7, మార్చి 2016, సోమవారం

సమస్య – 1965 (శివరాత్రికిఁ జేయవలెను...)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్.

55 కామెంట్‌లు:

 1. శుభోదయం

  కవి జెప్పెను జాగారము
  శివరాత్రికిఁ జేయవలెను, శ్రీహరి పూజల్
  నవవాసంతాగమునన్
  కవనము జేయు శుభవేళ కలదెల్లపుడున్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. శివునకు ప్రీతట జలకము
  శివరాత్రికిఁ జేయవలెను ,శ్రీహరి పూజల్
  అవతారము మారి నపుడు
  నవలోకించ గనుజేయు నాయా విధముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. పూరణ సంతృప్తికరంగా లేదు.
   ‘ప్రీతి+అట’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘పూజల్ అవతారము’ అని విసంధిగా వ్రాశారు.

   తొలగించండి
  2. శివునకు ప్రీతియె జలకము
   శివరాత్రికి జేయవలెను ,శ్రీహరి పూజల్
   నవవిధ భక్తిని గొలిచిన
   భవితవ్యము శివకేశవుల భారమ టంచున్

   తొలగించండి
  3. అక్కయ్యా,
   సవరించిన పూరణ బాగున్నది.
   చివరిపాదంలో గణదోషం. ‘భవితవ్యము హరిహరులదె భార మటంచున్’ అనండి.

   తొలగించండి
 3. శివునికి యభిషేకమ్ములు
  శివరాత్రికిఁ జేయవలెను, శ్రీహరి పూజల్
  నవవిధ భక్తిన్ సర్వులు
  సవినయముగ జేయునెడల సద్గతి గల్గున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘శివునకు నభిషేకమ్ములు’ అనండి.

   తొలగించండి
 4. శివపూజలు,యుపవాసము
  శివరాత్రీకి జేయవలెను.శ్రీహరి పూజల్
  శివకేశవులకు భేద మ్మవనిని లేదన జెందును అసమాక్షునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘శివపూజలు నుపవాసము’ అనండి. చివరిపాదంలో గణదోషం. ‘...మ్మవనిని లేదనగ జెందు నసమాక్షునకున్’ అనండి.

   తొలగించండి
 5. శివపూజలు,యుపవాసము
  శివరాత్రీకి జేయవలెను.శ్రీహరి పూజల్
  శివకేశవులకు భేద మ్మవనిని లేదన జెందును అసమాక్షునకున్

  రిప్లయితొలగించండి
 6. శివకేశవ భేదంబే
  ల? వలద నవసరపు కలవరములు జనులకున్
  శివపూజలతో నింపుగ
  శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. స మ స్య

  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { తిరుపతి లో నివాస మున్న నేను శ్రీశైలము
  పోనేల ? తిరుమలేశునే అర్చి౦చ వలయునని నిర్ణయి౦చు కున్నాను . ఏలయన శివ
  కేశవు లిరువు రొకటే కదా ! }


  నివసి౦చెద తిరుపతి లో

  న | వడిగ శ్రీనగమునకు జన నవసర౦బే ?

  శివ కేశవు లొకటే ! నే

  శివరాత్రికి చేయ వలయు శ్రీహరి పూజల్ .

  రిప్లయితొలగించండి
 8. గురువుగారికి కవి మిత్రులకు నమస్కారములు
  మహా శివరాత్రి శుభాకాంక్షలు

  భవనాశికి యభిషేకము
  శివరాత్రికి జేయవలయు , శ్రీహరి పూజల్
  కువలయమందున జేతురు
  నవరాత్రులపేర రామనవమిన గాదే

  భవభయ హరులౌ శివకే
  శవులకు భేదమ్ము లేదు శంభుని గొల్వ
  న్నవకాశము లేకుండిన
  శివరాత్రికి జేయవలయు శ్రీహరి పూజల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   ‘భవనాశికి నభిషేకము’ అనండి.

   తొలగించండి
 9. శివ రాత్రి పర్వ దినమున
  శివ శివ యని పలుకు నంత శివ సాయుజ్యం
  భవ! యని బలుకును భవు దట
  భవ భవ యని పలుక రాదె భాగ్యము కొరకై .

  రిప్లయితొలగించండి
 10. భువి జేయును జాగారము
  శివరాత్రికి, జేయవలెను శ్రీ హరి పూజల్ల
  నవరత మున్బ్ర తియొక్కరు
  కువలయమున మంచి బ్రదుకు గూర్చుట కొ ర కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటిపూరణలో మూడవపాదం అర్థం కాలేదు. ‘శివసాయుజ్యం| బవలీలగ లభియించును’ అంటే ఎలా ఉంటుంది?
   రెండవపూరణలో ‘పూజల్+అనవరతము’ అన్నపుడు లకారానికి ద్విత్వము రాదు. ద్రుతాంతపదాలకే ఆ అవకాశాన్ని పూర్వకవులు కల్పించారు.

   తొలగించండి
 11. శివునికి యభిషేకములను
  శివరాత్రికిఁ జేయవలెను ; శ్రీహరి పూజల్
  నవరాత్రిని యామని లో
  భవబంధ విముక్తి కొఱకు పలుజేయవలెన్

  శివ కేశవు లొకరేనని
  జవసత్వము లుడుగు వరకు జపమొనరించ
  న్నవగతమై తపసి బలికె
  శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటిపూరణలో ‘శివునకు నభిషేకములను’ అనండి.
   రెండవపూరణలో ‘...లొకరే యని’ అనండి.

