గురువు గారికి కవిమిత్రులకూ నమస్సుమాంజలులుహోళీ శుభాకాంక్షలుతారతమ్యములను పారద్రోలుచు ద్రుంచువైరములను, బెంచు బంతికూడుజనులలోన స్నేహమనురాగ ములె గాకయైకమత్య మచట యంకురించు
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘...మచట నంకురించు’ అనండి.
గురువు గారికి ధన్యవాదములు నా సవరించిన పద్యముతారతమ్యములను పారద్రోలుచు ద్రుంచువైరములను, బెంచు బంతికూడుజనులలోన స్నేహమనురాగ ములె గాకయైకమత్య మచట నంకురించు
నేటి విందు లందు మేటిభోగము లంట పంక్తి భోజ నంబు పాత మాట కులము మతము యనుచు కోరితగవు లాడ వైర ములను బెంచు బంతి కూడు
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మతము+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మత మటంచు’ అనండి.
నేటి విందు లందు మేటిభోగము లంట పంక్తి భోజ నంబు పాత మాట కులము మతమ టంచు కోరితగవు లాడ వైర ములను బెంచు బంతి కూడు
వలదు వలదు భువిన వసతులు మనలకు వైరములను బెంచు! బంతి కూడునరయ మీరు మేము నెల్లరు ఒకరమై నిచట సుఖము గనగ నిలుచుదముగ !
జిలేబీ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘భువిని’ అనండి.
అహము దురభి మాన మంగజమ్ము వలన నేమి తెచ్చు తెలుపు? మింక శాంతి సహనములను పెంచు సాధన మేదిరా వైరములను, బెంచు బంతి కూడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బంతి భోజనాల వడ్డన లచ్చోటవంక పెట్టి నారు వరునివారు వైన మడుగ బంపె వధువును సరదాగవైరములను బెంచె బంతి కూడు కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అయినవారలనుచు నాకులన్ దీరిచికానివారలనుచు కంచమొసఁగియతిథులకును బెట్ట నంతరమున్ జూపివైరములను బెంచు బంతికూడు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులము పేరుతోడ కూరలన్ వండగ వైరములను దెచ్చె బంతికూడు అన్నిజాతులకును నామోద్యయోగ్యమౌ కూడు వండి నపుడు కూరు మైత్రి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేద ధనికులనెడు భేదమ్ము లవనిన వైరములను బెంచు, బంతి కూడుపారదోలునంట తారతమ్యములనుపెంచు జనుల మధ్య ప్రేమ నదియుకులము మతము మరచి కూర్చుండ మనియన్నయగ్ర కులపు వారు నాగ్రహింపవైరములను బెంచు బంతికూడనుచునుపలికె నొక్క ఖలుడు పరుల తోడ
ఆంజనేయ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘భేదమ్ము లవనిని’ అనండి.
భోజ్య వస్తువు లవి భుజి యించ రానిచో వైరములను బెంచు బంతి కూడు నుప్పు పులుపు లేని చప్పిడి యోగిర మనుచు వెడలి పోదు రందఱపుడు
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్సవమ్ము లందు నుద్యాన వన భోజనమ్ముల సమ భావనమ్ము సుంతవదలినను దరతమ భావమ్ము జూపినవైరములను బెంచు బంతికూడు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.మనసు నిగ్రహింప మధుమేహమువలనవైరములను బెంచు బంతికూడునాలుక, మనసులకు. నాలుక మనసపైగెలుచు నెపుడు, తుదకు గెలుచు వెజ్జ - వెంకోరా.
‘వెంకోరా’ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘మనసపై’...?
కులముకట్టుబాట్లు కలుషిత మందునవైరములను బెంచు|”బంతికూడుమమతలందజేయు |మహిమాన్వితంబైనసహన శీలగతులసాకుగాన|”
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతరములు గాదె నవనిలో నిరతమువైరములను బెంచు, బంతికూడు మైత్రి కలుగ జేసి మనుజుల మధ్యనశాంతి పూలు విరియు సంతసముగ!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘గాదె యవనిలో’ అనండి.
అన్నదమ్ముల వలె హాయిగా నుండరునెగ్గు వారి జూచి యెగ్గు దలతు రేల యీ ప్రయాస యిరుజట్లు కలువవువైరములను బెంచు బంతికూడు.(బంతికూడు=బంతితో పొందు...బంతి యాట అనే భావంతో)
మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలిమి కూడిన యధికార దాహం బిట వైరములను బెంచు! బంతి కూడు నెపుడు చేయి గలుపు, నెయ్యము వాంఛించు,నెల్లర జత చేయ నెంచుచుండు!
