3, మార్చి 2016, గురువారం

సమస్య – 1961 (లచ్చిమగఁడు వసించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లచ్చిమగఁడు వసించుఁ గైలాసమందు.

45 కామెంట్‌లు:

 1. విశ్వమ మంతట వ్యాపించు విష్ణు వనగ
  లీన మైయుండు నీశ్వరు లీల లందు
  లచ్చి మగఁడు వసించుఁ గైలాస మందు
  హరిహరులకు భేదమనుట హాస్య మవగ  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మంచి భావంతో పూరణ చెప్పబోయారు కాని ఆ భావాన్ని చక్కగా ఆవిష్కరింకలేకపోయారు. పద్యం సలక్షణంగా ఉంది. ‘విశ్వ మంతట’ అన్నచోట టైపాటు.

   తొలగించండి

 2. పాల కడలిన హరుని తపమున గనుచు
  లచ్చి మగఁడు వసించుఁ, గైలాస మందు
  హరుడు తపమును జేయుచు హరిని తలచు
  నోత నోచుర నిటులన నొకరి నొకరు !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘పాలకడలిని’ అనండి. ‘...నోత నోచుర నిటులన...’ అర్థం కాలేదు.

   తొలగించండి

 3. పార్వతి! కుశలమా ? లక్ష్మి భద్ర నడిగె
  లచ్చి, మగఁడు వసించుఁ గైలాస మందు
  బిచ్చము గద మాకును బువ్వ! భీతి గూడ
  సవతి పోరు గూడను సుమీ శక్తి జెప్పె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది.
   ‘లక్ష్మి భద్ర నడిగె’...? ‘...కుశలమా యని పలుకరించె| లచ్చి;...’ అందామా?

   తొలగించండి
 4. సత్య లోకము నందుండు సంతసముగ
  లచ్చి మగడు, వసించు కైలాసమందు
  పార్వతీ నాథుడు శివుడు వాస్తవముగ
  ప్రణతు లిడుదును భక్తితో వారికెపుడు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   సత్యలోకమున నుండేది బ్రహ్మ. విష్ణువు వైకుంఠమున కదా!

   తొలగించండి
  2. ప్రణామములు గురువుగారు... ఆంధ్రభారతి లో వైకుంఠము = సత్యపురము , పరమపదము, శ్వేతదీపము అవి వున్నాయి..నేను సత్యపురము అని వ్రాయబోయి సత్యలోకము వ్రాసాను..ధన్యవాదములు.


   సత్య పురము నందుండును సంతసముగ
   లచ్చి మగడు, వసించు కైలాసమందు
   పార్వతీ నాథుడు శివుడు వాస్తవముగ
   ప్రణతు లిడుదును భక్తితో వారికెపుడు!!!

   తొలగించండి
 5. భవుని జూడగ మెడలోన పాములుండు
  పులిది చర్మంబు మేనిపై బూది పూత
  కామవైరియె, మెచ్చగా కామజనక
  లచ్చి మగడు, వసించు కైలాసమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘కామజనక(కుడైన) లచ్చిమగడు’ అని సమాసం చేయరాదు. ‘మెచ్చ శంకరసఖు డగు| లచ్చిమగడు...’ అనండి.

   తొలగించండి
 6. పాలకడలిలో పన్నగ పాన్పుపైన
  కువలయమును బ్రోచుచును వైకుంఠమందు
  లచ్చిమగడు వసించు, కైలాసమందు
  చంద్రమౌళియె కొలువుండు సతిని గూడి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘పన్నగ పాన్పు’ అనరాదు. ‘పాలకడలిలో శేషతల్పమ్ముపైన’ అందామా?

   తొలగించండి

 7. అరయవైకుంఠధామమునందుసుమ్ము లచ్చిమగడువసించుగైలాసమందు నాదిదేవుడువసియించునంబతోడ మనలగాపాడనిరతముమాననీయ!

  రిప్లయితొలగించండి
 8. గోత్ర ధారి ముదముగ వైకుంఠ మందు
  లచ్చిమగఁడు వసించుఁ గైలాసమందు
  చంద్రమౌళి పార్వతితోడ శంకరుండు
  ప్రమథ గణము సేవింపగఁ బరవశించు

  రిప్లయితొలగించండి

 9. పాలసాగరమందున పవ్వళించు
  లచ్చి మగడు,వసించు కైలాసమందు
  సంతసాన పార్వతి తోడ శంకరుండు
  మ్రొక్కెద నిరువుర నొక్కట ముక్తి కోరి.

  నరకుని దునుమగ జనించె నవని యందు
  లచ్చి మగడు,వసించె కైలాసమందు
  పరమశివుడు సతులతోడ ప్రమథు లుండ
  హరిహరులకు మ్రొక్కెద ననవరతము.
  .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణ చివరిపాదంలో గణదోషం. ‘హరిహరులకును మ్రొక్కెద...’ అనండి.

   తొలగించండి
 10. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  బ్రతికి న౦త కాలము శివాలయము లోన

  నర్చకుడయి , దుర్ఘటనము న౦దు పోయె

  లచ్చి మగడు | వసి౦చు కైలాస మ౦దు

  నేడు , గౌరీశు దివ్య సాన్నిధ్య మ౦దు |

  లచ్చి కొమరుని కి౦తలో లభ్య మయ్యె ,

  నిన్న చక్కని యుద్యోగ. | మెన్న డైన c

  జెడుదురే శివ పూజలు సేయు వారు ? ?

