25, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1983 (జనకునకున్ సుతుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ.

33 కామెంట్‌లు:

 1. గురువుగారికి కవిమిత్రులకు నమస్కారములు


  ఘనమగు కీర్తి దెచ్చునది కల్పము నందున సత్యవర్తుడై
  వినయము గల్గి యుండుటయు పెద్దల యందున, భక్తి శ్రద్ధతో
  జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట, పాప కృత్యమౌ
  ఖననము జేసి ధర్మమును కాంతల కాసుల పొందగోరుటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘సత్యవర్తియై’ అనవలసి ఉంటుందేమో?

   తొలగించండి
  2. ధన్యవాదములండీ....సవరించిన పద్యము


   ఘనమగు కీర్తి దెచ్చునది కల్పము నందున సత్యవర్తియై
   వినయము గల్గి యుండుటయు పెద్దల యందున, భక్తి శ్రద్ధతో 
   జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట, పాప కృత్యమౌ 
   ఖననము జేసి ధర్మమును కాంతల కాసుల పొందగోరుటన్ 


   తొలగించండి
 2. జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
  ననుచు తలంప గాజనులు నాగరి కంబున తేలియాడుచున్
  వినయము లేకయాధునిక వేకర మందున మేలమాడగా
  మనమున తల్లిదండ్రులకు మానని గాయము జేయు చుందురే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   ‘ఆధునిక వేకరము’ అని సమాసం చేయరాదు కదా! ‘క్రొత్తనగు వేకర మందున’ అనండి.

   తొలగించండి
  2. జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
   ననుచు తలంప గాజనులు నాగరి కంబున తేలియాడుచున్
   వినయము లేకక్రొత్తనగు వేకర మందున మేలమాడగా
   మనమున తల్లిదండ్రులకు మానని గాయము జేయు చుందురే

   తొలగించండి
 3. మనసనదేమిలేక మదమత్సరమూని నిషా విలోలుడై
  తనసుతయైన తగ్గకను తప్పుడు దోవను కామవర్తుడై
  జన సమకట్టునట్టియొక జారుడునాతని తండ్రిగాగనా
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘నిషావిలోలుడై’ అని సమాసం చేయరాదు. ‘మత్సర మూనియు మత్తచిత్తుడై’ అందామా? అలాగే ‘కామవర్తియై’ అనండి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. ధన్యవాదాలు గురువుగారూ...
   మనసనదేమిలేక మదమత్సరమూనియు మత్తచిత్తుడై
   తనసుతయైన తగ్గకను తప్పుడు దోవను కామవర్తియై
   జన సమకట్టునట్టియొక జారుడునాతని తండ్రిగాగనా
   జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ

   తొలగించండి
 4. తనయులు సర్వసంపదలఁ దాలిచి నిత్యము సంతసించ, యా
  తనల, పరాభవమ్ముల సదా భరియించుచుఁ గూడఁబెట్టగన్
  'జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాపకృత్యమౌ'
  యనెడు తలంపునన్ సుతులు నాశ్రమమందున జేర్చఁ బాడియే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘కృత్యమౌ| ననెడు...’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
   తనయులు సర్వసంపదలఁ దాలిచి నిత్యము సంతసించ, యా
   తనల, పరాభవమ్ముల సదా భరియించుచుఁ గూడఁబెట్టగన్
   'జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాపకృత్యమౌ'
   ననెడు తలంపునన్ సుతులు నాశ్రమమందున జేర్చఁ బాడియే?

   తొలగించండి
 5. జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాప కృత్యమౌ
  నననవివేకమే ఘనదయాగుణసంయుత తప్త చిత్తులై
  యనిశమునాత్మ సౌఖ్యములనాశలనుంచక కష్ట జీవులై
  తనయులనుద్ధరింతురిల తల్లియుదండ్రియు పూజనీయులే
  పైపద్యము పోచిరాజు కామేశ్వరరావు గారు వ్రాసినది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. జనకునకున్ సుతుండు పరిచర్య లొ నర్చుట పాప కృత్యమౌ
  యనుచు మదిన్ దలంచుట యనాగ రికంబగు భావననే యగున్
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పుణ్య కార్యమే
  యనునది నాయభీ ష్ట మ ,వినంగ దలంచితె యార్య !మంచిగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘కృత్యమౌ|ననుచు... భావమే యగు’ అనండి.

