8, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1966 (పండువెన్నెలఁ గురిపించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు. 
(నాలుగైదు రోజులుగా నాకు విపరీతమైన వెన్నునొప్పి, నడుమునొప్పి. ఎక్కువసేపు కూర్చొనలేకపోతున్నాను. బ్లాగుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. అందుకే ఈరోజు ‘పద్యరచన’ శీర్షికను ఇవ్వడం లేదు. మన్నించండి)

59 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు.

  1.
  విదుఁడు, ముక్కంటి తలపువ్వు వేడ్కతోడ
  పండు వెన్నెల గురిపించె, భాస్కరుండు
  తనకు తానుగ పడమట దాగియుండు
  వేళ తామసిన్ హరియింప వేరువిత్తు

  2.
  చుక్కలదొర యనగ నొప్పు సోముడపుడు
  పండు వెన్నెల గురిపించె భాస్కరుండు
  వృద్ధుడై పశ్చిమాద్రుల వెనుక దాగి
  యుండెడుసమయాన తనయె యుర్వి వెలుగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   రెండవపూరణ చివరిపాదంలో ‘తనయె’..?

   తొలగించండి
 2. పశ్చిమాద్రినఁ గ్రుంగియు పౌర్ణమి తిథిఁ
  దా స్వయంప్రకాశకుఁడుఁ గాదంచు రాజు!
  ప్రభలఁ గొని పరావర్తన భాగ్యమందఁ
  బండు వెన్నెలఁ గురిపించు భాస్కరుండు!

  రిప్లయితొలగించండి
 3. గురువుగారలు కావలసినంత విశ్రాంతిని తీసుకొన ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 4. గురువులకు నమస్కారములు
  రెండు మూడు రోజులుగా నాకు అనుమానంగానే ఉంది " అక్కయ్యా మీపూరణ బాగుంది " అనీ పేరుపేరునా రాసే వ్యాఖ్యలు " మీపూరణ బాగుంది " అనిపొడిపొడిగా రాస్తుంటే ' పనివొత్తిడొ, ప్రయాణమొ ,నలతగా ఉండో అనుకున్నాను.ఇక ఇప్పుడు ముందు మీఆరోగ్యము జాగ్రత్తగా చూసు కోండి.ఈపని పెద్దలెవరి కైనా అప్పజెప్పండి మీ ఆరోగ్యం జాగ్రత్త .మాకందరికీ ఇదే ప్రాణం.సెలవు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ అనుమానం నిజమే. అనారోగ్యం కారణంగా ఎక్కువసేపు సిస్టం ముందు కోర్చోలేక అలా సంక్షిప్తంగా కానిస్తున్నాను. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 5. కందివారు

  ఆరోగ్యము జాగ్రత్త

  నిరుడు కురిసిన హిమమున నియతి మారి
  పండు వెన్నెల కురిపించె భాస్కరుండు
  నరుడు గురువుల పాదము నమ్మి మారె
  మనసున కురిసె ప్రేమయు మధురిమయును

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. కాని మొదటి రెండు పాదాలకు, తర్వాతి రెండు పాదాలకు సంబంధం?

   తొలగించండి
 6. అన్నయ్యగారూ ఆరోగ్యము జాగ్రత్త.
  శరదృతువునందు గగనాన చందమామ
  పండు వెన్నెల కురిపించె;భాస్కరుండు
  పగటి వేళలందు వెలుగు పంచు చుండు
  వీరి కిరణములవలన వెలుగు జగతి

  రిప్లయితొలగించండి
 7. గురువుగారలు కావలసినంత విశ్రాంతిని తీసుకొన ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 8. మాస్టరుగారూ ! ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకొనగలరు.


  వరమునందిన కుంతియే పరవశమున
  పనితనమ్మును చూడగా పారజూచి
  రవిని పిలువగ వచ్చుచున్ రయమునచట
  పండు వెన్నెల కురిపించె భాస్కరుండు

  రిప్లయితొలగించండి
 9. సెట్టు వేసెను మయసభ చిత్ర రీతి
  ఎంటి వోడంత శర్మను యెంతొ మెచ్చి
  బిరుదు నిచ్చెను శిల్పికి భేషు యనుచు
  "పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు".

  (దాదాపు ఎన్.టీ.రామారావు పౌరాణిక సినిమాలకు అన్నింటికీ టీ.వీ.యెస్.శర్మ గారు
  అత్యద్భుతమైన సెట్లు వేసేవారు. శ్రీ కృష్ణపాండవీయం లో సిం హం మీద
  కూర్చునే ఆసనం ఆయన సృష్టే! ఆయనను ఎన్.టీ.ఆర్ గారు సదా మెచ్చుకుంటూ
  ఉండే వారు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   ‘శర్మను+ఎంతొ, భేషు+అనుచు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘శర్మనే యెంతొ... భేషటంచు’ అనండి.

   తొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. నిండు పౌర్ణమి రేయిన నీరజారి
  పండు వెన్నెల కురిపించు, భాస్కరుండు
  పూర్వదిక్కున ప్రభవించి పోడిమిగను
  వెలుగు పంచును జగతికి వేడితోడ!!!

  రిప్లయితొలగించండి
 12. అనిలు డడలును వీచగా, ననలు డుండు
  తేజ మణగారి, వరుణుండు తెరిపిలేని
  పోత మరచును లంక నే ప్రొద్దు గనిన
  పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారు మీ పూరణ యత్యంత సందర్భోచితముగ నున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మిస్సన్న గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  3. గురువుగారూ ధన్యవాదాలు.
   మీకు త్వరలో స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను.

   కామేశ్వరరావుగారూ ధ్యవాదములు.

   తొలగించండి
 13. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యారోగ్యము త్వరగా కుదుట పడాలని కాంక్షిస్తూ..

  సూర్యుని కాంతి చంద్రుని మీద పడి యది మనకు రాత్రి వెన్నెలవుతుంది.

  ఉర్విఁ జండ ప్రచండ మయూఖ సంహి
  తార్కుడు కమల మిత్రుం డహర్పతి కువ
  లయ విలాసకరు శశి కిల కరుణించి
  పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “భాస్కరుండు” ని కూడ “అహర్పతి” తర్వాత నన్వయించుకో ప్రార్థన. పునరుక్తి దోషము రాకుండ.

   తొలగించండి
  2. పుష్ప భరిత క్షితిరుహము భువిని నొసగు
   సుధ లొలుకెడి కాంతితతుల సోము డవని
   నశన దాతయై వర్తిల్లు ననవరతము
   పండు, వెన్నెలఁ గురిపించు, భాస్కరుండు.

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. నిండు పూర్ణిమ దినమున నీ రజారి
  పండు వెన్నెల గురిపించు, భాస్కరుండు
  వేడి గాలుల మనలను వివశు జేయు
  సూర్య చంద్రుల తత్త్వముల్ చోద్య ముగద

  రిప్లయితొలగించండి
 15. సరస సామ్రాజ్యమేలగ చందమామ
  పండువెన్నెల గురుపించు|”భాస్కరుండు
  నిశిని మాన్పగ నింగిలో నిలచుపగలు|
  రాత్రి,పగలందు దేవుళ్ళు రక్ష మనకు| {సూర్య,చంద్రులు మనకుప్రత్యక్ష దైవాలు

  రిప్లయితొలగించండి
 16. బ్రహ్మ వరము లొసగిన పౌలస్త్యు డేను
  భవుని పర్వత మెత్తిన బలుడ నేన
  రావణుడ!నాదు సైగకు రాణమీర
  పండు వెన్నెల కురిపించు భాస్కరుండు

  రిప్లయితొలగించండి
 17. సుహృన్మిత్రులు శంకరయ్య గారికి-మీరీ సాహితీ సేవకు కొంతవిశ్రాంతినివ్వండి. ఇటువంటి బాధకుఉపశమనం విశ్రాంతే.ఆరోగ్యంకాపాడుకోవటం ఈ వయససులో చాల ముఖ్యమని అభిమానిగా చిన్నసలహా...
  -----""-------------""----
  నిండుపున్నమి జాబిలి మెండుగ నిడు
  పండువెన్నెల-గురిపించు భాస్కరుండు
  చండ్రనిప్పులు వైశాఖి శాఖజూపి
  రెండు కాంతుల కాలాలె రేబగళ్లు!

  రిప్లయితొలగించండి
 18. సుహృన్మిత్రులు శంకరయ్య గారికి-మీరీ సాహితీ సేవకు కొంతవిశ్రాంతినివ్వండి. ఇటువంటి బాధకుఉపశమనం విశ్రాంతే.ఆరోగ్యంకాపాడుకోవటం ఈ వయససులో చాల ముఖ్యమని అభిమానిగా చిన్నసలహా...
  -----""-------------""----
  నిండుపున్నమి జాబిలి మెండుగ నిడు
  పండువెన్నెల-గురిపించు భాస్కరుండు
  చండ్రనిప్పులు వైశాఖి శాఖజూపి
  రెండు కాంతుల కాలాలె రేబగళ్లు!

  రిప్లయితొలగించండి
 19. ఇనకులాబ్ధికి సోముడు గనుక రామ
  చంద్రు డాప్త మిత్రులకు సజ్జనులకతడు
  పండువెన్నెల గురిపించు భాస్కరుండు
  శత్రువుల కగ్నివర్షించు చండ కరుడు

  రిప్లయితొలగించండి
 20. శంకరార్య!

