17, మార్చి 2016, గురువారం

సమస్య – 1975 (హవనమ్ములు కీడుసేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే.

23 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారములు
  ఆరోగ్యం యెలా వుందండి?
  మందులు జాగ్రత్తగా వాడుకుంటున్నారనే భావిస్తున్నాను.

  యువతను మత్తున ముంచుచు
  భవితను నాశమ్ము జేసి బానిసలన్ జే
  యు వసుధలో గంజాయి రు
  హవనమ్ములు కీడు సేయు ననుట నిజమ్మే.

  అవనికి వర్షము నిచ్చును
  హవనమ్ములు, కీడుసేయు ననుట నిజమ్మే
  నవతరమున తరగెడు మా
  నవత సమాజమునకెంతొ నష్టము దెచ్చున్

  రిప్లయితొలగించండి
 2. అవనిని శుభముల కొఱకని
  భువినేలెడి ప్రభువు లంత భూరిగ క్రతువుల్
  అవరోధము జేయ దనుజులు
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే

  రిప్లయితొలగించండి
 3. భువిలోన మేలు జేయున్
  హవనమ్ములు! కీడుసేయు ననుట నిజమ్మే ?
  కవనమ్ములు జేయ నస
  త్యవచనములు పలుకరాదు తప్పుగద కవీ !

  హ కి న కి యతి కుదురుతుందాండీ ? హవన/ననుట ?

  రిప్లయితొలగించండి
 4. భువి నాశా పీడిత మా
  నవ దురహంకార చేత నమ్ములు నిత్యం
  బవిరళ ఖండిత జంతు స
  హ వనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే.

  రిప్లయితొలగించండి
 5. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  భవ కిల్బి షాహుతి బడు చ

  నవరత మక్రమ ధనార్జనా రతి బ్రతుకన్ ,

  భవ దూహ లగు కదా = మో

  హ వనమ్ములు | కీడుసేయు ననుటనిజమ్మే !్

  { సమస్య లో "హవనము " ఉన్న౦దున
  మొదటి పాదములో "ఆహుతి " అన్నాను.

  ధనార్జనారతి = ధనార్జనేచ్ఛ , వనము = నిలయము.
  భవదూహలు = మోహ. వనమ్ములు
  నీ ఊహలు = అఙ్ఞాన. నిలయములు }

  రిప్లయితొలగించండి

 6. అవకతవకగనుజేసిన
  హవనమ్ములుకీడుసేయుననుటనిజమ్మే
  పవిత్రభావముతోడన
  హవనంబునుజేయవలయునార్యా!యెపుడున్

  రిప్లయితొలగించండి
 7. 11.09.2001.వరల్డ్ ట్రేడ్ సెంటర.బాంబింగ్
  భువనములో నెగురుచు వ
  చ్చువిమాన మ్మాజ్య మవగ క్షుద్రులు హోతల్
  భవనమ్మే ద్రవ్యమ్మౌ
  హవనమ్ములు కీడు సేయు నునుట నిజమ్మే

  రిప్లయితొలగించండి
 8. అవనికి హితమును గూర్చెడి
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే?
  నవనవలాడుచు తరువులు
  అవరోధము లేక పెరుగ నవసరము సుమా !.
  2హవనము చేసెడు కౌశికు
  నివెంట వచ్చిరి దశరథుని సుతులు కావన్
  రవమునుచేయుచు దనుజులు
  హవనమ్ములు కీడుసేయుననుట నిజమ్మే
  3.భువిలో పెరిగెను నాస్తిక
  పువాదము క్రతువులు మరియుపూజలు వ్యర్థం
  బవని ననుచు పల్కెదరిటు
  హవనమ్ములు కీడు సేయుననుట నిజమ్మే.

  రిప్లయితొలగించండి
 9. అవును గజయూధములు రే
  బవళులు నాశన మొనర్చు పంటల మనచే
  రువలో నున్నను చాలు ని-
  హ, వనమ్ములు కీడుసేయు ననుటనిజమ్మే

  ***

  రిప్లయితొలగించండి
 10. భువి జనమేజయ! పాములు
  నివసించుట ధర్మమౌను నీకివ్విధి నా
  గువులను చంపెడి కర్కశ
  హవనమ్ములు కీడుసేయు ననుటనిజమ్మే.

  రిప్లయితొలగించండి
 11. . భవితకు భాగ్యమునింపెడి
  హవనమ్ములు|”కీడు సేయు ననుట నిజమ్మే
  అవసర హవిస్సుకల్తీ
  ప్రవరుడిలా వచ్చిజేర?ఫలితముసున్నా| {యజ్ఞములో వేయు హవిస్సు కల్తీయుండినకీడుజరుగును మాయాప్రవరుడిలా|యజ్ఞంభవితకుముఖ్యమే

  రిప్లయితొలగించండి
 12. దివిజులను తృప్తి పరచు న
  నవరతము వి వేకపు సవనమ్ములు సుమ్మా
  భువిపై సలుపు నశుద్ధపు
  హవనమ్ములు కీడుచేయుననుట నిజమ్మే

  రిప్లయితొలగించండి
 13. 11.09.2001.వరల్డ్ ట్రేడ్ సెంటర.బాంబింగ్
  భువనములో నెగురుచు వ
  చ్చువిమాన మ్మాజ్య మవగ క్షుద్రులు హోతల్
  భవనమ్మే ద్రవ్యమ్మౌ
  హవనమ్ములు కీడు సేయు నునుట నిజమ్మే

  రిప్లయితొలగించండి
 14. అవనికి సేమము గూర్చును
  హవనమ్ములు, కీడు సేయుననుట నిజమ్మే
  యువతను ప్రలోభ పెట్టెడు
  అవినీతియు దురలవాట్లు హానిని జేయున్!!!

  రిప్లయితొలగించండి
 15. భువి సస్యశ్యామలమై
  యవనినిగల జీవ రాశి యలరగ జేయ
  న్నవ రోధించగ నసురులు
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే.

  రిప్లయితొలగించండి
 16. భువిలో చేసెడి క్షుద్ర పు
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే
  అవనీశులు ఋషి గణములు
  సవనమ్ములు జేసి మేలు సాధించిరిగా.

  రిప్లయితొలగించండి
 17. అవనిని విఘ్నగణపతిని
  స్తవమ్ముఁ జేయక మొదలిడ, తడబడు క్రియలన్
  సవరించు నస్తవ్యస్తపు
  హవనమ్ములు కీడుఁ జేయుననుట నిజమ్మే!

  రిప్లయితొలగించండి
 18. ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  నా ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చింది. నడుమునొప్పి తగ్గినట్టే తగ్గి ఈరోజు మరీ ఎక్కువయింది. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 19. కవనము ఘనకార్యమనుచు
  నవనవ లాడెడి నవీన నానా రీతుల్
  కవులకు పొగాకు గంజాయ్
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే

  రిప్లయితొలగించండి
 20. చెవిలో పూవులు పెట్టెడి
  పవమాన సుతులు మెండు పద్ధతి యనుచున్
  భవనములకు మసి నిచ్చెడు
  హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే

  రిప్లయితొలగించండి