10, మార్చి 2016, గురువారం

సమస్య – 1968 (చక్రాయుధమున్ ధరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్.

58 కామెంట్‌లు:

 1. సక్రమము గవిధాత జగతిని
  వక్రమము లుజరుగ కుండ పాలించుటకై
  చక్రికిని బదులుగ శివుడే
  చక్రా యుధమున్ ధరించు శంభునకు నతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ గందరగోళంగా ఉంది. మొదటి, మూడవ పాదాలలో గణదోషం.

   తొలగించండి
  2. గురువులు క్షమించాలి " సవరించిన పద్యము
   ----------------------
   సక్రమ రక్షణ కొఱకని
   వక్రమము లుజరుగ కుండ భాసిల్లు ప్రజల్
   చక్రికి బదులుగ శివుడే
   చక్రా యుధమున్ ధరించు శంభునకు నతుల్

   తొలగించండి
 2. చక్రికి నమస్కృతి నతడు
  చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
  సక్రమ మార్గము జూపు, ప
  రిక్రమ జేయుము జిలేబి త్రిభువని గూడన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. సక్రమము శూలము కుడి ప
  రాక్రమమును జూప గనుపరాశక్తియుతన్
  వక్రముగా లేక నెడమ
  చక్రా యుధమున్ ధరించు శంభునకు నతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణలోని భావం బోధపడడం లేదు. వివరించండి.
   ‘లేక యెడమ’ అని ఉండాలి.

   తొలగించండి
  2. మాస్టరుగారూ ! పరాశక్తి తో కూడిన శివుడు ..అర్థనారీశ్వర రూపున కుడిచేత శూలం ఎడమచేత చక్రం ధరించియున్న శంభునకు నమస్కారము..అని నాభావం...సరిగా వ్రాయలేక పోయాననుకుంటానండీ !

   తొలగించండి
 4. వక్రత్రిశిఖయు ధాత్రీ
  చక్రమ్మున దైత్య కంపజ త్రిశూలమ్మున్
  శక్రాశనితుల్య సదృశ
  చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ అర్థం కాలేదు. వివరిస్తారా? ‘వజ్రాయుధ నిభ చక్రాయుధమును శంభుడు ధరించడం’...?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
   వక్రత్రిశిఖయు, ధాత్రీ చక్రమ్మున దైత్య కంపజ, శక్రాశనితుల్య, సదృశ
   చక్రాయుధమూ త్రిశూలమ్మున్ ధరించు శంభునకు నతుల్.
   క్రూరమైన మూడు కోణాలు కలది, భూమి మీద డైత్యుల కు వణుకు పుట్టించేది, వజ్రాయుధము తో సమానమైనదీ, చక్రాయుధానితో సమానమైనదీ యయిన త్రిశూలమ్మును ధరించిన శంభునకు వందనములు.

   తొలగించండి
 5. చక్రేశ్వర పురమందున
  విక్రేతలు విక్రయించు విగ్రహములలోన్
  చక్రికి శ్రీ భూలక్ష్ములు
  చక్రాయుధమున్ ధరించు శంభునకు సతుల్

  శంభుడు = విష్ణుడు శివుడు బ్రహ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   చివరి రెండు పాదాలలో అన్వయం లోపించినట్లు అనిపిస్తున్నది. శంభుడు శబ్దానికి బ్రహ్మ అనే అర్థం ఉంది కాని విష్ణువు అనే అర్థం ఆంధ్రభారతిలో వెదికితే దొరకలేదు.

   తొలగించండి
 6. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అక్రమ వర్తనులన్, దీ
  నక్ర౦దకుల, నసురులను నాశ మొనర్చున్
  జక్రి | సుదర్శన మను నా
  చక్రాయుధమున్ ధరి౦చు శ౦భునకు నతుల్ !


  { దీనక్ర౦దకులు = దీనుల శోకి౦ప జేయు వారు ;

  శ౦భునకు నతుల్ = అట్టి విష్ణువునకునతులు.

  శ౦భువు = శి వు డు. వి ష్ణు వు . బ్రహ్మ
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగుంది.
   కాని శంభుడు శబ్దానికి విష్ణువనే అర్థం ఉందా?

   తొలగించండి
 7. ఆక్రందనల్ విని దొరికిన
  చక్రము శివవేషధారి చాచెను బ్రోవన్!
  సక్రమ రక్షణ విధికై
  చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్!

  రిప్లయితొలగించండి

 8. విక్రమముతోడ శ్రీహరి
  నక్రమునెటు సంహరించెనాగము కావన్
  వక్రముగలనెలతాలుపుఁ
  చక్రాయుధమును ధరించి శంభునకునతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   నెలవంక చక్రాయుధంలా కనిపించిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. ఉమాదేవి గారూ,
   చివరి రెండు పాదాలలో అన్వయం లోపించినట్లుంది.

   తొలగించండి
 9. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అక్రమ వర్తనులన్, దీ
  నక్ర౦దకుల, నసురులను నాశ మొనర్చున్
  జక్రి | సుదర్శన మను నా
  చక్రాయుధమున్ ధరి౦చు శ౦భునకు నతుల్ !


  { దీనక్ర౦దకులు = దీనుల శోకి౦ప జేయు వారు ;

  శ౦భునకు నతుల్ = అట్టి విష్ణువునకునతులు.

  శ౦భువు = శి వు డు. వి ష్ణు వు . బ్రహ్మ
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  రిప్లయితొలగించండి
 10. చక్ర ధరు౦డగు శ్రీహరి
  చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
  సక్రమ రీతి ప్రదక్షిణ
  వక్రకరుడు జేసి విఘ్న పతి యై చెలగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   చక్రధరుడు, చక్రాయుధమును ధరించువాడు... పునరుక్తి కదా! ‘నక్రాంతకుఁడగు శ్రీహరి..’ అందామా?

   తొలగించండి
  2. గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
   నక్రాంతకుడగు శ్రీహరి
   చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
   సక్రమ రీతి ప్రదక్షిణ
   వక్రకరుడు జేసి విఘ్న పతి యై చెలగెన్

   తొలగించండి
  3. గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
   నక్రాంతకుడగు శ్రీహరి
   చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
   సక్రమ రీతి ప్రదక్షిణ
   వక్రకరుడు జేసి విఘ్న పతి యై చెలగెన్

   తొలగించండి
 11. శత్రువులఁ దున్మ హరి తాఁ
  జక్రాయుధమున్ ధరించు, శంభునకు నుతుల్
  భద్రము నొసంగు నెప్డు ప
  విత్రమగు హృదయముతోడ వేడిన భువపై

  రిప్లయితొలగించండి
 12. సత్యనారాయణరెడ్డి గారూ ప్రాసను సరిజూసుకోండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. సత్యనారాయణ రెడ్డి గారూ,
   భావం బాగుంది. కాని ఎన్నడూ లేనిది ఇలా ప్రాసదోషంతో పద్యం వ్రాసారేమిటి?

   తొలగించండి
  3. I am planning / preparing to go to USA on 5.04.2016 for one month tour, besides house husband duties, a little bit confused.

   తొలగించండి
  4. విక్రమముతో సిరిమగడు
   చక్రా యుధమున్ ధరించు, శంభు నకు నతుల్
   సక్రమముగాసలు పుచు న
   వక్రందము జేయువారి పశుపతి కాచున్

   తొలగించండి
 13. చక్రాయుధము.......

  చక్రియయగుటనగృష్ణుడు చక్రాయుధమున్ధరించుశంభునకునతుల్
  సక్రమమగుపధ్ధతిని
  న్నక్రూరునిగాచినట్టియాదేవుడెయౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని ‘శంభుడు’ ఏ అర్థంలో గ్రహించారు?

   తొలగించండి
 14. శక్రుడు కాదట, శ్రీహరి
  చక్రాయుధమున్ ధరించు, శంభునకు సతుల్
  చక్రియు గల విగ్రహముల
  విక్రేతలె యమ్ముచుండ్రి విత్తము కొరకై

  రిప్లయితొలగించండి
 15. అక్రూరవరద! శంకర!
  చక్రాయుధ! శూలపాణి! శౌరీ! రుద్రా!
  ఈక్రమమున తిక్కన యన
  చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   తిక్కన గారి హరిహరనాథుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. వెన్నునొప్పికిసరియైనబిళ్లసామి!
  ఓవరానుయస్సునిజముచేవగలది
  గంటలోపలతగ్గించుగరగి దాను
  నెట్టినొప్పులునైననునిట్టెతగ్గు


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   ధన్యవాదాలు.
   డాక్టరు గారు వ్రాసిన మందులు వాడుతున్నాను.

   తొలగించండి
 17. చక్రే పాపుల ద్రుంచగ
  చక్రాయుధమున్ ధరించు- శంభునకు నతుల్
  ప్రక్రాంత జీవి త్రెంచగ
  తా క్రోధానల విలాస తత్పరుడగుటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘చక్రియె’ అనండి. అక్కడ ‘చక్రి+ఏ’ సంధి లేదు.

   తొలగించండి
 18. నక్రము జంపిన చక్రియె
  చక్రాయుధమున్ ధరించు, శంభునకు నతుల్
  సక్రమముగ జేయు హరి, త్రి
  విక్రమునకు నేను జేతు వినుతుల నెపుడున్

  రిప్లయితొలగించండి
 19. {చక్రి అనునతడు ఒకవిగ్రహమురాతిలోహరిహరులనుఒకేశిల్పంగాచెక్కడమైనదిదానినిఒక వైపునచూడగా ఒకవిధముఇంకొక వైపుజుచినవేరువిధము అగుపించును.మనముచూచేవిధానమునశివునికిచక్రాయుధముగా కనుపించుటచే
  చక్రియు జేసిన శిలయది
  విక్రముడగు విష్ణు,శివుల విగ్రహ మొకటై
  చక్రియు నొకచో జూచిన
  చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా నడుము నొప్పి ఇంకా తగ్గలేదు. నడుమునొప్పితో పాటు బుద్ధిమాద్యం కూడా వచ్చిందేమో అని అనుమానంగా ఉంది. కొందరి పూరణలను నేను అవగాహన చేసికొనలేకపోతున్నాను. అందుకు నన్ను మన్నించాలి. వృద్ధాప్యంలో బుద్ధికూడా మందగిస్తుందా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు ప్రణామములు.మిమ్మల్ను మీరలా హిప్నటైజ్ చేసుకోవద్దండీ.మీకు తెలియజెప్పేంతవాడిని కాకపోయిన ఒక మాట చెప్పాలని చెబుతున్నాను. మనసుకు వయసేంటి సార్? నిర్మలంగా! నిత్యనూతనంగా! మీరెలా ఉండాలని అనుకుంటే అలాగే ఉండగలరు.

   తొలగించండి
 21. క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(రక్షించిన)వాడు చక్రాయుధము ధరించినవాడని,నెలవంకను దాల్చిన శంభునకు నతులని అనుకొన్నాను.సరిపోలేదా అన్నయ్యగారూ.

  రిప్లయితొలగించండి
 22. క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(రక్షించిన)వాడు చక్రాయుధము ధరించినవాడని,నెలవంకను దాల్చిన శంభునకు నతులని అనుకొన్నాను.సరిపోలేదా అన్నయ్యగారూ.

  రిప్లయితొలగించండి
 23. విక్రముడు సుదర్శనమను
  చక్రాయుధమున్ ధరించు శంభునకు సతుల్
  అక్రముల ద్రుంచ నెంచగ
  విక్రము లై శూలమెత్తి విజయము నొందన్

  రిప్లయితొలగించండి
 24. చక్రము , శూలముల , హరియె
  చక్రాయుధమున్ ధరించు; శంభునకు నతుల్ ,
  సక్రమ తపసుల బ్రోవ ప
  రాక్రమమునశూలి జంపు రక్కసులనిలన్

  రిప్లయితొలగించండి
 25. అక్రియుడై వర్ధిల్లెడి
  వక్రపు బుద్ధుల శఠుడను బఫ్ఫూననుచున్
  విక్రమ యుద్ధమ్మున వా
  క్చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్!

  (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

  రిప్లయితొలగించండి