  రిప్లయితొలగించండి
 11. సర్వ మంగలమాంగల్య!శర్వు దేవి
  అంబికా! నారాయణాఖ్యల నమరు తల్లి
  లచ్చి మగడు వసించె కైలాసమందు
  శివుడు కేశవు లొకరూపు చెలగి రనగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణలో భావం సంతృప్తికరంగా లేదు. ‘అంబికా నారాయణాఖ్యల’ అన్నచోట గణదోషం. ‘అంబ నారాయణి యనంగ నమరు తల్లి’ అంటే సరి. కాని పార్వతిని సంబోధించిన పై రెండు పాదాలకు తరువాతి పాదాలకు సంబంధం?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 12. సచ్చిదానంద రూపుడై సంద్రమందు
  లచ్చి మగడు వసించు-గైలాసమందు
  పార్వతీపతి నాట్యాన పరవశించి
  జగము లేలుచు నుందురు జంటగాను !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘ఉందురు జంటగాను’కు అన్వయం లేదు. ‘జగము లేలిచునుండును సదయుడగుచు’ అందామా?

   తొలగించండి
 13. శేష తల్పమునందున సేదదీరు
  లచ్చి మగడు, వసించు కైలాస మందు
  చండి మగడు తా సతితోడ సంతతమ్ము
  బ్రహ్మ లోకము తానుండు వాణి విభుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘బ్రహ్మలోకమ్ములో నుండు...’ అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 14. లచ్చి మగడు వసించు , కైలాసమందు
  నాలికర్థదేహమునిచ్చి యంక మందు
  సుతులు కలిగినట్టి శివుని సుహృద యమ్ము
  నందును సదా నిలిచియుండు నందురతడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   పూరణ బాగుంది. కాని ‘వసించు, నిలిచియుండు’ అనడం పునరుక్తమే.

   తొలగించండి
 15. కల్పవృక్షమ్ము నింద్రుండు, కలిమి నేను
  పాలసంద్రమ్ము మధియించ బడసితిమని!
  సేమ మెంచి విషము గొన్నశివుని పొగడ
  లచ్చిమగఁడు, వసించు కైలాసమందు!

  నిత్య యోగ, తపో, ధ్యాన నిరతి తోడ
  హరిని మదినిల్పి గొల్వగా హరుడు తానె!
  శివుని మానసంబున దీరి చెదరనట్టి
  లచ్చిమగఁడు వసించు కైలాసమందు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మొదటిపాదంలో ‘ఎద, మనసు, హృదయము’ ఒక్కటే కదా... పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. అన్వయలోపం కూడా ఉంది. సవరించండి.

   తొలగించండి
 17. జీవనోపాధికై పోయి చెన్నపురిని
  లచ్చిమగఁడు వసించు; కైలాసమందు
  కొలువుదీరిన శివుని పూజలు సలిపిన
  మగడు తిరిగివచ్చు ననుచు మగువ నమ్మె.

  రిప్లయితొలగించండి
 18. పాల సంద్రాన ఫణిరాజు పడగనీడ
  లచ్చిమగడు వసించు,కైలాసమందు
  పార్వతీపతి నివసించు ,భారతిపతి
  సత్య లోకమ్మునందుండు సహజముగను !!!

  రిప్లయితొలగించండి
 19. శివ కేశవులిరువురు జగములను పాలిస్తారని భావించాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వివరణ నిచ్చినందుకు సంతోషం. లచ్చిమగడు వసించు... ఇక్కడికి వాక్యం అయిపోయింది. రెండవ వాక్యంలో పార్వతీపతి... జగము నేలుచునుండును అని కదా ఉండవలసింది. మీ పద్యాన్ని ఇలా చెప్తే అన్వయం బాగుంటుందని నా సలహా...
   సచ్చిదానంద రూపుడై సంద్రమందు
   లచ్చి మగడు వసించు-గైలాసమందు
   పార్వతి శివుడు నాట్యాన పరవశించి
   జగము లేలుచు నుందురు జంటగాను !
   (పార్వతీపతి నాట్యాన పరవశించు;
   హరిహరులు జంటగా జనుల నాదుకొంద్రు)

   తొలగించండి
 20. గౌరవీయులైనగురువర్యులుశ్రీ కందిశంకరయ్యగారికివందన చందనాలతోనాపొరపాటుపూరణంసవరించడమైనది
  దయతోచూడగలరనికోరిక
  3.3.16. “భక్తియుండిన రక్షించు యుక్తి చేత
  లచ్చిమగడు.”|”వసించు గైలాసమందు,
  గుడుల,బడులందు,శ్రీశైల గుంపునందు,
  భజన జేయగ మనయందుపరమ శివుడు|”.

  రిప్లయితొలగించండి
 21. సవరించినందుకు సంతోషం. బాగున్నది.
  ‘శ్రీశైల గుంపులు’ అనరాదు కదా!

  రిప్లయితొలగించండి
 22. గురుదేవులసూచనమేరకు పద్యము సవరించితిని. లచ్చి నారాయణి యైనపార్వతి మగడుకైలాసమందు వసించె ,శివునకు కేశవునకు భేదము లేదని నాభావన సరిగా చెప్పలేక పోయానేమో గురుదేవులు మన్నించాలి
  సర్వ మంగలమాంగల్య!శర్వు దేవి
  అంబ! నారాయణాఖ్యల నమరు తల్లి
  లచ్చి మగడు వసించె కైలాసమందు
  శివుడు కేశవు లొకరూపు చెలగి రనగ

  రిప్లయితొలగించండి