రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. మొదటిపాదంలో గణదోషం. ‘పరమేశు బెండ్లియాడగ’ అనండి. ‘పార్వతి+అపుడు’ అన్నపుడు సంధి లేదు. ‘పార్వతి కడు తన్మయపడుచున్’ అనండి.
సీసము: ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు మాకురెండు కనుల మంటలుండు కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు మమ్మునమ్ము జనులు మసియె యగును విషము కంఠమందు వెలసియుండును నీకు కాయమంతయు మాకు గరళముండు నందివాహనమొండు నమరియుండును నీకు ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారూ...సుకవి మిత్రులారా....
నే నీ మధ్య ’అయుత కవితా యజ్ఞము’న ప్రకటించిన పద్యములను నా బ్లాగు "అయుత మధుర కవితా స్రవంతి"లోఁ బ్రచురించితిని. వాని నామూలాగ్రముగఁ బరిశీలించి మీ యమూల్యమైన యభిప్రాయములనుం దెలుపఁగలరని మనవి.
పరమేశుని పెండ్లి యాడగ
రిప్లయితొలగించండితరుణీమణి పార్వ తపుడు తన్మయ మందున్
సురలందరు దీవించగ
విరిమాలను వేసెనంట వేడుక మీరన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
మొదటిపాదంలో గణదోషం. ‘పరమేశు బెండ్లియాడగ’ అనండి. ‘పార్వతి+అపుడు’ అన్నపుడు సంధి లేదు. ‘పార్వతి కడు తన్మయపడుచున్’ అనండి.
పరమేశు పెండ్లి యాడగ
తొలగించండితరుణీమణి పార్వతి కడు తన్మయ పడుచున్
సురలందరు దీవించగ
విరిమాలను వేసెనంట వేడుక మీరన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆది బిక్షువునికి ఆమె సతియనగ
ఆకసమున కురిసె అందముగను
పూల వర్షమనగ పూబోణి వేసెను
పతికి మాల భువి శుభములు గనగ
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘ఆదిభిక్షువునకు నామె...’ అనండి.
ఓం నమః శివాయ
రిప్లయితొలగించండిమీకు అందరికీ మహేశ్వరానుగ్రహము కలుగుగాక.
సీసము:
ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు
మాకురెండు కనుల మంటలుండు
కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు
మమ్మునమ్ము జనులు మసియె యగును
విషము కంఠమందు వెలసియుండును నీకు
కాయమంతయు మాకు గరళముండు
నందివాహనమొండు నమరియుండును నీకు
ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు
తేటగీతి:
శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె
అవగుణమ్ములు మాకవి యనెడు మమ్ము
మందబుద్ధుల దీవించ మదిని గొలుతు
తలలు మార్చెడు వాడ ! మా తలపు మార.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
‘జనులు’ బహువచనం కదా... ‘మసి యగుదురు’ అనండి.
మాస్టరుగారూ! చక్కని సవరణకు ధన్యవాదములు
తొలగించండిహరివాగీశాదిగ సుర
రిప్లయితొలగించండివరగణ సేవిత వధువును వరునిం గనుడీ
దురితౌఘ హరము ఘన శుభ
కరమ్ము గిరిజా పురహర కళ్యాణ మిలన్
వందన మాచరింతు మదిఁ బర్వత రాజ తనూజ భర్తకున్
చందనభస్మగంధ పరి సర్పిత గాత్రుడు చంద్రమౌళికిన్
నందిత భృంగి శృంగి వర నంది పిశాచ గణాధినేతకున్
సుందర ఫాలనేత్ర పరి శోభిత వక్త్రు పినాకపాణికిన్
శ్రీశైలాగ్రతటీస్థ పుణ్యజన సంసేవ్యుండు మల్లన్ననున్
కాశీక్షేత్ర విరాజితున్ శివుని ద్రాక్షారామ భీమేశ్వరున్
రాశీభూత దయాపయోనిధిని సద్రామేశ్వ రాలంకృతు
న్నీశానీ కర పూజితాంఘ్రియుగ దేవేశుం భవున్ వేడెదన్
హరహర! మహా సురా! హిమ
గిరివరవాస! నటరాజ! గిరిజానాథా!
పుర త్రయ హరా! దయాకర!