   తొలగించండి
 12. ప్రవచనములతో పూజల
  సవరింతుము నేడు మీకు సాంబశివా!మీ
  రెవరిఁ గొలుతురన ననె "నే
  శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్"

  రిప్లయితొలగించండి
 13. కం శివమన శుభమని తెలియగ
  శివముగ శుభములు బడయగ చిత్తము తోడన్
  ఎవరిని ఎప్పుడు మరువక
  శివరాత్రికి జేయవలెను శ్రీ హరి పూజల్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. వివరముగ 'శ్రీ'యన విషము
   భవుడె హరించె గద మ్రింగి పార్వతి మెచ్చన్!
   సవరించిన యర్థమ్మున
   శివరాత్రికిఁ జేయవలెను 'శ్రీహరి' పూజల్!

   తొలగించండి
  2. సహదేవుడు గారూ,
   ‘శ్రీహరి’కి మీరిచ్చిన విశేషార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. శివమునుగొన జాగారము
  శివరాత్రికి జేయవలెను, శ్రీహరి పూజల్
  భవ బంధమ్ము లడచి కర
  ము వెసన్ కలిగించు సుమ్మ ముక్తి పథమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. భవనాశంకరు సేవలు
  శివరాత్రికి జేయవలయు-శ్రీహరి పూజల్
  వివరింపనేల మిత్రమ!
  అవిరళముగ సలుపనగును నహమును నిశలున్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అయినా అహర్నిశలు శ్రీహరి పూజలు చేస్తూ శివపూజ కేవలం శివరాత్రికే చేయాలా?

   తొలగించండి
 18. కవి మిత్రులందఱకు శివరాత్రి పర్వదిన శుభకామనలు!

  రిప్లయితొలగించండి
 19. కవి మిత్రులందఱకు శివరాత్రి పర్వదిన శుభకామనలు!

  రిప్లయితొలగించండి
 20. వివరించుచు నారదు డా
  భవహరలింగోద్భవంపు భవ్యచరిత శ్రీ
  ధవునకు పలికెను భక్తిని
  శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి! పూజల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   సంబోధనతో మీ పూరణ వైవిధ్యంగా ఉండి రంజింపజేసింది. అభినందనలు.

   తొలగించండి
 21. శివమన శుభమని తెలియగ
  శివమును జేరంగ వచ్చు చిత్తము నిలుపన్
  ఎవరిని ఎప్పుడు మరువక
  శివరాత్రికి జేయవలెను శ్రీ హరి పూజల్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 22. శివశివ యనుచును పూజలు
  శివరాత్రికి జేయవలెను|”శ్రీహరి పూజల్
  ఎవరికి యిష్టంబొసగునొ?
  అవసరముల నాదుకొనునొ ?నతడేజరుపున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   పూరణ బాగున్నది. కాని ఎక్కువగా విసంధిగా వ్రాశారు.

   తొలగించండి
 23. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { నిన్నటి పూరణము దయచేసి
  స్వీకరి౦పగలరు }

  పశువులు కలవారి౦టిలో గడ్డి మోపు
  ( గరళము ) అవసరము
  .............................. ........

  తలపగ గృహమున , పశువులు

  కలవారలకున్ గరళము కావలెను సుమీ |

  ఇలలో పశువే మేలగు |

  ఖలు డెప్పుడు పాలు ద్రావి గరళము గ్రక్కున్


  { గ ర ళ ము = గ డ్డి మో పు }


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ నిన్నటి పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. మిత్రులందఱకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!

  వివర మ్మడుగుచు బాలుని
  "శివరాత్రికి నెవరి పూజఁ జేయవలె?" ననన్
  జవమునఁ జెప్పె నతం డిటు

  "శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్!"

  రిప్లయితొలగించండి
 25. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారూ...సుకవి మిత్రులారా....

  నే నీ మధ్య ’అయుత కవితా యజ్ఞము’న ప్రకటించిన పద్యములను నా బ్లాగు "అయుత మధుర కవితా స్రవంతి"లోఁ బ్రచురించితిని. వాని నామూలాగ్రముగఁ బరిశీలించి మీ యమూల్యమైన యభిప్రాయములనుం దెలుపఁగలరని మనవి.

  బ్లాగు చిరునామా: అయుత మధుర కవితా స్రవంతి

  భవదీయుఁడు
  గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 26. నకు యభిషేకంబును
  శివరాత్రికి చేయవలెను;శ్రీహరి పూజల్
  నవకరము లేక చేసిన
  జవమున చేసిన కలుగును జవసత్వంబుల్.

  2.భువియందున భవున కెపుడు
  శివరాత్రికి పూజలు చేయవలెను ;శ్రీహరి పూజల్
  నవసర మప్పుడు కాక న
  నవరతము సలుపుచు నుండ నలకువ తగ్గున్/నాకము దొరకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటిపూరణలో ‘భవునకు నభిషేకంబును’ అనండి. ‘నవకరము’...?
   రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘భువిలో భవునకు పూజలు| శివరాత్రికి జేయవలెను...’ అనండి. ‘అవసరము’... నవసరమైనది.

   తొలగించండి
 27. అవసరమిది "కడియము"నకు
  కవివరు లందరు నుడివిరి కచ్చితముంగన్...
  అవిరళపు మంత్రి పదవికి
  శివరాత్రికిఁ జేయవలెను "శ్రీహరి" పూజల్!

  రిప్లయితొలగించండి
 28. శివరాత్రిని సందడిలో
  శివ భక్తులు భంగు త్రాగి చెప్పులు విసరన్
  శివమెత్తగ వైష్ణవులకు...
  శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్

  రిప్లయితొలగించండి