6, మార్చి 2016, ఆదివారం

పద్యరచన - 1185

కవిమిత్రులారా,
“నమ్ముము నా వచనమ్ముల...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు నచ్చిన అంశంపై పద్యాన్ని వ్రాయండి.

48 కామెంట్‌లు:

  1. నమ్ముము నావచనమ్ములు
    కొమ్మలు బానిసలు గారు కులదీపికలౌ
    అమ్మలమృతసమ తుల్యులు
    నిమ్మహిలో వెలసినట్టి యిల వేల్పులురా!

    2.
    నమ్ముము నా వచనమ్ములు
    సమ్మెట పోటువలెనుండు సత్యపు వాక్కుల్
    కమ్మని మాటల నెప్పుడు
    నమ్మకుమా! నీకు యవియె నష్టము దెచ్చున్

    3.
    నమ్ముము నా వచనమ్ములు
    సొమ్ముల నార్జించు వాడె శూరుండనుచున్
    నమ్మితి వౌరా? తగదిది
    యిమ్మహిలో మానవతయె యింపగు ధనమౌ

    4.
    నమ్ముము నా వచనమ్ములు
    నమ్మని చో చెడదవీవు నష్టమె నీకున్
    దమ్మము వీడిచరించుట
    అమ్మను బాధించుట నిల యపరాధములే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యమ్మ ను బాధించుటనిల యపరాధములే

      నాలుగవ పద్య చివరిపాదం టైపోటుకు క్షంతవ్యుడను

      తొలగించండి
    2. మీ నాలుగు పద్యాలు బాగున్నవి.
      మొదటిపద్యంలో ‘సమ-తుల్యులు’ అన్నచోట పునరుక్తి. ‘అమ్మ లమృతతుల్యులు గద| యిమ్మహిలో...’ అనండి.
      రెండవపద్యంలో ‘నీకు నవియె’ అనండి.
      నాల్గవపద్యంలో ‘బాధించుట యిల’ అనండి.

      తొలగించండి
  2. నమ్ముము నా వచనమ్ముల
    నిమ్మహిలో లేదుమనకు నిక్కము సుమ్మీ
    అమ్మను మించిన దైవము
    కమ్మని దీవెనల నిచ్చు కలలో నైనన్

    రిప్లయితొలగించండి
  3. నమ్ముము నా వచనమ్ముల
    ముమ్మాటికి నీవెనాకు ముద్దుల చెలివే
    పొమ్మన భావ్యమ నేనే
    యమ్మాయిని చూడలేదె యన్నులమిన్నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు (షరా మామూలే అన్నట్టు ప్రియురాలిపై) చెప్పిన పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. నమ్ముము నా వచనమ్ముల.
    నిమ్మహిలో జరుగుచుండె నింతుల పైనన్
    అమ్మమ్మొ! క్రూర హింసలు
    నిమ్మళముగ, శాసనములు నిష్ఫల మాయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.
      ‘పైనన్+అమ్మమ్మొ’ అని విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  5. నమ్ముము నావచనమ్ముల
    కొమ్మా! నీకై తపించి కోరి కలడరన్
    కమ్మని నిదుర కరవయెన్
    రమ్మా! వెస నామనస్సు రంజిల జేయన్

    రిప్లయితొలగించండి
  6. నమ్ముము నావచనమ్ముల
    నమ్మలతనయను గొలుచుట తో సమమౌరా
    యమ్మల చక్కగ జూచుట
    నమ్మాయిల భ్రూణ హత్య లను మాపుటలున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      రెండవపాదంలో యతి తప్పింది. ‘మలతనయ’ అన్న సమాసమూ దోషమే. ‘అమ్మలకొమరితఁ గొలుచుట కది సమమౌరా’ అందామా?

      తొలగించండి
    2. మీ పద్యం బాగున్నది.
      రెండవపాదంలో యతి తప్పింది. ‘మలతనయ’ అన్న సమాసమూ దోషమే. ‘అమ్మలకొమరితఁ గొలుచుట కది సమమౌరా’ అందామా?
      నాల్గవపాదంలోను యతి తప్పింది. ‘భ్రూణహత్య లంతము సేయన్’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  7. నమ్ముము నా వచనమ్ముల
    నిమ్ముగ మనశంకరార్యులిచ్చు సమస్యల్
    సుమ్ము కవిత్వము వ్రాసెడి
    దమ్మును కల్గించి మనను తట్టు భుజమ్మున్.