సురాపగాజూటధీర! సుందర! ప్రణతుల్
మూర్ధవిరాజిత సోమున్
తొలగించండిదుర్ధర్షాభీల గరళ దోషిత కంఠు
న్నర్ధేశ సఖుఁ దలతు వా
మార్ధస్థిత శైలసుతు నుమాశంకరునిన్
మిత్రులు కామేశ్వర రావు గారూ...మీ పద్యములు చాల బాగుగ నున్నవి. శుభాభినందనలు!
తొలగించండిమధుసూదన్ గారు ధన్యవాదములు. మీవంటి కవీశ్వరుల ప్రశంస లందుకున్నందులకు ధన్యుడను. మీకు మీ కుటుంబానికి శివరాత్రి శుభాకాంక్షలు.
తొలగించండిమిత్రులు కామేశ్వర రావు గారూ...ధన్యవాదములు!
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ఎల్లరకూ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశివ! శివ! నీదు పాదమునుఁ జేరుదు నీదు కటాక్షమున్నచో,
భవమును దాటిపోనగును పాపము, పుణ్యము, చావుపుట్టుకల్,
రవ పరిమాణమేని మిగులంగల జాలవు దేవరా! హరా!
కవనము వ్రాసి నిన్నుఁ గన కౌశలమైన యొసంగనెంచుమా!
పెద్దల సూచనననుసరించి సవరణ.
తొలగించండిశివ! శివ! నీదు పాదములఁ జేరుదు నీదు కటాక్షమున్నచో,
భవమును దాటిపోనగును పాపము, పుణ్యము, చావుపుట్టుకల్,
రవ పరిమాణమేని మిగులంగల జాలవు దేవరా! హరా!
కవనము వ్రాసి నిన్నుఁ గన కౌశలమైన నొసంగనెంచుమా!
నిన్నుఁగను
తొలగించండిలక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గిరిసుత మనోభి రాముడు
రిప్లయితొలగించండిపరమేశ్వరుడే తరుణిని పరిణయ మాడన్
సురవంద్యుల పెండ్లియనుచు
సురగణమేవచ్చె, కురిసె సుమవర్షమ్మే
గిరిసుత మనోభి రాముడు
రిప్లయితొలగించండిపరమేశ్వరుడే తరుణిని పరిణయ మాడన్
సురవంద్యుల పెండ్లియనుచు
సురగణమేవచ్చె, కురిసె సుమవర్షమ్మే
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివ రాత్రి పర్వ దినమున
రిప్లయితొలగించండిశివ శివ యని పలుకు నంత శివ సాయుజ్యం
భవ! యని బలుకును భవు దట
భవ భవ యని పలుక రాదె భాగ్యము కొరకై .
గిరిజా కళ్యాణము శుభ
రిప్లయితొలగించండికరముగ జరుగు చుండె గాం చిరె యచట
న్విరి దండను నా శివునకు
కరములతో వేయుచుండె గమనీయ ముగన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి.
మొదటి పద్యంలో ‘సాయుజ్యం| బవలీలగ లభియించును’ అనండి.
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమారుని మంటలఁ గాల్చి కు
మారిని భర్గుఁడు వివాహమాడెడు వేళన్
జారెను నింగినిఁ బూవులు
శౌరి,నలువలాది సురలు సంవీక్షించన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘శౌరి విరించ్యాది సురలు...’ అంటే బాగుంటుందేమో?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండిమారుని మంటలఁ గాల్చి కు
మారిని భర్గుఁడు వివాహమాడెడు వేళన్
జారెను నింగినిఁ బూవులు
శౌరి విరించ్యాది సురలు సంవీక్షించన్!
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి...సుకవి మిత్రులందఱకును
రిప్లయితొలగించండిమహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
ఓం నమః శివాయ!
తేటగీతి (మాలిక):
శ్రీమహాదేవ! గౌరీశ! శివ! మహేశ!
ప్రణవ రూప! సదానంద! భవ విదూర!
భూత నాథ! సనాతన! బుద్ధ! శుద్ధ!
పార్వతీ వల్లభ! వరద! భర్గ! శంభు!
చంద్ర శేఖర! పరమేశ! శాశ్వత! హర!
దీక్షిత! త్రిణయన! దివ్య! దివిజ వంద్య!
కామిత ఫలద! కామేశ! కామ నాశ!
దుష్ట శిక్షక! శ్రితపక్ష! శిష్ట రక్ష!
దక్షజా వర! దీక్షిత! దక్ష హంత!
త్రిపుర హంత! పరాత్పర! త్రిభువన నుత!
