పామును బట్టగ గృధ్రము వ్యోమము నందుండి వ్రాలె వోగిర మనుచున్ సేమము లేదిక నీకని నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్
రాజేశ్వరి అక్కయ్యా,మీ పద్యం బాగున్నది.‘వ్రాలె నోగిర మనుచున్’ అనండి. ‘వో’తో మొదలయ్యే పదాలు తెలుగులో లేవు.
పామును బట్టగ గృధ్రము వ్యోమము నందుండి వ్రాలె నోగిర మనుచున్ సేమము లేదిక నీకని నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్
నీ నాథుడు లోకములే లే నాథుడుర ఖగరాజ ! లేమిన యుంటిన్ నానా విధముల వేడెద నీ నాథుని వోలె కరుణ నీవును జూపన్
జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. ‘లేమిని నుంటిన్’ అనండి.
నా నాథుడు నీ నాథుడు మానగు దేవుళ్ళుగాదె! మరి నను యిటులన్నీ నఖముతో పొడిచి నీ వే నను జంపుట తగదుర ! వేడితి గానన్
జిలేబీ గారూ, మీ రెండవ పద్యం బాగున్నది.‘మరి నన్నిటులన్’ అనండి. ‘నను+ఇటులన్’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
దండధర పాశ బంధనమండితము కఠోర ఘోర మరణాస్పదమున్భండన భీభత్సుండుద్దండ ఖగేశ్వరుని పోరు ధరణిన్ ఫణికిన్
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తనదుకాళ్లతోపామునునొనరబట్టి గద్దయక్కడతినుటకుసిధ్ధమయ్యె బ్రహ్మసృష్టియేయదిగదబలముగలుగు వారలుబలహీనులనిలబట్టితినుట
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈమధ్య మీరు పాద విభాగం చేయడం లేదు. డెస్కుటాపు కాకుండా ఫోను కాని, టాబ్లెట్ కాని వినియోగిస్తున్నారా?
నమస్కారములు.మీరు ఊహించినది నిజమే.ఫోను ద్వారా పంపుచున్నానండి
నీలకంఠుని సేవించు నిడుదవెన్నుజంపబూనుట న్యాయమా? శరణమంటిహరిని నమ్మిన వాడవే గరుడరాజహరిని నేనైతి వదులుమా కరుణ తోడహరియే గద నీదైవముహరుడను సేవించువాడ నాభరణమ్మైశరణము గోరితి యనఘాకరుణించుము పక్కిరాజ కాపాడుమురా.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి గారు శరణాగతముగ మీ కరుణారసపూరిత పద్యములు చాలా బాగున్నవి. రెండవ పద్యము లో “ గోరితి ననఘా” అంటే బాగుంటుంది.
మురియుచు నాగును బట్టుకుపరికించుచు యున్న గరుడ పక్షిని గనుచున్ దొరికితినని వాపోవుచుకరుణను నను విడువు మనుచు ఖగమును వేడెన్!!!
మీ పద్యం బాగున్నది. ‘పరికించుచు నున్న...’ అనండి.
.హరికి శయనమేను హరివాహనుడవీవుభావ్యమౌన యిటుల పరిభవింపకలసి మెలసి యున్న కలతయుండదుగదాకరుణజూపుమయ్య గరుడ రాజ.హరియెక్కును నీమూపునహరి పవళించును సుఖముగ ననిశము నాపైనరమరికలేల మనకిటగరుడా యనుచా యురగము కనలుచు యడిగెన్.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘గరుడా యని యా యురగము...’ అనండి.
భూమిపైనను నడయాడు భోగిఁగాంచిమంచి యాహారము దొరికె నంచు నెంచివాడి యగు కాళ్ళ తోడుత పట్ట గ్రద్దతప్పుకొనలేక సర్పమ్ము తల్లడిల్లె
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
నాపై పరుండు దైవమునీపై పయనించువాడు నిర్మలమూర్తౌకఆప ద్బాంధవు డాహరేఆపన్నుని నన్ విడువుమ అంజలులిడుదున్ !
2వ పాదం చివర "క" అదనంగా పడింది.
