22, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1980 (పద్యరచనకు గణయతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పద్యరచనకు గణయతిప్రాస లేల.

63 కామెంట్‌లు:

  1. పద్యరచనకు గణయతిప్రాస లేల
    వలయునో లక్ష్యలక్షణములను శాస్త్ర
    కారు లప్పకవ్యాదులు గ్రంథములను
    వ్రాసి రవియెల్లఁ బాటించవలయు మనకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమని చెప్పడమూ సరిపొదేమో నండి

      తొలగించండి
    2. విరించి గారూ,
      ధన్యవాదాలు.
      కాని నా పద్యంలో కించిదన్వయలోపం ఉన్నట్టు అనుమానం!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "లేలవలయునన" అనిన మీ శంక తీరుననుకుంటాను.

      తొలగించండి
    4. గురువుగారికి ప్రణామములు. తమరి పూరణ చాలా బాగున్నది. అన్వయలోపము లేకుండుటకు చివరి పాదము చివరి మాట 'మనము' అంటే సరిపోతుందేమో పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    5. గురువుగారికి ప్రణామములు. తమరి పూరణ చాలా బాగున్నది. అన్వయలోపము లేకుండుటకు చివరి పాదము చివరి మాట 'మనము' అంటే సరిపోతుందేమో పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ, సహదేవుడు గారూ,
      ధన్యవాదాలు. మీ యిద్దరి సూచనల మేరకు సవరించిన పద్యం.....
      పద్యరచనకు గణయతిప్రాస లేల
      వలయునన లక్ష్యలక్షణములను శాస్త్ర
      కారు లప్పకవ్యాదులు గ్రంథములను
      వ్రాసి రవియెల్లఁ బాటించవలయు మనము.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి

  2. హమ్మయ్య .చాలా సంతోషంగా ఉంది .గురువుగారి పద్యం కనబడి నందులకు .
    --------------------------------
    పండి తులైన వారలు పదిలము గను
    నెటుల వ్రాసిన చెల్లున దెంత మాట
    పద్య రచనకు గణయతి ప్రాస లేల
    యనుచు వ్రాసిన మనకంత ఘనత రాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో (తులైన) గణదోషం. ‘పండితు లయినవారలు...’ అనండి.

      తొలగించండి
    2. పండితు లయినవారలు పదిలము గను
      నెటుల వ్రాసిన చెల్లున దెంత మాట
      పద్య రచనకు గణయతి ప్రాస లేల
      యనుచు వ్రాసిన మనకంత ఘనత రాదు

      తొలగించండి
  3. గురువుగారికి కవిమిత్రులకు నమస్కారములు

    1.
    భాష పైన పట్టు మరియు వ్యాకరణపు
    నేర్పు ఛందో నియమముల న్నెరుగ వలెను
    పద్య రచనకు, గణయతి ప్రాసలేల?
    వచన కవితలన్ వ్రాసెడు పండితునకు

    2.
    గురువులు లఘువులే గద బరువు లయ్యె
    నేటి యాంగ్లమాధ్యమజనానికిది నచ్చ
    దంచు వాదించుచు సభలోన దాను జెప్పె
    పద్యరచనకు గణయతి ప్రాసలేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘...దనుచు వాదించుచు సభలోఁ దాను జెప్పె’ అనండి.

      తొలగించండి
  4. శుభోదయం!

    పద్యరచనకు గణయతిప్రాస లేల
    నీవు సహజ కవనముల నీలవేణి !
    రాగ తాళము లేలవే రాణి నీకు
    పాట నీనోట పదముల పద్య భ్రమక !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    [“నా ఈ వచనపద్యాలనే దుడ్డుకర్రల్తో
    పద్యాల నడుముల్ విరగదంతాను
    చిన్నయసూరి వ్యాకరణాన్ని
    చాల దండిస్తాను”
    -తిక్కవరపు పట్టాభిరామరెడ్డి]


    పండిత పఠాభి చెప్పిన వచన పద్య
    ములను దుడ్డుకఱ్ఱలఁ బద్దెముల నడుములు
    విఱుగఁదన్నెడి యాయన విధముఁ జూడఁ
    బద్యరచనకు గణయతిప్రాస లేల?

    రిప్లయితొలగించండి

  6. తెలుగు పద్యమ్ము నేర్వరా తెలుగు వాడ
    తేలికగుగాద చూడగా చాలు వినర
    ఆటవెలదియు, వ్రాయగా తేటగీతి
    పద్యరచనకు గణ,యతి - ప్రాస లేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ఉపజాతి పద్యాలకు ప్రాస అవసరం లేదన్న మీ పూరణ బాగున్నది.
      ‘తేలిక+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘తేలిక యగును చూడగా...’ అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు....
      మీరు చూపిన సవరణతో...


