12, మార్చి 2016, శనివారం

‘రామకృష్ణ విలోమకావ్యమ్’ వ్యాఖ్యానము

‘ఆంధ్రామృతం’ బ్లాగులో 
‘రామకృష్ణ విలోమకావ్యమ్’ వ్యాఖ్యానము
          24-1-2012 రోజున శంకరాభరణం బ్లాగులో చమత్కార పద్యాలు - 181 శీర్షికలో సూర్యకవి రచించిన ‘రామకృష్ణ విలోమకావ్యమ్’ మూలపాఠం ఇచ్చాను. ఎందరో మిత్రులు అందలి చమత్కృతికి అబ్బురపడి వ్యాఖ్యానం ప్రకటించమని కోరారు. దానికి వ్యాఖ్యానం వ్రాయగలిగిన పాండిత్యం నాకు లేక, ఇంతకాలం ఎక్కడైనా లభిస్తుందేమో అని వెదికాను. 
      మన అదృష్టం శ్రీ చింతా రామకృష్ణారావు గారి రూపంలో సాక్షాత్కరించింది. వారెంతో శ్రమపడి మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘ద్విరసన’ పేరుతో ప్రకటించిన ఆంధ్రవ్యాఖ్యానాన్ని సేకరించి వారి ‘ఆంధ్రామృతం’ బ్లాగులో రోజుకొక శ్లోకం చొప్పున ఇస్తున్నాను. చిత్రకవిత్వాభిమానులు ఆ బ్లాగులో వాటిని చదివి, స్పందించి, వారికి ధన్యవాదాలు తెలుపవలసిందిగా మనవి. 

క్రింది లింకును క్లిక్ చేయండి.

11 కామెంట్‌లు:

  1. గురువులకు ప్రణామములు
    అవును శ్రీ చింతా రామకృష్ణా రావు గారి బ్లాగులో నేను చదివగలిగిన అదృష్టం కలిగింది .ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. నారికేళ పాకముగా గోచరించు మాబోంట్లకు చక్కగా విడమరిచి ప్రతి " పదార్థము " నందించుచున్న శ్రీ చింతా వారికి కడుంగడు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. రామకృష్ణవలనరామకృష్ణకధలు
    చదువవీలుగలిగెసామి!మాకు
    శంకరార్య!మీకుశతములకొలదిగా
    వందనంబులిడుదునందుకొనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రామృతం గ్రోలి, రసాస్వాదనపరులై తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన శ్రీమతి రాజేశ్వరక్కయ్యగారికి, శ్రీమాన్ గోలి హనుమచ్ఛాస్త్రిగారికి,మిత్రులు శ్రీమాన్ మిస్సన్నగారికి, రసరమ్య హృదయులు సుబ్బారావు గారికి, పండితకోటిని అసాధారణ గౌరవ పురస్కారాలతో ప్రజ్వలింపఁజేసే ప్రజాపత్రిక అధినేత శ్రీమాన్ సుదర్శన్ గారికి, అన్నిటికీ మించినిరంతర సాహితీ సేవా దురంధరులైన శ్రీమాన్ శంకరార్యులకు నా ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.

      తొలగించండి
  4. తనరెడి రామకృష్ణ కవితాసుధనొప్పు విలోమ కావ్యమున్
    మనముననెంచి శంకరయ మాన్యతఁ గొల్పఁగనుంచె బ్లాగునన్.
    ఘనతఁ గడించినట్టి కృతికన్యకలన్ గను సత్కవీశ్వరుల్
    మనములఁ బొంగు దీనిఁ గని. మాన్యులు శంకర మిత్రులీధరన్.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. ఆంధ్రామృతం గ్రోలి, రసాస్వాదనపరులై తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన శ్రీమతి రాజేశ్వరక్కయ్యగారికి, శ్రీమాన్ గోలి హనుమచ్ఛాస్త్రిగారికి,మిత్రులు శ్రీమాన్ మిస్సన్నగారికి, రసరమ్య హృదయులు సుబ్బారావు గారికి, పండితకోటిని అసాధారణ గౌరవ పురస్కారాలతో ప్రజ్వలింపఁజేసే ప్రజాపత్రిక అధినేత శ్రీమాన్ సుదర్శన్ గారికి, అన్నిటికీ మించినిరంతర సాహితీ సేవా దురంధరులైన శ్రీమాన్ శంకరార్యులకు నా ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.

      తొలగించండి
  6. ఆంధ్రామృతం గ్రోలి, రసాస్వాదనపరులై తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన శ్రీమతి రాజేశ్వరక్కయ్యగారికి, శ్రీమాన్ గోలి హనుమచ్ఛాస్త్రిగారికి,మిత్రులు శ్రీమాన్ మిస్సన్నగారికి, రసరమ్య హృదయులు సుబ్బారావు గారికి, పండితకోటిని అసాధారణ గౌరవ పురస్కారాలతో ప్రజ్వలింపఁజేసే ప్రజాపత్రిక అధినేత శ్రీమాన్ సుదర్శన్ గారికి, అన్నిటికీ మించినిరంతర సాహితీ సేవా దురంధరులైన శ్రీమాన్ శంకరార్యులకు నా ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి