పేరంటమును సేయ పెండ్లి సంబరములో తూగుటుయ్యల యందు తోడు గాను పిల్లలు పాపలు వెంటనే యుండగా వధువు వరుడు నూగె బాగు గాను ముద్దు ముచ్చట్లతో మురిపించగా నంత ముత్తైదువలు కూడి మోద మంద పూలదండల బరువు తలల దించంగ యొద్దికనిరువురూ యూగె నంత
పెద్ద ముత్తయిదువ పేర్మితో వచ్చెగా అక్షతలను వేయ నలసి యున్న చేతులు కలిపేను చెలిమి నుండుడనుచు రంజనముగ నెపుడు రాజిలగను.
ఊయల నూపగ రమణులు
రిప్లయితొలగించండిహాయిగదీవించు బామ్మ యానందముగన్
సోయగము నిండు మిధునము
రేయంతయు కలలు గాంచు రేపటి కొడుకున్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశుభోదయం :)
ఆ జవనుల సరసపు పాటల
"గోజి" జిలేబి చెంత నయ్యరు
మా జిలుగమ్మణి నిట మామిగ మారెను హతవిధీ !
వాజిని ఉషోదయపు వేగము
మా జిగజిగల వనిత తెచ్చెను
ఈ జిగదేరు కవిత యీ భామినీ షట్పద నిట !
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ ‘షట్పదం’ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముదితల్ మురిపము తోడన్
రిప్లయితొలగించండినుదుటన తిలకమునుదిద్ది నూతన జంటన్
ముదముగ దీవించి పిదప
చదివించిరి కట్నములను జక్కగ వారల్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఊయలనూతుము మిమ్ముల!
రిప్లయితొలగించండిహాయిగ సంసారబంధమల్లిన తీగన్
తీయని ఫలములు నూగగ!!
మాయని దాంపత్యమొదవు మా దీవెనలన్!!!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబామ్మయచ్చటచూడుమువధువువరుని
రిప్లయితొలగించండిమంచిమనసుతో నాశీర్వదించుచుండె
చూచుచుండగనింతులుచుట్టుమూగి
మంచిసంతునుగనియిమ్ముమాకుబాల!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈ. వధూవరులకు నా విధాత. సుఖాయు
. . వు నొసగి చల్లగ బ్రోచు గాక
ఈ. సతీ పతుల రమేశు౦డు . సతతమ్ము
. . భాగ్యము లిచ్చి కాపాడు గాక
్
ఈ. ద౦పతులను మహేశు౦డు . నిరతమ్ము
. . కాలుష్య తతి బాపి కాచు గాక
ఈ. మిథునము నెప్పు డా మదాలస , రమ ,
. . శివ , శుభము లిడి కాచెదరు గాక
ఇనకులార్ణవ శీతా౦శు డెలమి మీకు >
లవ కుశుల వ౦టి సత్పుత్రు ల. నిడు గాక
య౦చు ముత్తయిదువలు దీవి౦చి రా హ !
చక్క నయి నట్టి కొ౦గ్రొత్త జ౦ట నపుడు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కట్టుబాట్లనియెడి పెట్టుబడుల మధ్య
రిప్లయితొలగించండి---------------చుట్టాల చూపుల చట్టసభన
మల్లెల సాక్ష్యాన మంగళ వాద్యాల
-----మగువలసొగసుల నగవులందు
మూడు ముళ్ళను వేసి ఏడడుగులువేయ|
------అలుపుగాదిదిమీకు వలపు నాంది|
ఊహల నుయ్యాల లూగుట గమనించి
--------తాళిమదిని ఎగ తాళిజేయ?
పట్టుచీర పడతి భావాలు దాచినా?
భర్త వోర చూపుబంగపరచ?
అనుభవాల అవ్వ ఆశీస్సు లందించ
నిండు జీవితాలు పండుగాక|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మలక్కలు చేరి యాడ పరాచికాల్
రిప్లయితొలగించండి.......సిగ్గుతో నిరువురు శిరము వంచ
బాబయ్య పెళ్ళి మా బాగున్నదని చేరి
.......పాపయు బాబును పరవ శించ
అత్తకు పెళ్ళంట అమ్మో బలే యున్న
.......దని పాప కౌతూహలమ్ము చూప
పిల్లపాపలతోడ వెయ్యేళ్ళు వర్ధిల్లు
.......డని పెద్ద సీమంతి నక్షత లిడ
క్రొత్త దంపతు లొద్దిక మెత్తనైన
తూగు టుయ్యాల నెక్కిరి తూగ మదులు
వలపు గాలికి, యొండొరు లెలమి పొంగ
భవ్యమౌ చిత్ర మియ్యది భళి! కనుండు.
మిస్సన్న గారూ,
తొలగించండి‘భవ్యమౌ పద్య మియ్యది భళి సెబాసు’ అని ప్రశంసింపదగిన పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు గురువుగారూ.
తొలగించండితీయని కలలను కనుచును
రిప్లయితొలగించండిహాయిగ జీవింపమనుచు నాశిస్సులతో
నూయల నూచితిమిక పా
పాయిని యందించుకార్య భారము మీదే!
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆశీర్వాదములిచ్చెదన్ సుఖముగా నానంద సందోహులై
రిప్లయితొలగించండిక్లేశావేశములన్ త్యజించుచును సంక్లిష్టంబులన్ బాపుచున్
నాశంబించుక లేని ప్రేమనిధులై నానార్థ సాన్నిధ్యులై
ప్రాశస్త్యంబును బొంది మీరు జగతిన్ వర్ధిల్లగా కోరెదన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాయక నుండుడు సతతము
రిప్లయితొలగించండిహాయిగ నిలలో ననుచును యానందముతో
నూయల లూపుచు బామ్మట
వేయి శుభములందు మనుచు వేడ్కతొ బల్కెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పేరంటమును సేయ పెండ్లి సంబరములో
రిప్లయితొలగించండితూగుటుయ్యల యందు తోడు గాను
పిల్లలు పాపలు వెంటనే యుండగా
వధువు వరుడు నూగె బాగు గాను
ముద్దు ముచ్చట్లతో మురిపించగా నంత
ముత్తైదువలు కూడి మోద మంద
పూలదండల బరువు తలల దించంగ
యొద్దికనిరువురూ యూగె నంత
పెద్ద ముత్తయిదువ పేర్మితో వచ్చెగా
అక్షతలను వేయ నలసి యున్న
చేతులు కలిపేను చెలిమి నుండుడనుచు
రంజనముగ నెపుడు రాజిలగను.
మంథా భానుమతి గారూ,
తొలగించండిమనోహరమైన సీసపద్యాన్ని అందించారు. బాగుంది. అభినందనలు.
‘దించంగన్+ఒద్దిక’ అన్నపుడు యడాగమం రాదు. ‘ఇరువురూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘తలల దించంగ నొద్దిక నిరువురు నూగి రంత’ అనండి.