      తెలుగు పద్యమ్ము నేర్వరా తెలుగు వాడ
      తేలికయగును చూడగా చాలు వినర
      ఆటవెలదియు, వ్రాయగా తేటగీతి
      పద్యరచనకు గణ,యతి - ప్రాస లేల?

      తొలగించండి
  7. పద్య రచనకుగణయతి ప్రాస లేల
    యనుట సరిగాదు గణ యతు లవస రమ్ము
    ప్రాస గూడను దప్పదు పద్య మునకు
    గణయ తులప్రాస వలననే కర్ణ ములకు
    వినుట కింపుగా నుండును వినుత శీల !

    రిప్లయితొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( 1. ) గణయతి ప్రాస . లే ల కో ?

    ( 2. ) గణయతి ప్రా స లే లఘుత . నొస౦గు

    …………………………………………………………

    పద్య రచనకు గణయతి ప్రాస లేల

    కో , యట౦చు మీరే యనన్ న్యాయ మగునె ?

    పద్య రచనకు గణయతి ప్రా స లే. ల

    ఘుత. నొస౦గుచు సాహితీ ప్రతిభ నేలు ! !

    { లఘత = లాఘవము }

    రిప్లయితొలగించండి
  9. నాల్గు పాదాల నుండెడు నడక దెలిసి
    లయను దప్పింపక కవిత్వ ప్రభలు నిండ!
    పద్యరచనకు గణయతి ప్రాసలేల
    దలచ వలె? నెచటివచట తళుకు మనగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. తే.గీ.
    పద్యరచనకు గణయతిప్రాస లేల
    వాడవలె నని కవితలు వ్రాసిన ఘన
    తెలుగు కవులకు నేనేమి తెలుపగలను
    పద్యరచనలోని మధుర్య పరిమళములు
    - వెంకోరా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘వెం.కో.రా.’ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఘన తెలుగు కవులు’ అనేకంటే ‘కవితలు వ్రాసినట్టి| తెలుగు కవులకు..’ అనండి.

      తొలగించండి
    2. ఆర్యా! "మధుర పరిమళములు" అనండి. మాధుర్యము ను మధుర్యమన దగదు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ‘పద్యరచనలో మాధుర్య/మాధురీ పరిమళములు’ అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అత్యంత మనోహరముగనుండును.

      తొలగించండి
    5. తప్పులను సవరించి సూచనలు చేసిన పెద్దలిరువురికీ ధన్యవాదకులు._/\_
      తే.గీ.
      పద్యరచనకు గణయతిప్రాస లేల
      వాడవలెనని కవితలు వ్రాసినట్టి
      తెలుగు కవులకు నేనేమి తెలుపగలను
      పద్యరచనలో మాధురీ పరిమళములు
      - వెంకోరా.

      తొలగించండి
  11. గురువుగారు మన్నించాలి, మీపూరణ ప్రేరణతో నా పూరణ

    పద్యరచనకు గణయతి ప్రాస లేల
    యుండ వలయునో తెలుపుచున్ దండి గాను
    కావ్యములను వ్రాసిరి నాటి కవులు గాదె
    వాటిననుసరించుచువ్రాయ వలెను మనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ నా పద్యంకంటే బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. పద్య రచనకు గణయతి ప్రాస లేల
      నన నమిత శ్రవణానంద మంద జేయ
      లలిత సుందరాంగుల కాభరణము లనగ
      చంద మిచ్చు పద్యమ్మున కంద మెపుడు
      [చందము = ఛందము]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  13. గణములను లెక్కజూచుటే గహనమాయె
    యతిని సరిపుచ్చ ప్రాస ప్రయాస లాయె
    రామ! నేనెట్లు పద్యాల వ్రాయు? టసలు
    పద్యరచనకు గణయతిప్రాస లేల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ చమత్కారమై ఒప్పుతున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. "పద్యరచనకు గణయతిప్రాస లేల?"
    "కైత నడక యతిప్రాస గణములమరి,
    హొయలు గుప్పించి నుయ్యేల లూపి స్వప్న
    భావనావీచికల లోన పరవశించ"
    2."పద్యరచనకు గణయతిప్రాస లేల?"
    రాస గణములు వెంటరా ప్రాస లమరి
    యతులు అక్షర బధ్ద్ధులై ప్రతి పదమున
    నర్తనము సేయ కావ్య గానమ్ము సాగు."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘రాస గణములు’ అని సమాసం చేయరాదు కదా!

      తొలగించండి
  15. పద్యరచనకు గణ యతి ప్రాస లేల
    కావలెననెడి మీమాంస గాలి కొదలి,
    భావ లయలు కలసి జను భాష గూర్చ,
    ఛందము లవియె సమకూరు నందమొసగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వదిలి’ని ‘ఒదిలి’ అన్నారు. ‘గాలికి నిడి/విడి’ అనవచ్చు.

