గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములుఇల వైకుంఠమ్మౌ తిరుమలలో కొని తెచ్చితి గద మధురపు లడ్డూల్ పిలువుమిటకు బంధువులనుకలవారలకున్ గరళము గావలెను సుమీగరళము= స్వల్పమురైతుతో మిత్రుని మాటగాపొలముకు చీడయె పట్టగవిలపించుట యేలమందు వేయుదు రెరుకల్ పిలువుము వారినిటకు యెరుకలవారలకున్ గరళము గావలెను సుమీఎరుకలు = ఒకానొక కులము వారు
మీ రెండు పూరణలు బాగున్నవి.మొదటి పూరణలో ‘పిలువుము బంధుల నెయ్యము| కలవారలకున్...’ అంటే బాగుంటుందేమో?రెండవపూరణలో ‘పొలముకు’ అనరాదు. ‘పొలమునకు చీడ పట్టగ’ అనండి.
అలరించు వేల్పు నైనను కలిమిలే ములయం దైన కలలో నైనన్ చెలిమిని గోరుచు సరసన కలవారలకున్ గరళము గావలెను సుమీ !గరళము = అమృతము, మందు , మధురము ,రసము
మీ పూరణ బాగున్నది. రెండవపాదంలో గణదోషం. ‘కలిమిన్ మఱి లేమినైన కలలోనైనన్’ అనండి.
అలరించు వేల్పు నైనను కలిమిన్ మఱిలేమి నైన కలలో నైనన్ చెలిమిని గోరుచు సరసన కలవారలకున్ గరళము గావలెను సుమీ !
అలవోకగ బతుకు సుఖముగల పురజనులకు సకలము గరయుట కొరకున్యిల జన కష్టము తెలియన్కలవారలకున్ గరళము గావలెను సుమీ :)
మీ పూరణ బాగున్నది. ‘కొరకున్+ఇల’ అన్నపుడు యడాగమం రాదు. ‘...కొరకై| యిల జన...’ అనండి.
ఇలలో విజ్ఞులు " త్రాగుట " వలదని యది గరళమంచు వచియింతురుగా యలవాటు విడని పెడమతి కలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొలములు పిల్లలు నున్నయెడల వలయునిక దమవాకిట పశుగణములున్నిల పశు సంపద నింపుగ గలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది.‘గరళము’ ఏ అర్థంలో స్వీకరించారు?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. గరళము = కసవు ప్రోగు; గడ్డి మోపు గా తీసుకొని పూరించితిని.
ఇల నెన్నియొ నేరములను నలవోకగ జేయువార లాప్తులు నైన న్గలగల లాడగ ధనములు కలవారలకున్ గరళము గావలెను సుమీ
మీ పూరణ బాగున్నా ‘గరళము’ ఏ అర్థంలో ప్రయోగించారు?
తప్పులుచేయుటవలన మరణించుటకు విషము కావలెను
విలువైన జీవితమ్ములుపలువిధములగు వ్యసనముల పాడుబడంగన్ సలిపెడు చెడురోగమ్ములు గలవారలకున్ గరళము కావలెను సుమీ !గరళము: మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు. సవరణకు ధన్యవాదాలు నేటి పూరణ కలలోనైన దలంపని పలువిధ యిడుములను గూర్చు పాపులు ధరలో చెలరేగగ , నా యూహలు కలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది. ‘పలు విధ యిడుములు’ అని సమాసం చేయరాదు కదా! ‘పలువిధముల యిడుముల నిడు పాపులు...’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కలకలమురేగ కడలిన్జిలికెడు వేళన్ జనించ! సేమము ప్రజకన్దెలియుమను సర్వమంగళఁగలవారలకున్ గరళము గావలెను సుమీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ప్రజకున్’ టైపాటువల్ల ‘ప్రజకన్’ అయినట్టుంది.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:కలకలమురేగ కడలిన్జిలికెడు వేళన్ జనించ! సేమము ప్రజకున్దెలియుమను సర్వమంగళఁగలవారలకున్ గరళము గావలెను సుమీ!
కలుషిత భావనలిలలోకలవారలకున్ గరళము|”గావలెను సుమీతలపున మంచిని బెంచెడివిలువలె ఆరోగ్యభాగ్య విజ్ఞత లొసగున్.”2.విలువగు విద్యే మనుగడకలవారలకున్|”గరళము గావలెను సుమీనిలలో మూర్ఖుడి భావననిలువెత్తునముంచు బుద్ది నెగడక జేయన్”.
