ కుండ దాచు కొనుటె.

    2.
    దానగుణము మిగుల హీన గుణము గాదు
    తలకు మించి యెపుడు దానమిడకు
    పాత్రతెరుగ కున్న పాపమ్ము యేసుమీ
    యవసరార్థి నెఱిగి యాదు కొనుము

    3.
    కుడువకుండ ధనము కోట్లుకూడగ బెట్ట
    ఫలిత మేమి యదియు ఫాంసువేను
    దీనజనుల బాధ దీర్చంగ వలె, కాదు
    దానగుణము మిగుల హీన గుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణలో ‘గుణము+అడ్డ’ అని విసంధిగా వ్రాశారు. ‘గుణమె| యడ్డదారు’ లనండి.
      రెండవపూరణలో ‘పాత్రత+ఎరుగ’ అన్నపుడు సంధి లేదు. అలాగే ‘పాపమ్ము+ఏ’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘పాత్రత గనకున్న పాప మగును సుమీ’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ సరిచేసిన పద్యములు

      1.
      సద్గుణముల లోన సాటిలేనిదొకటె
      దానగుణము, మిగుల హీన గుణమె"
      యడ్డ దారు లందు నర్థసాధన జేసి
      తాను కుడువ కుండ దాచు కొనుటె.

      2.
      దానగుణము మిగుల హీన గుణము గాదు
      తలకు మించి యెపుడు దానమిడకు
      పాత్రత గనకున్న పాపమగును సుమీ
      యవసరార్థి నెఱిగి యాదు కొనుము

      3.
      కుడువకుండ ధనము కోట్లుకూడగ బెట్ట
      ఫలిత మేమి యదియు ఫాంసువేను
      దీనజనుల బాధ దీర్చంగ వలె, కాదు
      దానగుణము మిగుల హీన గుణము

      తొలగించండి
  2. దాన మనగ నేమి దయతోన పేదల
    కడుపు నింపి నంత కలుగు ముక్తి
    ఓట్ల కొఱకు నేత నోట్లుపంచగ నెంచు
    దాన గుణము మిగుల హీన గుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ‘దయతోను/దయతోడ’ అనండి.

      తొలగించండి
    2. దాన మనగ నేమి దయతోడ పేదల
      కడుపు నింపి నంత కలుగు ముక్తి
      ఓట్ల కొఱకు నేత నోట్లుపంచగ నెంచు
      దాన గుణము మిగుల హీన గుణము

      తొలగించండి

  3. పనిని జేయ వలయు ! పనికిరానిదగు ని
    దానగుణము మిగుల హీన గుణము!
    మత్తు వదులు గాంచు మహిలోన సౌభాగ్య
    మును జిలేబి, నిదియె ముదితకు తగు !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘నిదానము’ను సంస్కృత పదంగా స్వీకరిస్తే ‘నిదానగుణము’ అన్న సమాసం సరియైనదే. కాని అర్థం ‘మొదటికారణం, రోగనిర్ణయం’ అని ఉంది.‘ఆత్రపడకుండడం’ అనే అర్థంలో తెలుగు పదంగా స్వీకరిస్త్రే సమాసం తప్పు అవుతుంది. గమనించండి.
      ‘జిలేబి యిదియె’ అనండి.

      తొలగించండి
  4. వ్రాయవలయు నేడు వ్రాతపరీక్షలు
    తెమిలిరండు వేగ, తెలియసుంత
    జాగుగలుగ పంప జాలరు లోన, ని
    దాన గుణము మిగుల హీన గుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘నిదానగుణం’ విషయమై పైన జిలేబీ గారికి వ్రాసిన వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! దోషమును సవివరముగా తెలిపినందుకు ధన్యవాదములు.

      తొలగించండి
  5. కలిగినంతలోన కారుణ్యమున్ జూపి
    దానమీయువాడె దాతయనఁగ
    పారవేయఁ దగిన పరమాన్నమున్ బెట్టు
    దానగుణము మిగుల హీనగుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ‘పాచిపోయినట్టి పరమాన్నమున్’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచన తో సవరించిన పద్యం:
      కలిగినంతలోన కారుణ్యమున్ జూపి
      దానమీయువాడె దాతయనఁగ
      పాచి పోయినట్టి పరమా న్నమున్ బెట్టు
      దానగుణము మిగుల హీనగుణము

      తొలగించండి
  6. అన్నిగుణములందుమిన్నయేగాదయీ
    దానగుణము,మిగుల హీనగుణము
    పరులబాగుజూచిపవలునురేయిని
    నెంతగానొమదినినీర్ష్యబడుట

    రిప్లయితొలగించండి
  7. కపటమున జనధన మపహరణ మదిని
    దురిత భయము దలపక రయమున నొ
    నరిచి గుడికి నిడ వితరణ మఘము గద
    దాన గుణము మిగుల హీనగుణము.

