గురువు గారికి నమస్కారములు.... మీ అనారోగ్యము గురించి మీరు బాధపడడం నాకూ బాధేసింది...మీ జ్ఞాపకశక్తి అపూర్వము...దానికై చింతించకండి బహుజనపల్లి సీతారామా చార్యులు గారి శబ్దరత్నాకరమున శంభువు అంటే శివుడు విష్ణువు బ్రహ్మ బుద్ధదేవుడు అని వుంది ఆంధ్రభారతిలో లేదు. .... శంభుడు అంటే విష్ణువని అనుకుంటే నిన్నటి పద్యానికి అన్వయం కుదిరినట్టేనని అనుకున్నానండి...పొరపాటైతే మన్నించ మనవి
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు..నిన్నటి వివరణ మరల వ్రాయుచున్నాను. వక్రత్రిశిఖయు, ధాత్రీ చక్రమ్మున దైత్య కంపజ, శక్రాశనితుల్య, సదృశ చక్రాయుధమూ త్రిశూలమ్మున్ ధరించు శంభునకు నతుల్. క్రూరమైన మూడు కోణాలు కలది, భూమి మీద డైత్యుల కు వణుకు పుట్టించేది, వజ్రాయుధము తో సమానమైనదీ, చక్రాయుధానితో సమానమైనదీ యయిన త్రిశూలమ్మును ధరించిన శంభునకు వందనములు.
పంపితి తెలుగు పరీక్షకు
రిప్లయితొలగించండినింపుగ చందస్సు నేర్పి యిందులకా నీ
దుంపతెగ వ్రాసినావట
చంపకమాలకు గణములు సభరనమయవల్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిప్రొద్దున ప్రొద్దున్నే హాయిగా నవ్వుకునేలా చేసింది మీ పూరణ. బాగుంది. అభినందనలు.
చంద్రమౌళి వారు చదువంగ గుర్తుండు
తొలగించండిపద్యమొకటి వ్రాసి పడక నెక్కె
చదివి నవ్వు కొనెడు చక్కిలిగింతల
పంచుతుండె నదియె బాగు! బాగు!
కంద దుంప తెంచారండీ భేష్
తొలగించండిదాందుంపతెగా గొప్ప పూరణ నిచ్చారు సూర్యనారాయణ గారూ!
తొలగించండిధన్యవాదములు మాష్టారు,సహదేవుడుగారు,గోలి వారు, మిస్సన్నగారూ, అక్కయ్య గారూ
తొలగించండిసెభాష్ చంద్ర మౌళి గారు
రిప్లయితొలగించండిఇంపట నజభజ జజరలు
రిప్లయితొలగించండిచంపక మాలకు గణములు,సభరన మయవల్
సొంపుగ నమరిన చాలును
వంపులు దిరిగిన కరమది మత్తేభ మనన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు.... మీ అనారోగ్యము గురించి మీరు బాధపడడం నాకూ బాధేసింది...మీ జ్ఞాపకశక్తి అపూర్వము...దానికై చింతించకండి
రిప్లయితొలగించండిబహుజనపల్లి సీతారామా చార్యులు గారి శబ్దరత్నాకరమున శంభువు అంటే శివుడు విష్ణువు బ్రహ్మ బుద్ధదేవుడు అని వుంది ఆంధ్రభారతిలో లేదు. ....
శంభుడు అంటే విష్ణువని అనుకుంటే నిన్నటి పద్యానికి అన్వయం కుదిరినట్టేనని అనుకున్నానండి...పొరపాటైతే మన్నించ మనవి
ఇంపుగ నజభజ జజరలు
చంపక మాలకు గణములు, సభరన మయవల్
నింపారిన మత్తేభము
సోంపగు నగలో మణివలె శోభిల్లునుగా.
విరించి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నింపారు’ శబ్దం ఉందా అన్న సందేహం కలిగి ఆంధ్రభారతిలో వెదికాను. ఉంది.
ఇంపగు మత్తేభములను
రిప్లయితొలగించండిసొంపుగ వ్రాయమని కోరి చూచెదవదియే
లంపటము, నన్ను విడువుము
చంపక, మాల! కుగణములు సభరనమయవల్!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
అయినా ఆ గణాలు కుగణాలు ఎలా అయ్యాయి? చంపకమాలకు కుగణాలు, మత్తేభానికి సుగణాలే కదా!
"మాల" అనే అమ్మాయి మత్తేభ పధ్యము వ్రాయమని కోరగ, అది వ్రాయలేని చేతకానితనాన్ని ఒప్పుకోలేక, ఆ పద్యగణములను "కుగణములు" అని అనటము
తొలగించండిఇక్కడ "చంపక" అనే పదాన్ని DO NOT KILL అనే అర్థములో వాడాను. (సరి అయినదో కాదో తెలియదు)
శుభోదయం :)!