మీ రెండు పూరణలు బాగున్నవి.‘సుమీ| యిలలో’ అనండి.
కలుముల నక్రమరీతిని విలాసముగ దాచు దేశవిద్రోహులకున్కులమత విద్వేషమ్ములు గలవారలకున్ గరళము గావలెను సుమీ
పొలమునకు పోదుమిప్పుడుతెలవారెను తొరగ లేచి తెములుము తాతా!బలితముగ పాడి యుండినకలవారలకున్ గరళము కావలెను సుమీ!!!గరళము = కసవుప్రోగు, గడ్డి..
మీ పూరణ బాగున్నది.‘త్వరగ లేచి’ అనండి.
అలనాడా సాగరమున కలవరపడి కడలిని చిలుకంగా వచ్చెన్పలువస్తువు లచ్చోటన్కలవారలకున్ గరళము గావలెను సుమీ.విలువగు బతుకును చెరుపుకునిలలో నటునిటు దిరుగుచు నెమ్మది లేకన్విలపించు చున్న దుర్మతికలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పూరణలో ‘చిలుకంగన్’ అనండి.
నమస్తే అండీ చిలుకంగన్ అంటే ఓక్షరం తగ్గుతుందండి
అక్షరం తగ్గడం లేదు. చిలుకంగా, చిలుకంగన్ రెండూ నాలుగక్షరాలే.
పలురీతుల యత్నించితి కలుగున నున్నట్టి వార్ని కబ్జా చేయన్...తెలియదిక వేరు విధ...మెలు కలవారలకున్ గరళము గావలెను సుమీ!
మిలమిల లాడెడి నిర్మల చెలగుచు భారత ప్రజలను చెండాడంగన్ తల మాయగ శిస్తులతో కలవారలకున్ గరళము గావలెను సుమీ
గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు
రిప్లయితొలగించండిఇల వైకుంఠమ్మౌ తిరు
మలలో కొని తెచ్చితి గద మధురపు లడ్డూల్
పిలువుమిటకు బంధువులను
కలవారలకున్ గరళము గావలెను సుమీ
గరళము= స్వల్పము
రైతుతో మిత్రుని మాటగా
పొలముకు చీడయె పట్టగ
విలపించుట యేలమందు వేయుదు రెరుకల్
పిలువుము వారినిటకు యెరు
కలవారలకున్ గరళము గావలెను సుమీ
ఎరుకలు = ఒకానొక కులము వారు
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిమొదటి పూరణలో ‘పిలువుము బంధుల నెయ్యము| కలవారలకున్...’ అంటే బాగుంటుందేమో?
రెండవపూరణలో ‘పొలముకు’ అనరాదు. ‘పొలమునకు చీడ పట్టగ’ అనండి.
అలరించు వేల్పు నైనను
రిప్లయితొలగించండికలిమిలే ములయం దైన కలలో నైనన్
చెలిమిని గోరుచు సరసన
కలవారలకున్ గరళము గావలెను సుమీ !
గరళము = అమృతము, మందు , మధురము ,రసము
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరెండవపాదంలో గణదోషం. ‘కలిమిన్ మఱి లేమినైన కలలోనైనన్’ అనండి.
అలరించు వేల్పు నైనను
తొలగించండికలిమిన్ మఱిలేమి నైన కలలో నైనన్
చెలిమిని గోరుచు సరసన
కలవారలకున్ గరళము గావలెను సుమీ !
అలరించు వేల్పు నైనను
తొలగించండికలిమిన్ మఱిలేమి నైన కలలో నైనన్
చెలిమిని గోరుచు సరసన
కలవారలకున్ గరళము గావలెను సుమీ !
అలవోకగ బతుకు సుఖము
రిప్లయితొలగించండిగల పురజనులకు సకలము గరయుట కొరకున్
యిల జన కష్టము తెలియన్
కలవారలకున్ గరళము గావలెను సుమీ :)
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘కొరకున్+ఇల’ అన్నపుడు యడాగమం రాదు. ‘...కొరకై| యిల జన...’ అనండి.
ఇలలో విజ్ఞులు " త్రాగుట "
రిప్లయితొలగించండివలదని యది గరళమంచు వచియింతురుగా
యలవాటు విడని పెడమతి
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొలములు పిల్లలు నున్నయె
రిప్లయితొలగించండిడల వలయునిక దమవాకిట పశుగణములు
న్నిల పశు సంపద నింపుగ
గలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘గరళము’ ఏ అర్థంలో స్వీకరించారు?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిగరళము = కసవు ప్రోగు; గడ్డి మోపు గా తీసుకొని పూరించితిని.