మీ పద్యం బాగున్నది.‘మూర్తి+ఔ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవపాదంలో గణదోషం. ‘హరే’ అన్నచోట ‘హరి’ అంటే సరి.
{ పాముతోగ్రద్దపలికిన పలుకులు}3.3.16. గరళ కంఠుని వోలె-గరళము గలదని------------పడగ పైకెత్తిన పట్టగలనుహరునికంఠమునకు-ఆభరణము నేన----------ని-అహము నెలకొన్న? నెగడలేవుపార్వతీశునిహరి –పలుకరించు నపుడు--------గర్వాన తలయెత్త గాంచినానుఅండజములుదిని –ఆనందమొందకు-------వంశ వృద్దిని ద్రుంచు వైరిగాన?విషపు కోరల నణచు వేవేగ మందుకాలి గోళ్ళను కత్తులే చాలు-నిన్నుసంహరించగ గ్రద్ద నై సంచరించితలకుపొగరున్న?తలదన్ను తలపు నాది
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
పడగెత్తి నిన్నెదుర్కొన నడవులలో పుట్టలందు నావాసముగా కుడిచెదను పవనములనే కడతేర్చకుమన్న గరుడ కరుణన్ గనుమా
నిదురించు పాన్పు నేనును!కదిలించెడు వాహమీవు కరివరదునకున్!వదలమని వేడుకొనియెద సుదర్శనము రాక మునుపె చూడుము దయగన్!హరిహరులిరువురి కడ నాపరపతి నీవెరుగవె? హరి వాహన ఖగమా!మొరవినగ వేడుకొనియెదపరాత్పరులు రాక మునుపె పట్టును విడుమా!
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చిక్కెను పామను కొంటివొ నొక్కుచు ఖగపతి! ముదమున నోటిని గూర్చన్ నిక్కముగా తెలియ గలవు చక్కని రబ్బరది బొమ్మ చైనీయులదౌ :)
పామును బట్టగ గృధ్రము
రిప్లయితొలగించండివ్యోమము నందుండి వ్రాలె వోగిర మనుచున్
సేమము లేదిక నీకని
నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘వ్రాలె నోగిర మనుచున్’ అనండి. ‘వో’తో మొదలయ్యే పదాలు తెలుగులో లేవు.
పామును బట్టగ గృధ్రము
తొలగించండివ్యోమము నందుండి వ్రాలె నోగిర మనుచున్
సేమము లేదిక నీకని
నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్
రిప్లయితొలగించండినీ నాథుడు లోకములే
లే నాథుడుర ఖగరాజ ! లేమిన యుంటిన్
నానా విధముల వేడెద
నీ నాథుని వోలె కరుణ నీవును జూపన్
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘లేమిని నుంటిన్’ అనండి.
రిప్లయితొలగించండినా నాథుడు నీ నాథుడు
మానగు దేవుళ్ళుగాదె! మరి నను యిటులన్
నీ నఖముతో పొడిచి నీ
వే నను జంపుట తగదుర ! వేడితి గానన్
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది.
‘మరి నన్నిటులన్’ అనండి. ‘నను+ఇటులన్’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
దండధర పాశ బంధన
రిప్లయితొలగించండిమండితము కఠోర ఘోర మరణాస్పదమున్
భండన భీభత్సుండు
ద్దండ ఖగేశ్వరుని పోరు ధరణిన్ ఫణికిన్
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండితనదుకాళ్లతోపామునునొనరబట్టి గద్దయక్కడతినుటకుసిధ్ధమయ్యె బ్రహ్మసృష్టియేయదిగదబలముగలుగు వారలుబలహీనులనిలబట్టితినుట
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈమధ్య మీరు పాద విభాగం చేయడం లేదు. డెస్కుటాపు కాకుండా ఫోను కాని, టాబ్లెట్ కాని వినియోగిస్తున్నారా?
