తోటలో విరిసిన పారిజాతములన్ని సాటి యగునే నీదు పాట ముందు తేటగా చెవి నిండ నీ మధుర గానమ్ము పూట గడుచును సౌశీల్య భావమందు
వ్రాయాలన్న తపన తప్ప తెలుగు వ్యాకరణమునందు నా జ్ఞానము పూజ్యము. కేవలం స్వేచ్చా రచన మాత్రమే. మీ బ్లాగులో ప్రవేశించే అర్హత లేకపోయినా, నా సాహసాన్ని, తప్పొప్పులను సహృదయంతో మన్నించ గలరు. ___/\___ ...
1.
రిప్లయితొలగించండిపరమ పావని శ్రీవాణి పరవ శమున
వీణమీటిన చందాన విశ్వమందు
గానమొనరించ మురిపించె కలికి పాట
చెప్పగవశమౌనె యిల సుశీల ఘనత.
2.
గాన కోకిల బిరుదమ్ము గలిగి నట్టి
తెలుగు తల్లికి బ్రియపుత్రి ధీరవనిత
విశ్వకీర్తిని బడసిన విమల చరిత
సాటి లేనట్టి సంగీత సవ్యసాచి
3.
పూతరేకులరిశ పూర్ణంపు భక్ష్యాలు
పాలకోవ లడ్డు బాదుషాల
కన్న మధుర మైన గాత్రమే కలిగున్న
మధురగాయనియని మహిని వెలిగె.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చివరిపద్యంలో ‘కలిగి+ఉన్న’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కలిగిన’ అన్నా సరిపోతుంది కదా!
ధన్యవాదములండి సరిచేసుకున్నాను
తొలగించండిపరమ పావని శ్రీవాణి పరవ శమున
తొలగించండివీణమీటిన చందాన విశ్వమందు
గానమొనరించ మురిపించె కలికి పాట
చెప్పగవశమౌనె యిల సుశీల ఘనత.
2.
గాన కోకిల బిరుదమ్ము గలిగి నట్టి
తెలుగు తల్లికి బ్రియపుత్రి ధీరవనిత
విశ్వకీర్తిని బడసిన విమల చరిత
సాటి లేనట్టి సంగీత సవ్యసాచి
3.
పూతరేకులరిశ పూర్ణంపు భక్ష్యాలు
పాలకోవ లడ్డు బాదుషాల
కన్న మధుర మైన గాత్రమే కలిగిన
మధురగాయనియని మహిని వెలిగె.
పాటల గంధివి నీవని
రిప్లయితొలగించండిమాటలలో చెప్ప లేను మణి మౌక్తికమౌ
సాటెవరు నీకటంచును
మేటివి గదగాన రసఫణి మేలిమి పైడీ
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
చివరిపాదంలో గణదోషం. సవరించండి.
క్షమించాలి గణదోషం నాకు తెలియటల్లేదు
తొలగించండి" రసజ్ఞ " అంటే కుదురుతుందేమొ అని
అక్కయ్య గారు "మేటివి గదగా నరత్న మేలిమి పైడీ" అనండి. మీ పాదములో "న" ఒక లఘువు ఎక్కువ ఉంది.
తొలగించండి‘రసఫణి’ అన్నచోట ఒక లఘువు ఎక్కువ. ‘రసజ్ఞ’ అన్నాకుదరదు. ‘మేటివి గద కన రసఫణి...’ అనండి.
తొలగించండిపాటల గంధివి నీవని
తొలగించండిమాటలలో చెప్పలేను మణి మౌక్తికమౌ
సాటెవరు నీకటంచును
మేటివి గదకన రసఫణి మేలిమి పైడీ
సోదరు లిరువురకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిశుభోదయం !
చిన్ని వయసునే సినిమా
లన్నిట పాటలు సుశీల లబ్జుగ పాడెన్
మిన్నగ పేరును గాంచెన్
గిన్నిసు పొత్తమున వచ్చి కీర్తిని పొందెన్ !
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
భక్తిపాటల విన పారవశ్యముగల్గు
రిప్లయితొలగించండిప్రేమ గీతికవిన ప్రీతి గలుగు
చిలిపి పాటలకును చెంగున మనసూగు
పంచదారలు పంచు బాలగీతి
కడువిషాదపుపాట కళ్ళనేచెమరించు
హాస్యగీతి మనసు హాయినింపు
వీణపాటలలోన విఖ్యాతమీగొంతు
లాలిపాటలకును మేలుమేలు
పీసుశీలయన్న ప్రియమైనకోయిల
తెలుగు గాన లతకు తీపికొమ్మ
స్పష్టమైన స్వరము సరితెలుంగు వరము
చేరే ' గిన్నిసునను ' జేలు జేలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ సీసపద్యం రసవంతంగా ఉంది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
తొలగించండిగాన కోకిలవు సుశీల గైకొ నుమ! న
రిప్లయితొలగించండితులను ,నీదు గానమ్ము సం తోష బరచె
మమ్ము లనునెం త యో ,కాన మనుగడ సుఖ
మయము గావుత !శంకరు మహిమ వలన
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమధురగీతాలతో పదునాల్గు భువనాల
రిప్లయితొలగించండి............పరిమళములు నింపు పైడిబొమ్మ
నవరసమ్ములొలుక నద్భుత రీతిలో
..............గొంతెత్తి పాడిన కోకిలమ్మ
భాష యేదయినను బహుభక్తి తోబాడి
.........వాసిగాంచిన మేటి వజ్రమమ్మ
వేల పాటలు బాడి వేదికలలరించు
.........గానకోకిల నిను గడన దరమె!