    [దాన = దాని వలన]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ సర్వలఘు పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  8. చక్కని గాత్రము శ్రోతల
    నిక్కము రంజిల్ల జేయు నీ గాన సుధల్
    దక్కెను మాకే నక్కా !
    మ్రొక్కెద, నీ కీర్తి నిలుచు భువిని సుశీలా!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      ‘పద్యరచన’లో పోస్ట్ చేయవలసినదానిని ఇక్కడ పెట్టారు. పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  9. గురువుగారు పోస్టింగ్ చేయడములో మరచి పోయాను మన్నించ మనవి

    కోరుకున్న ప్రియుడు కూరిమి తగదన్న
    నాశ పడిన యువతి యంద కున్న
    ప్రేమ కొరకు చేయు పిచ్చిగ బలి
    దానగుణము మిగుల హీనగుణము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదం చివర గణదోషం. ‘పిచ్చితనపు బలి|దానము...’ అందామా?

      తొలగించండి
  10. శత్రువు నినుబట్ట శాంతమునందు|ని
    దానగుణమె మిగుల హీన గుణము|
    స్వార్ట పరుడికి తనసంపద నంతయు
    దానమివ్వుటన్న ధర్మ గుణమ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘నిదానము’ను గురించి పైన జిలేబీ గారికి వ్రాసిన వ్యాఖ్యను చూడండి. ‘దాన మిచ్చుట యన ధర్మగుణమ?” అనండి.

      తొలగించండి
  11. అన్ని గుణములకును మిన్నసుమ్మ యిలలో
    దాన గు ణము, హీనగుణము
    చేరి దానములను చెడగొట్టి సతతమ్ము
    సంతసించునట్టి వింత గుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిగుల పొరపాటున టైపు అవ్వలేదు. మన్నించండి.(మిగుల హీన గుణము)

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి అ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    అత్త. సొమ్ము జేసె నల్లుడు దానము
    ఓట్ల. కొరకు ప౦చె కోట్ల ధనము
    పేరు. పొ౦ద. సొమ్ము వెచ్చి౦చె | వీ ర ల
    దాన గుణము మిగుల. హీన గుణము

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    వేని కేని మిగుల దానమ్ము సేసియుఁ
    జెప్పఁ గూడ దందు రెప్పటికిని!
    పరులు కనఁగ వినఁగ బాహ్యమ్ముగాఁ జేయు

    దానగుణము మిగుల హీనగుణము!!

    రిప్లయితొలగించండి
  14. గుణము లందు జూడ గొప్పదైన గుణము
    దానగుణము;మిగుల హీనగుణము
    దొంగతనము చేసి దొరవోలెతిరుగుట
    వాని నీసడింత్రు వసుధయందు.

    రిప్లయితొలగించండి
  15. గుణములందు మంచి గుణమేది యన్నచో
    దానగుణము:మిగులహీనగుణము
    తనకు మాలినట్టి దానములను చేసి
    ననవసరము గాను నర్ది బడుట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. పాత్ర తెరిగి మనము పాటించి ధర్మమ్ము
    దానమిచ్చి నపుడు ధరన జెల్లు
    పాత్ర తెరుగ నట్టి బహు గొప్ప కొరకైన
    దానగుణము మిగుల హీన గుణము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. కడుపు మాడునట్టి కడుపేద లుండగా -
    ఉన్నవాని కింక నొరగబెట్టి
    పేరు పొందగోరు పెద్దలుంద్రు! అపాత్ర
    దాన గుణము మిగుల హీన గుణము!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
      చాలారోజుల తరువాత ‘శంకరాభరణం’ బ్లాగులో మీ పూరణ చూసే అదృష్టాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు క్షమిస్తా రనుకొంటూ సాహసిస్తున్నాను. ‘ఉంద్రు అపాత్ర’ అని విసంధిగా వ్రాశారు. వాక్యావసానంబున సంధి లేమి దోషంబు గాదండ్రు... అని ఉన్నా... ‘పెద్ద లుందు రపాత్ర’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  18. శంకరయ్య గారు!
    నేను ఊహించినట్టుగానే ప్రశ్న వేసినారు. అయితే ... దోషం కానప్పుడు, పాఠక సౌలభ్యం కోసం సులభ గ్రాహ్యతకు పెద్ద పీట వేయడం సముచితం కదా! ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  19. తప్పు జేసి ధనము దండిగ నార్జించి
    డప్పు కొట్టి జనుల మెప్పు కోరి
    వేల కోట్ల టోపి వేంకటేశునకిడు
    దానగుణము మిగుల హీనగుణము :)

    రిప్లయితొలగించండి