తొలగించండినమస్కారములు.మీరు ఊహించినది నిజమే.ఫోను ద్వారా పంపుచున్నానండి
తొలగించండినీలకంఠుని సేవించు నిడుదవెన్ను
రిప్లయితొలగించండిజంపబూనుట న్యాయమా? శరణమంటి
హరిని నమ్మిన వాడవే గరుడరాజ
హరిని నేనైతి వదులుమా కరుణ తోడ
హరియే గద నీదైవము
హరుడను సేవించువాడ నాభరణమ్మై
శరణము గోరితి యనఘా
కరుణించుము పక్కిరాజ కాపాడుమురా.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివిరించి గారు శరణాగతముగ మీ కరుణారసపూరిత పద్యములు చాలా బాగున్నవి. రెండవ పద్యము లో “ గోరితి ననఘా” అంటే బాగుంటుంది.
తొలగించండిమురియుచు నాగును బట్టుకు
రిప్లయితొలగించండిపరికించుచు యున్న గరుడ పక్షిని గనుచున్
దొరికితినని వాపోవుచు
కరుణను నను విడువు మనుచు ఖగమును వేడెన్!!!
మీ పద్యం బాగున్నది.
తొలగించండి‘పరికించుచు నున్న...’ అనండి.
రిప్లయితొలగించండి.హరికి శయనమేను హరివాహనుడవీవు
భావ్యమౌన యిటుల పరిభవింప
కలసి మెలసి యున్న కలతయుండదుగదా
కరుణజూపుమయ్య గరుడ రాజ.
హరియెక్కును నీమూపున
హరి పవళించును సుఖముగ ననిశము నాపై
నరమరికలేల మనకిట
గరుడా యనుచా యురగము కనలుచు యడిగెన్.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘గరుడా యని యా యురగము...’ అనండి.
భూమిపైనను నడయాడు భోగిఁగాంచి
రిప్లయితొలగించండిమంచి యాహారము దొరికె నంచు నెంచి
వాడి యగు కాళ్ళ తోడుత పట్ట గ్రద్ద
తప్పుకొనలేక సర్పమ్ము తల్లడిల్లె
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
తొలగించండినాపై పరుండు దైవము
రిప్లయితొలగించండినీపై పయనించువాడు నిర్మలమూర్తౌక
ఆప ద్బాంధవు డాహరే
ఆపన్నుని నన్ విడువుమ అంజలులిడుదున్ !
2వ పాదం చివర "క" అదనంగా పడింది.
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది.
తొలగించండి‘మూర్తి+ఔ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవపాదంలో గణదోషం. ‘హరే’ అన్నచోట ‘హరి’ అంటే సరి.
{ పాముతోగ్రద్దపలికిన పలుకులు}
రిప్లయితొలగించండి3.3.16. గరళ కంఠుని వోలె-గరళము గలదని
------------పడగ పైకెత్తిన పట్టగలను
హరునికంఠమునకు-ఆభరణము నేన
----------ని-అహము నెలకొన్న? నెగడలేవు
పార్వతీశునిహరి –పలుకరించు నపుడు
--------గర్వాన తలయెత్త గాంచినాను
అండజములుదిని –ఆనందమొందకు
-------వంశ వృద్దిని ద్రుంచు వైరిగాన?
విషపు కోరల నణచు వేవేగ మందు
కాలి గోళ్ళను కత్తులే చాలు-నిన్ను
సంహరించగ గ్రద్ద నై సంచరించి
తలకుపొగరున్న?తలదన్ను తలపు నాది
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండిపడగెత్తి నిన్నెదుర్కొన
రిప్లయితొలగించండినడవులలో పుట్టలందు నావాసముగా
కుడిచెదను పవనములనే
కడతేర్చకుమన్న గరుడ కరుణన్ గనుమా
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండినిదురించు పాన్పు నేనును!
రిప్లయితొలగించండికదిలించెడు వాహమీవు కరివరదునకున్!
వదలమని వేడుకొనియెద
సుదర్శనము రాక మునుపె చూడుము దయగన్!
హరిహరులిరువురి కడ నా
పరపతి నీవెరుగవె? హరి వాహన ఖగమా!
మొరవినగ వేడుకొనియెద
పరాత్పరులు రాక మునుపె పట్టును విడుమా!
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచిక్కెను పామను కొంటివొ
రిప్లయితొలగించండినొక్కుచు ఖగపతి! ముదమున నోటిని గూర్చన్
నిక్కముగా తెలియ గలవు
చక్కని రబ్బరది బొమ్మ చైనీయులదౌ :)