ఇల నెన్నియొ నేరములను
రిప్లయితొలగించండినలవోకగ జేయువార లాప్తులు నైన
న్గలగల లాడగ ధనములు
కలవారలకున్ గరళము గావలెను సుమీ
మీ పూరణ బాగున్నా ‘గరళము’ ఏ అర్థంలో ప్రయోగించారు?
తొలగించండితప్పులుచేయుటవలన మరణించుటకు విషము కావలెను
తొలగించండివిలువైన జీవితమ్ములు
రిప్లయితొలగించండిపలువిధములగు వ్యసనముల పాడుబడంగన్
సలిపెడు చెడురోగమ్ములు
గలవారలకున్ గరళము కావలెను సుమీ !
గరళము: మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిశ్రీ శంకరయ్య గారికి నమస్సులు. సవరణకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండినేటి పూరణ
కలలోనైన దలంపని
పలువిధ యిడుములను గూర్చు పాపులు ధరలో
చెలరేగగ , నా యూహలు
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘పలు విధ యిడుములు’ అని సమాసం చేయరాదు కదా! ‘పలువిధముల యిడుముల నిడు పాపులు...’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలకలమురేగ కడలిన్
రిప్లయితొలగించండిజిలికెడు వేళన్ జనించ! సేమము ప్రజకన్
దెలియుమను సర్వమంగళఁ
గలవారలకున్ గరళము గావలెను సుమీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘ప్రజకున్’ టైపాటువల్ల ‘ప్రజకన్’ అయినట్టుంది.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండికలకలమురేగ కడలిన్
జిలికెడు వేళన్ జనించ! సేమము ప్రజకున్
దెలియుమను సర్వమంగళఁ
గలవారలకున్ గరళము గావలెను సుమీ!
కలుషిత భావనలిలలో
రిప్లయితొలగించండికలవారలకున్ గరళము|”గావలెను సుమీ
తలపున మంచిని బెంచెడి
విలువలె ఆరోగ్యభాగ్య విజ్ఞత లొసగున్.”
2.విలువగు విద్యే మనుగడ
కలవారలకున్|”గరళము గావలెను సుమీ
నిలలో మూర్ఖుడి భావన
నిలువెత్తునముంచు బుద్ది నెగడక జేయన్”.
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండి‘సుమీ| యిలలో’ అనండి.
కలుముల నక్రమరీతిని
రిప్లయితొలగించండివిలాసముగ దాచు దేశవిద్రోహులకున్
కులమత విద్వేషమ్ములు
గలవారలకున్ గరళము గావలెను సుమీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొలమునకు పోదుమిప్పుడు
రిప్లయితొలగించండితెలవారెను తొరగ లేచి తెములుము తాతా!
బలితముగ పాడి యుండిన
కలవారలకున్ గరళము కావలెను సుమీ!!!
గరళము = కసవుప్రోగు, గడ్డి..
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘త్వరగ లేచి’ అనండి.
రిప్లయితొలగించండిఅలనాడా సాగరమున
కలవరపడి కడలిని చిలుకంగా వచ్చెన్
పలువస్తువు లచ్చోటన్
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
విలువగు బతుకును చెరుపుకు
నిలలో నటునిటు దిరుగుచు నెమ్మది లేకన్
విలపించు చున్న దుర్మతి
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
మీ రెండు పూరణలు బాగున్నవి.
రిప్లయితొలగించండిమొదటి పూరణలో ‘చిలుకంగన్’ అనండి.
నమస్తే అండీ చిలుకంగన్ అంటే ఓక్షరం తగ్గుతుందండి
రిప్లయితొలగించండిఅక్షరం తగ్గడం లేదు. చిలుకంగా, చిలుకంగన్ రెండూ నాలుగక్షరాలే.
తొలగించండిపలురీతుల యత్నించితి
రిప్లయితొలగించండికలుగున నున్నట్టి వార్ని కబ్జా చేయన్...
తెలియదిక వేరు విధ...మెలు
కలవారలకున్ గరళము గావలెను సుమీ!
మిలమిల లాడెడి నిర్మల
రిప్లయితొలగించండిచెలగుచు భారత ప్రజలను చెండాడంగన్
తల మాయగ శిస్తులతో
కలవారలకున్ గరళము గావలెను సుమీ