2, మార్చి 2016, బుధవారం

సమస్య – 1960 (పెండ్లిలో వధూవరులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి!

41 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    బంధు జనులును పనివారు ఇందరుండ
    పెండ్లి లో వధూ వరులేల , పేరిశాస్త్రి
    మూటలన్ మోయుట దగను మోయి యిదియు
    పాటిగాదని తెలియదే పండితునకు.

    పెండ్లి లో వధూవరులేల పేరిశాస్త్రి
    కలత పడిరేల? పెట్టిరి కంటనీరు
    యేడ్చు చుండిరా? తెలియదా? యిదియె హవన
    కార్య మున వచ్చు పొగయేమొ కారణమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘పనివార లిందరుండ’ అనండి. ‘మోయి’...?
      వధూవరులేల... పడిరేల అని ‘ఏల’ పునరుక్తమయింది. ‘కంట నీరు|నేడ్చు..’ అనండి.

      తొలగించండి
  2. ప్రేమ విరిసెను సెల్లులో ప్రీతి గాను
    దండ మార్పిడి కోరిన తరుణ మందు
    మాట విరిగెను మిక్కిలి ఘాటు వెగటు
    పెండ్లిలో వధూవరు లేల పేరి శాస్త్రి

    రిప్లయితొలగించండి
  3. ఆహా ఏమి పెండ్లి జిలేబి !

    వెబ్ సయిటున జూసిరి వీరు వెంట జేరె
    ముదము, జేరెను మనములు, ముదురు బెండ
    ముదిత వనితయు పెండ్లివోయ్ ! మూర్తు లుండె
    పెండ్లిలో, వధూవరు లేల పేరి శాస్త్రి :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పెండ్లివోయ్’ అన్న ప్రయోగమే పానకంలో పుడకలా ఉంది.

      తొలగించండి


  4. పెండ్లిలోవధూవరులేలపేరిశాస్త్రి! యెడమొకముపెడమొకముగజూడబడిరి? కారణంబునుగనుగొనిగలుపుమయ్య! నీవుమధ్యవర్తిగనుండినీతిగరపి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని రెండవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
    2. 2వపాదము....
      .......పెడమొకముగనిప్పుడుండ్రి

      తొలగించండి
  5. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కట్న మివ్వ లేదను నొక కారణమున
    వరుని త౦డ్రి యెగిరె " వీరభద్రు " డనగ
    పీట పైను౦డి లేచెను పె౦డ్లి కొడుకు |
    అ౦దరు బయటికి వెడలి | రాగి నట్టి
    పె౦డ్లిలో వధూవరు లేల ? పేరిశాస్త్రి
    యేల. ? మేళతాలము యొక్క. గోల యేల. ?


    { మూడవ. పాదము వాక్యా౦త మయి న౦దున. నాల్గవ పాదము అచ్చు తో ప్రార౦భి౦చితి ని గురువర్యా ! }
    ి

    రిప్లయితొలగించండి
  6. రంజన సెడి యన్యోన్యాను రాగ సువిము
    ఖుల వలెనట మంగళవాద్య ఘోషణములు
    వఱలు చుండగ నతిఖిన్న వదను లైరి
    పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పెండ్లిలోవధూవరులేల పేరిశాస్త్రి
    కండ్ల కన్నీరు గార్చుచు కరము భీక
    రముగ నుండిరి? హోమ ధూమము వలననొ ? పరుల నికృష్ట నిర్బంధ పనుల వలనొ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘నిర్బంధ పనులు’ అని సమాసం చేయరాదు కదా! నికృష్ట అన్నచోట గణభంగం. కృ వల్ల ని గురువు కాదు.

      తొలగించండి
  8. పెళ్లి జరిపించే పేరిశాస్త్రులవారికి, పెళ్లికి వచ్చిన ఓ పెద్దమనిషికి మధ్య సంభాషణ(సరదాగ):

    పెద్దమనిషి: పువ్వులు విరబూసినటుల నవ్వుచుంద్రు
    పెండ్లిలో వధూవరులేల పేరిశాస్త్రి?
    పేరిశాస్తి: పెళ్లి తదపరి వాడెడు విధముఁ దెలిసి
    యిపుడు నవ్విన మీకేల నీర్ష్య కలిగె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      పద్యాలవరకు సలక్షణంగా ఉన్నాయి. కాని సమస్య సంతృప్తికరంగా పరిష్కరింపలేదు.