శ్రీధర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి వందనములు. కులము మతమటంచు కుత్సితమ్ముల తోడభేదభావములను పెంచి తమదువర్గ శాఖ తతికి ప్రత్యేకముగ బెట్టఁ, వైరములను బెంచు, బంతికూడు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కూడు నిడగ బిలిచి కులముల గదిజూప వైరములను బెంచు;బంతికూడుసంతసంబు గొలుపు నంతర్యముల బాప మహిని జాతి యొకటె మానవులకు.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులము మతము వీడి కూర్చుండి తినుటచే మాయ మగును మనపు మకిలి మరియు వైరములును, బెంచు బంతి కూడు మిగుల మైత్రి ,ప్రేమ సమత మనుజు లందు .
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.సమస్యలోని ‘వైరములను’ మీ పూరణలో ‘వైరములును’ అయింది.
వర్ణభేదమనుచు వాదులాడుచు నుండవైరములను బెంచు:బంతి కూడుబాపు వైరములను,బంధువులను చేయుననుట యందు లేదు యతిశయోక్తి.2.పాణిగ్రహణమందు పర్వసమయ మందు వైరములను బెంచు బంతికూడు ననుచు నుందు రిలను,నరసి జూడ నిదియె మైత్రి పెంచుచుండు మానవులకు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘లేదు+అతిశయోక్తి’ అన్నపుడు యడాగమం రాదు.
వీరి కేల ముందు బూరెలు పూరీలు వారి కేల ముందు వడలనుచును వారి కేల ముందు వడ్డన యనుచును వైరములను బెంచు బంతికూడు :)
గురువు గారికి కవిమిత్రులకూ నమస్సుమాంజలులు
రిప్లయితొలగించండిహోళీ శుభాకాంక్షలు
తారతమ్యములను పారద్రోలుచు ద్రుంచు
వైరములను, బెంచు బంతికూడు
జనులలోన స్నేహమనురాగ ములె గాక
యైకమత్య మచట యంకురించు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘...మచట నంకురించు’ అనండి.
గురువు గారికి ధన్యవాదములు
తొలగించండినా సవరించిన పద్యము
తారతమ్యములను పారద్రోలుచు ద్రుంచు
వైరములను, బెంచు బంతికూడు
జనులలోన స్నేహమనురాగ ములె గాక
యైకమత్య మచట నంకురించు
నేటి విందు లందు మేటిభోగము లంట
రిప్లయితొలగించండిపంక్తి భోజ నంబు పాత మాట
కులము మతము యనుచు కోరితగవు లాడ
వైర ములను బెంచు బంతి కూడు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మతము+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మత మటంచు’ అనండి.
నేటి విందు లందు మేటిభోగము లంట
తొలగించండిపంక్తి భోజ నంబు పాత మాట
కులము మతమ టంచు కోరితగవు లాడ
వైర ములను బెంచు బంతి కూడు
రిప్లయితొలగించండివలదు వలదు భువిన వసతులు మనలకు
వైరములను బెంచు! బంతి కూడు
నరయ మీరు మేము నెల్లరు ఒకరమై
నిచట సుఖము గనగ నిలుచుదముగ !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భువిని’ అనండి.
అహము దురభి మాన మంగజమ్ము వలన
రిప్లయితొలగించండినేమి తెచ్చు తెలుపు? మింక శాంతి
సహనములను పెంచు సాధన మేదిరా
వైరములను, బెంచు బంతి కూడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బంతి భోజనాల వడ్డన లచ్చోట
రిప్లయితొలగించండివంక పెట్టి నారు వరునివారు
వైన మడుగ బంపె వధువును సరదాగ
వైరములను బెంచె బంతి కూడు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అయినవారలనుచు నాకులన్ దీరిచి
రిప్లయితొలగించండికానివారలనుచు కంచమొసఁగి
యతిథులకును బెట్ట నంతరమున్ జూపి
వైరములను బెంచు బంతికూడు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులము పేరుతోడ కూరలన్ వండగ
రిప్లయితొలగించండివైరములను దెచ్చె బంతికూడు
అన్నిజాతులకును నామోద్యయోగ్యమౌ
కూడు వండి నపుడు కూరు మైత్రి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేద ధనికులనెడు భేదమ్ము లవనిన
రిప్లయితొలగించండివైరములను బెంచు, బంతి కూడు
పారదోలునంట తారతమ్యములను
పెంచు జనుల మధ్య ప్రేమ నదియు
కులము మతము మరచి కూర్చుండ మనియన్న
యగ్ర కులపు వారు నాగ్రహింప
వైరములను బెంచు బంతికూడనుచును
పలికె నొక్క ఖలుడు పరుల తోడ
ఆంజనేయ శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘భేదమ్ము లవనిని’ అనండి.
