కవులు వర్ణింప లేరైరి కపుల చేష్టలశ్వమైనను కుక్కైన హరిణమైననొక్కటేగద తనకంచు నెక్కి తిరుగుమర్కటమ్ముల గాంచరే మహిని యందు
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనిషికి వాహనములు మెండు మనకేమి తక్కువ సవారి మర్కట మైనన్ కనులకు కనుపించిన మరి వెనుదిరుగక బోవనెంచె వేగిర పడగన్
రాజేశ్వరి అక్కయ్యా,మీ పద్యం బాగున్నది.మొదటిపాదంలో గణదోషం. ‘మనిషికి యానము లెక్కువ’ అనండి.
జింక కోతియు యడవిలో చేరి వెడలె జింక మూపున కోతి అజీర్ణ మనగ సొలసి సొమ్మసిల్లి పరుండె సొగసు చూడ సమరస మన నిదియె గదా సఖి జిలేబి !సావేజితజిలేబి
జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. ‘కోతియు నడవిలో...’ అనండి.
›చిత్రమాయదిజూడగజిత్రమాయె లేడివీపుననెక్కియులీలగాను చూచుచుండెనుదిక్కులుచోద్యమలర కాంచితిరెమీరుమర్కటకందళిలను
పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది.‘మర్కట కందళిలను’...?
కందళి అనగా జింక
సత్సంగోత్సాహఘనులుమాత్సర్యవిగుణవిహీనమహిమోన్నతులున్తాత్సారఖాదనవిహారోత్సుకులిరువురుఁ గురంగయుగళముగనరే
పోచిరాజు కామేశ్వర రావు గారూ, కురంగ యుగళాన్ని గురించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
. హరిణము నెక్క మర్కటమె|”అంతర మందున మిత్ర తత్వమేతరచుగ గానుపించగ?వితండ వితర్కము లేల మానవా?పరువపు వేగమెంచక,నపాయము లుంచక జీవజాలపున్కరుణను బెంచుమో యనుచు గన్పడు చిత్రము నీతిబంచుగా2.చుక్కలచీరగట్టుకొని చూడగ నందపుతోడునీడగాటక్కుననున్నలేడి గని టక్కున కోతియువీపు నెక్కియున్చక్కగ గూరుచుండగ విచారము నెక్కడ గానుపించదే|మక్కువ మానసాన నణుమాత్రము నిల్చిన లాభమే గదా|”
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కోతిగంతులిడుచు కొమ్మలనెగబ్రాకియలసిసొలసి యుండె హనుమ యచటసేదదీరు కొఱకు చిన్నగ యోచింపవచ్చె సుఖమునీయ మచ్చ లేడి!
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కూర వాటికి చక్కని కూర్మి పేర్మి లేడి వృష్ట ము పై కెక్కి లీలగానువిశ్ర మించుచు నుండె నా పింగళమ్ము చూచు వారి కా దృశ్యము శోభ గూర్చె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కూర’..? ‘కూడ వాటికి..’ అని మీ భావం కదా!
Yes sir.
ఆ నరుడెక్కెను తురగమువానరుడ,కురంగముపయి వ్రాలగ తగనా?నేనా శ్రీ రామునికైఆనాడు సహాయ పడితి నాహవమందున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రామాజ్ఙానుసారము సీతమ్మకొరకు వెతికే ఓ వానర ప్రయత్నం:సీతమ్మ నపహరించగమా తండ్రినొక హరిణమ్మె మాయలు జేసెన్!చేతనగు సాయ మీయవెయే తావున నుండె తానొ యినకులుఁడెరుఁగన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
1కోతి చేష్ట చూడ కూరిమిగా తోచుకొండ లెక్కగలదు కొమ్మలెగురులేడి మూపు నెక్కి లీలగా కూర్చొన్నమర్కటమును గనుడు మనుజులార.2.హరియునెక్కె తాను హరిణమ్ము మూపుపైజడుపు లేక యెక్కె సంతసానమత్సరమ్ములేక మసిలేటి జీవులన్చూడ చూడ మురియు చుండు మనసు/మనము3.నరుడు యెక్కె మూపు నాడు కూరిమితోడశత్రు మూకఁజంపి జయము నందెహరియు యెక్కినట్టి హరిణమున్ గాంచగవేడ్క తోడ రండు వెలదులార.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. ‘మసిలేటి’ అనడం వ్యావహారికం. ‘మసలెడు’ అనండి.‘నరుడు+ఎక్కె’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘నరుడు మూపు నెక్కె’ అనండి. అలాగే ‘హరియు నెక్కినట్టి’ అనండి.