      తొలగించండి
    2. గురుదేవులు మన్నించాలి దేవుని కళ్యానికి వధువుతోకూడిన వరుడు చాలునని నాభావన

      తొలగించండి
  11. పనుల జేయను పదుగురు వ్యక్తులుండ
    పెండ్లిలో , వధూవరులేల పేరిశాస్త్రి
    చక్కగా నియోగించుము సత్వరముగ
    నన్ని కా ర్యములను జేయ నున్నతముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి
      మసలుకొందురు చిరునవ్వు విసురుకొంటు?
      ప్రేమ లేమౌను గనరావు పెళ్లి పిదప?
      తెలియ చేసిన మనసులు తేలికౌను !!!

      తొలగించండి
    3. మంద పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘విసురుకొనుచు... తేలిక యగు’ అనండి.

      తొలగించండి
  12. . ఇవ్వవలసిన కట్నంబు లివ్వకున్న
    పెండ్లిలో వధూవరు లేల?పేరిశాస్త్రి
    శోభనివ్వదు|జరుగదు శోభనంబు
    డబ్బు లేకున్న దర్పమ్ము దండుగేగ?
    2.అన్న,చెల్లియు,పెళ్ళిళ్ళు-కన్నతండ్రి
    నొకరి తర్వాత నొకరికిసకలురందు
    పెల్లిజేయగ?నొకజంట వేరుబడి-అ
    రుందతీ దర్శ నంబున ముందుగలరు
    పెండ్లిలో వధూ వరులేల?పెరి శాస్త్రి
    జరుగు పెళ్లికి వారేల మరలమరల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మొదటి పూరణ బాగున్నది. రెండవ పూరణ అర్థం కాలేదు.

      తొలగించండి
  13. తారలను గాంచుచుందురు తప్పకుండ
    పెండ్లిలో, వధూవరు లేల పేరిశాస్త్రి ?
    పరమ సాధ్వియరుంధతి న్నరసి జూడ
    గలుగు సౌభాగ్య సంపదల్ గాన విధిగ
    జూచె దరని జెప్పెనతడు సున్నితముగ!!!

    రిప్లయితొలగించండి

  14. పెండ్లి లో వధూవరులేల పేరిశాస్త్రి
    కలత పడుచుండ్రి? పెట్టిరె కంటనీరు
    నేడ్చు చుండిరా? తెలియదా? యిదియె హవన
    కార్య మున వచ్చు పొగగదా! కారణమ్ము

    రిప్లయితొలగించండి
  15. సంతకములిడ చాలును షరతుల కిక
    పెండ్లిలో వధూవరు లేల? పేరిశాస్త్రి!
    పరిణయమ్ముకు సాక్ష్యమే పదిలముగద
    యనుచు బల్కి పురోహిత నంపి రొకచొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పరిణయమ్ముకు’ అనరాదు. ‘పరిణయమునకు’ అనండి. ‘పురోహితు నంపి..’ అనాలనుకుంటాను.

      తొలగించండి
  16. పెండ్లియా చూడ ఉత్తుత్తి పెండ్లి యాయె
    వాద్యమా కన పృష్ఠ వాయిద్యమాయె
    పెండ్లి తంతిట్టి శోభల వెల్గుచుండ
    పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి?

    రిప్లయితొలగించండి

  17. పెండ్లిలోవధూవరులేల పేరి శాస్త్రి
    పెండ్లి పటముల యందున పేర్మిలేక
    చిరునగవులేక మొగములు చిన్నవోయి
    నట్లు యగుపించుచున్నారు యలిగి నట్లు.

    పెండ్లిలో వధూవరులేల పేరిశాస్త్రి
    మెగము వగపుతోడను చాల ముడుచుకనియె
    లాజ హోమపు పొగల వలనన లేక
    నన్యకారణంబో దెల్పు మయ్య శాస్త్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణ చివరిపాదాన్ని ‘...నట్టు లగుపించుచున్నార లలిగినట్లు’ అనండి.
      రెండవపూరణలో ‘ముడుచుకొనియె’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి

  18. పెండ్లి లో వధూవరులేల పేరిశాస్త్రి
    కలత పడుచుండ్రి? పెట్టిరే కంటనీరు
    యేడ్చు చుండిరా? తెలియదా? యిదియె హవన
    కార్య మున వచ్చు పొగగదా? కారణమ్ము

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్యగారికి నమస్సులు. పొరబాటుకు క్షంతవ్యుడను.
    --------------""--------------
    చివరిపాదం.
    పరులుజేసెడి కొఱగాని పనులవలనొ? సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్యగారికి నమస్సులు. పొరబాటుకు క్షంతవ్యుడను.
    --------------""--------------
    చివరిపాదం.
    పరులుజేసెడి కొఱగాని పనులవలనొ? సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  21. అబ్బురము చిన్న వయసున నాట పాట!
    చిలిపి చేష్టగ నెండను చినుకు లొదవ
    కూరిమిని పాడు పాటల కుక్క నక్క
    పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి!

    రిప్లయితొలగించండి