30, మార్చి 2016, బుధవారం

సమస్య – 1988 (పసిబాలునిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పసిబాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్.

42 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు
  నేటి సమస్యకు నా పూరణములు

  పసిచేష్టలతో కుంతియె
  ప్రసవించెను కన్యగాను రవివరమివ్వన్
  విసిరెను భయపడి జలమున
  పసిబాలుని, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్

  శిశువుకి జన్మమ్మిచ్చుచు
  ప్రసవములో జచ్చినట్టి భగినియె కోరన్
  ముసలిని, పెంచగ వలెనని
  పసిబాలుని, బెండ్లియాడె బ్రౌఢముదమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణ మొదటి పాదాన్ని ‘శిశువునకు జన్మమిచ్చుచు’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు
   నేటి సమస్యకు నా పూరణములు

   పసిచేష్టలతో కుంతియె
   ప్రసవించెను కన్యగాను రవివరమివ్వన్ 
   విసిరెను భయపడి జలమున
   పసిబాలుని, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్ 

   శిశువునకు జన్మ మిచ్చుచు
   ప్రసవములో జచ్చినట్టి భగినియె కోరన్ 
   ముసలిని, పెంచగ వలెనని
   పసిబాలుని, బెండ్లియాడె బ్రౌఢముదమునన్ 

   తొలగించండి
  3. పసి చేష్టలతో ...
   చాలా అద్భుతంగా వ్రాశారు విరించి గారు...
   అభినందనలు...

   తొలగించండి
 2. మిసమిస లాడెడి వయసున
  పొసగును తనకంచు కోరె పొలతి యటన్నన్
  విసురులు కసురుల నెరుగని
  పసిబాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమున్

  రిప్లయితొలగించండి
 3. పసిమిడి ఛాయన ఘన రూ
  పసి బాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్
  ముసిముసి బాల కుమారు సి
  రిసిరి నగవుల మొగముగనె రింగుల చాటున్ :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. బాలు అనే పేరుగలవానిని...

  గుసగుస లాడుచు సకియలు
  విసిరెడు సరసపు బలుకులు విందుగ వినుచున్
  ముసిముసి నవ్వులతో రూ
  పసి 'బాలు'నిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్!!!

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. గురుదేవులవారి ఆరోగ్యము త్వరగా కుదుటపడవలయునని భగవంతునికి ప్రార్థన.

   తొలగించండి
  2. పసగల క్రికెట్టు నాడఁగ
   నసహన మెరుఁగక! వరించె నంజలి! మరు రూ
   ప సచిన్ టెండూల్కరు రూ
   పసి, బాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్!

   తొలగించండి
  3. సహదేవుడు గారూ,
   ధన్యవాదాలు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 6. శశితో తొందరబడినను
  కసరక నాపెద్దలంత కలియుచు చేయన్
  ముసిముసి నవ్వుల నొడినిడి
  పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మాస్టరు గారూ ! మీ ఆరోగ్య సమస్య త్వరగా తీరి మీకు స్వస్థత చేకూర వలెనని దేవదేవుని కోరుకొనుచున్నాను.

   తొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ధన్యవాదాలు.

   తొలగించండి
 7. కసుబుసు లాడకు మామా !
  పసి బాలుని ,బెండ్లి యాడె బ్రౌ ఢ ముదమున
  న్నిసుకంభట్ల కులంబున
  మిసమిస లాడెడు రమణుని మెచ్చుచు మదిలోన్

  రిప్లయితొలగించండి
 8. * గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  మిసమిస పదమూడే౦డ్ల. వ

  యసుగల రూపసియగు ధనియగు " బాలు" ని కి

  న్నొసగి మనసు , లెక్కి౦చక

  పసి "బాలు" ని పె౦డ్లయాడె ప్రౌఢ ముదమునన్

  ( లెక్కి౦చక = ఎవరిని లక్ష్య పెట్టక ;
  పసి " బాలుని " = లేత వయస్కుడగు బాలుడను వానిని )
  ి

  రిప్లయితొలగించండి
 9. అసమాన పరాక్రము భా
  ను సమానాభాసు సద్గుణుని, మించిన మా
  నస నైర్మల్యము నందున
  పసిబాలునిఁ, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్.

  రిప్లయితొలగించండి
 10. వసుధను క్షామ మ్మేర్పడ
  వసుదేశుడు ఋష్యశృ౦గు హ్వానము సేయన్
  వెస వానలు కురియగ,తా
  పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్.

  రిప్లయితొలగించండి
 11. ఉసిరిక చెట్టుకడ తినియు
  విసుగున పడుకున్న పడతి”వేదికయందున్
  పొసపొస రాగా కలలో
  పసిబాలుని బెండ్లియాడె బ్రౌడముదమునన్”. {పొసపొస=త్వరితముగా}

  రిప్లయితొలగించండి
 12. * గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  మిసమిస పదమూడే౦డ్ల. వ

  యసుగల రూపసియగు ధనియగు " బాలు" ని కి

  న్నొసగి మనసు , లెక్కి౦చక

  పసి "బాలు" ని పె౦డ్లయాడె ప్రౌఢ ముదమునన్

  ( లెక్కి౦చక = ఎవరిని లక్ష్య పెట్టక ;
  పసి " బాలుని " = లేత వయస్కుడగు బాలుడను వానిని )
  ి

  రిప్లయితొలగించండి
 13. పసితనమున సంద్రములో
  నిసిలో పడినట్టి బాలు నింటికితేగా
  కసరక వానిని పెంచుచు
  పసిబాలుని పెండ్లి పెండ్లి యాడె ప్రౌఢముదమునన్.

  2.పసితనమందున పేదల
  వసతి గృహంబున పెరిగిన భామిని యచ్చో
  పసిడియు,సిరియును గల రూ
  పసిబాలుని పెండ్లి యాడె ప్రౌఢ ముదమునన్.

  రిప్లయితొలగించండి
 14. మిసమిస లాడెడు వయసున
  కసికసి చూపులను రువ్వి కాంక్షను బెంచన్
  రసికుండై చెలగెడు రూ
  పసి బాలుని పెండ్లి యాడె ప్రౌఢ ముదమునన్

  రిప్లయితొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  [సిబాలుఁ డను నొకనిని యొక ప్రౌఢ పెండ్లియాడిన సందర్భము]

  మిసమిసలాడెడి సుందరి
  బిసరుహ నేత్రుఁడగువాని బ్రియ రూపుఁ గనన్;
  గుసుమ శరుని విశిఖము తను

  ప; "సిబాలు"నిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   ‘సిబాలు’ పెండ్లితో మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 16. అసితుని గుణ సంపన్నుని
  విసమాన్విత వాణి వాన్నివిమలాత్మకునిన్
  రసికుని నవయవనపు రూ
  పసిబాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘విసమ’...?

   తొలగించండి
 17. పసిబాలుని సిరిగల పిత
  ముసిలోడు విధురుడవగను,...ముచ్చట మీరన్
  నసగొట్టక పెంచుటకై
  పసిబాలుని,...బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్ :)

  రిప్లయితొలగించండి