ఆంజనేయ శర్మ గారూ, ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నడుమునొప్పి తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తున్నది. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబీ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ‘సొమ్ములు పోనాయ్’ అని రావిశాస్త్రి గారిని గుర్తు చేశారు. కాని అది మాండలికం కదా! ‘సొమ్ములు పోయెన్’ అనండి. ‘వలదు+ఇక’ అన్నపుడు యడాగమం రాదు. ‘వల దింక’ అనండి. ఇక్కడ ‘దళము’ను ఏ అర్థంలో ప్రయోగించారు?
కొరుప్రోలు రాధా కృష్ణ రావు గారు నమస్కారములు. మీ పూరణ చాలా బాగుంది. “ దైవం” వ్యావహారిక పదము. సరియైన పదము దైవము. ఈ పాదము లో గణ, యతి దోషములు కూడా యున్నవి. “నిలిచెను యందొక్క తులసి నిజదైవమిలన్” అనవచ్చును. [నిజ = శాశ్వతమైన] “గంజాయు లనెను” అనండి.
కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. కామేశ్వర రావు గారి సూచనల మేరకు సవరించినందుకు సంతోషం. ‘నిలిచెను+అందొక్క’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిలిచిన దందొక్క’ అనండి. అలాగే ‘గంజాయి యనెను’ అనండి.
ఇప్పటివరకు చూసిన పూరణల్లో నాకు మీ పూరణ నచ్చిందండి. చక్కగా చేశారు. పూరణలను 1.పదాలను విరిచిగాని, లేక 2.ఇంకో అర్థాన్ని అన్వయిస్తూగానీ లేదా 3. సమాసాన్ని విడగొట్టిగాని చెబితేనే అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు రెండు పనులూ[2 మరియు3] చేశారు. రెండు- తులసి అంటే వ్యక్తిపేరును తీసుకున్నారు.మూడు- దళమును తులసి నుండి వేరు చేసి జిల్లేడుకు అతికించి భలేగా పూరణ చేశారు. ధన్యవాదాలు. ఇట్లు డా. బోలుగద్దె అనిల్ కుమార్ 9502568218
k.s gurumurthiacharigari puranam ఇద్దరు ముస్లిం యువతలుఅనుకొన్నమాటలు పలికెను సలీమతో యిటు వలిభీ హిందులకు మనము వ్యతిరేకము-గో ఫలల మమృత భక్షణమగు తులసీదళము మనకు విష తుల్యమ్ముగదా
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమీ ఆరోగ్యం యెలా వుంది? జాగ్రత్త పడగలరని నా విన్నపం
అవసాన దశలో వున్న వృద్ధుడి నోట మనవడిచే తులసితీర్థం పోయించిన క్షణమే తుదిశ్వాసవదిలిన తాతని చూసి పసివాడి యభిప్రాయముగా
తులసీ దళమును వేసిన
జలమును ద్రావించినంత చచ్చెను గాదే
తెలియక వేసిరి వీరలు
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నడుమునొప్పి తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తున్నది. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెలిసీ తెలియక పలికెను
రిప్లయితొలగించండితులసీదళము మనకు విషతుల్యమ్ము గదా !
తులసిని కొలిచిన వారికి
వలసిన శిరులిచ్చునట్టి వరలక్ష్మి యనన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘తెలిసియు...సిరులిచ్చునట్టి వరలక్ష్మి యగున్’ అనండి.
తెలిసీ తెలియక పలికెను
తొలగించండితులసీదళము మనకు విషతుల్యమ్ము గదా !
తులసిని కొలిచిన వారికి
తెలిసియు సిరులిచ్చు నట్టి వరలక్ష్మి యగున్
తెలిసియు తెలియని రచయిత
రిప్లయితొలగించండికలమున జనియుంచు క్షుద్ర కథనపు రచనల్
తలచిన మూర్కులఁ బెంచును
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!
ఓహొహో!!!
తొలగించండిభలే పూరణ అందించారు, ధన్యవాదములండీ
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
ఊకదంపుడు గారూ,
ధన్యవాదాలు.
అలసిన మనసున నిచటకు
రిప్లయితొలగించండిసొలసియు వచ్చితి , వెడలెద సొమ్ములు పోనాయ్
వలదు యిక సెటిలుమెంటును
తులసీ, దళము మనకు విషతుల్యమ్ము గదా
రిప్లయితొలగించండిఅలనాటి యండమూరిది
తులసీదళము! మనకు విషతుల్యమ్ము గదా
యిలలో నవలలు రచనలు !