      తొలగించండి
  16. "పద్యరచనకు గణయతిప్రాస లేల?"
    "కైత నడక యతిప్రాస గణములమరి,
    హొయలు గుప్పించి నుయ్యేల లూపి స్వప్న
    భావనావీచికల లోన పరవశించ"
    2."పద్యరచనకు గణయతిప్రాస లేల?"
    రాస గణములు వెంటరా ప్రాస లమరి
    యతులు అక్షర బధ్ద్ధులై ప్రతి పదమున
    నర్తనము సేయ కావ్య గానమ్ము సాగు."

    రిప్లయితొలగించండి
  17. పద్యరచనకు గణయతి ప్రాసలేల?
    యనుట పొరపాటు-లేకున్నవినుటయందు
    గద్యమై దలపించును|”కన్య కట్టు
    బొట్టు జడపూలు విడువ ఎబ్బెట్టు రీతి|
    2.మధ్యాక్కర ---పద్యరచనకు గణయతి ప్రాసలేల?”మనము నేర్చు
    విద్యకు వినయంబు మరియు విజ్ఞత లేకున్న విధమె|
    అద్యయనంబున మనసు నంతట జేరు పద్యమన|
    గద్యము?తాళము లయలు కరువేగ?చదువరులకట|

    రిప్లయితొలగించండి
  18. పద్యమందురు గణయతి ప్రాసలున్న
    లేనిచో గద్యమందురు, లిఖిత మెరిగి
    "పద్యరచనకు గణయతి ప్రాస లేల"
    యనుచు పలుకెడి వారె వరవనిలోన?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పద్యరచనకు గణయతి ప్రాసలేల
      యన్న పద్యమున కవియె నాయువగును
      లయ బద్ధత యన్ననే లహరి కలుగు
      శ్రావ్యతను కూర్చుచు మదికి సాంత్వ నొసగు.

      2.వలయును యతులును గణముల్ వదలకుఃడ
      పద్య రచనకు:గణ యతి ప్రాసలేల
      వచనకవితకు ననుచును వాదులాడు
      చుంద్రు జనములు తెలియక చూడవయ్య.

      తొలగించండి
    3. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణ మూడవపాదంలో ‘లయబద్ధత’ అన్నచోట గణదోషం. ‘లయనిబద్ధత యున్ననే...’ అనండి.

      తొలగించండి
  19. పూలదండలో దారపు ముడులు ఏల ?
    పంచ భూతము లవిఏల ప్రాణి కొరకు ?
    కాలు సేతులు అవి ఏల కాయమునకు ?
    పద్య రచనకు గణయతి ప్రాస లేల ?
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      సంధి చేయవలసిన తావుల్లో విసంధిగా వ్రాశారు. ‘ముడులు నేల...భూతము లవియేల... కాలుసేతు లేలనొ మన కాయమునకు’ అందామా?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. పూల దండ లో దారపు ముడులు నేల ?
      పంచ భూతము లవియేల ప్రాణ ములకు ?
      కాలు సేతులేల నొ మన కాయమునకు?
      పద్యరచనకు గణ యతి ప్రాస లేల ?

      తొలగించండి
  20. హాశ్యమైనను మరి యపహాశ్య మైన
    నాసు కవితల కైనను యవసరమ్మె
    పద్యరచనకు గణయతిప్రాస ; లేల
    వచన కవితకు ఛందస్సు ? పదమె చాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘హాస్య’మును ‘హాశ్య’మన్నారు. ‘ఐనను+అవసరమ్మె’ అన్నచోట యడాగమం రాదు. ‘హాస్యమైనన్+ ఆ సుకవితలకైనను’ అంటేనే యతి సరిపోతుంది. నా(యొక్క) సుకవితలు.. అంటే యతిదోషం. సవరించండి.

      తొలగించండి
  21. పద్య రచనకు గణయతి ప్రాసలేల
    యనెడు వాదము నిజముగా ననుమతించ
    పద్య సౌదర్య మం తయు పాడుబడును
    తరతరాల తెలుగుపద్య చరిత మడియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. (నాబోటి)

    ముద్దు ముద్దగు పదముల ముదము నొంది
    కొద్ది కొద్దిగ వ్రాసియు కొంప గూల్చు
    శుద్ధి బుద్ధులు లేనట్టి శుంఠలకిట
    పద్యరచనకు గణయతిప్రాస లేల?

    రిప్లయితొలగించండి

  23. ఏల యేల యనకు లెస్స గేను చెప్పె
    దను జిలేబి వినుమ! లలితంపు జినుగు
    పద్య రచనకు గణయతిప్రాస లే, ల
    యలను జేర్చు పాడుటకు సయాట గాను !

    జిలేబి

    రిప్లయితొలగించండి