16, మార్చి 2016, బుధవారం

సమస్య – 1974 (పేదవడిన సురలలో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు.
(బ్లాగులో ‘పద్యరచన’ శీర్షిక కనిపిస్తే నా ఆరోగ్యం కుదుటపడినట్లు లెక్క)

38 కామెంట్‌లు:

  1. అలిగి వెడలెను శ్రీలక్ష్మి కొలువు వీడి
    సిరిని కోరగ పెండ్లికి శ్రీని వాసు
    పేదవడిన సురలలోఁ , గుబేరుఁ డొకఁడు
    నప్పు నీయగ దలచెను నొప్పు గాను

    గురువులకు నంస్కారములు .ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త తొందర ఏముంది ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పెండ్లికిఁ జేరె హరియు| పేదవడిన సురలలో...’ అంటే అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  2. లంక నుండి తరిమి వేసె, లాగు కొనెను
    పుష్పకమును, మరి యలకాపురిని తాకి
    వనితలను తరలించె, రావణుడి వలన
    పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు!!

    రిప్లయితొలగించండి
  3. పుష్పక విమానాన్ని కోల్పోయిన కుబేరుడు పేదవాడయాడన్న ఊహతో

    1.
    బ్రహ్మకానుక నిచ్చిన రమ్యమైన
    పుష్పకమును గెలిచెగదా పోరు యందు
    రావణుండు, యసురదురాక్రమణ వలన
    పేదవడిన సురలలో గుబేరు డొకడు.

    2.
    సోదర దానవ చేష్టకు
    పేదవడిన సురలలో గుబేరు డొకడు గా
    దే, ధాత యొసగె , పుష్పక
    మా దానవుపాలబడుటనయ్యో! విధియే!

    3.
    కుంభ కోణాల నిపుణులీ కువలయమున
    కోట్ల ధనమును దోచుచున్ గులుకు చుండు
    నల్లధనకుబేరుల యార్జనమ్ముముందు
    పేదవడిన సురలలో గుబేరుడొకడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చిన నైపుణ్యం మెచ్చదగినది. అభినందనలు.
      1. ‘కానుక యిచ్చిన...పోరునందు... రావణుం డా యసురదురాక్రమణ...’ అనండి.
      3. ‘కులుకుచుంద్రు’ అనండి.

      తొలగించండి
  4. విజయ మాల్య నేపధ్యం లో :)

    వడ్డి కాసుల బతుకును వరము పొందె
    పేదవడిన సురలలో కుబేరుడొకడు
    వడ్డి, కాసుల నెగగొట్ట వరము పొందె
    పేద వడిన నరులలోన పెద్ద మాల్య

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    2. ఆర్య!చక్కగబలికితిరయ్య!యిటుల పేదవడినసురలలోకుబేరుడొకడు తెలిసికొంటినియీరోజుతెలియరాని నిజమునొకదానినినిపుడునెమ్మనమున

      తొలగించండి
    3. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నిజము నొకదాని నిప్పుడు’ అనండి.

      తొలగించండి
  5. రావణాసురుచే రవి రశ్మి హీను
    డయ్యె ననిలానలుల శక్తి యణగె నట్ల
    పుష్పక విమానముం గోలుపోయి దివిని
    బేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { బాకి అడిగి న౦దుకు తిరుపతి వె౦కన్న కుబేరున్ని income tax. వారికి పట్టి౦చి
    పాప మాతనిని పేదవానిగా చేశాడు. అయినా
    కుబేరునికి శాస్తి జరుగ వలసినదే ! }
    .......................................................ి

    పె౦డ్లి కని బాకి గొనియు కుబేరు చె౦త „

    కాల్ మనీ వచ్చె నని పలుకక. కదలక. „

    వడ్డి కట్టుట నెగవేసె ---వాట మిదియె >

    న౦చు వె౦కన్న | యిమ్మను చడిగి న౦త =

    పాప మాదాయపున్ బన్ను వారి నతని

    పైకి నుసిగొల్పి > యాస్తిని పట్టి యిచ్చె |

    పేద వడిన సురలలో కుబేరు డొకడు ! !

    * * * * * * * * * * * * * * * *

    స౦తసి౦చితి - జరిగెను శాస్తి నీకు |

    ధనదు డను నామధేయము తగదు నీకు |

    సిరుల నిచ్చెద వవినీతి పరుల కెపుడు |

    పేద వారి ను౦చెద వెప్డు పే ద లు గ నె !