రిప్లయితొలగించండిసొంపుగ జిలేబి చెప్పెన్
చంపకమాలకు గణములు సభరనమయవల్
ఒంపుగ నమరెను కందము
కొంపలు గూలున గణములు కొంచెము మారన్ :)
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక్క లఘువో, గురువో మారితేనే కొంపలు కూలుతాయి, మరి గణాలు మారితే ఇక అడగాలా?
తొలగించండికంది వారు !
ఆరోగ్యం కుశలమేనా !
చంద్ర మౌళి వారి పూరణ చదివాక వ్రాసా :)
జిలేబి
ధన్యవాదాలు. ఇప్పుడు కాస్త ఫరవాలేదు.
తొలగించండివిపరీతమైన భాషాభిమానం గలిగిన తెలుగు పంతులు పరీక్ష ప్రతులను దిద్దే సమయంలో వారి స్పందన
రిప్లయితొలగించండికంపరమెత్తె చదువనిది
"చంపక మాలకు గణములు సభరనమయవల్"
చింపితి పరీక్ష ప్రతులన్
చింపిరి వెధవకు సరిపడు శిక్ష యిదంచున్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపుచునున్నది చదువుచు
రిప్లయితొలగించండినింపుగ మత్తేభమునకు నేవో గణముల్
నింపాదిగ చెప్పు తల్లీ !
చంపకమాలకు-గణములు సభరనమయవల్
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మూడవ పాదంలో గణదోషం. 'నింపాదిగఁ జెప్పమ్మా' అందామా?
తొలగించండిమాస్టరుగారూ ! ధన్యవాదములు..మీ సూచనతో సరిచేశాను.
చంపుచునున్నది చదువుచు
నింపుగ మత్తేభమునకు నేవో గణముల్
నింపాదిగ చెప్పమ్మా!
చంపకమాలకు-గణములు సభరనమయవల్
ఇంపుగ నజభజజజ రలు
రిప్లయితొలగించండిచంపక మాలకు గణములు, సభరన మయవల్
సొంపుగ మత్తేభమునకు
చంపావతి ! తెలియు మమ్మ ,ఛందో గణముల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచింపితి మరిమరి పేపరు
అంబను గూడన్ గొలిచితి అయ్యరొ తెలియన్
నింపను గాలే ఎటులన్
చంపకమాలకు గణములు సభరనమయవల్.
జిలేబీ గారూ,
తొలగించండిరెండవ పాదంలో ప్రాస తప్పింది. మూడవ పాదం అర్థం కాలేదు.
ఎంపిక జేయగ నడిగెను
రిప్లయితొలగించండి"హంపిని"ఛందస్సునంత హనుమాచార్యుల్
ఒంపులుదిరుగుచు బలికెను
చంపకమాలకు గణములు సభరనమపవల్ !
సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదాన్ని అచ్చుతో కాకుండా 'వంపులు' అని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?
ఎంపిక జేయగ నడిగెను
రిప్లయితొలగించండి"హంపిని"ఛందస్సునంత హనుమాచార్యుల్
ఒంపులుదిరుగుచు బలికెను
చంపకమాలకు గణములు సభరనమపవల్ !
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇ౦పుగ. నజభజ జజరల్
చ౦పక మాలకు గణములు | సభరన మయవల్
సొ౦పుగ మత్తేభమ్మగు |
చ౦పును మసజస తతగల. శార్దూల మికన్
{ చ౦పును = ఎక్కువ గురువు లున్న శార్దూలము మనలను చ౦పి వేస్తు౦ది}
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గు రు వు గా రి కి న మ స్కా ర ము లు
నిన్నటి నా పూరణము లో వివరణ. =
శ౦భువు = శివుడు . విష్ణువు. బ్రహ్మ.
అని రె౦డు నిఘ౦టువులలో ఉ౦డుట చూచి
నేను పద్యము వ్రాశాను
నమస్తే
ి
.
వివరణకు ధన్యవాదాలు.
తొలగించండిఇంపుగ నజభజ జజరలు
రిప్లయితొలగించండిచంపకమాలకు గణములు సభరనమయవల్
సొంపగు మత్తేభమునకు
పెంపారు కవన సుమములు పేరిమి తోడన్
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు..నిన్నటి వివరణ మరల వ్రాయుచున్నాను.
తొలగించండివక్రత్రిశిఖయు, ధాత్రీ చక్రమ్మున దైత్య కంపజ, శక్రాశనితుల్య, సదృశ
చక్రాయుధమూ త్రిశూలమ్మున్ ధరించు శంభునకు నతుల్.
క్రూరమైన మూడు కోణాలు కలది, భూమి మీద డైత్యుల కు వణుకు పుట్టించేది, వజ్రాయుధము తో సమానమైనదీ, చక్రాయుధానితో సమానమైనదీ యయిన త్రిశూలమ్మును ధరించిన శంభునకు వందనములు.
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నటి పూరణకు మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. సంతోషం.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ యారోగ్యము కుదుట పడుతున్నట్లు తలుస్తాను.
తొలగించండినా ఆరోగ్యం కొంత నయం. పూర్తిగా కోలుకోలేదు. ధన్యవాదాలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. చివరి రెండు పాదాల భావం సందేహాస్పదం.
పెంపొసగ స-ఖుడు,భ-ర్తయు,
రిప్లయితొలగించండిమంపుగొను ర-మణుడు న-నుపు మ-రుడును య-వను౦
డింపుగ వ-రుడుగ భాసిల
చంపకమాలకు.గణములు స-భ-ర-న-మ-య-వల్-.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
చెంపలు వా యింతు నెటుల
రిప్లయితొలగించండిచంపకమాలకు గణములు సభరన మయవల్ ?
సొంపుగ నేర్పెదను వినుము
పంపకవి కి శిశువు నేను వ్యాకరణములో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంపుగ నజ భజజజరలు
రిప్లయితొలగించండిచంపకమాలకు గణములు; సభరనమయవల్
కెంపులె ! గణ సంయుక్తము
సొంపగు మత్తేభమునకు శోభను గూర్చున్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంపగు నజభజజజరలు
రిప్లయితొలగించండిచంపకమాలకు గణములు;సబరనమయవల్
సొంపగు మత్తేభమునకు
వంకర చేయక సతతము పలుకము పుత్ర !
వంకర=వెటకారము
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
. చంపక మాలను జూచుచు {తరగతిగదియందలి చదువరి}
రిప్లయితొలగించండిచంపకమాలకు గణములు సబరనమయవల్
పంపాపతి దెలుపగ| “గురు
పంపా |పతిశివుడు గంగ |బదులిడునటులే|” {పంపాపతి ఉత్తరము-పంపా-పతిశివుడుగంగఅన్నరీతిఒకదానికినొకటిపొంతనలేని సమాదానం}
2.కంపరమందునదెలిపెను
చంపకమాలకు గణములు సబరనమయవల్
“చంపక”సఖుడట,బలుడుగ,
రంపు, నగవు , మర, యశము వరలగసుఖమగన్
రంపు=గొప్పదనం;మర=గుట్టు
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిఇప్పటికీ మీ మొదటి పూరణలో భావం సందేహాస్పదమే.
రెండవ పూరణ బాగుంది. కాని భ(గణాన్ని) బ(లుడుగ) అన్నారు.
కొంపలు మునగవు, వినగా
రిప్లయితొలగించండినింపగు రీతినిఁ జదువవదేమీ ? వరుసల్
తెంపితి కలుగగ భ్రమలిటు,
చంపకమాలకు గణములు సభరనమయవల్.
లక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘మునుగవు’ సరియైన ప్రయోగం.
అలాగేనండి. దిద్దుకుంటాను.ధన్యవాదాలు.
తొలగించండిచాలింపుమురా! చంపక
రిప్లయితొలగించండిమాలకు గణములు సభరన మయవల్లనుట
న్నేలన్నవియే మత్తే
భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!
విరించి గారూ,
తొలగించండిసమస్యపాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
‘మయవల్+అనుట’ అన్నప్పుడు లకారానికి ద్విత్వం రాదు. అది కేవలం ద్రుతానికే (నకారానికే) పరిమితం. ‘మయవల్ గావే| యేలనన నవియె మత్తే|భాలకు...’ అనండి.
చాలింపుమురా! చంపక
రిప్లయితొలగించండిమాలకు గణములు సభరన మయవల్లనుట
న్నేలన్నవియే మత్తే
భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!
చాలింపుమురా! చంపక
రిప్లయితొలగించండిమాలకు గణములు సభరన మయవల్ గావే
యేలనన నవియె మత్తే
భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!
ప్రత్యుత్తరంతొలగించు
చంపకు మదనపు మార్కుల
రిప్లయితొలగించండినింపుగ కలుపుదురు బిట్టు నీయమి సరిగా
గుంపున దొర్లిన తప్పిది
చంపకుమాలకు గణములు సభారనమయవల్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంపుగ నేర్పెను గురువదె
రిప్లయితొలగించండిచంపక మాలకు గణములు సముచిత రీతిన్ !
చంపకు సుమ్మీ వ్రాయుచు,
చంపకమాలకు గణములు సభరనమయవల్!
జంపులు జగణము లిచ్చును
రిప్లయితొలగించండిచంపకమాలకు,...గణములు సభరనమయవల్
కంపము మత్తేభమునకు,...
చంపకు నన్నిటుల నిచ్చి చవట సమస్యల్!