భోజ్య వస్తువు లవి భుజి యించ రానిచో
రిప్లయితొలగించండివైరములను బెంచు బంతి కూడు
నుప్పు పులుపు లేని చప్పిడి యోగిర
మనుచు వెడలి పోదు రందఱపుడు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్సవమ్ము లందు నుద్యాన వన భోజ
రిప్లయితొలగించండినమ్ముల సమ భావనమ్ము సుంత
వదలినను దరతమ భావమ్ము జూపిన
వైరములను బెంచు బంతికూడు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.
రిప్లయితొలగించండిమనసు నిగ్రహింప మధుమేహమువలన
వైరములను బెంచు బంతికూడు
నాలుక, మనసులకు. నాలుక మనసపై
గెలుచు నెపుడు, తుదకు గెలుచు వెజ్జ
- వెంకోరా.
‘వెంకోరా’ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మనసపై’...?
కులముకట్టుబాట్లు కలుషిత మందున
రిప్లయితొలగించండివైరములను బెంచు|”బంతికూడు
మమతలందజేయు |మహిమాన్వితంబైన
సహన శీలగతులసాకుగాన|”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతరములు గాదె నవనిలో నిరతము
రిప్లయితొలగించండివైరములను బెంచు, బంతికూడు
మైత్రి కలుగ జేసి మనుజుల మధ్యన
శాంతి పూలు విరియు సంతసముగ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గాదె యవనిలో’ అనండి.
అన్నదమ్ముల వలె హాయిగా నుండరు
రిప్లయితొలగించండినెగ్గు వారి జూచి యెగ్గు దలతు
రేల యీ ప్రయాస యిరుజట్లు కలువవు
వైరములను బెంచు బంతికూడు.
(బంతికూడు=బంతితో పొందు...బంతి యాట అనే భావంతో)
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలిమి కూడిన యధికార దాహం బిట
రిప్లయితొలగించండివైరములను బెంచు! బంతి కూడు
నెపుడు చేయి గలుపు, నెయ్యము వాంఛించు,
నెల్లర జత చేయ నెంచుచుండు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండికులము మతమటంచు కుత్సితమ్ముల తోడ
భేదభావములను పెంచి తమదు
వర్గ శాఖ తతికి ప్రత్యేకముగ బెట్టఁ,
వైరములను బెంచు, బంతికూడు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూడు నిడగ బిలిచి కులముల గదిజూప
రిప్లయితొలగించండివైరములను బెంచు;బంతికూడు
సంతసంబు గొలుపు నంతర్యముల బాప
మహిని జాతి యొకటె మానవులకు.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులము మతము వీడి కూర్చుండి తినుటచే
రిప్లయితొలగించండిమాయ మగును మనపు మకిలి మరియు
వైరములును, బెంచు బంతి కూడు మిగుల
మైత్రి ,ప్రేమ సమత మనుజు లందు .
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యలోని ‘వైరములను’ మీ పూరణలో ‘వైరములును’ అయింది.
రిప్లయితొలగించండివర్ణభేదమనుచు వాదులాడుచు నుండ
వైరములను బెంచు:బంతి కూడు
బాపు వైరములను,బంధువులను చేయు
ననుట యందు లేదు యతిశయోక్తి.
2.పాణిగ్రహణమందు పర్వసమయ మందు
వైరములను బెంచు బంతికూడు
ననుచు నుందు రిలను,నరసి జూడ నిదియె
మైత్రి పెంచుచుండు మానవులకు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘లేదు+అతిశయోక్తి’ అన్నపుడు యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివీరి కేల ముందు బూరెలు పూరీలు
రిప్లయితొలగించండివారి కేల ముందు వడలనుచును
వారి కేల ముందు వడ్డన యనుచును
వైరములను బెంచు బంతికూడు :)