15, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1973 (కం టెల్ మీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.
(మా బాల్యమిత్రుడు సుదర్శన్ బలవంతంమీద ఈ సమస్యను ఇవ్వవలసి వచ్చింది. మన్నించండి)

56 కామెంట్‌లు:

 1. ఇంటర్ చదివిన నన్నే
  యింటెలి జెంట్ ప్రశ్న లడిగి యిరికించెదవా
  తంటరి మెంటలు వాడా
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తుంటరి’ టైపాటు వల్ల ‘తంటరి’ అయినట్టుంది.

   తొలగించండి
 2. జంటన మిత్రుని కోరిక
  గంటన ఇచ్చితి సమస్య గాభర పడుచున్
  వెంటనె పూరింతురుగద
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ :)

  మీ మిత్రుడికి జిలేబి నమస్సులు :)

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. వింటిని యిపుడే సంగతి
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ
  వెంటనె తెలిపెద జూడుము
  వింటివె మనగాడ్ దీగుడ్ కాంకర్ దీపీస్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదంలో ‘దీగుడ్’ అని గగం వేశారు. అక్కడ జగణం రావాలి కదా!

   తొలగించండి
  2. వింటిని యిపుడే సంగతి
   కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ
   వెంటనె తెలిపెద జూడుము
   వింటివె మనగాడ్ దిగుడ్ కాంకర్ దీపీస్

   తొలగించండి
 4. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారం

  1.
  మెంటల్ యాంటికి నేర్పితి
  తుంటరి మాటలను కొన్ని తొందర పెట్టన్
  సెంటే మెసేజు, యూ వెల్
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచు.

  2.
  చింటూ వేరార్యూరా!
  ఆంటీ హాజ్ కేమ్ వెరీజ్ ద యంకుల్ ప్లీజ
  ర్జంటుగ కాల్హిమ్ యూ వెల్
  కం టెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ.

  3.
  తుంటరి తనమేలర నీ
  కొంటెతనమ్మును భరించు కోమలి యెవరో?
  మెంటల్ ది పిచ్చి మాలో
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. ఇంటెలి జెంటుర గూగుల్
  వింటిని వోలెన్ అడిగిన వెంటనె జెప్పెన్
  యింటనె పూరణ జేసితి
  కం టెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది.
   ‘వింటిని వెడలు శరమువలె వెంటనె జెప్పెన్’ అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 6. 'తింటే తినాలి గారెల్,
  వింటే మా భారతమ్ము వినుడీ'అంటే
  'ఏంటీ టెల్గూ న్యూసన్స్,
  కం,టెల్ మీ, గాడ్ది గుడ్డు కంకర పీచూ'

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. ఏంటీ తెలుగు పదాల్తో
  తంటాలై మెంటలవుతు తత్తర పడ్తూ
  ఉంటే ఇంగ్లీషోటా?
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ.

  రిప్లయితొలగించండి
 8. ఇంటెలిజెంట్ జెంటును మరి
  మెంటల్ నాకేమిలేదు మీ టేబులుపై
  కంటిని చెప్పితి తప్పా
  కం,టెల్ మీ, గాడ్ దిగుడ్డు, కంకర, పీచూ !

  రిప్లయితొలగించండి

 9. ఉంటిమిభారతభూమిని
  మెంటలుమనకుండదార్య!మెదడున్నకునున్
  వింటిమె?సమస్యయీయది
  కంటెల్ మీగాడ్దిగుడ్డుకంకరపీచూ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘మెదడున్నకునున్’...? ‘మెద డున్న కతన్’ అందామా?

   తొలగించండి
 10. కాచితి వట పందెముల
  ప్రాచీనపు పనులు సేయ రచ్చలు రావే
  దాచిన దాగునె కోతలు
  రా చెపు నాకిట ఖరాండ రాతిని పీచూ
  [కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ, సమస్య అనువాదం బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. వింటిరె రామాయణమును?
  కంటిరె గ్రేట్భారతమును? ఘనమౌ సారం
  బంటును వినినను గనినను !
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ!!!

  మంటల్ బెట్టిన హనుమయు
  వంటల్ వండిన వలలుడు భారతి ఘనమౌ
  పంటల్ జెంటిల్మేనులు
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ!

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్సులు.
  మా మిత్రుని బలవంతాన ఈ సమస్యను ఇచ్చానని చెప్పాను కదా! ఆ మిత్రుడు సమస్యనిస్తూ ‘పూరణ పద్యాల్లో ఛందో దోషాలను పట్టించుకో కాని అన్యదేశ్య, గ్రామ్య పదాల ప్రయోగాలను తప్పు పట్టకు. ఇచ్చిన సమస్యే అటువంటిది కదా’ అన్నాడు.
  ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు ‘పూరణలను చూస్తున్నాను. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. బాగున్నవి. కవులకు నా అభినందనలు, ధన్యవాదాలను తెలియజేయి’ అని.

  రిప్లయితొలగించండి
 13. 'తింటే తినాలి గారెల్,
  వింటే మా భారతమ్ము వినుడీ'అంటే
  'ఏంటీ టెల్గూ న్యూసన్స్,
  కం,టెల్ మీ, గాడ్ది గుడ్డు కంకర పీచూ'

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. ఎవరో చెప్పగ నిప్పుడు
  కంటెల్మీగాడిదగుడ్డు కంకర పీచూ
  అంటూ వింటినికదరా
  అంటే యేమిటొ దెలుపుచు నన్వయ పరుచుమ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంటీ చెప్పగా నిప్పుడు అంటె మొదటిపాదం స రిపోతుందేమో?