   తొలగించండి
 7. జనకుడు ధూర్తుడైన మరి జారుడు చోరుడు నైన తాల్మితో
  ననయము సేవ జేయదగు నాతని వార్ధకమందు నేరికిన్,
  వినుమిది పాడిగా దతని వెన్కటి చేష్టల నెంచి "మానుటల్
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట", పాపకృత్యమౌ.

  రిప్లయితొలగించండి
 8. అనయము కట్టెలో రగులు నగ్ని దహించును దానినే కదా?
  చెనటిని వాని కర్మములె చేర్చును దుర్గతి, నీకు ధర్మమే
  తనయుడ! వీడ ధూర్తుడని తండ్రిని? వృద్ధుని? "మానజూచుటల్
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట", పాపకృత్యమౌ.

  రిప్లయితొలగించండి
 9. తనయుడు ధూర్తుడైన మరి తండ్రి తలంచునె వీడ వాని? నీ
  జనకుని దుష్టుగా దలచి జాలిని చూపక వార్ధకమ్మునన్
  వినుమిటు, వీడబోకుము, వివేకివి, ధర్మము దప్పి "మానగా
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట", పాపకృత్యమౌ

  రిప్లయితొలగించండి
 10. అనువగు విద్యనేర్పి కడియన్నమునైనను తాగ్రహించకన్
  తనయునికై శ్రమించి కడు త్యాగమొనర్చగ, పాడియౌగదా
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట; పాపకృత్యమౌ,
  మనుగడకైన నొక్కకడి మాత్రము బెట్టక మ్రందజేసినన్

  రిప్లయితొలగించండి
 11. అనవరతంబు-నాయువునె నందగ జేసెడి బ్రహ్మనాన్న|నీ
  తినగల తిండి,బట్టలను తీరికయందున గూర్చువిష్ణువే|
  “జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాప కృత్య మౌ
  యనగల మాట తీరు విన?ఆశివు డొప్పున?శిక్ష వేయకన్?”
  2.దినములు వత్సరంబులును తీరిచి దిద్దుచు నిన్ను బెంచగా?
  “జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుటపాపకృత్యమౌ
  అనుట సమంజసంబె?మరియాదల మంటప మందు నుంచినా?
  కనబడు కాంత సౌఖ్యమున-కళ్ళకు తండ్రియుగానుపించడా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   ‘కృత్యమౌ| ననగల మాట...’, ‘కృత్యమౌ| ననుట సమంజసంబె’ అనండి.

   తొలగించండి
 12. తనయుని బుద్ధి మంతునిగ తండ్రియె పెంచును గొప్పవిద్యలన్
  ఘనముగ నభ్యసించుటకు కారణ కారకు డౌను కాని యా
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
  నని మదిలో దలంచు కుజ నాత్ముడు పుట్టిన గిట్టినట్టులే .

  రిప్లయితొలగించండి
 13. అనవరతమ్ము ప్రాణసము నారడి పెట్టి చెలంగు దుష్టుడౌ
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాప కృత్యమౌ
  అనురతితోడుతన్ సతము నాదరణమ్ము జూపి పెంచినన్
  మనుజులపైన నెట్టి దయ మండలి జూపగ నేర్చు నెయ్యెడన్

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. "వినుముర! చాలు! నేనికను వెళ్ళెద స్వర్గము వీడుమో"యనన్,...
  "చనుమిక నాసుపత్రికిని చక్కగ నుండుము నైసియూ" ననన్...
  ఘనముగ నన్ని రంధ్రములు ఘట్టిగ మూయగ పైప్ల వైప్లతో
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ!

  "Don’t Torture The Dying"

  http://gpsastry.blogspot.com/2016/06/great-read-from-times-of-india.html?m=0

  రిప్లయితొలగించండి
 16. కొనగను కల్లు ముంతలను కొంచెము కూడను దుడ్డులేనిచో
  ఘనముగ రూకలివ్వకయె గాడిద వీవని తిట్లు తిట్టగా
  కనుగొని మారు మూలనొక గట్టిగ నుండెడి దుడ్డుకర్రతో
  జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ

  రిప్లయితొలగించండి