4, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1962 (పాపులు దుర్జనుల్ ఖలులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్.

33 కామెంట్‌లు:

  1. శాపము నొందువా రలకు సాగిల మ్రొక్కిన దైవమెన్నడున్
    తాపము దీర్చియా దుకొను దాతయె గావున భక్తిమె చ్చినన్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూ రులున్
    ప్రాపున ముక్తినొం దెదరు భారము వీడుచు సౌఖ్యమొం దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొద్దిపాటి తికమక ఉన్నా మొత్తానికి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. తాపము దీర్చియా దుకొను దాతయె గావునభక్తిమె చ్చినన్
      శాపము నొందువా రలకు సాగిలమ్రొక్కిన దైవ మెన్నడున్
      పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్
      ప్రాపున ముక్తినొం దెదరు భారము వీడుచు సౌఖ్యమొం దగన్

      క్షమించాలి సవరించిన పద్యము ఎలా ఉంటుందో మరి ?

      తొలగించండి
  2. కోపము వీడలేక మది కోరిక తీరని కోప భూసురుల్
    తాపము తాళలేక సరితా వనితామణి జోడిగో రుచున్
    పాపము జేయుచూ తరచు పాటిగ పూటుగ తాగు వారులున్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్

    రిప్లయితొలగించండి

  3. ఇట్లా అందరూ పాపులు అనేస్తే మనమంతా ఏ కోవలోకి చేరతామో ఏడుకొండల పెరుమాళ్లకే ఎరుక ! జెకె :) :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగుంది. ‘కోపభూసురుల్’ ఎందుకు? ‘జోడు గోరుచున్ పాపము జేయుచున్...’ అనండి.

      తొలగించండి
  4. ఆపగ లాక్రమించి యొరులాస్తుల దోచుచు మిత్రక్షేమమున్
    సైపక సాటివారి సిరిసంపదలెల్ల హరించు నీచులై
    యాపద లెన్నియో పరుల కాలరులై యొనగూర్చు వారలే
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్

    ఆపగ = వాగు ; ఆలరి = దుశ్శీలుడు

    శ్రీపతి శత్రువంచు తమచింతన యందున పద్మనాభునే
    కోపము తోడదూరుచు కుట్రలు పన్నుచు దైవనిందయున్
    తాపసులన్ వధించు ఖలు దానవు లెల్లరు లోకకంఠకుల్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో ‘...యొరుల+ఆస్తులు’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘మిత్రక్షేమమున్’ అన్నపుడు ‘త్ర’ గురువై గణదోషం.
      రెండవ పూరణలో ‘దూరుచు’ అన్నచోట గణదోషం. ‘దూరుచును’ అనండి. మూడవపాదంలో ‘ఖలు’కు అన్వయం లేదు. ‘ఖల దానవు’లంటే సరి.

      తొలగించండి

  5. పాపులుదుర్జనుల్ఖలులుభ్రష్టులునీచులునీతిదూరులు న్దాపుననుండుచున్మనకుదారనిశమ్మునుగీడొనర్చుగా బ్రాపుగనుంటకైశివునిబ్రార్ధనజేయుటయొక్కటేమరి
    న్నాపదలందుకాచెడుమహాత్ముడుశంకరుడేభువిన్గదా

    రిప్లయితొలగించండి
  6. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్
    కాపురముండుతావుల సఖా!పొరబాటుననుండబోకుమా!
    దాపరికంబులేని మన ధార్మిక జీవన భారతీయతల్
    ఏపుగ వృద్ధినొందగను నీశ్వరు సేవల మోక్షమందగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      ‘భారతీయతల్ ఏపుల’ అని విసంధిగా వ్రాశారు. ‘భారతాత్మయే|యేపుగ’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  7. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్
    కోపము కామమున్ మదము కుత్సిత మత్సర మోహలోభముల్
    తాపము నీయ మారిన యధర్మ పరుల్ నరు లెల్లరుం గన
    న్నా పరమాత్ము సంతతులె యాగుణ దూరులు నైన ధన్యులే

    రిప్లయితొలగించండి
  8. ఆపదలందు గావుమని యాపరమాత్మునినే స్మరించుచున్
    తాపము నొందకన్ కుటిల తర్కము జేయక, శోకమందకన్
    పాపుల మమ్ము బ్రోవుమని ప్రార్ధన జేయగముక్తి నొందరే!
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్.

