18, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1976 (అరిగణమ్ముల గెలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.
(నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దయచేసి మిత్రుల పూరణలను చదివి స్పందించండి. గుణదోషాలను చర్చించండి. నేనొక్కడనే సమీక్షిస్తే సరిపోదు. మీరంతా మర్యాద నతిక్రమించకుండా, సంస్కారవంతమైన భాషతో విమర్శన చేయండి. స్వస్తి!)

53 కామెంట్‌లు:

  1. ఉత్తరుడు సినిమాలలో చూపినట్లు పిరికివాడు కాదనే భావముతో

    కౌరవులు పాండవులు పోరు కాలమందు
    విరట సైన్యంబు పాండవ పరముకాగ
    రణమునందున ఘన ధర్మరాజు మెచ్చ
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఉత్తరుడు మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి శల్యుని చేతిలో మరణించాడు.

      తొలగించండి
  2. జమ్మి వృక్షమ్ము పైనున్న శస్త్రములను
    బొంది పేడియె క్రీడియై ముందుకురికి
    యరిగణమ్ముల గెలిచె! నుత్తరుఁ డెసంగి
    యుత్తమంబగు సారధ్యమొసఁగినంత!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులు వెన్ను నొప్పినుంచి శీఘ్రమే యుపశమన మందునటుల పరమాత్మునకు ప్రార్థన.

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      ప్రస్తుతానికి నొప్పి కొద్దిగా తగ్గింది. ధన్యవాదాలు.

      తొలగించండి

  3. అర్జునుని గాంచి భయమున అచ్చెరువున
    కౌర వాదుల సైన్యము గాబర పడె
    అరి గణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి
    అతల కుతలమై సైన్యము అటునిటయ్యె !

    రిప్లయితొలగించండి

  4. కవివరుల అన్ని పద్యములు బాగున్నవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'గాబరా' అన్యదేశ్యం కదా! 'కలత పడెను/కలవరపడె' అనండి. 'సైన్యము+అటునిటు' అన్నప్పుడు సంధి నిత్యం. 'సైన్యమే యటునిటు/కురుసైన్య మటునిటు' అనండి.

      తొలగించండి
  5. ఉత్తర కుమార ఫల్గుణు లుత్తములు ప
    రాక్రములును సారథి మహారథులు గోగ్ర
    హణ విముక్త రతులు ఘను లందు నాజి
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్తరుడు : తరువాత చెప్పబడిన వాడు. ఉత్తరకుమార ఫల్గుణులలో ఫల్గుణుడు.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. సమర రంగము నందున సవ్యసాచి
    అరిగణమ్ముల గెలిచె నుత్తరుడెసంగి
    సారథై నిలిచెను తాను యరదమునకు
    విజయులక్ష్మియు వరియించె విజయు నపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.ఉమాదేవి గారు మీ పూరణ బాగుంది. అభినందనములు. తాను+ అరదమునకు= తానరదమునకు. సంధి నిత్యము. యడాగమము రాదు. సార- యర ప్రాస యతి దోషము. ప్రాస పూర్వాక్షరములు రెండూ లఘువులేనా అవ్వాలి లేక గురువులేనా అవ్వాలి.
      “సారథిగ నిలిచెనట తా స్యందనమున” అనిన రెండు దోషములు పోవును. “సవ్యసాచి / యరిగణమ్ముల” అనండి. విజయలక్ష్మియు. బహుశా “యు” ముద్రణా దోషమయి యుండవచ్చును.

      తొలగించండి
    2. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కామేశ్వరరావు గారి సూచనలను గమనించండి.

      తొలగించండి

  7. ధర్మజునిదీవనమిగులదనకుగలుగ నరిగణమ్ములగెలిచెనుత్తరుడెసంగి
    పెద్దవారలదీవనల్కద్దునెడల
    చేయగలరార్య!యెంతటిచేతనైన

    రిప్లయితొలగించండి
  8. విరటుని పశుగణముల నుత్తరపు దిశను
    కౌరవుల్ పట్టుకొని పోవ కదురు కొనగ
    సవ్యసాచికి సూతుడై సంగరమున
    అరిగణమ్ముల గెలిచె నుత్తరు డెసంగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. అర్జునుండేమి జేసెను యావహమున
    యరదమునకునెవ్వారలు సారథైరి
    అరిగణమ్ముల గెలిచెనుత్తరుడెసంగి
    వివరములను దెలుసుకొమ్ము విశదముగను.

    రిప్లయితొలగించండి
  10. అర్జునుండేమి జేసెను యావహమున
    యరదమునకునెవ్వారలు సారథైరి
    అరిగణమ్ముల గెలిచెనుత్తరుడెసంగి
    వివరములను దెలుసుకొమ్ము విశదముగను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      '... జేసెను+ఆహవమున' అన్నప్పుడు యడాగమం రాదు. ఆహవమును ఆవహము అన్నారు. '... జేసినా డాహవమున |నడుమును...' అనండి.

      తొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " అరిగణమ్ముల గెలిచె నుత్తరు డెస౦గి "

    యనుచు నూహి౦చి రా యుత్తరాది వనిత ,

    లతని యనిజోత్తరమ్ముల నాలకి౦చి |

    నిజ మెరి౦గి యనుకొనిరి నెలత లిటుల :--

    గీత లెక్కువ. చెల్లని ప్రాత నాణె

    మునకు ; చేత కా నటువ౦టి పురుషునకును

    కూత లెక్కువ. చేయడు కొ౦చె మేని


    ఉత్త రాది = ఉత్తర. మొదలగు

    అనిజోత్తరములు = అసత్యపు జవాబులు ,
    = కల్ల మాటలు

    రిప్లయితొలగించండి
  12. త్రిపురములు స్వర్ణ,రజత,లోహపుట భేద
    నమ్ములొక్కటై కలియు క్షణమ్మునందు
    భస్మమొనరించె నీశుని పాశుపతము
    అరిగణమ్ముల గెలిచె నుత్తరు డెసంగి
    ఉత్తరుడు=మంచివాడు,శివుడు.

    రిప్లయితొలగించండి
  13. త్రిపురములు స్వర్ణ,రజత,లోహపుట భేద
    నమ్ములొక్కటై కలియు క్షణమ్మునందు
    భస్మమొనరించె నీశుని పాశుపతము
    అరిగణమ్ముల గెలిచె నుత్తరు డెసంగి
    ఉత్తరుడు=మంచివాడు,శివుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. . గోగణములను గొనిపోవు కోర్కె మాన్ప ?
    అడ్డగించెను కౌరవులడ్డుబడిన
    అరిగణమ్ముల గెలిచె|నుత్తరు డెసంగి
    రథమునందున సారదైరాకచేత.
    2.అరిగణమ్ముల గెలిచె నుత్తరు డెసంగి
    రావణాసుర శక్తినిరయముజేసె
    శివుని యాజ్ఞగ రాముడే భవిత మాన్పె|
    దుష్ట తత్వము నిలచునా?శిష్టు లెంచ? {రావణుడు శివుని భక్తుడైనా వరగర్వమునఆహముచే నాశనంబునుకొనితెచ్చుకొనుటయే| }
    ఉత్తరుడు=శివుడు,విష్ణువు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె.ఈశ్వరప్ప గారూ,
      మీ మొదటి పూరణ బాగున్నది. ‘సారథి+ఐ’ అన్నపుడు యడాగమం వస్తుంది.
      రెండవ పూరణ (మీరు వివరణ ఇచ్చినా) అర్థం చేసికొనలేకపోతున్నాను. మన్నించండి.

      తొలగించండి
  15. హరిసఖుండు నరవరుండు సవ్యసాచి
    అరి గణమ్ముల గెలిచె- నుత్తరుడెసంగ
    వీరుడైనట్టి వాడిలవెంటనుండ
    కోరి సారథి పయ్యెను గూర్మితోడ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో యతిదోషం. ‘హరిసఖుఁడు సవ్యసాచియు నరవరుండు’ అందామా? ‘పయ్యెను’ టైపాటు.

      తొలగించండి
  16. హరిసఖుండు నరవరుండు సవ్యసాచి
    అరి గణమ్ముల గెలిచె- నుత్తరుడెసంగ
    వీరుడైనట్టి వాడిలవెంటనుండ
    కోరి సారథి పయ్యెను గూర్మితోడ !

    రిప్లయితొలగించండి
  17. కౌ ర వులపైన విజయమ్ము కూరెననుచు
    తెలిసి గూఢ చారుల నుండి తెల్లముగను
    పలికెను విరాటరాజు తా బలుపు తోడ
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుడెసంగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      నేను ఎదురుచూస్తున్న అంశంతో మీ పూరణ వచ్చింది. బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. విజయ నాదములనువిని నిజముగాను
    ఆలమందలు గొనిపోవ నడ్డగించి
    అరిగణమ్ముల గెలిచె నుత్తరుడెసంగి
    యనుచు మురిసెను విరటుడుఆర్తితోడ!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు మీ పూరణ బాగుంది. అభినందనములు. ఉత్వమునకు సంధి నిత్యము. పాదము చివరనున్న సంధి చేయుట మంచిది. నిజముగాను+ఆలమందలు; విరటుడు+ఆర్తితోడ విసంధి గా వ్రాసిన దోషము. మీరు చక్కగ సవరించగలరని నా నమ్మకము. అటులనే “నడ్డగించి/ యరి” అనండి.

      తొలగించండి
    2. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. కామేశ్వర రావు గారి సూచనలను గమనించారు కదా! ఆర్తితో మురిసె ననడం పొసగదు కదా! మీ పద్యానికి నా సవరణ....
      విజయనాదములను విని నిజముగానె
      యాలమందలు గొనిపోవ నడ్డగించి
      యరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి
      యనుచు మురిసెను విరటుండు హర్షమొప్ప.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువుగారు, శ్రీ కామేశ్వరరావుగారు...

      తొలగించండి
  19. ధన్యవాదములండీ కామేశ్వరరావుగారూ,శంకరయ్య అన్నయ్యగారూ.సవరించుకొంటానండీ.

    రిప్లయితొలగించండి
  20. పశుల గ్రమ్మర గొని రాగ ఫల్గుణుండు
    రంగు పీలికలను జూచి , రణమునందు
    గెలిచె నని దల్చి సోదరి బలికె నిటుల
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    విరటరాట్సుతుఁడును ఘనుఁ డురుతరుఁడయి
    యరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ; డెసంగి,
    సంగరమ్మునఁ గౌరవ సైన్యములనుఁ
    జీల్చుచుం దాను శల్యుని చేతఁ జచ్చె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మఱొక పూరణము:

      జూద మాడుచు విరటుఁడు ♦ చూచి కంకు
      నిట్టులనె "గోగణముఁ గొని, ♦ నిశ్చయముగ
      నరిగణమ్ముల గెలిచె ను♦త్తరుఁ డెసంగి!
      యదిగొ వచ్చుచుండెను! కాంచు ♦ మయ్య కంకు!!"

      తొలగించండి
    2. ఆర్యా వీరమరణముపొందిన మహా వీరునుకి “చచ్చె” పదము బాధాకరముకదా!

      తొలగించండి
    3. గుండు మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. సుకవులు కామేశ్వరావుగారూ నమస్సులు! ఇది బాధాకరమే యైనను సత్యమేకదా! చచ్చు...పరుషముగ నున్నది కావున, దీనిని నీ క్రింది విధమున మార్చుచుంటిని.

      విరటరాట్సుతుఁడును ఘనుఁ డురుతరుఁడయి
      యరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ; డెసంగి,
      సంగరమ్మునఁ గౌరవ సైన్యములనుఁ
      గాల్చి, శల్యుతోఁ బోరి, స్వర్గస్థుఁడయ్యె!!

      స్వస్తి

      తొలగించండి
    5. సత్కవీంద్రులు మధుసూదన్ గారు వందనములు. సవరించినందులకు ధన్యవాదములు.

      తొలగించండి
  22. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మిత్రుల పూరణలను సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. కురువరుల గెలువంగను కోరి వచ్చి
    నరవరుండు తా నిలువంగ నమ్మి తోలె
    యరదమునొడుపుతోడుత, నద్భుతముగ
    నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.

    రిప్లయితొలగించండి