విజయనగరమందు విరిసిన కోయిల
సాటి గలరె నీకు జగతి లోన!
సురుచిరమధు దార సుస్వరాల సుశీల
అందుకొనుమ తల్లి వందనములు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ సీసపద్యం బాగున్నది. అభినందలు.
మొదటిపాదంలో ‘ద-ధ’ ప్రాసయతి వేశారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశైలజ గారూ, మధు "ధార" అనండి లేకపోతే సమాస దోషము. “మధుర గీతగణ సంహతమున భువనాల” అనండి.“మ” కి సం“హ” కి యతి చెల్లుతుంది. (బిందు పూర్వ “హ”)
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండినేను గమనించలేదు. ధన్యవాదాలు.
శ్రీ కామేశ్వరరావుగారికి ధన్యవాదములు...
తొలగించండిచక్కని గాత్రము శ్రోతల
రిప్లయితొలగించండినిక్కము రంజిల్ల జేయు నీ గాన సుధల్
దక్కెను మాకే నక్కా !
మ్రొక్కెద, నీ కీర్తి నిలుచు భువిని సుశీలా!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పద్యరచనాంశమునిప్పుడే చూచాను.
రిప్లయితొలగించండిమానవ పూజార్హ రమ
జ్ఞానామృత మయ మనోజ్ఞ నాద భరితముల్
గాన సుధా రస ధారల
గాన సహస్రద సుశీల కరుణా మయియే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిపి.సుశీలగాయినిపై పద్యములు
రిప్లయితొలగించండి1.పలుకులరాణి భావనల బంధ సుగంధమె రాగయుక్త మై
విలువలు గూర్చు శక్తియు,వివేకమునందు “సుశీల”గానమే
నిలిపెను మానసాన ననునిత్యము చిత్ర పరిశ్రమందునే
నిలువల వోలె నిల్పెగద నేర్పున కూర్పున పాటలందునన్.
2.గీత సంగీతమందు సుఖించు నట్లు
గానమాధుర్య మందించ?కలిమి బలిమి
రాగమనురాగమై పాడ మూగయైన
పరవ శించును పాములా పాటవినగ|
3.లాలిపాటను బాడ?సుశీల గొంతు
పిల్లలేడుపు నిదురించు కల్లగాదు|
యువత కందించు పాటలు భవితకెపుడు
ప్రేమ పెంపొందజేయు|సంపెంగ లాగ|
4.వృద్దు లైనచొ?భక్తి సంతృప్తి నొసగు
పాటమాటునదాగిన పరవశంబు
భాష లేవైన పాడ శభాషుయనగ
పంచగలిగె సుశీల సుస్వరముమనకు|
5.ప్రతిభను పంచి పెంచె గద భావన భాగ్యము రాష్ట్రమంతటన్
ప్రతి శృతియందు రాగములుపంచిన పద్దతి గంట నాదమై
బ్రతుకగ పాట పల్లవి సభా సదులందున,చిత్ర సీమలో
ప్రతిపద మందు నేర్పు,టనురాగముబాడ?సుశీలవే సుమా|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సంపెంగ వలెను, శభాషనంగ’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆ హ ! తారా శ్రుతి య౦దున రవళి౦చు
. . మురళీ స్వనమ్మును పోలి నట్టి
వైణికా మాధుర్య వాద్యములో పలి
. . కి౦చు స౦గతులను మి౦చు నట్టి
ఆ వస౦త ద్రుమ మ౦దు హాయిగ. నాల
. . పి౦చు పికము మరపి౦చు నట్టి
సురలోక మున నున్న సుధకన్న , భువినున్న
. . తేనియ కన్న , బల్ తియ్య నట్టి
మధుర గాత్రము గలిగిన. మాత వీవు
.............................................