మౌని సంభావ్య! సుర హిత! మాధవ సఖ!
వేద వేద్య! శుభంకర! విశ్వరూప!
శార్ఙ్గ హస్త! సద్గురువర! శర్వ! సాంబ!
త్ర్యక్ష! మృత్యుంజయ! దిగంబర! సుర సేవ్య!
సింధురాస్య షడాస్యాధిసేవిత పద!
పూర్ణ! నటరాజ! శంకర! బుధ్న! రుద్ర!
నాగభూషణ! భూరి! పినాకపాణి!
తాండవ విలోల! దేవేశ! దహన నయన!
పాపనాశక! శాస్త! తాపత్రయఘ్న!
దక్షిణామూర్తి! సాంఖ్య! నృత్యప్రియ! భవ!
నీలకంఠ! భస్మాంగ! త్రిశూలధారి!
వ్యోమకేశ! ఋతధ్వజ! యోగివంద్య!
శైలకార్ముక! లయకారి! శక్రవినుత!
నందివాహన! హింస్ర! పినాకపాణి!
రుద్ర! జగదేక భద్ర! విరూప నయన!
జలధి తూణీర! హీర! శ్మశాన వేశ్మ!
దక్షయజ్ఞ విధ్వంసక! త్ర్యంగట! భగ!
ధూర్జటి! హిరణ్యరేతస! ద్రుహిణ! సోమ!
వామదేవ! స్వయంభూత! ఫాలనేత్ర!
విషమ నేత్ర! విశ్వాత్మక! విశ్వనాథ!
మంగళప్రద! భీషణ! మందర మణి!
శేష కటక! గంగాధర! చేకితాన!
మృగధర! క్ష్వేళగళ! సర్గ! మృడ! కపర్ది!
మేరు ధామ! వృషాకపి! మేరు ధన్వ!
కృత్తివాస! కాలాంతక! లింగమూర్తి!
ప్రమథనాథ! పింగళ! హీర! శమన వైరి!
మలహర! భువనేశ! కరిచర్మాంబరధర!
ధ్రువ! జటాజూటధర! కపాలి! విధు! సూక్ష్మ!
మేచకగ్రీవ! వృషపర్వ! మృత్యునాశ!
దేవదేవ! మహానట! తే నమోఽస్తు!
ఓం నమః శివాయ!
కవిజన విధేయుఁడు
గుండు మధుసూదన్
మధుసూదన్ గారూ సహస్రనామావళి నిభమైన మీ శివస్తుతి నిజముగ నత్యంత భక్తిప్రదముగ మనోహరముగనున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులు కామేశ్వర రావు గారూ...ధన్యవాదములు!
తొలగించండివాణీపుత్రులు మధుసూదన మిత్రులకు నమోనమః
తొలగించండిమధుసూదన్ గారూ ! శివమయ మైన నామావళి ..చక్కగా కూర్చారు
తొలగించండి_/\_ _/\_ _/\_
తొలగించండిసుకవి మిత్రులు మిస్సన్న గారూ...ధన్యవాదములు...నమస్సులు!
తొలగించండిసుకవి మిత్రులు హనుమచ్ఛాస్త్రి గారూ...ధన్యవాదములు...నమస్సులు!
సుకవి మిత్రులు సహదేవుఁడు గారూ...ధన్యవాదములు...నమస్సులు!
_/\_ _/\_ _/\_
తొలగించండిగుండు మధుసూదన్ గారూ,
తొలగించండిసంబోధనాంకితమైన మీ తేటగీతిక శివమయమై, శివకరమై విరాజుల్లుతున్నది. అభినందనలు.
పరిణయమాడెను శుభముగ
రిప్లయితొలగించండిపరమేశుడు ప్రేమమీర పర్వత తనయన్
మురియుచు దేవత లందరు
కురిపించిరి పూలజల్లు కూరిమి తోడన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దేవగణంబులెల్ల కడు దీప్తులు నింపగ, తాపసోత్తముల్
రిప్లయితొలగించండిభావజహారికిన్నగజ భామిని ప్రేమవిలాసశైలికిన్
సేవగ భక్తి తత్పరత జేసిరి పెండిలి వైభవంబుగన్
కావగనెల్ల లోకములు కన్నులపండువు కాంచరండహో!
