మీ రెండు పూరణలు బాగున్నవి. ‘భాను+ఇందు=భాన్విందు’ అని యణాదేశం వస్తుంది. ‘పున్నమి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పండితులును+అదియు=పండితులు నదియు’ అవుతుంది. ‘పండితవరు|లదియు...’ అనండి.
నమస్కారములు ఇబ్బంది పెట్టకూడదనీ మొన్న రాయలేదు.ఐనా విలను బుద్ధికదా ? ఏం చేస్త్తాం ? భూమి తిరగడం వల్లనేకదా మనకి రాత్రి పగలు ఏర్పడుతుందీ, మధ్యలో అప్పుడప్పుడు సూర్యుడికీ చంద్రుడికీ మధ్యన భూమి విలన్ లాఆడ్డం వచ్చేసరికి గ్రహణం వస్తుంది " అని చెప్పడం అదన్నమాట అసల్ సంగతి .
కవిమిత్రులకు నమస్కృతులు. నా నడుము నొప్పి మరింత ఎక్కువయింది. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. మరికొద్ది రోజులు మీ పూరణల నిశిత పరిశీలన చేయలేను. ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. మన్నించండి.
గురువర్యులకు నమస్సులు.నాలుగురోజులు ఫిజయో థెరపి చేయించుకుంటే మీ వె న్ను నొప్పి తగ్గుతుంది. వరంగల్లులో ఎ వరన్నా ఉన్నారా ఫిజియోథెరపిస్టు. హై దరా బాదు లో మా ఎన్ ఆర్ ఐ సంస్థ ఉచితంగా చేస్తుంది.
గురువు గారికి నమస్కారములు మీ ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోగలరని మనవి
రిప్లయితొలగించండిపున్నమి దివసమ్ముల యందు పుడమి తాను
చిత్రభానిందుల నడుమ జేరినంత
పట్టు గ్రహణమ్ము శశినమా వాస్యనాడు
రవిని, విదుడు మధ్యనజేర భువికి హరికి.
భుజగుడే కృద్ధుడై వచ్చి పున్నమందు
పట్టు గ్రహణమ్ము శశినమావాస్య నాడు
భానుననుచును తెలిపిరే పండితులును
అదియు కల్లలే ననుచుండ్రి యాధునికులు
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండి‘భాను+ఇందు=భాన్విందు’ అని యణాదేశం వస్తుంది.
‘పున్నమి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పండితులును+అదియు=పండితులు నదియు’ అవుతుంది. ‘పండితవరు|లదియు...’ అనండి.
గురువు గారికి నమస్కారములు మీ ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోగలరని మనవి
రిప్లయితొలగించండిపున్నమి దివసమ్ముల యందు పుడమి తాను
చిత్రభానిందుల నడుమ జేరినంత
పట్టు గ్రహణమ్ము శశినమా వాస్యనాడు
రవిని, విదుడు మధ్యనజేర భువికి హరికి.
భుజగుడే కృద్ధుడై వచ్చి పున్నమందు
పట్టు గ్రహణమ్ము శశినమావాస్య నాడు
భానుననుచును తెలిపిరే పండితులును
అదియు కల్లలే ననుచుండ్రి యాధునికులు
కంటికి గనబడిన వేళ కట్ట వచ్చు,
రిప్లయితొలగించండికొట్ట వచ్చును ప్రక్కకు నెట్ట వచ్చు
కంటికి గనరాకుండిన కదిలి యెటుల
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాఁడు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివసుధ దిరుగగ నేర్పడు పగలు రేయి
రిప్లయితొలగించండియినుని చంద్రుని నడుమకు విలను వలెను
ధరణి ఏతెంచు గావున వరమ టంచు
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్య నాడు
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం అర్థం కాక ‘విలను’లా ఇబ్బందిపడుతున్నది.
నమస్కారములు
తొలగించండిఇబ్బంది పెట్టకూడదనీ మొన్న రాయలేదు.ఐనా విలను బుద్ధికదా ? ఏం చేస్త్తాం ?
భూమి తిరగడం వల్లనేకదా మనకి రాత్రి పగలు ఏర్పడుతుందీ, మధ్యలో అప్పుడప్పుడు సూర్యుడికీ చంద్రుడికీ మధ్యన భూమి విలన్ లాఆడ్డం వచ్చేసరికి గ్రహణం వస్తుంది " అని చెప్పడం అదన్నమాట అసల్ సంగతి .
రిప్లయితొలగించండివినుమ పున్నమి రోజున విరివి గనగ
పట్టు గ్రహణమ్ము శశి, నమావాస్యనాఁడు
శశియు కనబడడు నిదియె సత్య మనగ
శంకరాభరణ జిలేబి సాగ దీత ! :)
సావేజిత
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాహు కేతువు లిద్దరు రవిని శశిని
రిప్లయితొలగించండిమచ్చరీడులై మ్రింగగ వచ్చు నపుడు
పట్టు గ్రహణమ్ము.శశి నమావాస్య నాడు
గట్టి యత్నము జేసినా, పట్టలేరు
మీ పూరణ బాగున్నా చివర అన్వయలోపం ఉన్నట్టు అనుమానం.
తొలగించండిగురుదేవులకువందనములురాహుకేతువులుఈర్ష్యతో రవిని ,శశిని గ్రహణమునాడు మింగడానికివచ్చినా ఎంత ప్రయత్నించినా శశిని అమావాస్యనాడు పట్టలేరు.ఇందులో ఆనుమానము లేదు
తొలగించండిగురుదేవులకువందనములురాహుకేతువులుఈర్ష్యతో రవిని ,శశిని గ్రహణమునాడు మింగడానికివచ్చినా ఎంత ప్రయత్నించినా శశిని అమావాస్యనాడు పట్టలేరు.ఇందులో ఆనుమానము లేదు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రున్ని రాహువు పట్టుకొనుటవలన చంద్ర విహీనమై యా రోజమావాస్యలా కన్పించింది.