గానశారదకు బ్రియ౦పు సూన వీవు
గానశీల ! సుశీల ! తల్లీ ! నమస్సు
దక్షిణభరత సీమ నుద్భవము గా౦చి ,
నీవు మమ్మలరి౦చుట నిజము గాను
మే మొనర్చుకొనిన పుణ్యమే కదమ్మ !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆ హ ! తారా శ్రుతి య౦దున రవళి౦చు
. . మురళీ స్వనమ్మును పోలి నట్టి
వైణికా మాధుర్య వాద్యములో పలి
. . కి౦చు స౦గతులను మి౦చు నట్టి
ఆ వస౦త ద్రుమ మ౦దు హాయిగ. నాల
. . పి౦చు పికము మరపి౦చు నట్టి
సురలోక మున నున్న సుధకన్న , భువినున్న
. . తేనియ కన్న , బల్ తియ్య నట్టి
మధుర గాత్రము గలిగిన. మాత వీవు
.............................................
గానశారదకు బ్రియ౦పు సూన వీవు
గానశీల ! సుశీల ! తల్లీ ! నమస్సు
దక్షిణభరత సీమ నుద్భవము గా౦చి ,
నీవు మమ్మలరి౦చుట నిజము గాను
మే మొనర్చుకొనిన పుణ్యమే కదమ్మ !
పంచదారకన్న పాలుచక్కెర కన్న
రిప్లయితొలగించండిమధురమైన యట్డి మంచి గాత్ర
మిలనెవరికి గలదు నింతి సుశీలకు
గాక!వినగ రండు కాంతలార
2.భరత మాత గన్న భవ్య చరితవీవు
కమ్మనైన మధుర కంఠమెత్తి
పాడు పాట వినగ పరవశాన మురియు
బుధుల కైన వీరి పొగడ తరమె .
3గానకోకిల ప్రశస్తి ఘనముగాను
పొందినట్టిమహిళనీదు పుణ్యమేమొ
కంఠమెత్తి పాడుచునుండ కరగు శిలలు
శారదయు నిల్చె గళమున శాశ్వతముగ.
4.భక్తి పాటలైన బరువుపాటలె యైన
వలపు పాటలైన వరుసగాను
అలుపు లేక తాను యాలపించుచు నుండు
భరతజాతిగన్న భవ్య చరిత.
5.చక్కని గాత్రముఁసతతము
మక్కువ తోడన్ వినియెడి మనుజులు యిలలో
పెక్కురు గలరను మాటయు
నిక్కము,గానపుమధురిమ నెల్లెడ వినిచెన్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కోటి రాగాల శ్రుతి నీవు కోకిలమ్మ,
రిప్లయితొలగించండితేనె కన్న మధురమేదొ తెలిసెనమ్మ
సుస్వరాల సుశీలమ్మ! శుభము గలుగ
నందు కోవమ్మ గానాభి వందనాలు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కోటి రాగాల శ్రుతి నీవు కోకిలమ్మ,
రిప్లయితొలగించండితేనె కన్న మధురమేదొ తెలిసెనమ్మ
సుస్వరాల సుశీలమ్మ! శుభము గలుగ
నందు కోవమ్మ గానాభి వందనములు!
దశదిశల గానవాహిని
రిప్లయితొలగించండియశమందుచు సాగెనమ్మ యంకిత మైనన్!
విశదమ్మై గిన్నీసున
సుశీల! మీ కీర్తిఁ జేరె సుస్వర జతులన్!
దశదిశల గానవాహిని
రిప్లయితొలగించండియశమందుచు సాగెనమ్మ యంకిత మైనన్!
విశదమ్మై గిన్నీసున
సుశీల! మీ కీర్తిఁ జేరె సుస్వర జతులన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాగు పాము కూడ నాట్యమాడును సుమ్మ
రిప్లయితొలగించండినీదుగళములోని నాదమునకు
నీదు జోల పాట నిదు రబుచ్చును సుమ్మ
చంటి పాపల కడు చక్కగాను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితోటలో విరిసిన పారిజాతములన్ని
సాటి యగునే నీదు పాట ముందు
తేటగా చెవి నిండ నీ మధుర గానమ్ము
పూట గడుచును సౌశీల్య భావమందు
వ్రాయాలన్న తపన తప్ప తెలుగు వ్యాకరణమునందు నా జ్ఞానము
పూజ్యము. కేవలం స్వేచ్చా రచన మాత్రమే. మీ బ్లాగులో ప్రవేశించే
అర్హత లేకపోయినా, నా సాహసాన్ని, తప్పొప్పులను
సహృదయంతో మన్నించ గలరు. ___/\___ ...
బండి ఎన్.ఎమ్.రావు గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. సాధనమునఁ బనులు సమకూరు... అన్నారు కదా! స్వస్తి!
మీ పద్యానికి నా సవరణ...
తోటలో కోయిలమ్మల పాటలన్ని
సాటి యగునే సుశీల నీ పాటముందు
చెవుల నీ గాన సుధలివే చేరుకొనగ
పూట గడచును సౌశీల్యపాటవమున.
పూజ్యులు కంది శంకరయ్య గారికి ప్రణామములు.
తొలగించండిసవరణకు మరియు ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
___/\___ ...