24, మార్చి 2016, గురువారం

సమస్య – 1982 (యముని సావిత్రి గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యముని సావిత్రి గని పలాయన మొనర్చె.

41 కామెంట్‌లు:

 1. భీతి జెందక కాలుని వెంబ డించి
  భర్త ప్రాణము లిమ్మని బ్రతిమి లాడె
  యముని సావిత్రి గని, పలాయన మొనర్చె
  సాధ్వి కోరిక దీర్చుట సబబు గాదు

  రిప్లయితొలగించండి
 2. శుభోదయం :) కలికాలపు సావిత్రి :)

  విధవలకు పింఛను గలదు విధవిధములు
  వలదు యమరాజ పతియును వలదు నాకు
  యముని సావిత్రి గని పలాయన మొనర్చె
  వెడలె పించను ఆఫీసు వేగిరంబు !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘విధవిధములు’ అన్నదాన్ని ‘వివిధగతుల/వేవిధముల/వివిధములుగ’ అనవచ్చు. ‘పించను ఆఫీసు’ అని విసంధిగా వ్రాశారు. ‘పింఛనాఫీసుకు’ అనండి.

   తొలగించండి
 3. యమునిసావిత్రి యెదిరించె నపుడు నాడు
  పాత సినిమాల లోపల పాడు 'విలను'
  రాజనాలయె చంపగా రాగ కాల
  యముని సావిత్రి గని పలాయన మొనర్చె

  రిప్లయితొలగించండి
 4. బెదరిన తురగమొక్కటి వేగముగను
  పరుగు దీయుచు వచ్చెనా పడతులున్న
  దెసకు, రౌద్రరూపమ్మున తిరుగెడా హ
  యముని సావిత్రిగని పలాయనమొ నర్చె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నా ‘హయమును’ అనవలసినచోట ‘హయముని’ అనడం దోషమే.

   తొలగించండి
  2. గురువు గారికి ధన్యవాదములు
   మీరు సూచించినది నేననుకున్నదియే ....కేవలం వైవిద్యంగా వుంటుందని భావనతో పూరించాను ...

   తొలగించండి
 5. కోరె దనభర్త ప్రాణము ల్ కోర్కె లలర
  యముని సావిత్రి గని, పలాయన మొనర్చె
  సత్య వంతుని బ్రాణముల్ సాదరముగ
  దనర సావిత్రికి నొసగి దా యముండు

  రిప్లయితొలగించండి
 6. కాననమ్ములఁ బతి సేవ కందె నంత
  సత్యవంతుడాయెనట భృశమ్ము వశము
  యముని సావిత్రి గని పలాయన మొనర్చె
  వేగ నాతని జేరగ సాగె నతివ


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. వివిధ రీతుల బ్రతిమాలి వెంటపడుతు
  పతిని బ్రతికించమనిగోరె పరితపిస్తు
  యముని సావిత్రి గని, పలాయనమొనర్చె
  సాధ్వి కోరిక నెరవేర్చి సంగమనుడు !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'పరితపిస్తు'అని వ్యావహారికం ప్రయోగించారు. 'పరతపించి' అనండి.

   తొలగించండి
 8. భర్త ప్రాణములందెడు పట్టుదలను
  చతురతన్ జూప చకితుడై సడలి నట్టి
  యుముని, సావిత్రిఁ గని పలాయన మెనర్చె
  పాశము! ప్రభువు కరుణించి పట్టు విడువ!!

  రిప్లయితొలగించండి
 9. భర్త ప్రాణములందెడు పట్టుదలను
  చతురతన్ జూప చకితుడై సడలి నట్టి
  యుముని, సావిత్రిఁ గని పలాయన మెనర్చె
  పాశము! ప్రభువు కరుణించి పట్టు విడువ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. పతియె ప్రత్యక్షదైవమ్ము సతికి, నాదు
  భర్త ప్రాణముల్ గొనిపోవ వలదనియెను
  యముని సావిత్రిగని, పలాయనమొనర్చె
  పాశధరుడా పడతికి యా వరమొసంగి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘పడతికి నా వరమొసంగి’ అనండి.

   తొలగించండి
 11. యముని సావిత్రిగని పలాయన మొనర్చె
  ననుట పొరపాటు “భయముగానక యముడినె
  ననుసరించి భర్త ప్రాణ మందజేయు
  వరకువెంటాడె|సాత్విక కరుకునందు”|
  2.ప్రాణ నాథుని ప్రాణాల రక్ష కొరకు
  చేయు సంకల్పమెంచ?విచిత్రము|విజ
  యముని సావిత్రిగని పలాయన మొనర్చె
  భర్త బాగోగు లెంచిన కర్త వోలె|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘కరుకునందు... విజయముని’...?

   తొలగించండి
 12. నీడ వోలెను వెంటాడి నిలువరించె
  యముని సావిత్రి గని! ' పలాయనమొనర్చె
  భానుజుండను ' యూహకే భయము నొంది,
  కాలుడయ్యెడ బ్రతికించె కాంత మగని!

  రిప్లయితొలగించండి
 13. వరములఁ గొను నెపమ్మున వైవసత్వు
  దృష్టి మరలించి సాధ్వి తా తెలివితోడ
  భర్త యసువులఁబొందగా, పాశ మపుడు
  యముని సావిత్రిఁగని పలాయన మొనర్చె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘వైవస్వతుడు’ను ‘వైవసత్వుడు’ అన్నారు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. "వరముల నెపమ్మున పాశహస్తు" లేక "భాను సుతుని" అంటే సరిపోతుందా?.

   తొలగించండి
 14. తనను భర్తతో గొంపోవ తప్పదనుచు
  పతికి వెను వెంట పరుగిడి పట్టు బట్ట
  యముని సావిత్రి, గని పలాయన మొనర్చె
  "వఱలు సౌభాగ్య వతి"యని వరమొసంగి

  రిప్లయితొలగించండి
 15. అందరి పూరణలు బాగున్నవి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. యముని సావిత్రి గని, పలాయన మొనర్చె
  మాటలను యుక్తితో బల్కె మహిత సాధ్వి,
  చేయునదిలేక మరుమాట చెప్పలేక
  ధవుని ప్రాణము గొనకయే ధర్మరాజు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. సత్యవంతున కచ్చోట చావు రాగ
  బెదరకుండ పడతితాను వెంట నడచి
  యముని సావిత్రి గని పలాయనమొనర్చి
  తెలివి తోడ వరమడిగి తిరిగి పొందె

  రిప్లయితొలగించండి
 18. మాయా సావిత్రి:

  సమకూర్చుచు కొంగులను
  న్నమరించి గదను భుజమున నానందముతో
  సమరమునకు రమ్మన నా
  యముని,..సావిత్రి గని పలాయన మొనర్చె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. నడిరేయిలోన వ్రాయన్
   వడివడి గా తేటగీతి పాదంబిదిగో
   బుడిబుడి నడకల కందము
   గ డిగనురికెను గద నాదు కవనంబందున్ :)


   ఏమండీ జీపీయెస్ వారు :)


   జిలేబి

   తొలగించండి


 19. నాదు పతిని విడువమనె నాడు సూవె
  యముని సావిత్రి గని, పలాయన మొనర్చె,
  నేడు రమణి పతిని యమునికివిడిచి, జి
  లేబి కలియుగ సతిగద లెస్స గాన :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. మాయా సావిత్రి:

  చీర కొంగును సవరించి వీరవనిత
  గదను భుజమున కెత్తుచు బెదర కుండ
  రమ్ము తగవుకు నాతోడ రార! యనగ
  యముని...సావిత్రి గని పలాయన మొనర్చె!

  రిప్లయితొలగించండి