తలపుల నైనను పొగడకు తలవకు వాటిన్ :)
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
‘సొమ్ములు పోనాయ్’ అని రావిశాస్త్రి గారిని గుర్తు చేశారు. కాని అది మాండలికం కదా! ‘సొమ్ములు పోయెన్’ అనండి. ‘వలదు+ఇక’ అన్నపుడు యడాగమం రాదు. ‘వల దింక’ అనండి. ఇక్కడ ‘దళము’ను ఏ అర్థంలో ప్రయోగించారు?
తొలగించండికంది వారు !
నెనర్లు ! కులాసాయే నా !
దళము దండు అన్న అర్థం లో వ్రాసాను ;
జిలేబి
కలదొక గంజాయి వనము ,
రిప్లయితొలగించండినిలిచెను యందొక తులసి ,నిరుపమ దైవం,
కలహపు గంజాయి లనెను
"తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా"
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు గారు నమస్కారములు. మీ పూరణ చాలా బాగుంది. “ దైవం” వ్యావహారిక పదము. సరియైన పదము దైవము. ఈ పాదము లో గణ, యతి దోషములు కూడా యున్నవి.
తొలగించండి“నిలిచెను యందొక్క తులసి నిజదైవమిలన్” అనవచ్చును. [నిజ = శాశ్వతమైన] “గంజాయు లనెను” అనండి.
కలదొక గంజాయి వనము
తొలగించండినిలిచెను యందొక్క తులసి నిజ దైవమిలన్ ,
కలహపు గంజాయు లనెను
"తులసీ దళము మనకు విష తుల్యము గదా"
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
శ్రీ పోచిరాజు గారికి నమస్కారములు
అమూల్య సూచనలు
తొలగించండికొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
కామేశ్వర రావు గారి సూచనల మేరకు సవరించినందుకు సంతోషం.
‘నిలిచెను+అందొక్క’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిలిచిన దందొక్క’ అనండి. అలాగే ‘గంజాయి యనెను’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికలదొక గంజాయి వనము
తొలగించండినిలిచిన దందొక్క తులసి నిజ దైవమిలన్ ,
కలహపు గంజాయి య నెను
"తులసీ దళము మనకు విష తుల్యము గదా"
అలపాలు గారుచున్నను
రిప్లయితొలగించండితెలియక నే నోటనుంచి తినకుము, వినుమా !
వలదిక త్రుంచకు జిల్లెడు
తులసీ ! దళము మనకు విషతుల్యమ్ము గదా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇప్పటివరకు చూసిన పూరణల్లో నాకు మీ పూరణ నచ్చిందండి. చక్కగా చేశారు. పూరణలను 1.పదాలను విరిచిగాని, లేక 2.ఇంకో అర్థాన్ని అన్వయిస్తూగానీ లేదా 3. సమాసాన్ని విడగొట్టిగాని చెబితేనే అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు రెండు పనులూ[2 మరియు3] చేశారు. రెండు- తులసి అంటే వ్యక్తిపేరును తీసుకున్నారు.మూడు- దళమును తులసి నుండి వేరు చేసి జిల్లేడుకు అతికించి భలేగా పూరణ చేశారు. ధన్యవాదాలు.
తొలగించండిఇట్లు
డా. బోలుగద్దె అనిల్ కుమార్
9502568218
(రోగ కారక క్రిముల స్వగతం)
రిప్లయితొలగించండిఇలలో జనులకు జబ్బులు
కలిగించు క్రిములము మనకు కంటకమగుచున్
విలవిల లాడించెడి యీ
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇలలో పుణ్యము నొసగును
రిప్లయితొలగించండితులసీదళము మనకు;విషతుల్యమ్ము గదా!
తులసి యనుమాటనృతము
తులసిని కొలిచిన యొసగును తులలేని సిరుల్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మూడవపాదంలో గణదోషం. ‘తులసి యనుమాట యనృతము’ అనండి. అలాగే ‘కొలిచిన నొసగును’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిన్నటి సమస్యకు పూరణ..
రిప్లయితొలగించండిఆముదమును దెచ్చి యరచేత నిమురుచు
సఖియ మర్దనమ్ము సరిగ జేయ
నా ముదమును దలువ నాగిలిగింతల
నడుము నొప్పి దెచ్చె గడు ముదమ్ము.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజలమిలఁ బ్రాణా ధారము
రిప్లయితొలగించండిఫలవంతము నెంచ స్నాన పానాదులకున్
సలలితము పూజ నీయము
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!