    నిన్నటి పూరణ

    సత్య లోకములో విధి సాగుచుండ,
    పద్మనాభుడు వైకుంఠ వాసియె గద
    లచ్చిమగఁడు; వసించుఁ గైలాసమందు
    గరళ కంఠుడు గౌరి , గంగలను గలసి

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి ధన్యవాదములు సవరించిన పద్యాలు

    ఆపగ లాక్రమించి పరయాస్తుల దోచుచు బంధుమిత్రులన్
    సైపక సాటివారి సిరిసంపదలెల్ల హరించు నీచులై
    యాపద లెన్నియో యొరుల కాలరులై యొనగూర్చు వారలే
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్

    ఆపగ = వాగు ; ఆలరి = దుశ్శీలుడు

    శ్రీపతి శత్రువంచు తమచింతన యందున పద్మనాభునే
    కోపము తోడదూరుచును కుట్రలు పన్నుచు దైవనిందయున్
    తాపసులన్ వధించు ఖల దానవు లెల్లరు లోకకంఠకుల్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్

    రిప్లయితొలగించండి
  10. 16కోపముసాకువారు,తమకూరిమి నమ్మియునున్నవారు,సం
    తాపము లేనివారు,తలిదండ్రుల జూడక యున్నవారు,తా
    రూపమెనమ్మువారు, పలురోగములున్నను మోసకారు లౌ
    పాపులు,దుర్జనుల్ ఖలులు బ్రష్టులు నీచులు నీతిదూరులున్.

    రిప్లయితొలగించండి
  11. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్
    భూపతులై కృషీవలుల భూముల బొక్కుచు నుండ ధూర్తులై
    రేపటి దుస్థితిన్ గనుచు రోయుచు నుండిరి యన్న దాతలున్
    దోపిడి నుండి కాచు ఘన ధూర్గతు కోసము వేచి చూచుచున్
    ధూర్గతుడుః నాయకుడు, సువిధానుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ధూర్గతుడు’ శబ్దం కేవలం పర్యాయపద నిఘంటువులో తప్ప మరే నిఘంటువులోను కనిపించలేదు.

      తొలగించండి
    2. నాలుగవ పాదం ఇలామారిస్తే సరిపోతుందా. దయతో తెలియ జేయండి
      “తాపముఁదీర్చునట్టి కడు దార్మిక నాయకు దన్ను కోసమై”

      తొలగించండి
  12. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్!
    మా పరిపాలనమ్ముఁ గని మారగ వీడరె వైరిపక్షమున్?
    శాపము లెన్నియున్న సరె!శాసన సభ్యులు వచ్చి చేరినన్
    చూపముగా! వివక్షలను సొంపును గూర్చెడు కండువాలివే!

    రిప్లయితొలగించండి
  13. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్,
    దోపిడిగాండ్రు,హంతకులు,దొంగలు,స్త్రీలబలాత్కరించువా
    రూపిరి వీడువేళ మది నొక్కపరిన్ స్మరియింప శ్రీహరిన్
    పాపము బాసి పొందెదరు వాసిగ ముక్తిని విష్ణులోకమున్

    రిప్లయితొలగించండి
  14. పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్.

    దాపుర మైరి మా భరత ధాత్రికి యెన్నడు మోక్షమబ్బునీ

    కాపురుషుల్ జనా గ్రహము కట్టలు త్రెంచక ముందె మారినన్

    తాపము లుండబోవు మరి తప్పిన తిప్పలు తప్పవిద్ధరన్

    రిప్లయితొలగించండి
  15. కాపులు కమ్మలున్ రెడులు కానగ వైశ్యులు బ్రాహ్మణాదులు
    న్నోపుచు బల్జెలున్ విరివి నోబిసి జాతులు మాలమాదిగల్
    దాపుచు నన్నిటిన్ గలరు దండిగ నేడిల భారతావనిన్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్ :)

    రిప్లయితొలగించండి
  16. అమిత్ షా ఉవాచ:
    (కాంగ్రెస్ ముక్త్ భారత్)

    దాపున చేరదీయకుము దైత్యుల నెప్పుడు భారతీయుడా!
    చీపురు బట్టి బాదవలె చెంతకు చేరగ నడ్డిమీదనున్!
    పోపుని భక్తులున్ బలుపు పోకిరి మూకలు కాంగ్రెసోత్తముల్
    పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్!

    రిప్లయితొలగించండి