2, మార్చి 2016, బుధవారం

పద్యరచన - 1181

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

26 కామెంట్‌లు:

 1. రామ కార్యమనుచు శ్రమను లెక్కింపక
  భక్తి తోడ నీవు శక్తి మించి
  పాటు పడితి వీవు మేటియే నీ సేవ
  ఉడుత భక్తి యనుచు నుర్వి నిలుచు.

  ధర్మస్థాప నమ్మె దనుజ సంహారమ్ము
  తథ్యమనుచు తలచి తరలు వేళ
  వార్ధి దాట గలుగు వారధినే గట్ట
  ఉత్సహమ్ము నింపె నుడుత సేవ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యాలు బాగున్నవి.
   ‘భక్తితోడ నీవు...పాటుపడితి వీవు’ అని నీవు_ఈవు పునరుక్తి. ‘పాటుపడిత వౌర..’ అనండి.
   ‘ధర్మస్థపన’ అన్నచోట ‘ర్మ’ గురువై గణదోషం. ‘ఉత్సహమ్ము’ అన్న పదం లేదు.

   తొలగించండి
 2. కడలిని నింపగ యిసుకను
  నుడుతా భక్తిని మెచ్చి యుప్పొంగె మదిన్
  నుడివెను ప్రీతిగ రాముడు
  కడుమోదము నీదుచరిత కలకాల మిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది.
   ‘నింపగ నిసుకను’ అనండి. ఉడతా అని దీర్ఘాంతంగా అనరాదు.

   తొలగించండి
  2. కడలిని నింపగ నిసుకను
   నుడుతకు గలభక్తి మెచ్చి యుప్పొంగె మదిన్
   నుడివెను ప్రీతిగ రాముడు
   కడుమోదము నీదుచరిత కలకాల మిలన్

   తొలగించండి
 3. చేసెద నీకు సహాయము
  వేసెద నావంతు రాళ్లు వేగిర నిచటన్
  చూసెద సీత జతన్ ని
  న్నున్ సేతువు జేసెదముర నూరట గనుమా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది.
   చివరిపాదంలో ప్రాస తప్పింది. ‘ని|న్నే సేతువు జేసెదముర నేరుపు మీరన్’ అనండి.

   తొలగించండి
 4. సేతువు కై సాయమ్మును
  జేతును నేనని యుడుతయె చేసెను చూడన్
  చేతుల జేకొని రాముడు
  ప్రీతిగ నిమిరెనుగ మూపు పెట్టెను గుర్తుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 5. ఉడుతతనవంతుసాయమునుత్సుకతన జేయశ్రీరామచంద్రుడుచేతనిమురు చుండెనచ్చటచక్కగజూడుడార్య,
  పూర్వజన్మపుసుకృతముబొందెనుగద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. గురుతర కార్య ధురీణుని
  స్థిరమతి వనధి తరణ సురుచిర సేవా త
  త్పరుని గనుడు రామాంచిత
  కరాంగుళీకృత త్రిరేఖఁ గమనీయముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   అద్భుతమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 7. పుణ్యమేమి చేసె పుడమియందీ ప్రాణి
  రాము స్పర్శ నంది రహిని పొందె
  ఉడత సాయమంచు నుర్విలోని జనులు
  పుణ్యశీలి వంచు పొగడుచుందఅరు.
  2వార్ధి కట్టువేళ వానరులకు తోడు
  సాయ పడగ నెంచి శక్తి కొలది
  నొక్కయుడుత నాడు నుర్వియందు యిసుక
  రాల్చి మెప్పు పొందె రాము చేత.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. వారధి కొరకై పొరలుచు
  నీరస పడిపోతివేమొ నెమ్మది గొనుమా!
  కారుణ్య ధామ! మీ కర
  పూరిత చారలె శమనము పూయించె నయా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. చిన్నదానవైన చేసిన సాయంబు
  మరువలేను నిన్ను మమతతోడ
  "ఉడుతసాయ"మనగ కడుగొప్ప ఖ్యాతిని
  రహినిబొందుమనెను రాఘవుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. వడివడిగా రాళ్ళను గొని
  కడలిని బడవేయుచుండె గట్టగ నడవన్
  ఉడుతనుగని మురిపెముతో
  తడుముచు తన గురుతుల నిడె దశరధ సుతుడే!!!

  రిప్లయితొలగించండి
 11. రామునికార్యమేగనుక లంకకు సేతువు గట్టనెంచగా?
  స్వామిని నమ్మియున్ నుడుత భక్తిగ రేణువు లుంచ సాంద్రమున్
  ఏమి విచిత్ర- ప్రాణియని నెంచినరాముడు |ప్రేమమీరగా
  గోముగ వ్రేళ్ళతో నిముర గుర్తులు నేటికి గానుపించుగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘ప్రాణియని యెంచిన’ అనండి.

   తొలగించండి
 12. ధరణి రక్ష జేయ దనుజ సంహారమ్ము
  తథ్యమనుచు తలచి తరలు వేళ
  వార్ధి దాట గలుగు వారధినే గట్ట
  ఉడుత సాయ మొకటె యుర్వి నిలుచు

  రిప్లయితొలగించండి