[విషము = జలము]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సలలితము అంటే ఏమని అర్థం తీసుకున్నారు సార్
తొలగించండిచెలియా! పవిత్రమైనది
రిప్లయితొలగించండితులసీ దళము , మనకు విషతుల్యమ్ము గదా
యిలలో గన్నేరనుచును
ఫలియించెడు కాయలు కడు భద్రము సుమ్మీ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
దళములఁ జల్ల రసాయన
రిప్లయితొలగించండిముల చీడలు వీడి తలసి ముచ్చట గొలిపెన్
జలమందు శుద్ధి జేయని
తులసీ దళము మనకు విషతుల్యమ్ము గదా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తులసీదళమునునిట్లన
రిప్లయితొలగించండితులసీదళముమనకువిషతుల్యమ్ముగదా
కలలోనైననుభావ్యమె?
తులసీదళముమనకమృతతుల్యమ్ముగాదె!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జలుబును దగ్గును మాపును
రిప్లయితొలగించండితులసీదళము.మనకువిషతుల్యమ్ముగదా
చిలుము కలంజము మత్తును
కలిగించెడి నల్లమందు కల్లును త్రాగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.తులసీ మొక్కను బెంచిన?
రిప్లయితొలగించండిఫలితము లాయింటికబ్బు|భాగ్యముగని-“తా
దలచెను దారిద్ర్యము-ఆ
తులసీదళము మనకువిష తుల్యమ్ముగదా”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తులసీ’ యను దళమొక్కటి
రిప్లయితొలగించండిబలహీనుల దోచుకొనుచు బాధలు పెట్టన్!
ఇలపై దాడులు జరిపెడి
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!
‘తులసీ’ యను దళమొక్కటి
రిప్లయితొలగించండిబలహీనుల దోచుకొనుచు బాధలు పెట్టన్!
ఇలపై దాడులు జరిపెడి
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలు రుగ్మతలను బాపగ
రిప్లయితొలగించండితులసీదళము ; మనకు విషతుల్యమ్ము గదా
కలుషిత రసాయ నమ్ములు
కలసిన శాకములు , పండ్లు , కనువిందైనన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తులలేని సిరుల నొసగును
రిప్లయితొలగించండితులసీదళము మనకు,విషతుల్యమ్ముగదా
కలుషంబగునీరు కలువ
మలినమ్ములను తొలగించి మంచిని కూర్చున్
తులలేని సిరుల నొసగును
రిప్లయితొలగించండితులసీదళము మనకు,విషతుల్యమ్ముగదా
కలుషంబగునీరు కలువ
మలినమ్ములను తొలగించి మంచిని కూర్చున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూకలఁ గని, తన యనుచరులతోఁ బలికిన సందర్భము]
కలిమిఁ గొని, లేమి నిచ్చిన
ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
నిలువెల్ల కంపన మ్మయె,
తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!
చిన్న సవరణము:
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
[యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూఁకలఁ గని, తన భార్య తులసితోఁ బలికిన సందర్భము]
కలిమిఁ గొని, లేమి నిచ్చిన
ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
నిలువెల్ల కంపన మ్మయె,
తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
k.s gurumurthiacharigari puranam
రిప్లయితొలగించండిఇద్దరు ముస్లిం యువతలుఅనుకొన్నమాటలు
పలికెను సలీమతో యిటు
వలిభీ హిందులకు మనము వ్యతిరేకము-గో
ఫలల మమృత భక్షణమగు
తులసీదళము మనకు విష తుల్యమ్ముగదా
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘వలిభీ హిందువులు మనకు వ్యతిరేకులు...’ అంటే బాగుంటుందేమో?
చాలా బాగుంది. చాలా చాలా చక్కని పూరణ
తొలగించండిసలుపును మేలు నిజముగా
రిప్లయితొలగించండితులసిదళము మనకు , విషతుల్యమ్ముగదా
పలు గన్నేరుల కాయలు
తెలుసుకొని చిరుతల కెప్డు తెలుపగ వలయున్ see
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కగా ఉంది. లెస్స లెస్స
తొలగించండికలవర మౌచును మదిలో
రిప్లయితొలగించండికలశములో నీరు జూచి కలవారింటన్
కలరా క్రిమి యనియెనిటుల:
"తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!"
తలనొప్పి కలిగి నంతనె
రిప్లయితొలగించండివలవల విలపించి చనుచు వైద్యుని కడకున్
బలుపగు సూదుల కలవడ
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!