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
భూతసంఘమ్ములుభీతిని కల్గింప
రిప్లయితొలగించండి.........గిరిబందు లరసిరి కిక్కురనక
తారకాసురునకు దగ్గరపడెనని
.........సురలు మింటను జేరి మురిసిపడిరి
ఒక యింటివాడయ్యె నిక చింతలేదని
.........ప్రమధులు తనిసిరి ప్రభువును గని
వలచిన నాథుని తిలకించి శైలజ
.........తలవంచె సిగ్గుతో తత్తరపడి
పుఱ్ఱె దండల పై వైచె పూలమాల
శివుని కంఠాన పార్వతి శిరము వంచి
తనను గెలిచిన తరుణిని తరచి చూచి
తల్లి దొరకె జగతి కని తలచెశివుడు.
పులితోలు మారెను కలికి తాకినయంత
........కనకచేలముగ శంకరుని మేన
సర్పహారమ్ములు చక్కగా సురసాల
........పుష్పదామములాయె పురహరునకు
శవభస్మ చారికల్ క్షణములో పరిమళ
.......చందన చర్చగా జ్వాలి కమరె
చిచ్చర కన్నాయె ముచ్చట గొలిపెడి
.......బొట్టుగా నొసటను భూతపతికి
పార్వతీకరగ్రహణపర్వంపు వేళ
విరియ ముక్కోపి మొగములో చిరునగవులు
అజుడు శ్రీహరి గుసగుస లాడిరంత
నెంత వారలు దాసులే కాంత కనుచు.
_/\_ _/\_ _/\_
తొలగించండి_/\_ _/\_ _/\_
తొలగించండిమిత్రులు మిస్సన్న గారూ... మీ "శివపార్వతుల కళ్యాణ" పద్యములు చాల బాగుగనున్నవి. శుభాభినందనలు!
తొలగించండిధన్యోస్మి మధుసూదన మిత్రమా! మీవంటి కవిపుంగవుని మెచ్చుకోలు నాకు బహుసంతోషదాయకం.
తొలగించండిసహదేవుడుగారూ ధన్యవాదములు.
మిస్సన్న గారూ! కల్యాణకరమైన పద్యాలు చక్కగా ఉన్నవి.
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిపార్వతీ పరమేశ్వరుల కళ్యాణఘట్టాన్ని మనోహరంగా వర్ణించిన మీ పద్యాలు అద్భుతంగా, ఆహ్లాదప్రదంగా ఉన్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు.
తొలగించండిహనుమఛ్చాస్త్రిగారూ ధన్యవాదాలు.
ఆకాశంబొక పందిరైనిలచె|ఆర్భాటాల నానందమున్
రిప్లయితొలగించండి“లోకేశుండట పెళ్లి పందిటన ముల్లోకాలు వీక్షించగా
కాకాబట్టిన పార్వతీ పతిగ సంకల్పంబు జేకూర్చగా?
లోకంబంతట సంబరాలెగద|మాలోపంబుమన్నించుమా
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘పందిటను’ అనండి. ‘కాకాబట్టిన’...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమదను భాణపు ధాటికి మతిచలించ
రిప్లయితొలగించండికనలి దహియించి మూడవ కన్నుతోడ
పిదప పెండ్లాడె శైలజన్ ప్రేమ మడర
శౌరి బ్రహ్మాది దేవతల్ సంతసించ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారూ...సుకవి మిత్రులారా....
రిప్లయితొలగించండినే నీ మధ్య ’అయుత కవితా యజ్ఞము’న ప్రకటించిన పద్యములను నా బ్లాగు "అయుత మధుర కవితా స్రవంతి"లోఁ బ్రచురించితిని. వాని నామూలాగ్రముగఁ బరిశీలించి మీ యమూల్యమైన యభిప్రాయములనుం దెలుపఁగలరని మనవి.
బ్లాగు చిరునామా:అయుత మధుర కవితా స్రవంతిపై క్లిక్ చేయండి.
భవదీయుఁడు
గుండు మధుసూదన్
రిప్లయితొలగించండిమిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
పార్వతి తపస్సు:
1.ఆ.వె:దక్షయఙ్ఞమందు దాక్షాయణీ దేవి
దగ్ధమవగ గాంచి తల్లడిల్లి
తాను తపము చేయదలచి మదిని,సాగె
శీతశైలమునకు శివుడు తాను.
2.తే.గీ:తారకాసురుడనియెడు దనుజుడొకడు
బ్రహ్మ వలన తాను వరము బడసి కోరె
శంకరు తనయుని వలన చావు వలయు
ననగ తపము భంగ పరుప నరిగె మరుడు.