    * * * * * * * * * * * * * * *

    రిప్లయితొలగించండి
  7. ఏడు కొండల శ్రీ వేంక టేశు డొకడు
    పేదవడిన సురలలోఁ, గుబేరుఁ డొకఁడు
    వడ్డి కిచ్చెను డబ్బు నా ప్రభువునకును
    భక్త జనులిచ్చు కాన్కలు పసిడి నగల
    నిచ్చు చున్నను దీరలే దింక ఋణము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఘోర దుర్బుద్ధి ప్రేరిత కూళ యగుచు
    రావణుండు హరించెను రమ్య రథము
    పుష్పకంబను దానిని పోరు సల్పి
    పేద వడిన సురలలొ కుబేరుడొకడు

    రిప్లయితొలగించండి
  9. సంఘమెప్పుడు వెలివేయు సాటి వాని?
    ఇంద్రుడయ్యెను రాజుగా నెవరిలోన ?
    సిరుల వాడని పేరున్న శ్రేష్టుడెవడు ?
    పేద వడిన - సురలలో - గుబేరుడొకడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. చావు లేదని తెలిసిన రావణుండు ,
    దండయాత్రలు జేయంగ దలచి తాను
    సకల దేవతలను గెల్చె సౌర్య మొప్ప,
    పేదవడిన సురలలోఁ, గుబేరుఁ డొకఁడు.

    రిప్లయితొలగించండి
  11. మాన్యులు శంకరయ్య గారికి . నిన్నటి పద్యం స్వేకరింప గోరుచున్నాను .

    తుంటరి కవియొక సభలో
    మెంటలు గావాగునట్టి మిత్రుని గనుచున్
    వింటే వినవలె నీ సొద
    కం - టెల్మీ- గాడ్ది గుడ్డు కంకర పీచూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. అతడు ధనదుండె యగుగాక అయిననేమి ?
    యక్షుఁ శపియించె క్రోధాగ్నినార్పలేక
    నిగ్రహంబను శక్తితో నిలువరించ
    పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      బహుకాల దర్శనం. సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. తాను ఈశానునకు మిత్రు డైనగాని,
    పైడిరేడని పేరున్నవాడు,గాని
    పుష్పకము లంకపట్టణమ్మును త్యజించి
    పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. .నామకరణంబు జేసిన నాటినుండి
    ఆకు బేరుడనగ? ధన మందునిధియె|
    రావణాసుర ధాటికి సేవకుడిగ
    పేదవడి నసురలలో గుబేరుడొకడు|
    2.శివుని యాజ్ఞయు లేకున్న భవితలేదు|
    భవితకాధారమౌ శివభావరూపు
    పేదవడినసురలలోగుబేరు డొకడు
    సకలసంపద లొదిగిన సంతసపడు.

    రిప్లయితొలగించండి
  15. సోదరునకు వంచన జేసి సురల గెల్చి
    అట్టహాసము తోడ నవని నేలె
    వాని ధాటికి భయపడి పారిపోయె
    పేదవడిన సురలలో గుబేరుడొకడు.
    2.పంక్తికంఠుడపుడు జూపి రాజసమ్ము
    దోచుకొనియెను తానట దుష్ట తనము
    తోడ సోదరుండదురుచు తొలగి పోయె
    పేదవతిన సురలలో గుబేరుడొకడు.

    3.సిరిరహితుడైనయట్టి యాశ్రీని వాసు
    నకు యొసగుచు ధనమును తానయ్యె పేద
    కలియుగాంతమువరకును కాసు రాక
    పేదవడిన సురలలో గుబేరుడొకడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవపాదంలో గణదోషం. ‘తోడ తా నవని నేలె’ అనండి.
      రెండవ పూరణలో ‘పేదపడిన’ టైపాటువల్ల ‘పేదవతిన’ అయింది.

      తొలగించండి
  16. ఎంత వడ్డీని గట్టినా సుంత యైన
    నసలు దీర్చని తిరుమల నాధు కతన
    పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు,
    మూల ధనమది రాదని మూల్గు చుండె.

    రిప్లయితొలగించండి
  17. పైకమేదియు లేకను పద్మనంద
    పేదవడిన, సురలలో కుబేరుఁ డొకడు
    వేంకట పతికి యప్పిచ్చి పిండ వడ్డి
    వడ్డికాసుల వాడౌచు ప్రజలఁ గాచె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. మీదబడి యప్పులిమ్మని మ్రింగి మ్రింగి
    తీర్చవలయు సమయమున తిండికూడ
    లేదురనని లండను పార బీదవాడు ,...
    పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు :)

    రిప్లయితొలగించండి