    రిప్లయితొలగించండి

  8. నమ్ముము నా వచనమ్ముల
    నమ్మనిచో నీకె కల్గు నష్టము, కూర్మిన్
    నమ్మక మన్నది పునాది
    నమ్మిక చెడ కూలిపోవు నం టిర వయ్యో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవపద్యం బావం బాగుంది.
      మూడవపాదంలో గణదోషం. ‘నమ్మకమె పునాది కనుక’ అందామా?
      ‘...అంటిరవయ్యో’...?

      తొలగించండి
    2. గురువుగారూ దోషసవరణకు ధన్యవాదములు.

      కూలిపోవును+అంటు+ఇరవు+అయ్యో

      నమ్మిక చెడిపోతే స్నేహమనే సౌధము కూలిపోతుంది అని నా భావమండీ.

      తొలగించండి
  9. నమ్ముము నా వచనమ్ముల
    నమ్మకమున్బెట్ట నీదు హారము నెపుడు
    న్నమ్మా ! సత్యము బలికితి
    దెమ్మనినన్దెత్తు నిపుడె తీసుకు రానా ?

    రిప్లయితొలగించండి
  10. అశోక వనంలో సీతామాతతో భక్తహనుమ:

    నమ్ముము నా వచనమ్ముల
    నెమ్మనమున జెప్పుచుంటి నీరజనయనీ!
    దుమ్ము కరిపించి దనుజుల
    సమ్మతమగునేని మిమ్ము స్వామిని జేర్తున్!

    రిప్లయితొలగించండి
  11. నమ్ముము నా వచనమ్ముల
    నిమ్ముగ నిమ్ము సువిభాగ మిత్తరి నీ రా
    జ్యమ్ము ప్రజలు బంధువులు సు
    ఖమ్ముగ నుందురు చెలిమిని కౌంతేయులతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హమ్మయ్య! నేను ఎదురు చూచిన పద్యం మీనుండి వచ్చింది. సంతోషం. చివరంటా చూసి ఎవరూ వ్రాయకపోతే నేనే రాయబారఘట్టంలో కృష్ణుని మాటలుగా వ్రాద్దామనుకున్నాను.
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా పద్యము మీకింతగా నచ్చినందుకు నాకెంతోయానందముగా నున్నది. ధన్యవాదములు.

      తొలగించండి
  12. నమ్ముము నా వచనమ్ముల
    కమ్మని మాటలు జిలేబి కవనము జేయన్
    నిమ్మది నిచ్చును పాటలు
    నెమ్మది మేరగ తెలియును నేర్పును గూర్పున్

    రిప్లయితొలగించండి
  13. నమ్ముము నా వచనమ్ముల
    నిమ్మహిలో భారతమ్మె యెక్కుడు సుక్షే
    త్రమ్మగుననుటయె నిజమిది
    సుమ్మా! కాదతిశయమ్ము, చూడగ నెపుడున్.

    రిప్లయితొలగించండి
  14. . పాడకవృత్తము
    1.నమ్ముము నావచనమ్ముల మీలో
    క్రమ్మగనే శివరాత్రికి భక్తే
    సమ్మతిగా హర సంస్కృతియే లో
    కమ్మున నిల్వగ?కాంక్షలుదీరున్.
    2.నమ్ముము నావచనమ్ముల
    నమ్మనిచో నరకమబ్బు|నారాయణుడే
    ఇమ్మహి దైవంబనుమిక
    సమ్మతిగా నమ్ముకొన్న ?స్వర్గంబదియే|

    రిప్లయితొలగించండి
  15. నమ్ముము నావచనమ్ముల
    అమ్మగ నిన్నాదరించు |నైశ్వర్య మిడున్
    నమ్మియువిద్యను నేర్వగ
    దమ్మును, ధైర్యమ్మునొసగు దయగల వాణీ
    2.
    .

    రిప్లయితొలగించండి
  16. బాలకృష్ణుడు యశోదతో.....

    నమ్ముము నావచనమ్ముల
    నమ్మా ! నే మన్నుదినుట నాలము సుమ్మా!
    కమ్మని వెన్నను గ్రోలితి
    నమ్మిక లేకున్న నీకు నరయుము నోరున్!!!

    రిప్లయితొలగించండి
  17. నమ్ముము నావచనమ్ముల
    నమ్మా సీతమ్మ రాముడా రావణు నా
    శమ్మొనరించును భూ భా
    రమ్మును తొలగించు నీ చెరను విడిపించున్

    రిప్లయితొలగించండి
  18. గురుమూర్తి ఆచారి గారి పద్యం....

    పద్యార౦భ నిర్మాణ ము మార్చ కు౦డా ఉత్పలమాలలోనికి మలచుకొని వ్రాస్తున్నాను. నన్ను క్షమి౦చ౦డి.
    { చిన్ని కృష్ణుడు, యశోదకు నేను మన్ను తినలేదని చెప్పి, తన నోటిలో సకల విశ్వములను
    చూపి౦చుట.}

    "నమ్ముము నీవు నాదు వచన౦బుల నవ్య నవోధృతమ్ము ని
    త్యమ్ము మెస౦గుచు౦దుగద తల్లి! భుజి౦తునె నేను మృత్తికన్?
    నమ్మక యున్నమూర్కొనుము నా ముఖ గ౦ధ" మట౦చు చూపె వి
    శ్వమ్ముల నెల్ల నాస్యమున శౌరి యశోదయు కా౦చె స్థాణువై!!!
    {నవోధృతము = వెన్న
    మృత్తిక = మన్ను
    నా ముఖ గ౦ధము = నా మొగము వాసన}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      (పద్యారంభాన్ని మార్చినందుకు క్షమించమని ముందే చెప్పారు కదా! స్వస్తి!)

      తొలగించండి

  19. 1.నమ్ముము నావచనమ్ములు
    నమ్మక పోయిన కలుగును నష్టము నీకే
    నమ్మిన వారిని యిలలో
    బమ్మపితయును సతతమ్ము వరములొసంగున్.

    2.నమ్ముము నావచనమ్ములు
    కమ్మగ సాగెడి బతుకున గరళము పోయన్
    దమ్మము కాదని యెరుగుము
    అమ్మల గన్న యమ్మకాచు ననవరతంబున్.

    3.నమ్ముము నావచనమ్ములు
    యిమ్ముగ కొనియిత్తు కారు నిపుడే నీకున్
    కమ్మగ పైచదువు చదివి
    యమ్మకు ముద్దుల తనయుడ వగుమాకన్నా.

    4.నమ్ముము నావచనమ్ములు
    సొమ్ములు దోచెడి జనములు చుట్టును యుందుర్/యుండన్
    నమ్మకు వారల నెల్లను
    నమ్మిన నెడతెగని యట్టి నష్టము కలుగున్.

    5.నమ్ముము నావచనమ్ములు
    కొమ్మల నతిగా నమ్మకు కూరిమి తోడన్
    నమ్మించి పారి పోదురు
    నిమ్మహిలో నట్టి వారినివిడువుము తనయా.

    రిప్లయితొలగించండి
  20. నమ్ముము నావచనమ్ముల
    వమ్మగదు సుమా జరిగెడు బవరము నందున్
    దమ్మమె గెల్చును చూడుము
    సమ్మతముగ నీకు నేను సారథి నౌదున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆరు పద్యాలు బాగున్నవి.
      రెండవపద్యంలో ‘అమ్మల గన్న యమ్మ’ అన్నచోట గణదోషం. ‘అమ్మల గన్న యమ కాచు’ అనవచ్చుననుకొంటాను.
      మూడవపద్యంలో ‘వచనమ్ముల| నిమ్ముగ...’ అనండి.
      నాల్గవపద్యంలో ‘యుందుర్’ అన్న ప్రయోగం దోషం. ‘చుట్టును నుండన్’ అనండి.
      ఐదవపద్యంలో ‘పారిపోయెద| రిమ్మహిలో’ అనండి. ‘వారిని విడుము తనయా’ వారిని విడువుము సుతా’ అనండి. లేకుంటే గణదోషం.
      ఆరవపద్యంలో ‘వమ్మవదు...’ అనండి.

      తొలగించండి
  21. నమ్ముము నావచనమ్ముల
    వమ్మగదు సుమా జరిగెడు బవరము నందున్
    దమ్మమె గెల్చును చూడుము
    సమ్మతముగ నీకు నేను సారథి నౌదున్.

    రిప్లయితొలగించండి
  22. నమ్ముము నా వచనమ్ముల!
    బొమ్మను బొరుసుగను జేసి బుట్టను వేతున్
    గమ్మున బెంగాలు వెడలి
    గుమ్మను నిమ్మళము జేతు గుట్టుగ మోడీ!

    రిప్లయితొలగించండి
  23. నమ్ముము నా వచనమ్ముల:
    దమ్మును కొట్టంగ రాదు; దండుగ పనిరా!
    గమ్మున వీడుము బీడిని!
    రమ్ముర నాచెంత కిపుడు రమ్మును గ్రోలన్!

    రిప్లయితొలగించండి