   తొలగించండి
  2. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదాన్ని అన్నపరెడ్డివారు సూచించినట్లు ‘ఆంటీ చెప్పగ నిప్పుడు’ అని సవరించండి.

   తొలగించండి
 15. . అమ్మతనకుమారుడు వంటింటఅన్నముతింటూముఖానికి,గొంతుకూఅంటినఅన్నం “కంటె “వలేనున్నది వాడియూహకు
  కంటె-గడిదగుడ్డా|అంటూనాపూరణ
  చంటీనీ కెందుకురా
  కంటెల్?మీగాడ్ది గుడ్డు,”కంకర పీచూ
  కంటించిన విధమే|నీ
  కంటిన అన్నంబు మెడకు హారమ|జెపుమా?” {కంటెల్=కంటహారము}

  రిప్లయితొలగించండి
 16. ఇచ్చిన పనిని చేయకుండా తలతిక్క ప్రశ్నలతో సతాయించే సబార్డినేట్స్ పై బాస్ మండిపాటు:

  వెంటనె మీపని జేయక
  తింటిరి నాతల మరింత! దెన్ యూ విల్బీ
  సెంటెల్స్ వేర్! హూ కాల్డ్యు టు
  కం,(&)టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఒంటరిగా మార్గమ్మున
  కంటబడినచిన్నదాన్ని కాటే సిన మా
  చం టాడమా య కుండే
  కం టెల్ మీ గా డ్దె గుడ్డు కంకరపీచూ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. వింటిన్ మిడిమిడి యాంగ్లము
  కం టెల్ మీ, గాడ్దిగుడ్డు కంకరపీచూ.
  తంటాల్ పడు గతి యెందుకు
  చంటీ! నీ మాతృ భాష సక్షమ మిలలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. 'కంటెలు ఆభరణమ్ములు
  కంటెలు పన్నగులు మాకు గౌరీ'యను ము
  క్కంటికనెను పార్వతి మీ
  కంటెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ
  కంటెల్ మీ గాడ్ ది గుడ్డు కంకర పీచూ
  కంకర్ర=శివ లింగ స్వరూపా,పీచూ=పిసినారీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. కాని ‘కంకర’ను ‘కంకర్ర’ అన్నారు. అయినా ‘కంకర్ర’ అంటే శివలింగస్వరూపా అనే అర్థం ఉందా?

   తొలగించండి
 20. మెంటల్ పీసీజ్ నెససరి,
  వాంటెడ్ డాక్టర్ టు క్యూర్ది వర్రీడ్ ఫెల్లో,
  ఇంటర్ వ్యూహిమ్ జుస్ట్ నౌ
  కం, టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.
  (God the good! Conquer peace!)

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  సరదా పూరణము:
  [ఏదియో యనుకొని మఱి యేదియో చెప్పునట్టి యాంగ్ల మాధ్యమ విద్య నభ్యసించు తెలుఁగు రాని విద్యార్థి తలతిక్క మాటలు!]

  ...చివర "ఈచూ" యను దాని యర్థము బోధ పడకున్నదనుకొని తల గోకికొనుట...

  ఇంటన్ కంకర తునుకల
  కంటెన్ సద్దైవ మిట్లు గాడ్ ది గుడ్డ్ ఐ
  యుంటన్ కంకర పీస్ "వెల్
  కం! టెల్ మీ! గాడ్ ది గుడ్, డు కాంకర్ అప్! ఈచూ???"

  రిప్లయితొలగించండి
 22. ఆంటీ యనగా వింటిని
  కంటెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ
  అంటే యేమిటి నాన్నా!
  వెంటనె మరి జెప్పు దాని వివరంబేమో!!!

  రిప్లయితొలగించండి
 23. ధన్యవాదాలండీ సవరిస్తాను.
  ఇంటర్వ్యూకని వెడలెను
  ఇంటరు చదివేటి పాప;యింగ్లీషంటే
  యేంటని యడుగగ పలికెను
  కంటెల్మీ గాడ్గిగుడ్డు కంకరపీచూ

  రిప్లయితొలగించండి
 24. క్రొత్త వంటలు చేయాలను కునే వాడితొ మరొకరు ఇద్దరి మాటలు

  1 వ వాడు....

  వంటలలో కొంగ్రొత్తవి
  వంటలు జేతున్ సరియగు వస్తువు లున్నన్

  2 వ వాడు
  అంటే సరిసరి యని వెల్
  కం టెల్ మీ

  1 వ వాడు
  గాడ్దిగుడ్డు కంకర పీచూ

  పద్యం
  వంటలలో కొంగ్రొత్తవి
  వంటలు జేతున్ సరియగు వస్తువు లున్న
  న్నంటే సరిసరి యని వెల్
  కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ

  రిప్లయితొలగించండి
 25. సం టెల్ యుగాడ్ది నీవే

  కంటే, జగతిని చిత్రము కదరా కన్నా! కంటే= బిడ్డల కనుట.

  అంటే తప్పా యేమిటి?

  కం టెల్ మీగాడ్ది గుడ్డుకంకర పీచూ!

  విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగుపండితులు ప్రొద్దుటూరు 7396564549

  రెండవ

  రిప్లయితొలగించండి
 26. డా. మూలె రామముని రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. పింటో బైబులు చదువ
  న్నొంటరిగా చర్చినందు నోరిమి తోడన్
  తుంటరిగా పలికెనిటుల: 👇
  "కం! టెల్ మీ! గాడ్ ది గుడ్! కాంకర్ పీసూ!"

  రిప్లయితొలగించండి