3.కం: మారహరుని తాను పతిగ
కోరుచు హైమవతి వేగ కుధరము చెంతన్
చేరి తపము చేయుదు ననగ
గిరి రాజను మతి నొసంగి గిరిజను పంపెన్
4ఆ.వె: మంచి పుటముఁదాల్చు మహరాజ సుత నాడు
నార చీర కట్టె నయము గాను
పట్టు పాన్పు పైన పవళించు పడతి తా
కటిక నేల పైన కనులు మూసె(నిద్రించె).
5.ఆ.వె:తపము చేయుచుండె తాపసి వోలె తా
నొంటికాలిపైన నువిద యచట
పర్ణములను కూడ బక్షించని యతివఁ
గాంచి ముదము తోడ కరుణ జూప
6.ఆ.వె:పరమశివుడు వచ్చె వటురూపమును దాల్చి
మాట కలిపె తాను మంచిగాను
హితుల మైతి మంచు హితవుగా పల్కుచు
తపము మాను మనియె తరుణి తోడ.
7.సీ:సుదతి తపము తీరు చూడంగ నచ్చోట
మదినెంచి యేతెంచె మార హరుడు
తపమేల యనుచును తరుణీమణి నడుగ
పరమేశు కొరకనె పడతి తాను
పరిపరి విధముల పరిహాసములు చేయు
భవుని పల్కులు విని పార్వతచట
చెవులు మూసుకొనుచు శివ నిందవలదంచు
వారించె వటునట వడిగ తాను
ఆ.వె:వెంట బడుచు తిరుగు వేషధారిని జూచి
ఛీత్కరించి తాను శీఘ్రముగను
మొగము త్రిప్పుకొనగ,ముదమార నవ్వుచూ
కనుల యెదుట నిలిచె కంతు హరుడు.
8.ఆ.వె:నమ్మి కొలిచినట్టి నగరాజ నందినిన్
పెండ్లి యాడె శివుడు పేర్మి తోడ
భువన త్రయము మెచ్చ పూలవాన కురిసె
మురిసె జగతి యెల్ల ముదము తోడ.
9.ఆ.వె:కనుల యెదుటె శివుడు కంతుని చంపంగ
మారహరుని పతిగ కోరి గిరిజ
నారదాది మునులు నాశీర్వదింపంగ
తపము చేసి తాను త్ర్యక్షు పొందె.
10.ఆ.వె:ఉమయు తపముచేయ ఊర్ధ్వలోకములెల్ల
నిలిచి చూచెగాదె నింగి లోన
కపట యతిగ వచ్చి కల్యాణమాడెగా
శంకరుండు తాను సంతసాన.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పార్వతీపరిణయము ఖండకృతి బాగున్నది. అభినందనలు.
శివపార్వతులపెళ్లి శ్రీ శైలమనుకున్న?
రిప్లయితొలగించండి-------కోటప్పకొండలోకొందరనిరి
కాశి విశ్వేశుని కళ్యాణ మనియెంచ?
------మహానందిలో గంటి మంటపాలు
ద్వాదశ లింగాల దర్శించుభక్తుల
------కగుపించె పెళ్ళిళ్ళు సొగసుమీర
ఓంకారమందునా?ఓంశాంతి యందునా?
------గుడులందు పెళ్ళిళ్ళు గుట్టు దరిగె
భక్త కోటిని పిలువకే పట్టుదలగ
నడచివచ్చిరి హరహర నమ్మకాన
మూడులోకాలభక్తులు ముంగిటున్న?
సూర్య,చంద్రులు పెళ్లినిజూడరేల?
3.వెలుగు నింపెడి వేల్పులే నలుగుటేల?
సంబరమ్మున మరచుట సాకుగాదు.
మంచి బెంచెడి మహనీయమంత్రులనగ?
పెంచి కోపాన సూర్యుడునుంచె వేడి
2.ఆదిదేవుని పెళ్లి మా మోదమనుచు
గ్రామ,గ్రామాలు జేయగ రక్ష మాకు
శక్తి నాసక్తి పార్వతి యుక్తిచేత
పరిణయంబాయె శివునితో భారతాన|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
శివరాత్రి నేడు వచ్చెగ!
రిప్లయితొలగించండిశివశివ యనిపారెను చలి సిగ గోసినటుల్
శివభక్తు లెల్లరికినిట
శివరాత్రిని జాగరణను సినిమాల్ సినిమాల్!