కవులు వర్ణింప లేరైరి కపుల చేష్ట
రిప్లయితొలగించండిలశ్వమైనను కుక్కైన హరిణమైన
నొక్కటేగద తనకంచు నెక్కి తిరుగు
మర్కటమ్ముల గాంచరే మహిని యందు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనిషికి వాహనములు మెండు
రిప్లయితొలగించండిమనకేమి తక్కువ సవారి మర్కట మైనన్
కనులకు కనుపించిన మరి
వెనుదిరుగక బోవనెంచె వేగిర పడగన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
మొదటిపాదంలో గణదోషం. ‘మనిషికి యానము లెక్కువ’ అనండి.
రిప్లయితొలగించండిజింక కోతియు యడవిలో చేరి వెడలె
జింక మూపున కోతి అజీర్ణ మనగ
సొలసి సొమ్మసిల్లి పరుండె సొగసు చూడ
సమరస మన నిదియె గదా సఖి జిలేబి !
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘కోతియు నడవిలో...’ అనండి.
రిప్లయితొలగించండి›
చిత్రమాయదిజూడగజిత్రమాయె
లేడివీపుననెక్కియులీలగాను చూచుచుండెనుదిక్కులుచోద్యమలర కాంచితిరెమీరుమర్కటకందళిలను
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది.
‘మర్కట కందళిలను’...?
కందళి అనగా జింక
తొలగించండిసత్సంగోత్సాహఘనులు
రిప్లయితొలగించండిమాత్సర్యవిగుణవిహీనమహిమోన్నతులున్
తాత్సారఖాదనవిహా
రోత్సుకులిరువురుఁ గురంగయుగళముగనరే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండికురంగ యుగళాన్ని గురించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండి. హరిణము నెక్క మర్కటమె|”అంతర మందున మిత్ర తత్వమే
రిప్లయితొలగించండితరచుగ గానుపించగ?వితండ వితర్కము లేల మానవా?
పరువపు వేగమెంచక,నపాయము లుంచక జీవజాలపున్
కరుణను బెంచుమో యనుచు గన్పడు చిత్రము నీతిబంచుగా
2.చుక్కలచీరగట్టుకొని చూడగ నందపుతోడునీడగా
టక్కుననున్నలేడి గని టక్కున కోతియువీపు నెక్కియున్
చక్కగ గూరుచుండగ విచారము నెక్కడ గానుపించదే|
మక్కువ మానసాన నణుమాత్రము నిల్చిన లాభమే గదా|”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కోతిగంతులిడుచు కొమ్మలనెగబ్రాకి
రిప్లయితొలగించండియలసిసొలసి యుండె హనుమ యచట
సేదదీరు కొఱకు చిన్నగ యోచింప
వచ్చె సుఖమునీయ మచ్చ లేడి!
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కూర వాటికి చక్కని కూర్మి పేర్మి
రిప్లయితొలగించండిలేడి వృష్ట ము పై కెక్కి లీలగాను
విశ్ర మించుచు నుండె నా పింగళమ్ము
చూచు వారి కా దృశ్యము శోభ గూర్చె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కూర’..? ‘కూడ వాటికి..’ అని మీ భావం కదా!
Yes sir.
తొలగించండిఆ నరుడెక్కెను తురగము
రిప్లయితొలగించండివానరుడ,కురంగముపయి వ్రాలగ తగనా?
నేనా శ్రీ రామునికై
ఆనాడు సహాయ పడితి నాహవమందున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రామాజ్ఙానుసారము సీతమ్మకొరకు వెతికే ఓ వానర ప్రయత్నం:
రిప్లయితొలగించండిసీతమ్మ నపహరించగ
మా తండ్రినొక హరిణమ్మె మాయలు జేసెన్!
చేతనగు సాయ మీయవె
యే తావున నుండె తానొ యినకులుఁడెరుఁగన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
1కోతి చేష్ట చూడ కూరిమిగా తోచు
రిప్లయితొలగించండికొండ లెక్కగలదు కొమ్మలెగురు
లేడి మూపు నెక్కి లీలగా కూర్చొన్న
మర్కటమును గనుడు మనుజులార.
2.హరియునెక్కె తాను హరిణమ్ము మూపుపై
జడుపు లేక యెక్కె సంతసాన
మత్సరమ్ములేక మసిలేటి జీవులన్
చూడ చూడ మురియు చుండు మనసు/మనము
3.నరుడు యెక్కె మూపు నాడు కూరిమితోడ
శత్రు మూకఁజంపి జయము నందె
హరియు యెక్కినట్టి హరిణమున్ గాంచగ
వేడ్క తోడ రండు వెలదులార.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి.
‘మసిలేటి’ అనడం వ్యావహారికం. ‘మసలెడు’ అనండి.
‘నరుడు+ఎక్కె’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘నరుడు మూపు నెక్కె’ అనండి. అలాగే ‘హరియు నెక్కినట్టి’ అనండి.