26, మార్చి 2016, శనివారం

సమస్య – 1984 (రాముఁడు కన్నీరు కార్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్.

16 కామెంట్‌లు:

 1. గురువు గారికి, కవిమిత్రులకు నమస్సుమాంజలులు  కోమలి సీతను గానక
  రాముడు కన్నీరు గార్చె రావణు డలర
  న్నామగువను విడుచుటయే
  క్షేమమనె విభీషణుండు క్షితిపతి తోడన్ .

  రిప్లయితొలగించండి
 2. కాముని భీకర కృత్యము
  భామిని సీతను పొంద భావ్య మటంచు
  న్నేమని వింతగ జెప్పుదు
  రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్

  రిప్లయితొలగించండి
 3. ఏమందుము విధి లీలల?
  ప్రేమలుఁ బంచెడు సుదతిని విడదీయగఁ, దా
  కాముకుని జేర్చె లంకన్
  రాముఁడు కన్నీరుఁ గార్చె! రావణుఁడలరన్!

  రిప్లయితొలగించండి
 4. శ్యామము పై పయనించుచు
  సోమము తోడుత ననుజుని స్రుక్కగ జేయన్
  భీమరము నసుర తనయుడు
  రాముడు కన్నీరుగార్చె రావణు డలరన్

  రిప్లయితొలగించండి
 5. ఆముని వేషమున సతిని
  నేమరిచి నతడు జటాయునే జంపెగదా
  పామరుడ నేననుచు రఘు
  రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్

  రిప్లయితొలగించండి
 6. కోమలి సీతను గానక
  రాముఁడు కన్నీరు కార్చె; రావణుఁ డలరన్
  కాముకుడై భూమిజ నా
  రామము నందుంచి ,తుదకు క్రాలుని చేరెన్

  రిప్లయితొలగించండి
 7. ఏమా యెనొ నేమొ కాని
  రాముడు కన్నీ రు కార్చె, రావణు డ లర
  న్నామా రీచుడు సీతను
  దా మాయ న్లేడి యగుచు దరికి న్జేర్చెన్

  రిప్లయితొలగించండి
 8. స్వామిని సీతను గానక
  రాముడు కన్నీరు కార్చె, రావణుడలరెన్
  భూమిజను వరించదలచి
  కాముకుడా లంకరాజు ఖైదున బెట్టెన్!!!


  రిప్లయితొలగించండి
 9. రామ దశకంటు దురమున
  సౌమిత్రుo డింద్ర జిత్తు శస్త్రమ్ములచే
  భూమిన్ గూలగ దశరథ
  రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్.

  రిప్లయితొలగించండి
 10. ఆమారీచుని జంపిన
  రాముడు వెనుదిరిగివచ్చి రమణినిగనకన్
  భామను వెదుకుచు నచ్చో
  రాముడు కన్నీరు గార్చె రావణుడలరన్.

  రిప్లయితొలగించండి
 11. .కోమలి సీతను గానక
  రాముడు కన్నీరు కార్చె|”రావణు డలరన్
  ధీమా దుర్మార్గంబే
  సామాన్యుని జేసి చంపు సహజంబదియే|”

  రిప్లయితొలగించండి
 12. రాము ఘననీలిమేఘ
  శ్యామునినేమార్చి తాదశగ్రీవుడు సీ
  తామాతనపహరింపగ
  రాముడు కన్నీరు కార్చె రావణుడలరన్

  రిప్లయితొలగించండి
 13. భూమిజ విరహము నోర్వక
  రాముడు కన్నీరు కార్చె! రావణుడలరన్
  కామము మీరిన వాడై
  తామసు డీతడె యటంచు ధారుణి తలచెన్

  రిప్లయితొలగించండి
 14. సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  అస్వస్థత కారణంగా విడివిడిగా సమీక్షించలేకున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 15. గోముగ రాహులు కౌగిల
  భీముడు మోడియె హడలెను భీతుడు నౌచున్...
  భామా! యిది యెట్లన్నన్: 👇
  రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్ :)

  రిప్లయితొలగించండి