గురువు గారికి కవి మిత్రులకు నమస్కారములు1.మద్యమదియు నిచ్చు మత్తుయే తలకెక్కిత్రాగినంత నరుడు తనని మరిచితాను జ్ఞానినంచు తత్వాలె పాడడా?త్రాగు బోతు గొప్ప తత్వ వేత్త2.మత్తు గోరి యెపుడు మద్యాన్ని సేవించుత్రాగుబోతు, గొప్ప తత్వ వేత్తజ్ఞాన సుధలు పంచి మానవ జాతికిసత్యపథము జూపు నిత్యమతడు.
మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పూరణలో 'మత్తు+ఏ' అన్నప్పుడు యడాగమం రాదు. 'తనను మరచి' అనండి.
చెలిని మరువలేక కలతచెందిన దేవదాసు చివరికయ్యె త్రాగుఁబోతు -గొప్ప తత్త్వవేత్త - చెప్పె మైకములోనెజగమె మాయయనుచు చక్కగాను
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధు వేష మేసి బోధజే యునునీతిత్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త కలిని కుదిపి జూడ తెలుపును కధలెన్నో జగతి గాంచి నంత ప్రగతి వెలుగు
Akayyagaru..vshamu+vesi= veshamesi? Sandhi correct yenaa
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కలిని'...?
సూర్యనారాయణ గారూ, 'ఏయు'ప్రయోగం కూడ సాధువే.
నమస్కారములు " కలిని " అంటే ఇదికలియుగం కదా .కలిపురుషుడు చేసేపన్లు కలికే తెలుసు " అని అదన్నమాట sOdarulu chamdra mouLi gaariki dhanya vaadamulu.
3.సిద్ధుడ నని చెప్పి సిద్ధాంత మనుచునుభక్తి మత్తు యనెడు భ్రాంతిలోనమునిగి జనుల తాను ముంచుచున్ గంజాయిత్రాగు బోతు గొప్ప తత్వ వేత్త
విరించి గారూ, మీ పూరణ బాగున్నది. ‘మత్తు+అనెడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మత్తనియెడు’ అనండి.
సరుకు లోదిగినంత జగతికి మూలము****నాదమె యను రీతి వాదులాడుతూలి క్రిందపడుచు రాలిపోయెడిదె యీ****దేహ నైజంబని తెలియ పరచుకైపెక్కి బురదయె చాపగ పవలించు****ద్వంద భావములేని తాపసి వలెమత్తు వదిలినను మరి నడవగ లేడు****తొలిజన్మ వాసనల్ తెలిసినట్లుమురిసి త్రాగు వేళ గరళ కంఠుడు కాడెగరుడ గమన సముడె కదులు వేళపడిన వేళ తాను పంకజ భవుడగుత్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!!
జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
పలికిన పలుకు మరి పలుకక పలుకులపలు పలు విధ ములన పలికి అలసిసొలసి డస్సి యేడ్చి సొమ్ములు పోయినత్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
జిలేబీ గారూ, వృత్త్యనుపాసతో శోభిస్తున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తిరిగి లోకమంత తీరుతెన్నులెరుగువారి వలెను మిగుల వాగుచుండిమధువు బిగియ తూలు మాటలే సూక్తులౌత్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యమెపుడుతాగు మత్తులో తానుండు తాగుబోతు;గొప్పతాత్త్వ వేత్తతత్త్వ విషయములను తార్కికముగ దెల్పజగతి జనుల కెల్ల ప్రగతి హెచ్చు.
జగమె మాయ యనుచు చక్కగా బోధించె తాగుబోతు;గొప్ప తాత్త్వికుండుతాను జనుల కెపుడు దైవచింతన నేర్పిఅగ్ర స్థాన మందు నవనియందు
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ‘అగ్రస్థాన’మన్నపుడు గ్ర గురువై గణదోషం.
సమము గాదె చూడ సర్వేశు దృష్టిలోచిన్న చీమ మరియు చెట్టుచేమశునక సామజములు శుద్ధపండితుడును త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కామాలు పెడితే బాగుండేది.
›త్రాగుబోతుగొప్పతత్త్వవేత్తయెమరి త్రాగిపలుకునిజముధరణినెపుడు పాడుచుండునెపుడుపాటలరూపాన తత్త్వములనునెన్నొతడుముకొనక
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్మ భూమి బుట్టి మర్మంబు దెలియుచుదైవ సన్నిధి జని తనువు మరచిభక్తి సారమంత బాగుగ ద్రాగెడుత్రాగుబోతు గొప్ప తత్త్వవేత్తయె మరి
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిరికి దేవదాసు విఫలప్రేమికుండు,త్రాగుబోతు,గొప్ప తత్వవేత్త జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని ఘంట కొట్టి పాడె ఘంటసాల
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదం చివర గణదోషం. ‘విఫల ప్రేమికుడయె’ అందామా?
గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము పిరికి దేవదాసు విఫలప్రేమికుడయె,త్రాగుబోతు,గొప్ప తత్వవేత్త జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని ఘంట కొట్టి పాడె ఘంటసాల
పాప దుఃఖ హర మపార పారాశర్యవినుత సకల శాస్త్ర వేద సారధరము హరికథా సుధా పాన మత్తుండు త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పోచిరాజ శతకము పూర్తి యయినది. ఇప్పుడు “పద్మావతీ శ్రీనివాసము” ద్విపద కావ్యము వ్రాయుచున్నాను. కానీ యిందు కృతిపతి సంబోధనా పద్యములు మాత్రము కందములో వ్రాయుచున్నాను. ఇది సమ్మతమేనా? తెలుపగోర్తాను.
బాధ్యతల నెరుగక వారుణి గొని సతమిల్లుగుల్లచేసి యొల్లక సతిననుభవమ్ముఁబొంది యత్య కాలమునందుత్రాగుబోతు గొప్ప తత్వవేత్త
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘...యంత్యకాలము’నకు టైపాటు.
బ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.గొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు గంజ ముట్టించి దమ్మును గాఢముగను పీల్చి,జగమంత'మాయ' ని తల్చు వాడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, తేటగీతిలో మీ పూరణ బాగుంది. ‘మాయ+అని’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘మాయగ దల్చువాడు’ అనండి.
గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము బ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.గొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు గంజ ముట్టించి దమ్మును గాఢముగను పీల్చి,జగమంత'మాయ'గ తల్చు వాడు
. మత్తుమనసుకొసగి మర్యాదనేవీడుత్రాగుబోతు|”గొప్పతత్వవేత్తతనసుఖంబు గాక తనవారి సుఖమెంచుమానవత్వ మందు మసలుకొరకు.2.తప్ప-త్రాగుబోతు గొప్పతత్వవేత్త గాదులేనిప్పులాంటి నిజము యున్న?నేర్పుమీర జెప్పులేఅప్పులెన్నియున్న మనిషి హాయిగాను –ద్రాగుచున్ముప్పుతిప్పలందు మునిగి మూర్ఖుడట్లుమెల్గులే.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ‘మనసున కొసగి’ అనడం సాధువు. ‘మత్తు మనసున కిడి’ అనండి. ‘నిజము+ఉన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిజము లున్న’ అనండి.
పచ్చి తాగుబోతు కచ్చితమునబల్కు మెట్ట వేదమైన గట్టి గాను మత్తు బెరుగు కొలది తత్వమంతబెరుగు త్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త
కవిశ్రీ సత్తిబాబు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాని పొందు గోరి సరసమ్ము గావించి కల్లు , సార , గొనుచు కమ్మ గాను '' విశ్వదాభి రామ ! విను '' మను వేమన త్రాగుఁబోతు , గొప్ప తత్త్వవేత్త.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జగమె మాయ యనుచు చక్కగా బోధించె తాగుబోతు;గొప్ప తాత్త్వికుండుతాను జనుల కెపుడు దైవచింతన నేర్పిఅవని యందు నతడుయధికుడౌను.2చెలిని మరువ లేక చింతతో తానయ్యెతాగుబోతు ;గొప్ప తాత్త్వికుండుమంచి విషయములను మానవాళికి దెల్పిసాగుచుండు గాదె సత్పథంబు/?సజ్జనుండు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి.‘అవనియం దతండె యధికుడౌను’ అనండి. (అతడు+అధికుడు=అత డధికుడు; యడాగమం రాదు).రెండవపూరణ చివరిపాదాన్ని ‘సాగుచుండు గాదె సత్పధమున/ సాగుచుం డతండె సజ్జనుండు’ అనండి.
"సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః | పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||"గోవులుపనిషదుల గోపాలుడుపితికి పార్థునకిడెనంట పాలటంచు నమృత మిద్దె గీత యనుచును నాపాలు ద్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త :)
గురువు గారికి కవి మిత్రులకు నమస్కారములు
రిప్లయితొలగించండి1.
మద్యమదియు నిచ్చు మత్తుయే తలకెక్కి
త్రాగినంత నరుడు తనని మరిచి
తాను జ్ఞానినంచు తత్వాలె పాడడా?
త్రాగు బోతు గొప్ప తత్వ వేత్త
2.
మత్తు గోరి యెపుడు మద్యాన్ని సేవించు
త్రాగుబోతు, గొప్ప తత్వ వేత్త
జ్ఞాన సుధలు పంచి మానవ జాతికి
సత్యపథము జూపు నిత్యమతడు.
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిమొదటి పూరణలో 'మత్తు+ఏ' అన్నప్పుడు యడాగమం రాదు. 'తనను మరచి' అనండి.
చెలిని మరువలేక కలతచెందిన దేవ
రిప్లయితొలగించండిదాసు చివరికయ్యె త్రాగుఁబోతు -
గొప్ప తత్త్వవేత్త - చెప్పె మైకములోనె
జగమె మాయయనుచు చక్కగాను
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధు వేష మేసి బోధజే యునునీతి
రిప్లయితొలగించండిత్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త
కలిని కుదిపి జూడ తెలుపును కధలెన్నో
జగతి గాంచి నంత ప్రగతి వెలుగు
Akayyagaru..vshamu+vesi= veshamesi? Sandhi correct yenaa
తొలగించండిAkayyagaru..vshamu+vesi= veshamesi? Sandhi correct yenaa
తొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కలిని'...?
సూర్యనారాయణ గారూ,
తొలగించండి'ఏయు'ప్రయోగం కూడ సాధువే.
నమస్కారములు
తొలగించండి" కలిని " అంటే ఇదికలియుగం కదా .కలిపురుషుడు చేసేపన్లు కలికే తెలుసు " అని అదన్నమాట
sOdarulu chamdra mouLi gaariki dhanya vaadamulu.
3.
రిప్లయితొలగించండిసిద్ధుడ నని చెప్పి సిద్ధాంత మనుచును
భక్తి మత్తు యనెడు భ్రాంతిలోన
మునిగి జనుల తాను ముంచుచున్ గంజాయి
త్రాగు బోతు గొప్ప తత్వ వేత్త
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘మత్తు+అనెడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మత్తనియెడు’ అనండి.
సరుకు లోదిగినంత జగతికి మూలము
రిప్లయితొలగించండి****నాదమె యను రీతి వాదులాడు
తూలి క్రిందపడుచు రాలిపోయెడిదె యీ
****దేహ నైజంబని తెలియ పరచు
కైపెక్కి బురదయె చాపగ పవలించు
****ద్వంద భావములేని తాపసి వలె
మత్తు వదిలినను మరి నడవగ లేడు
****తొలిజన్మ వాసనల్ తెలిసినట్లు
మురిసి త్రాగు వేళ గరళ కంఠుడు కాడె
గరుడ గమన సముడె కదులు వేళ
పడిన వేళ తాను పంకజ భవుడగు
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
పలికిన పలుకు మరి పలుకక పలుకుల
రిప్లయితొలగించండిపలు పలు విధ ములన పలికి అలసి
సొలసి డస్సి యేడ్చి సొమ్ములు పోయిన
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
జిలేబీ గారూ,
తొలగించండివృత్త్యనుపాసతో శోభిస్తున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తిరిగి లోకమంత తీరుతెన్నులెరుగు
రిప్లయితొలగించండివారి వలెను మిగుల వాగుచుండి
మధువు బిగియ తూలు మాటలే సూక్తులౌ
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యమెపుడుతాగు మత్తులో తానుండు
రిప్లయితొలగించండితాగుబోతు;గొప్పతాత్త్వ వేత్త
తత్త్వ విషయములను తార్కికముగ దెల్ప
జగతి జనుల కెల్ల ప్రగతి హెచ్చు.
జగమె మాయ యనుచు చక్కగా బోధించె
రిప్లయితొలగించండితాగుబోతు;గొప్ప తాత్త్వికుండు
తాను జనుల కెపుడు దైవచింతన నేర్పి
అగ్ర స్థాన మందు నవనియందు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
‘అగ్రస్థాన’మన్నపుడు గ్ర గురువై గణదోషం.
సమము గాదె చూడ సర్వేశు దృష్టిలో
రిప్లయితొలగించండిచిన్న చీమ మరియు చెట్టుచేమ
శునక సామజములు శుద్ధపండితుడును
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామాలు పెడితే బాగుండేది.
రిప్లయితొలగించండి›
త్రాగుబోతుగొప్పతత్త్వవేత్తయెమరి త్రాగిపలుకునిజముధరణినెపుడు పాడుచుండునెపుడుపాటలరూపాన తత్త్వములనునెన్నొతడుముకొనక
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్మ భూమి బుట్టి మర్మంబు దెలియుచు
రిప్లయితొలగించండిదైవ సన్నిధి జని తనువు మరచి
భక్తి సారమంత బాగుగ ద్రాగెడు
త్రాగుబోతు గొప్ప తత్త్వవేత్తయె మరి
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిరికి దేవదాసు విఫలప్రేమికుండు,
రిప్లయితొలగించండిత్రాగుబోతు,గొప్ప తత్వవేత్త
జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని
ఘంట కొట్టి పాడె ఘంటసాల
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదోషం. ‘విఫల ప్రేమికుడయె’ అందామా?
గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
తొలగించండిపిరికి దేవదాసు విఫలప్రేమికుడయె,
త్రాగుబోతు,గొప్ప తత్వవేత్త
జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని
ఘంట కొట్టి పాడె ఘంటసాల
పాప దుఃఖ హర మపార పారాశర్య
రిప్లయితొలగించండివినుత సకల శాస్త్ర వేద సార
ధరము హరికథా సుధా పాన మత్తుండు
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పోచిరాజ శతకము పూర్తి యయినది. ఇప్పుడు “పద్మావతీ శ్రీనివాసము” ద్విపద కావ్యము వ్రాయుచున్నాను. కానీ యిందు కృతిపతి సంబోధనా పద్యములు మాత్రము కందములో వ్రాయుచున్నాను. ఇది సమ్మతమేనా? తెలుపగోర్తాను.
తొలగించండిబాధ్యతల నెరుగక వారుణి గొని సత
రిప్లయితొలగించండిమిల్లుగుల్లచేసి యొల్లక సతి
ననుభవమ్ముఁబొంది యత్య కాలమునందు
త్రాగుబోతు గొప్ప తత్వవేత్త
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘...యంత్యకాలము’నకు టైపాటు.
బ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.
రిప్లయితొలగించండిగొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు
గంజ ముట్టించి దమ్మును గాఢముగను
పీల్చి,జగమంత'మాయ' ని తల్చు వాడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండితేటగీతిలో మీ పూరణ బాగుంది.
‘మాయ+అని’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘మాయగ దల్చువాడు’ అనండి.
గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము
తొలగించండిబ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.
గొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు
గంజ ముట్టించి దమ్మును గాఢముగను
పీల్చి,జగమంత'మాయ'గ తల్చు వాడు
. మత్తుమనసుకొసగి మర్యాదనేవీడు
రిప్లయితొలగించండిత్రాగుబోతు|”గొప్పతత్వవేత్త
తనసుఖంబు గాక తనవారి సుఖమెంచు
మానవత్వ మందు మసలుకొరకు.
2.తప్ప-త్రాగుబోతు గొప్పతత్వవేత్త గాదులే
నిప్పులాంటి నిజము యున్న?నేర్పుమీర జెప్పులే
అప్పులెన్నియున్న మనిషి హాయిగాను –ద్రాగుచున్
ముప్పుతిప్పలందు మునిగి మూర్ఖుడట్లుమెల్గులే.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
‘మనసున కొసగి’ అనడం సాధువు. ‘మత్తు మనసున కిడి’ అనండి.
‘నిజము+ఉన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిజము లున్న’ అనండి.
పచ్చి తాగుబోతు కచ్చితమునబల్కు
రిప్లయితొలగించండిమెట్ట వేదమైన గట్టి గాను
మత్తు బెరుగు కొలది తత్వమంతబెరుగు
త్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త
కవిశ్రీ సత్తిబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాని పొందు గోరి సరసమ్ము గావించి
రిప్లయితొలగించండికల్లు , సార , గొనుచు కమ్మ గాను
'' విశ్వదాభి రామ ! విను '' మను వేమన
త్రాగుఁబోతు , గొప్ప తత్త్వవేత్త.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజగమె మాయ యనుచు చక్కగా బోధించె
రిప్లయితొలగించండితాగుబోతు;గొప్ప తాత్త్వికుండు
తాను జనుల కెపుడు దైవచింతన నేర్పి
అవని యందు నతడుయధికుడౌను.
2చెలిని మరువ లేక చింతతో తానయ్యె
తాగుబోతు ;గొప్ప తాత్త్వికుండు
మంచి విషయములను మానవాళికి దెల్పి
సాగుచుండు గాదె సత్పథంబు/?సజ్జనుండు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
‘అవనియం దతండె యధికుడౌను’ అనండి. (అతడు+అధికుడు=అత డధికుడు; యడాగమం రాదు).
రెండవపూరణ చివరిపాదాన్ని ‘సాగుచుండు గాదె సత్పధమున/ సాగుచుం డతండె సజ్జనుండు’ అనండి.
"సర్వోపనిషదో గావో
రిప్లయితొలగించండిదోగ్ధా గోపాలనందనః |
పార్ధో వత్స స్సుధీర్భోక్తా
దుగ్ధం గీతామృతం మహత్ ||"
గోవులుపనిషదుల గోపాలుడుపితికి
పార్థునకిడెనంట పాలటంచు
నమృత మిద్దె గీత యనుచును నాపాలు
ద్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త :)