తొలగించండిపట్టు వదలక మదిని నెప్పట్టు నైన
పట్ట వలెనని రాహువు పట్టె నత్రి
పట్టిని నుడువ నలవియే యట్టి గట్టి
పట్టు గ్రహణమ్ముశశిన మావాస్య నాఁడు.
[అమావాస్య నాడు = నాడమావాస్యయే]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూర్యచంద్రుల మధ్యన చుట్టుదిరుగు
రిప్లయితొలగించండిసుందరంపు భూగ్రహమని సూక్ష్మబుద్ధి
శాస్త్రవేత్తలు శోధించ, సఖుడ! యేల
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాడు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్టు గ్రహణ మ్ము శశి నమా వాస్యనాడు
రిప్లయితొలగించండిననుట సరి కాదు పట్టును నర్కుని నమవసన
పూర్ణిమ దినమున గ్రహణము బూర్తి గాను
శశిని బట్టును నొకసారి సాలునకట
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘సాలునకట’...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశుభ్ర కాంతులు విరియుచున్ సొబగు లీను
రిప్లయితొలగించండిపండు వెన్నెల కురిసెడు పౌర్ణమందు
పట్టు గ్రహణమ్ము శశి నమా వాస్య నాడ
మరిన చందమ్ము నిశిని తామసియె జేరు.
మీ మూడవ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండి{చంద్రుని ప్రకాశము సూర్యునివలెనే |ఆకాంతినిఅమావాస్యరోజు చంద్రుని కందక
రిప్లయితొలగించండిజేయుటవలన అమావాస్యరోజు సూర్యునిగ్రహణమేగద?చంద్రుడికి
సూర్య వెలుగులు చంద్రుని శోకినపుడు
దర్పణంబుగ కిరణాలు ధరను జేరు|
గ్రహణమేగద సూర్యుని కాంతిలేక
పట్టు గ్రహణమ్ము శశి నమవాస్య నాడు|
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘సూర్యవెలుగులు’ అని సమాసం చేయరాదు. ‘సూర్యకాంతులు చంద్రుని సోకినపుడు’ అనండి.
పండు వెన్నెల కురిసెడు పౌర్ణమందు
రిప్లయితొలగించండిపట్టు గ్రహణమ్ము శశినమవాస్యనాడు
రవిని కబళించు చుండును రాహుమిత్రు
డైన కేతువు మదినున్న యాగ్రహాన
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘పౌర్ణమి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది.
.నేటి గ్రహణమ్ము చాటులే చాటుగాను
రిప్లయితొలగించండిసూర్య గ్రహణమ్ము యనివిన్న?చూడలేని
నిజముగమనించ?భూమికి,ఋజువుగాను
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాడు {సంపూర్ణ సూర్య గ్రహణమున్న సూర్యునికాంతి,చంద్రుని కాంతిభూమికాంతియు సన్నగిల్లగ?అదిసూర్య,చంద్ర,భూమికివర్తించి నటులేగద?}
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనుచు చీకటి రాత్రిని చెనటి బలికె
రిప్లయితొలగించండినాగ్రాహమ్మున గ్రహములె యాక్రమింప
పట్టు గ్రహణమ్ము శశి , నమావాస్యనాఁడు
కాక , ప్రతిరాత్రి తేజస్వి కనగరాడు
పూర్ణిమను రాహు కేతువుల్ పూన కక్ష
పట్టు గ్రహణమ్ము శశి, నమావాస్యనాఁడు
పట్టు నటులనే గ్రహణము భాస్కరునకు
సూర్య చంద్రుల మ్రింగగ చూతురు గద !
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగ్రహణ వేళల నింగిని రవిని శశినిఁ
రిప్లయితొలగించండిగనము పాక్షిక,సంపూర్ణ గతుల మనము
మాసమునకొక రాత్రంత మార్పులేక
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాడు!
గ్రహణ వేళల నింగిని రవిని శశినిఁ
రిప్లయితొలగించండిగనము పాక్షిక,సంపూర్ణ గతుల మనము
మాసమునకొక రాత్రంత మార్పులేక
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎరగొనగ రాహు వాదిత్యు నేమి యగును?
రిప్లయితొలగించండిరాహుకేతువుల్ కబళింత్రు రాక నెవని?
భాస్కరుడు గ్రస్తుడగు నెప్డు? వరుసగాను
పట్టు గ్రహణమ్ము, శశి, నమావాస్యనాఁడు.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినా నడుము నొప్పి మరింత ఎక్కువయింది. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. మరికొద్ది రోజులు మీ పూరణల నిశిత పరిశీలన చేయలేను. ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. మన్నించండి.
పండు వెన్నెల కురిసెడు పౌర్ణమితిథిఁ
రిప్లయితొలగించండిఅంటే సరిపోతుందా అన్నయ్యగారూ
గురువర్యులకు నమస్సులు.నాలుగురోజులు ఫిజయో థెరపి చేయించుకుంటే మీ వె న్ను నొప్పి తగ్గుతుంది. వరంగల్లులో ఎ వరన్నా ఉన్నారా ఫిజియోథెరపిస్టు. హై దరా బాదు లో మా ఎన్ ఆర్ ఐ సంస్థ ఉచితంగా చేస్తుంది.
రిప్లయితొలగించండిపట్టుకొని యభిమన్యుని గట్టిగాను
రిప్లయితొలగించండిపండు వెన్నెల రాత్రిని పాట పాడి
పడవ యాత్రల తిరుగుట పడక పోగ...
పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాఁడు