క౦టికి ఘ౦టసాల యిక కన్పడ కున్నను క౦చు క౦ఠ మి౦
టి౦ట సదా ధ్వని౦చి వినిపి౦చును కమ్మని గానస౦పదన్;
మి౦టికి "పద్మమిత్ర - రజనీకరు" ల౦టుక యున్న మేర కా
వ౦టి సునాదమౌ గళము భావి జని౦పదు నిశ్చయ౦బుగా.
ప౦చదారను పాలలో ను౦చి నటుల
పాటలో నీవు లీనమై పాడు చు౦డ
కవి రచి౦చిన కవితకే కా౦తి కలుగు
గాన గ౦ధర్వ శీల! ఓ ఘ౦టసాల!
పలుకును నీవు పల్కగనె పల్కుల రాణి విప౦చిక స్వరా
వళి సమమైన స్పష్టతయు, పా౦డవమిత్రుని పా౦చజన్య మ౦
దలి ఘనమౌ పటిష్ఠతయు తావక క౦ఠములో స్ఫురి౦చు నో
సలలిత గాన శీల! నిను సన్నుతి జేయగ మాకు శక్యమే?
భక్తిగీతము పాడ పరమనాస్తికు డైన
.....తన్వయత్వము నొ౦దు స్తబ్ధు డగుచు
శోక గీత మనిన సూనరు౦ డైనను
.....తపియి౦చు కన్నీటి ధార లిడుచు
లలితగీత మనగ పులకి౦చి డె౦ద మా
.....న౦ద మ౦దున కడు చి౦దు లేయు
పద్య మాలాపి౦చ భావ స౦గీతముల్
....పలుకుచు మధువుల నొలుకు చు౦డు
ద౦డకమున దైవ౦బు ప్రత్యక్ష మగును
దేని నెటు పాడ వలయునో తెలియ జేయ
నవతరి౦చితి వయ్య నీ వవని పైన
గాన గ౦ధర్వ శీల! ఓ ఘ౦టసాల!
భగవద్గీత సమస్త మానవులకున్ భావ్య౦ బగున్ గాననే
తగ, గానమ్మును చేసినావొ యటు కాదా, శ్రీ మహావిష్ణువే
భగవద్గీత హితోపదేశము పరివ్యాప్త౦బు గావి౦పగా
జగతిన్ నీవయి పుట్టెనో, తెలుపుమా స౦గీత భాషానిధీ!
రచన : గురుమూర్తి ఆచారి
గురుమూర్తి ఆచారి గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిగ౦భీరమైన మాధుర్యమైన శాస్త్రస౦గీత భరితమైన లాలిత్యమైన బావావేశ పూరితమైన మరియు విశుధ్ధమైన ఘ౦టసాల గారి గానము శ్రోతల హృదయములను ర౦జి౦పజేసినది, చలి౦పజేసినది. కలియుగ జనులను, గీతాగానామృత సేచకముతో తరి౦పజేసిన మహానుభావుడు ఘ౦టసాల. ఆయనపై నేను వ్రాసి ప౦పిస్తున్న ఈ పద్యాలను స్వీకరి౦చి, స౦గీత సరస్వతిని స౦తసి౦పజేయ మని గురువుగారిని అర్థిస్తున్నాను.
నేను ఘ౦టసాల పై పద్యాలను వ్రాయడానకి కారణ మొకి౦త వివరిస్తాను...
నేను Retired Bank Cashier ను. ఏదో, ఈపాటి పద్యరచన య౦దే కాక నాకు స౦గీతమ౦దు కూడా కాస్త౦త ప్రవేశము కలదు. ఒక ఘ౦టసాల వీరాభిమానిగా అనేక కచేరీలలో ఆయన పాటలు పాడాను. మరియు నేను Radio & T.V. గాయకుడను. స్వీయరచిత మైన భక్తిగీతాలను నేనే గానము చేయగా C.D. లు విడుదల ఐనవి.
శ్రీ గురు మూర్తి గారికి అభినందనలు.మధుర గాయకుడు ఘంటసాల గురించి సుమధురమైన పద్యాలు చెప్పారు.
రిప్లయితొలగించండిఘంటసాల వారి జయంతి సందర్భంగా గతములో నేను వ్రాసిన పద్యము.
సీ: జానపదమొకండు - జనులు మెచ్చగపాడు
పద్యంబు నొక్కడు - పాడగలుగు
లలితగీతమొకడు - లయబద్ధముగబాడు
శ్లోకంబుకొక్కడు - శోభదెచ్చు
శాస్త్రీయమొక్కడు - శ్రావ్యంబుగాపాడు
కీర్తనల నొకండు - కీర్తిబొందు
భక్తి గీతమొకడు - రక్తిగా పాడును
పాశ్చాత్యమొక్కడు - పలుక గలుగు
ఆ.వె: ఎట్టిపాటగాని యే శ్లోకములుగాని
పద్యమైన మరియు గద్యమైన
నవరసంబులొలుకు నాయాసమేలేక
ఘంటసాలవారి గళమునందు.
శ్రీగురుమూర్తి ఆచారి గారికిి మరియు శ్రీగోలి వారలకు అభినందనలు.గానగంధర్వుడైన ఘంటసాలపై మీదు పద్యములు శ్లాఘనీయము.
రిప్లయితొలగించండిశ్రీగురుమూర్తి ఆచారి గారికిి మరియు శ్రీగోలి వారలకు అభినందనలు.గానగంధర్వుడైన ఘంటసాలపై మీదు పద్యములు శ్లాఘనీయము.
రిప్లయితొలగించండికవిమిత్రులకు ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘ౦ ట సా ల గా రి ప ద్య ము ల ను
రిప్లయితొలగించండిస్వీ క రి౦ చి న౦ దు ల కు
గు రు వు గా రి కి ధ న్య వా ద ము లు
ి
న మ స్తే
ఘంట సాల పే రుగలయా యింట బుట్టి
రిప్లయితొలగించండితెలుగు సాహిత్య రంగాన దేజ రిల్లి
తలలు నూ గగ పాటలు దనివి దీర
పాడి మమ్ముల నలరించి పద్మ శ్రీని
నొందిన గురువ !వందనం బందు కొనుము
శ్రీ గురు మూర్తి గారికి అభినందనలు.మధుర గాయకుడు ఘంటసాల గురించి సుమధురమైన పద్యాలు చెప్పారు.
రిప్లయితొలగించండిశ్రీ గురు మూర్తి గారికి అభినందనలు.మధుర గాయకుడు ఘంటసాల గురించి సుమధురమైన పద్యాలు చెప్పారు.
రిప్లయితొలగించండిఘంటసాల వారికి మంచి నివాళి. అభినందనలు ఆచారి గారూ.
రిప్లయితొలగించండిఘంటసాల వారికి మంచి నివాళి. అభినందనలు ఆచారి గారూ.
రిప్లయితొలగించండిశ్రీ.కె.యస్.గురుమూర్తి ఆచారిగారికిమరియు గురువర్యులు కందిశంకరయ్యగారికివందన చందనాలు ఘంటసాలవారినిస్మరించుపద్యమాలికలుపంచినందుకు. స,రి,గ,మ,ప,ద,ని,పదాల తేటగీతలు
రిప్లయితొలగించండి1.సగటు మనిషిగ బెరిగిన సాత్వికుండు|
రిక్త హస్తుడు |గళమునశక్తిజూపి
గణుతి కెక్కిన గంధర్వ ఘంటసాల|
మధుర మంజుల గాన సన్మాన చరిత|
2.పలుకు పరిమళ గంధమై పరవశించ?
దక్కు నింటింట పాటలచెక్కులెన్నొ|
నిత్య నిర్మల తత్వాలనిధులు విధులు
గళము నందున బంచెను ఘంటసాల|
మీ సరిగమలు బాగున్నాయండీ
తొలగించండిగోలి హనుమఛ్ఛాస్త్రి గా రికి , G V S . సహదేవుడు గారికి , సుబ్బారావు గారికి , G . లక్ష్మినారాయణ. గారికి , మిస్సన్న గారికి , మరియు
రిప్లయితొలగించండితదితర. కవులకు నా యొక్క
ధ న్య వా ద ము లు
సదా మీ ఆశీర్వాదములను కోరుకొనే
ే
" గు రు మూ ర్తి ఆ చా రి "
గోలి హనుమఛ్ఛాస్త్రి గా రికి , G V S . సహదేవుడు గారికి , సుబ్బారావు గారికి , G . లక్ష్మినారాయణ. గారికి , మిస్సన్న గారికి , మరియు
రిప్లయితొలగించండితదితర. కవులకు నా యొక్క
ధ న్య వా ద ము లు
సదా మీ ఆశీర్వాదములను కోరుకొనే
ే
" గు రు మూ ర్తి ఆ చా రి "
అంతర్జాలమందుబాటులో లేని కారణమున నేడు స్పందించుచున్నాను. మన్నించగలరు.
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి గార్కి హృదయపూర్వకాభినందనలు. చక్కటి పద్యకుసుమాలతో మహా గాయకుడు ఘంటసాల గారిని కీర్తించారు. మీరు ధన్యులు
గోలి హనుమచ్ఛాస్త్రి గారు ఘంటసాల వారి బహుముఖ ప్రజ్ఞ ని చక్కగా వర్ణించారు. మీకు నా హృదయపూర్వకాభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి :--
ి
మీరు నా ఘ౦టసాల స్తుతి - పద్యాలను
పరిశీలి౦చి న౦దుకు ధన్యవాదములు. యిట్లు
మీ ఆశీర్వాదముల సదా కోరుకొనుచున్న
విధేయుడు = " గురుమూర్తి ఆచారి "
…………………………………………………......
* * ఆ పద్యాలను స్వీకరి౦చిన గురువు గారికి
శ్రీ క౦ది శ౦కరార్యునకు
నేను మరియొక. సారి కృతఙ్ఞతలతో
పదనమస్కారముల నర్పిస్తున్నాను **
...........................................
సర్వశ్రీ హనుమఛ్ఛాస్త్రి గారికి జి.వి యస్
సహదేవుడు గారికి సుబ్బారావు గారికి మిస్సన్న
గారికి జి.లక్ష్మినారాయణ గారికి ఈశ్వరప్పగారికి
ి
హృదయపూర్వక. ధ న్య వా ద ము లు ,
మరయు న మ స్సు లు
...................................................
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి :--
ి
మీరు నా ఘ౦టసాల స్తుతి - పద్యాలను
పరిశీలి౦చి న౦దుకు ధన్యవాదములు. యిట్లు
మీ ఆశీర్వాదముల సదా కోరుకొనుచున్న
విధేయుడు = " గురుమూర్తి ఆచారి "
…………………………………………………......
* * ఆ పద్యాలను స్వీకరి౦చిన గురువు గారికి
శ్రీ క౦ది శ౦కరార్యునకు
నేను మరియొక. సారి కృతఙ్ఞతలతో
పదనమస్కారముల నర్పిస్తున్నాను **
...........................................
సర్వశ్రీ హనుమఛ్ఛాస్త్రి గారికి జి.వి యస్
సహదేవుడు గారికి సుబ్బారావు గారికి మిస్సన్న
గారికి జి.లక్ష్మినారాయణ గారికి ఈశ్వరప్పగారికి
ి
హృదయపూర్వక. ధ న్య వా ద ము లు ,
మరయు న మ స్సు లు
...................................................