  నొప్పిదగ్గుటకొరకుగాదప్పకుండ వోవరానుయస్సనుబిళ్ళబూర్తిగాను మూడుపూటలువాడినముఖ్యముగను
  మాయమగునార్య!నొప్పులుమాయమగును

  రిప్లయితొలగించండి
 21. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  శ్రేయ మయిన. యాహారము చెప్పు మేది ?
  తారకేశుడు ప్రసరి౦చు , ధరణి నేది ?
  లోక బా౦ధవు డన నెవ్వరో తెలియునె ?
  ప౦డు | వెన్నెల కురిపి౦చు | బాస్కరు౦డు

  రిప్లయితొలగించండి
 22. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  శ్రేయ మయిన. యాహారము చెప్పు మేది ?
  తారకేశుడు ప్రసరి౦చు , ధరణి నేది ?
  లోక బా౦ధవు డన నెవ్వరో తెలియునె ?
  ప౦డు | వెన్నెల కురిపి౦చు | బాస్కరు౦డు

  రిప్లయితొలగించండి
 23. రాత్రివేళల యందున ధాత్రిపైన
  స్వీయ కాంతి లేకుండగ చెంగలించు
  పక్షధరుని పై ప్రసరించి వాడి శిఖలు
  పండువెన్నెలఁగురిపించు భాస్కరుండు

  రిప్లయితొలగించండి

 24. కంది శంకరయ్య కవితా నిలయముగ
  శంకరాభరణము సకల కవుల
  మేళ వింపు ! ఓర్మి మేష్టారు మాకును
  చేయి పట్టి నేర్ప చేవ కలిగె

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. గురువు గారికి నమస్కారములు....ఆరోగ్యము జాగ్రత్త మీకు విశ్రాంతి యవసరము ...ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చేయకండి

  రిప్లయితొలగించండి
 26. గురువు గారికి నమస్కారములు....ఆరోగ్యము జాగ్రత్త మీకు విశ్రాంతి యవసరము ...ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చేయకండి

  రిప్లయితొలగించండి
 27. నిండు పున్నమినిన్ శశి దండిగాను
  పండువెన్నెలఁ గురిపించు ;భాస్కరుండు
  మండు టెండను మలమల మాడ్చజూచు
  గ్రహణ మంతము గాగ నా గ్రహము కతన

  రిప్లయితొలగించండి
 28. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా ఆరోగ్యవిషయమై పరామర్శించిన అందరికీ ధన్యవాదాలు. డాక్టరు గారు వ్రాసిన మందులు వాడుతున్నాను. ఎక్కువసేపు సిస్టంముందు కూర్చొనలేకపోతున్నాను. విశ్రాంతి తీసుకుంటున్నాను. అందుకే సంక్షిప్తంగా వ్యాఖ్యలు పెడుతున్నాను. ‘మీ పూరణ బాగున్నది. అభినందనలు’ అన్నదానిని కాపీ, పేస్ట్ చేస్తున్నాను. నా ఆరోగ్యం ఎలా ఉన్నా సమస్యలు ఇవ్వడం మానుకోను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. కొద్దిరోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండకపోవచ్చు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 29. గురుదేవులవారికి ఒక విన్నపము. సిస్టం ముందర కూర్చొనవలసిన పనిలేకుండా సమస్య పోస్టింగ్ ఒక్కటి మంచము మీద విశ్రాంతి తీసుకుంటూ Tab ద్వారా ప్రయత్నించండి.

  రిప్లయితొలగించండి
 30. వేరు విత్తుకే జెల్లును వెలుగు బంచి
  పండు వెన్నెల గురిపించ, భాస్కరుండు
  తాను భూగోళమునబెంచు తాపములను,
  చంద మామగైకొని మార్చగ చల్ల గాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిశ్రీ సత్తిబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరిపాదంలో ‘మార్చగ’ అన్నచోట గణదోషం. ‘మార్చఁ జల్లగాను’ అంటే సరి!

   తొలగించండి
  2. గురువు గారూ! మీ ఆరోగ్యము జాగ్రత్త ! నా పోస్టుకి మీ సమస్యలు రావడము లేదండి... దయచేసి సవరించగలరు....

   తొలగించండి
 31. చిన్న సవరణ తరువాత

  వేరు విత్తుకే జెల్లును వెలుగు బంచి
  పండు వెన్నెల గురిపించ, భాస్కరుండు
  తాను భూగోళమునబెంచు తాపములను,
  చంద మామగైకొని మార్చఁ జల్లగాను,

  రిప్లయితొలగించండి
 32. అండ పిండగ బ్రహ్మాండ మలరుచుండ
  రెండు మూడు ముప్పది గాక మెండుగాను
  కుండ పోతగ పద్యముల్ కూడగట్టి
  పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు :)

  భాస్కరుండు = ప్రభాకరుండు (yours truly)

  రిప్లయితొలగించండి